న్యూయార్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని,గాజాలో బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.
మంగళవారం నిర్వహించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక అత్యవసర సెషన్‌లో ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 153 దేశాలు, 23 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.10 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే ఈ తీర్మానంలో హమాస్ పేరు ఎక్కడా వాడకపోవడం విశేషం. తీర్మానానికి అమెరికా సవరణలు ప్రతిపాదించింది.
2023 అక్టోబర్7వ తేదీన ఇజ్రాయెల్ పై గాజా నుంచి హమాస్ జరిపిన దాడులు, అక్కడి పౌరులను బంధీలుగా తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక వ్యాఖ్యాన్ని తీర్మానంలో చేర్చాలని అమెరికా కోరింది.15 రోజుల క్రితం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment