మేం 'గే'లు కాదు...
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వి ఆర్ నాట్ గేస్' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పశ్చిమ దేశాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త హక్కులు అంటూ ఆ దేశాలు తెరపైకి తీసుకొస్తున్న నూతన విధానాలు మా ప్రజల విలువ, సంస్కృతి, నమ్మకాలపై ప్రభావం చూపిస్తాయని ముగాబే పేర్కొన్నారు.
ఆఫ్రికా ఖండంలో ఎల్జీబీటీ విధానాలు, హక్కులు అధికంగా ఉన్న దేశం జింబాబ్వే అన్న విషయం అందరికి విదితమే. తమ దేశస్థులను స్వలింగ సంపర్కం చేసే వారిగా ఇతర దేశాలు భావిస్తుండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్వలింగ సంపర్కం చేసే వారు 'పందులు, మేకలు, ఇతర జంతువుల కన్నా హీనం' అంటూ 2013లోనూ ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే.