తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించిన జీవన్‌దీప్ కోహ్లి అనే సిక్కు యువకుడిని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. ఈ మేరకు..‘ జీవన్‌దీప్ నువ్వు చాలా గర్వపడాలి. ఇలా చేయడం ద్వారా ఈ దేశంలోని సమానత్వ భావనను మరింత ఇనుమడింపజేశావు. నీ టర్బన్ చాలా బాగుంది. అందరికీ హ్యాపీ ప్రైడ్ మంత్’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ విషయమేమిటంటే.. 1968, జూన్ 28 తెల్లవారుజామున గే హక్కుల కార్యకర్తలపై పోలీసులు రైడ్ చేశారు. సమానత్వం కోసం పోరాడుతున్న తమను ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తూ వారంతా పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. స్టోన్‌వాల్ అల్లర్లుగా పిలువబడే ఈ ఉదంతం.. ఎల్జీబీటీ హక్కులను ప్రముఖంగా ప్రస్తావించిన ఉద్యమంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రతీ ఏడాది జూన్‌ను ప్రైడ్‌మంత్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సాండియాగోలో నివసించే జీవన్‌దీప్ కో్హ్లి..‘ నేను బైసెక్సువల్ అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతాను. ఈ విధంగా నా గుర్తింపును బయటపెట్టుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నాలాగే అందరికీ ఇలాంటి స్వేఛ్చ లభించేందుకు నా వంతు కృషి చేస్తా అని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఎల్జీబీటీ వర్గాన్ని ప్రతిబింబించే ఇంద్రధనుస్సు రంగులతో కూడిన టర్బన్ ధరించాడు. దీంతో కోహ్లి ధైర్యానికి ఫిదా అయిన ఒబామా అతడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
You've got a lot to be proud of, Jiwandeep. Thanks for everything you do to make this country a little more equal. Turban looks great, by the way. Happy Pride Month, everybody! https://t.co/SO7mgnOkgl
— Barack Obama (@BarackObama) June 4, 2019
Comments
Please login to add a commentAdd a comment