గేల విషయంలో హైకోర్టు తీర్పునే సమర్థిస్తా: రాహుల్
స్వలింగ సంపర్కుల హక్కుల పరిరక్షణ విషయంలో సోనియా గాంధీ, కపిల్ సిబల్ తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత కూడా ముందుకొచ్చాడు. ఇలాంటి విషయాలను వ్యక్తుల ఇష్టాయిష్టాలకే వదిలేయాలని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చెప్పాడు. 2009 నాటి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేయడంపై విలేకరులు ఆయన అభిప్రాయం కోరినప్పుడు ఇలా స్పందించారు.
తాను హైకోర్టు ఉత్తర్వులనే సమర్థిస్తానని, మన దేశంలో అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావల్సినంత ఉందని రాహుల్ అన్నారు. అందువల్ల ఇలాంటి విషయాలను వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవిగా భావించి వారికే వదిలేయాలన్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి సెక్షన్ 377ను రద్దు చేయాలని గే హక్కుల కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.