![India Response On israel Hamas War In United Nations - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/10/united%20nations.jpg.webp?itok=Hpeu5ydA)
న్యూయార్క్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) జనరల్ అసెంబ్లీలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కంబోజ్ స్పందించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఒక ప్రమాదకరమైన మానవతా సంక్షోభంగా ఆమె అభివర్ణించారు.
ఈ సమస్యకు పరిష్కారం కేవలం చర్చల ద్వారానే సాధ్యమన్నారు. ‘ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో చిన్న పిల్లలు, మహిళలు మరణించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఎంత మాత్రం అంగీకారం కాదు. అయితే ఈ యుద్ధానికి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి కారణమని కూడా మాకు తెలుసు.
ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ క్షమించదు. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు భారత్ తరపున ఇప్పటికే 70 టన్నుల వివిధ రకాల సహాయ సామాగ్రిని పంపించాం. వీటిలో 16.5 టన్నుల మందులున్నాయి’ అని కంబోజ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment