un general assembly
-
పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్
పొరుగు దేశం పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి వేదికగా మన దేశంపై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అయితే ఈ ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది.ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమేంటో? అని మన దేశపు దౌత్యవేత్త భవిక మంగళానందన్ ప్రశ్నించారు.‘‘ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తూ అవాస్తవాలను వినాల్సి వచ్చింది. పాక్ ప్రధాని భారత్ గురించి ప్రస్తావించడంపై ఇవాళ మేం స్పందిస్తున్నాం. సుదీర్ఘకాలంగా పొరుగు దేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఒక ఆయుధంగా ఉపయోస్తోంది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం వంచనే అవుతుంది.ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవమేంటంటే.. ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన పాక్, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమా?’’ అని భవిక అన్నారు. Watch: India exercises its Right of Reply at the 79th session of the @UN General Assembly debate.@DrSJaishankar @MEAIndia pic.twitter.com/c6g4HAKTBg— India at UN, NY (@IndiaUNNewYork) September 28, 2024 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా.. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్ము ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. అలాగే.. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు. -
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
భద్రతా మండలికి పాక్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి. అవి..పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్. ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమా లియా, పాకిస్తాన్‌లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్‌లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి నుంచి రెండేళ్ల పాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి. -
ఇజ్రాయెల్-హమాస్ వార్..భారత్ కీలక నిర్ణయం
న్యూయార్క్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని,గాజాలో బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. మంగళవారం నిర్వహించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక అత్యవసర సెషన్లో ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 153 దేశాలు, 23 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.10 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే ఈ తీర్మానంలో హమాస్ పేరు ఎక్కడా వాడకపోవడం విశేషం. తీర్మానానికి అమెరికా సవరణలు ప్రతిపాదించింది. 2023 అక్టోబర్7వ తేదీన ఇజ్రాయెల్ పై గాజా నుంచి హమాస్ జరిపిన దాడులు, అక్కడి పౌరులను బంధీలుగా తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక వ్యాఖ్యాన్ని తీర్మానంలో చేర్చాలని అమెరికా కోరింది.15 రోజుల క్రితం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించలేకపోయింది. ఇదీచదవండి..పాక్ ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి -
Israel-Hamas War: తీర్మానానికి భారత్ దూరం
ఐక్యరాజ్యసమతి: గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతావి ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే ఉగ్రవాదం మానవాళి పట్ల ఎప్పటికీ మాయని మచ్చేనని భారత్ పునరుద్ఘాటించింది. ‘‘ఉగ్రవాదానికి సరిహద్దుల్లేవు. జాతి, జాతీయత లేవు. అందుకే కారణమేదైనా సరే, మతిలేని ఉగ్రవాద చర్యలకు ఎవరూ మద్దతివ్వరాదు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కతాటిపై ఉండాలి’’అని పిలుపునిచి్చంది. ఇజ్రాయెల్, హమాస్ తక్షణం పోరుకు స్వస్తి చెప్పాలని తీర్మానం పిలుపునిచి్చంది. గాజాకు అన్ని రకాల సాయం నిరి్నరోధంగా, పూర్తిస్థాయిలో, సురక్షితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బందీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాన్ని జోర్డాన్ రూపొందించింది. అందులో హమాస్ పేరును ప్రస్తావించకపోవడాన్ని అమెరికా తప్పుబట్టింది. చర్చలతోనే పరిష్కారం: భారత్ ఐరాసలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ తీర్మానంపై చర్చలో భారత్ తరఫున పాల్గొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి దిగడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన పరిణామమన్నారు. దాన్ని అందరూ ఖండించాల్సి ఉందని చెప్పారు. విభేదాలు, వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ‘అలాగాకుండా పలు దేశాలు పరస్పరం హింసాకాండకు దిగుతుండటం ఆందోళనకరం. మానవతా విలువలకు పాతరేసే స్థాయిలో హింస, ప్రాణ నష్టం చోటుచేసుకుంటుండటం శోచనీయం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసను మార్గంగా చేసుకోవడం శాశ్వత పరిష్కారాలు ఇవ్వజాలదు’అని స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈ విషయంలో దేశాలు పరస్పర విభేదాలను కూడా పక్కన పెట్టాలి’అని పిలుపునిచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగని చర్చలు ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశమిచ్చాయని అభిప్రాయపడ్డారు. తక్షణం బందీలను విడిచిపెట్టాలని హమాస్‌కు సూచించారు. గాజాకు భారత్ కూడా మానవతా సాయం అందించిందని పటేల్ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటే ఘర్షణకు పరిష్కారమన్నది ముందునుంచీ భారత్ వైఖరి అని స్పష్టం చేశారు. 38 టన్నుల మేరకు ఔషధాలు, పరికరాలు, నిత్యావసరాలను పంపినట్టు చెప్పారు. ఇరుపక్షాలు హింసకు స్వస్తి చెప్పి తక్షణం నేరుగా చర్చలు మొదలు పెట్టాలని కోరారు. హమాస్ పేరు ప్రస్తావించనందుకే...! ఐరాసలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ పేరును ప్రస్తావించనందుకే దానిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా తదితర దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాలు అనుకూలంగా ఓటేయగా భారత్‌తో పాటు కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఉక్రెయిన్ తదితర దేశాలు దూరంగా ఉన్నాయి. తీర్మానానికి కెనడా ప్రతిపాదించిన కీలక సవరణకు భారత్ మద్దతిచ్చింది. ‘‘ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని, వందల మందిని బందీలుగా తీసుకోవడాన్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం. వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని తీర్మానంలో చేర్చాలని భారత్ కోరింది. భారత్‌తో పాటు మొత్తం 87 దేశాలు సవరణకు అనుకూలంగా, 55 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 23 దేశాలు దూరంగా ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో సవరణ ఆమోదం పొందలేదు. -
ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. యూఎన్ 78వ సర్వ సభ్య సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. భారత్- పాక్ మధ్య కశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతుండటం దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైతుందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని మరోసారి చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుర్కియే ఈ అంశంపై మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ' ఇండియా, పాకిస్థాన్‌లు స్వాతంత్య్రం తెచ్చుకుని 75 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరం. కశ్మీర్లో ఇప్పటికైన శాంతి నెలకొనే విధంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోవాలి.' అని ఐక్యరాజ్య సమితి వేదికగా ఎర్డోగాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన జీ20కి హాజరైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. వారం రోజులకే ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని యూఎన్‌లో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. సభ్య దేశాల సంఖ్య పెంచాలి: ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలక పాత్ర పోషించడంపై ఎర్డోగాన్ శుభపరిణామం అని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉండగా.. కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత స్థానంలో ఉండటం సరికాదని అన్నారు. భద్రతా మండలిలో ఉన్న 20 దేశాలను విడతలవారిగా శాశ్వత సభ్యులుగా మార్చాలని కోరారు. ఇదీ చదవండి: జాగ్రత్త.. కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు -
ఐరాసలో రష్యాకు భారత్ షాక్!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో భారత్ తన మిత్రదేశం రష్యాకు షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై.. రష్యా రహస్య బ్యాలెట్ కోసం డిమాండ్ చేసింది. అయితే.. రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేసింది. ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్ రెజల్యూషన్‌పై ఓటింగ్ విషయంలో పునరాలోచించాలని రష్యా.. ఐరాస సాధారణ అసెంబ్లీని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో తీర్మానంపై ఓటింగ్ రహస్య బ్యాలెట్‌తో జరగాలా? బహిరంగంగా జరగాలా? అనే విషయంపై సోమవారం ఓటింగ్ నిర్వహించింది జనరల్ అసెంబ్లీ. రహస్య ఓటింగ్‌కు రష్యా పట్టుబట్టగా.. ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. మొత్తం 107 మంది సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. పదమూడు దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. మరో 39 దేశాలు (రష్యా, చైనా సహా) ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. రష్యా విజ్ఞప్తి మేరకు.. ఈ ఓటింగ్ నమోదు చేయబడింది. ఇందులో.. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటి అని యూఎన్జీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓటింగ్ అనంతరం రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. UN సభ్యత్వం ఒక దారుణమైన మోసానికి సాక్ష్యంగా మారిందని, ఈ మోసంలో దురదృష్టవశాత్తు జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు అని ఆరోపించారు. UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ముసాయిదా ప్రకారం.. రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి, యుద్ధంలో దెబ్బతిన్న దేశం అంతర్జాతీయ సరిహద్దుల నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్‌పై తన ప్రకోపరహిత దూకుడు యుద్ధాన్ని నిలిపివేయాలి. అలాగే.. రష్యా చర్యను గుర్తించవద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింది. బుధవారంగానీ, గురువారంగానీ ఈ తీర్మానంపై బహిరంగ ఓటింగ్ జరగనుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించాయి. రష్యా రిఫరెండం చట్టవిరుద్ధంగా పేర్కొంటూ అమెరికా-ఆల్బేనియాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా.. భారత్ ఆ ఓటింగ్‌కు దూరంగా ఉంది. పైగా రష్యా వీటో జారీ చేయడంతో.. ఆ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలోనే ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఆల్బేనియా. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ/రష్యా మిలిటరీ చర్య విషయంలో మొదటి నుంచి తటస్థ స్థితిని అవలంభిస్తోంది భారత్. శాంతి చర్చల ద్వారానే సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణుల దాడులు పెరిగిపోతుండడంతో ఆందోళన సైతం వ్యక్తం చేసింది భారత్. పరిస్థితి మామూలు స్థితికి చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో రెండురోజుల్లో జరగబోయే కీలక ఓటింగ్‌లో తటస్థ వైఖరినే అవలంభిస్తుందా? లేదంటే ఇప్పుడు బహిరంగ ఓటింగ్‌కు మొగ్గుచూపినట్లే కీలక ఓటింగ్ రష్యాకు ఝలక్ ఇస్తుందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!. -
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
కరోనా కథ ముగిసింది!: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. కోవిడ్–19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ‘‘వైరస్ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై కేసుల అంతగా పెరుగుదల ఉండదు. అలాగని పూర్తిగా తగ్గి జీరో కేసులకు వచ్చే పరిస్థితి కూడా లేదు’’ అని అంచనా వేసింది. ‘‘రెండున్నరేళ్లుగా మనం చీకటి గుహలో బతుకులు వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు గుహ చివర్లో వెలుగు రేఖ కనిపిస్తోంది. అయితే అక్కడికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరముంది. అప్రమత్తంగా లేకుంటే ఇంకా ఎన్నో అడ్డంకులు వస్తాయి’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు. గురువారం ఆయన ఐరాస సర్వప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బలహీనపడిపోయిందని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ కూడా అన్నారు. ఆయన తొలినుంచీ కరోనా కేసుల్ని ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్‌కు మన శరీరాలు అలవాటు పడిపోయాయని, ఇక ఆ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడం జరగదని ఆయన ధీమాగా చెప్పారు. -
ప్రపంచ దేశాల ఐక్యతతోనే అది సాధ్యం: ప్రియాంక
ఐక్యరాజ్యసమితి: ‘‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే ఇది సాకారమవుతుంది’’ అని నటి, దర్శకురాలు ప్రియాంకా చోప్రా జోనాస్ అన్నారు. ప్రపంచదేశాలు సంఘీభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ అయిన చోప్రా ఎస్‌డీజీపై మంగళవారం జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రమాదం ముంగిట ప్రపంచం ప్రపంచ దేశాల మధ్య విభేదాలు భద్రతా మండలి వంటి కీలక అంతర్జాతీయ వ్యవస్థలను బలహీనపరుస్తున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచం ప్రమాదం అంచున ఉందన్నారు. అంతర్జాతీయ సహకారం లేకుండా మనుగడ సాగించలేమని గుర్తు చేశారు. ప్రపంచం ముంగిట ఉన్న సవాళ్లను సహకారం, చర్చల ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని తెలిపారు. -
ఉక్రెయిన్ నుంచి రష్య దళాలు వైదొలగేలా తీర్మానం!
Demanding Moscow Withdraws Its Troops: యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొగాలని డిమాండ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతవారం నుంచి ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా పై ప్రపంచదేశాల నుంచి తీవ్రమైన ఆగ్రహం వెల్లువెత్తుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్థం గురించి చర్చించేందుకు సుమారు 100కు పైగా దేశాలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మాస్కో తన దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరరూ దౌత్యవేత్తలచే ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్షలా సాగుతున్న నిరుకుశ ప్రభుత్వాలను సరైన మార్గంలో పెట్టేలా ఈ తీర్మానం ఉంటుందని యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం పేర్కొంది. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమన్ పుతిన్‌కి కనువిప్పు కలిగించేలా శక్తివంతమైన మందలింపు చర్యగా అభివర్ణించింది. అయితే ఈ తీర్మానం ఆమెదించాలంటే రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి. అంతేకాదు భద్రతామండలిలో ఈ తీర్మానాన్ని సమర్పించక మునుపే రష్యా వీటో చేసే అవకాశం లేదు. అంతేకాదు ఈ తీర్మానానికి 193 మంది సభ్యులతో కూడిన బలమైన సంస్థల అత్యధిక మెజార్టీ మద్దతు ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉంచాలనే పుతిన్ నిర్ణయాన్ని యూఎన్ తీవ్రంగా ఖండించింది. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఏమి లాభం ఉండదని చైనా కూడా నొక్కి చెబుతోంది. గతవారం రష్యాని కట్టడి చేసే దిశగా పశ్చిమ దేశాలు పలు కఠిన ఆంక్షలు విధించాయి. స్విఫ్ట్ నుంచి డిస్కనెక్టం చేయడం వంటి వాటిని సైతం రష్యా లక్ష్య పెట్టక పోగా ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు అడ్డుకట్టే వేసేందుకు ప్రపంచ దేశాలన్ని ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఓటింగ్ నిర్వహించే యోచన చేస్తోంది. -
అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
US Diplomatic Boycott Of Beijing Winter Olympics: అమెరికా 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యసంబంధమైన బహిష్కరణ(డిప్లొమేటిక్ బాయ్‌కాట్) చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీసీ) పేర్కొంది. ఈ మేరకు దౌత్యవేత్తలు అయిన ప్రభుత్వ అధికారుల ఉనికి ప్రతి దేశ ప్రభుత్వానికి పూర్తిగా రాజకీయ నిర్ణయం అని అందువల్ల ఆయా దేశాల రాజకీయ తటస్థ వైఖరిని పూర్తిగా గౌరవిస్తాం అని ఐఓసీ ప్రతినిధి అన్నారు. (చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!) అయితే ఈ దౌత్యపరమైన బహిష్కరణ అనేది యూఎస్ అథ్లెట్లు పోటీ పడకుండా నిరోధించే చైనా మానవ హక్కుల రికార్డుకు క్రమాంకనం చేసిన మందలింపు చర్యగా యూఎస్ అభివర్ణించింది. అంతేకాదు దౌత్యపరమైన బహిష్కరణ అంటే ఈ ఒలింపిక్ క్రీడలు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో అమెరికా దౌత్య అధికారులను పంపకుండా ఒలింపిక్ ప్రాధాన్యతను తగ్గించేలా చైనాతో నేరుగా ఢీ కొనే పరంపరలో అమెరికా తీసుకున్న తొలి నిర్ణయం ఇది. వాయువ్య జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా మారణకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ క్రీడలపై ఎటువంటి నిర్ణయం తీసకువాలని వాషింగ్టన్ నెలల తరబడి తర్జనభర్జనలు పడిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు ఐఓసీ కూడా అమెరికా ప్రభుత్వ ప్రకటన మేరకు ఒలింపిక్ క్రీడలు, అథ్లెట్ల భాగస్వామ్య రాజకీయాలకు అతీతమైనదని, పైగా దీనిని తాము స్వాగతిస్తున్నాం అని తెలపడం విశేషం. అంతేకాదు యూఎన్ జనరల్ అసెంబ్లీలో దాదాపు 193 సభ్య దేశాల ఏకాభిప్రాయంతో 173 సభ్య దేశాలు సహకారంతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఐఓసీ తెలిపింది. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అటువంటి బహిష్కరణ అమలు చేస్తే "నిశ్చయమైన ప్రతిఘటన" ఉంటుందంటూ ముందుగానే బెదిరించింది. (చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!) -
మోదీ మేల్కొలుపు
ప్రపంచ దేశాల అత్యున్నత వేదిక ఐక్యరాజ్యసమితిలో శుక్రవారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఉపన్యాసం గమనించాక ఉపఖండంలో ఉద్రిక్తతలు ఎందుకున్నాయో, ఈ స్థితికి కారకులెవరో అన్ని దేశాలకూ అర్థమై ఉంటుంది. మోదీ 20 నిమిషాలు చేసిన ప్రసంగంలో అభివృద్ధి దిశగా మన దేశం చేస్తున్న కృషి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మొదలుకొని భూగోళంపై వాతావరణ మార్పులు కలగ జేస్తున్న ప్రభావం వరకూ ఎన్నో అంశాలను స్పృశించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచానికి కలగబోయే ముప్పేమిటో హెచ్చరించారు. దాన్ని కూకటివేళ్లతో పెకిలించటానికి అన్ని దేశాలూ సమష్టిగా కదలవలసిన అవసరం గురించి నొక్కిచెప్పారు. అందుకు భిన్నంగా ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగంలో నెత్తురుటేర్లు, అణుయుద్ధం తదితరాలన్నీ ఉన్నాయి. ఇలా ఆద్యంతమూ బెది రింపులతో కాలక్షేపం చేశాక ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్లామోఫోబియా’ వ్యాపించిందని వాపోయారు. ఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలుస్తున్నవారు తమ విధ్వంసకార్యకలాపాలకూ, విచ్ఛిన్నకర చర్యలకూ మతం ముసుగేసుకునే ప్రయత్నం చేయడం వల్లనే ఈ స్థితి తలెత్తింది. అయితే ఇస్లాం ధర్మాన్ని, సకల మానవాళి శ్రేయస్సు కోసం అది ప్రబోధిస్తున్న విలువలను చాటి చెబుతున్న అనేకమంది మతాచార్యులు అలాంటి దురభిప్రాయాలను చాలావరకూ చెరిపేయగలిగారు. ఇప్పుడు ఉగ్రవాదులనూ, వారికి మద్దతుపలుకుతున్నవారిని ఉన్మాదులుగానే అందరూ పరిగ ణిస్తున్నారు. (చదవండి : కలిసికట్టుగా ఉగ్ర పోరు) పాకిస్తాన్ మన దేశంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేయా ల్సిందిపోయి మొదటినుంచీ బెదిరింపులకూ, దుస్సాహసాలకూ దిగుతోంది. సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలకు సిద్ధపడటానికి బదులుగా మిలిటెంట్లకు పాక్ భూభాగంలో ఆయుధ శిక్షణనిచ్చి సరిహద్దులు దాటించి కశ్మీర్లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. సుశిక్షితమైన సైన్యం, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్న భారత్ ఇలాంటి చేష్టలకు బెదిరి, తమ దారికొస్తుందని ఆ దేశం ఎలా అనుకుంటున్నదో ఎవరికీ బోధపడదు. అసలు భారత్‌తో ఎలా వ్యవహరించాలన్న అంశంలో పాకిస్తాన్‌కు ఒక వైఖరి ఉన్నట్టు కనబడదు. అక్కడి ప్రజా ప్రభు త్వాలు ఒకటి తలిస్తే, పాక్ సైన్యం మరో విధంగా ప్రవర్తిస్తుంది. అన్ని దేశాల తరహాలో అక్కడ కూడా ప్రభుత్వం చెప్పుచేతల్లో సైన్యం ఉంటే ఈ స్థితి తలెత్తదు. కానీ ఇందుకు భిన్నంగా పాక్ సైన్యం పాలకుల్ని నియంత్రిస్తుంది. చర్చలు జరపాలని ఇరు దేశాలూ నిర్ణయించిన ప్రతిసారీ పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగడం, సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని పౌరులపై గుళ్లవర్షం కురిపిం చడం రివాజుగా మారింది. కొన్నిసార్లు ఉగ్రవాద చర్యలకు ఉసిగొల్పడం కూడా కనబడు తుంటుంది. ఇలాంటి చేష్టలవల్ల పలుమార్లు ఇరు దేశాల మధ్యా జరగవలసిన చర్చలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. కొన్ని నెలలు గడిచాక తిరిగి ప్రభుత్వాలు రెండూ చర్చల తేదీలు ఖరారు చేసుకుంటే తిరిగి అదే పునరావృతమయ్యేది. గతంలో పనిచేసిన భుట్టో, నవాజ్ షరీఫ్, బేనజీర్ వంటివారు తమ వ్యక్తిత్వాలను నిలుపుకొనేందుకూ, సైన్యం అభిప్రాయాలకు భిన్నమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతో కొంత ప్రయత్నించేవారు. అందుకు భుట్టో, ఆయన కుమార్తె మూల్యం చెల్లించారు. నవాజ్ షరీఫ్ అర్థంతరంగా పదవి కోల్పోయి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలై జైల్లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకూ కారాగారవాసం తప్పలేదు. ఇమ్రాన్‌ఖాన్ పూర్తిగా సైన్యం చెప్పినట్టు ఆడుతున్నారని, ఏ నిర్ణయం సొంతంగా తీసుకోవడంలేదని పాక్ మీడియానే తరచు ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఏముంటుందని కూడా ఇమ్రాన్ ఆలోచించలేకపోయారు. కశ్మీర్లో విధించిన ఆంక్షల గురించి, దాని ప్రతిపత్తి మార్చడం గురించి ఇక్కడి పార్టీలు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఒత్తిళ్లు తెస్తున్నారు. అది భారత్ ఆంతరంగిక వ్యవహారం. పాకిస్తాన్‌కు సంబంధం లేని అంశం. తమకేమి కావాలో, ఎవరిని డిమాండ్ చేయాలో, ఎలా సాధించుకోవాలో కశ్మీర్ ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడి ఉద్రిక్తతలను సాకుగా తీసుకుని ఏదో ఒక అలజడి సృష్టించి లబ్ధిపొందుదామనుకోవడం పాక్ తెలివితక్కువతనం. కశ్మీర్ పౌరుల గురించి గుండెలు బాదుకున్న ఇమ్రాన్ తీరును ఆ తర్వాత ప్రసంగించిన అమెరికా ప్రతినిధి ఎండగట్టారు. కశ్మీర్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్న పాకిస్తాన్ చైనాలోని వీగర్‌లో లక్షలాదిమంది ముస్లిం జనాభా వేదనను ఎందుకు పట్టించుకోదని నిలదీశారు. దీనికి ఇమ్రాన్ దగ్గర జవాబేముంటుంది? అక్కడి వరకూ పోనక్కరలేదు...తన భూభాగంలోని బలూచిస్తాన్‌లో సైన్యం ఆగడాల గురించి, అక్కడ అమలవుతున్న ఆంక్షల గురించి నిలదీస్తే పాకిస్తాన్ సమాధానం ఇవ్వగలదా? భారత్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచాభివృద్ధిలో భాగమేనన్న సందేశం ప్రధాని మోదీ బలంగా ఇవ్వగలిగారు. అదే సమయంలో భారత్‌పై ఎక్కుపెట్టిన ఉగ్రవాద చర్యలు ప్రపంచ భద్రతకు కూడా ముప్పు తెస్తాయన్న సంకేతమిచ్చారు. ఎక్కడా పాకిస్తాన్ పేరెత్తకుండా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదన్న మోదీ మాటల్లో నిజముంది. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ చేస్తామన్న అమెరికా కూడా ఈ విషయంలో చొరవ ప్రదర్శించడం లేదు. ఏది ఉగ్రవాదమో, ఎవరు ఉగ్రవాదులో నిర్ధారించే నిర్వచనాలు ఖరారైతే తన ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయం ఆ దేశానికుంది. తప్పించుకు తిరిగే ఇలాంటి ధోరణి పరోక్షంగా ఉగ్రవాదానికి ఊతమిస్తుంది. ఏదేమైనా మన దేశం సాధ్యమైనంత త్వరగా కశ్మీర్లో శాంతిని పునరుద్ధరించి, అక్కడ అమలు చేస్తున్న ఆంక్షల్ని ఎత్తేయగలిగితే పాకిస్తాన్ తప్పుడు ప్రచారానికి తగిన జవాబిచ్చినట్టవుతుంది. ఆ దిశగా కేంద్రం అడుగులేయాలి. -
ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలి : మోదీ
న్యూయార్క్ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్ని ఉద్దేశించి ప్రసంగించడం గర్వంగా ఉందన్నారు. గాంధీజీ చెప్పినట్టుగా సత్యం, అహింస ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. ఒక అభివృద్ధి చెందిన దేశం(భారత్) ఐదేళ్లలో 11 కోట్ల శౌచాలయాలు నిర్మించిందని.. ఇది ప్రపంచానికి కొత్త సందేశమని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ప్రస్తావించిన మోదీ.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అన్నారు. దీని ద్వారా 50 కోట్ల మందికి రూ. 5 లక్షల బీమా కల్పిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శనీయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని అన్నారు. డిజిటలైజేషన్‌తో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. భారత్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 2 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతులకు, గ్రామీణులకూ హక్కులొచ్చాయి!
ఆరుగాలం కాయకష్టంతో పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామాల్లో పనీపాటలతో జీవనం సాగించే బడుగు ప్రజల హక్కులకు ఐక్యరాజ్య సమితి బాసటగా నిలిచింది. 2018 ఆఖరులో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఒక ముఖ్య పరిణామం ఇది. పరిమిత వనరులతోనే ప్రపంచ జనాభాకు 70% ఆహారాన్ని పండించి అందిస్తున్న మట్టి మనుషులకు ఉన్న హక్కులను సముచితంగా గుర్తించమని అంతర్జాతీయ సమాజానికి ఐరాస సర్వసభ్య సమావేశం చాటిచెప్పింది. ఈ మేరకు డిసెంబర్ 17న తుది డిక్లరేషన్‌ను న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఇందులో పేర్కొన్న హక్కులను దేశీయ చట్టాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు, గ్రామీణులకు రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాల నేతలకు, ప్రభుత్వాలకు సూచించింది. పాలకుల నిరాదరణకు, అన్యాయాలకు గురవుతూ కనీస మానవ హక్కులకు నోచుకోకుండా.. అరకొర ఆదాయాలతో అర్థాకలితో అలమటిస్తూ.. భూమి హక్కులు, సాంఘిక, ఆర్థిక, ఆహార భద్రత లోపించి, అప్పులపాలై కుంగిపోతూ, ఆత్మహత్యల పాలవుతున్న చిన్న–సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, ఆదివాసులు, సంచార జాతులు, ఇతర గ్రామీణ వృత్తిదారులకు.. ఐక్యరాజ్య సమితి కొత్త సంవత్సరం కానుకగా ఈ డిక్లరేషన్‌ను వెలువరించడం గొప్ప సానుకూల పరిణామం. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ తర్జన భర్జనల తర్వాత డిసెంబర్ 17న ఐక్యరాజ్య సమితి రైతులు, గ్రామీణ ప్రజల ప్రత్యేక హక్కుల డిక్లరేషన్‌ను వెలువరించడం విశేషం. ఏమిటీ డిక్లరేషన్? 74 దేశాలకు చెందిన 164 రైతు సంఘాలతో కూడిన సమాఖ్య ‘లా వయ కంపెసినా’, స్వచ్ఛంద సంస్థలు ‘సెటిమ్’, ‘ఫియమ్’ ఇంటర్నేషనల్‌తో కలిసి తొలుత 17 ఏళ్ల క్రితం ఈ ప్రతిపాదనను ఐరాస మానవ హక్కుల విభాగం ముందుకు తెచ్చాయి. అంతేకాదు. అది మరుగున పడిపోకుండా పట్టించుకున్నాయి. ఆ తర్వాత ఐరాసలో బొలీవియా దేశ ప్రతినిధి 2012 నుంచి ఈ డిక్లరేషన్‌ను భుజానేసుకొని డిసెంబర్ 17న ఆమోదింపజేసే వరకూ విశేష కృషి చేశారు. ఐరాసలో సభ్యదేశాలు 193. రైతులు, గ్రామీణులకు ప్రత్యేక హక్కులు అవసరమేనని గుర్తించే 28 అధికరణాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను భారత్, చైనా సహా 121 దేశాలు సమర్థించాయి. ఆస్ట్రేలియా, యూకే, యు.ఎస్.ఎ. వంటి 8 దేశాలు వ్యతిరేకించాయి. 54 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఏదైతేనేమి డిక్లరేషన్ ఇప్పుడు అంతర్జాతీయ చట్టబద్ధత పొందింది. ఈ హక్కులను ఇక ప్రపంచ దేశాలు ప్రత్యేక చట్టాలు చేసి రైతులు, గ్రామీణుల హక్కులు రక్షించాల్సి ఉంది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? చిన్న కమతాల్లో పంటలు పండించుకొని జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు ప్రపంచ జనాభాకు అవసరమైన 70% ఆహారాన్ని ఆరుగాలం కష్టపడి పండించి అందిస్తున్నారు. ప్రకృత వనరలను తగుమాత్రంగా వాడుకుంటూ, గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నారు. అయితే, హక్కుల విషయానికి వచ్చేసరికి పట్టణప్రాంతీయులతో పోల్చితే చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణులు వివక్షకు గురవుతున్నారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న వ్యవసాయ విధానాలు సంపన్న రైతులు, పారిశ్రామిక వ్యవసాయదారులకు లబ్ధి చేకూర్చేవిగానే ఉన్నాయని.. ఈ విధానాల వల్ల చిన్న, సన్నకారు రైతులకు, రైతు కూలీలకు, ముఖ్యంగా వ్యవసాయంలో అత్యధికంగా శ్రమిస్తున్న మహిళా రైతులకు, చేకూరుతున్న లబ్ధి తూతూ మంత్రమేనని ఐరాస మానవ హక్కుల సలహా సంఘం చేసిన అధ్యయనంలో వెలడైంది. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణుల హక్కుల డిక్లరేషన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, సంప్రదాయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని అనుసరించడం, ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడం, భూమిపైన, నీటిపైన, అడవి, ఇతర ప్రకృతి వనరులపైన రైతులు, గ్రామీణులకున్న సామూహిక హక్కులను కాపాడటం.. సభ్య దేశాల్లోని ప్రభుత్వాల విధి అని ఐక్యరాజ్యసమితి ఈ డిక్లరేషన్‌లో పేర్కొంది. దేశీ, స్థానిక వంగడాలను సాగు చేసి భద్రపరచుకొని వినియోగించుకోవడంతోపాటు ఇతర రైతులకు విక్రయించుకునే హక్కు కూడా కల్పించమని ఈ డిక్లరేషన్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. మన దేశంలో ఇప్పటికే చట్టం ఉన్నా, అది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న అభిప్రాయం ఉంది. రైతులకున్న హక్కులు పాలకుల దృష్టిలో ఇకనైనా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని ఆశిద్దాం. -
ఐరాస వేదికపై ఎన్నికల ప్రచారమా..
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సాధారణ సమితిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పెదవివిరిచారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచేలా ఆమె ప్రసంగం నిర్మాణాత్మకంగా సాగలేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను ఆకర్షించేలా కేవలం పాకిస్తాన్ అంశంపైనే సుష్మా ప్రసంగం మొక్కుబడిగా ఉందని ఆరోపించారు. ఐరాస సమగ్ర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను 73వ ఐరాస సాధారణ సమితి సమావేశంలో ఆమె సోదాహరణంగా వివరించారు. కాగా ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఆసియా ఉపఖండంలో ఉగ్రవాద నిరోధానికి పాకిస్తాన్ చేసిందేమీ లేదని సుష్మా సమర్ధంగా చాటిచెప్పారని జైట్లీ ట్వీట్ చేశారు. ఉగ్రవాదంపై పాకిస్ధాన్ ద్వంద్వ వైఖరిని ఆమె సమర్ధంగా ఎండగట్టారన్నారు. -
యూఎన్‌లో ట్రంప్‌కు అవమానం : ఫక్కున నవ్వారు
అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం అంటే ఎలా ఉండాలి. ఎంతో హుందాగా... ఎవరూ కూడా చిన్న శబ్ధం చేయకుండా.. శ్రద్ధతో ఆయన ప్రసంగాన్ని వింటూ ఉండాలి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగ సమయంలో మాత్రం ఐక్యరాజ్య సమితిలో ఊహించని పరిణామం ఎదురైంది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించడం ప్రారంభించగానే.. సభలోని సభ్యులందరూ బిగ్గరగా నవ్వారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో తాము సాధించిన అభివృద్ధిని అమెరికా చరిత్రలో ఏ యంత్రాంగం సాధించలేదని ట్రంప్ చెప్పారు. ఆ సమయంలో సభలోని సభ్యులు గొల్లుమని నవ్వారు. ఆ హఠాత్త్ పరిణామం ఊహించని ట్రంప్, ఒక్కసారిగా మూగబోయారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని, తాను కూడా చిన్నగా నవ్వి... 'ఇలాంటి స్పందన వస్తుందని నేను ఊహించలేదు.. సరే కానీయండి' అన్నారు. అయితే సభలో ట్రంప్‌కు ఎదురైన ఈ ఊహించని పరిణామంపై.. అసలకే అధ్యక్షుడిపై ఓ డేగా కన్నేసే అమెరికన్ మీడియా.. ఒక్కోటి ఒక్కోలా రాశాయి. అయితే మీడియా వార్తలపై కూడా ట్రంప్ వెంటనే స్పందించారు. ‘అధ్యక్షుడి ట్రంప్‌ను చూసి ప్రజలు నవ్వారు అని రాశారు. వారు నన్ను చూసి నవ్వలేదు. వారు నాతో మంచి సమయాన్ని గడిపారు. మేమందరం కలిసి పనిచేస్తున్నాం’ అని అమెరికా మీడియా అవుట్లెట్లను ప్రస్తావిస్తూ.. న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఏడాది క్రితం ఈ సభలో తాను తొలిసారి మీ ముందు నిల్చున్నానని... ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మెరుగైన భవిష్యత్తు గురించి మాట్లాడానన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో.. పన్నుల తగ్గింపు, స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరగడం, డిఫెన్స్ నిధుల గురించి మాట్లాడారు. ఉత్తర కొరియాలో అణ్వాయుధాల తయారీ తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు. -
సుష్మా స్వరాజ్‌తో ఇవాంకా ట్రంప్ భేటీ
-
సుష్మా స్వరాజ్‌తో ఇవాంకా ట్రంప్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయనకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్ మంగళవారం న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వీరివురు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇవాంకా...సుష్మాను కలిశారు. ఈ సమావేశంలో మహిళా వ్యవస్థాపకతతో పాటు ఇరుదేశాలలో శ్రామిక అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌పై ఇవాంకా ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపించారు. సుష్మా స్వరాజ్ ‘ఆకర్షణీయమైన’ విదేశాంగ మంత్రిగా అభివర్ణించిన ఆమె.. సుష్మాను కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. మహిళా సాధికారితతో పాటు భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే జీఈఎస్ (పారిశ్రామిక వ్యవస్థాపకులు) సదస్సుకు సంబంధించి తమ మధ్య చర్చ జరిగినట్లు ఇవాంకా తెలిపారు. We had a great discussion on women's entrepreneurship, the upcoming #GES2017 and workforce development in the US and India. #UNGA https://t.co/mnc6sHKYBf — Ivanka Trump (@IvankaTrump) 18 September 2017 I have long respected India's accomplished and charismatic Foreign Minister @SushmaSwaraj, and it was an honor to meet her today. #UNGA https://t.co/IeAfBCOETO — Ivanka Trump (@IvankaTrump) 18 September 2017 కాగా భారత, అమెరికా దేశాల ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సు (గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్)-2017.. నవంబర్ 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో (జీఈఎస్) జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా తరఫున ఇవాంకా హాజరు అవుతున్నారు. అలాగే ఈ నెల 23న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభ 72వ వార్షిక సమావేశంలో సుష్మా స్వరాజ్ ప్రసంగించనున్నారు. మరోవైపు ఇండియన్ ఎంబసీ కూడా న్యూయార్క్‌లో సుష్మా, ఇవాంకా భేటీకి సంబంధించి ఓ ఫోటోను ట్విట్ చేసింది. EAM @SushmaSwaraj discussed Women Empowerment and @IvankaTrump 's forthcoming visit to India. #GES2017 pic.twitter.com/kxD5xxE101 — India in USA (@IndianEmbassyUS) September 18, 2017 -
ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్‌గా లాజ్‌కాక్
యునైటైడ్ నేషన్స్: స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్‌కాక్(54) ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజి దౌత్యవేత్త పీటర్ థాంప్సన్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌లో మొదలయ్యే యూఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్‌కు లాజ్‌కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతేడాది యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ∙వారిలో లాక్‌జాక్ ఒకరు. -
ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు
పాకిస్థాన్ కుటియత్నానికి ఐక్యరాజ్యసమితిలో మరోసారి చుక్కెదురైంది. కశ్మీర్ సమస్యకు ఏవేవో రంగులు పూసి, దాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి, ఆ సమస్య పరిష్కారంలో వివిధ దేశాలతో వేలు పెట్టించాలనుకున్న ఆ దేశ ప్రయత్నానికి మళ్లీ గండిపడింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటూ పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అది ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం అవ్వాల్సిన సమస్య అని, భారత్-పాక్ దానిపై చర్చించుకోవాలని నవాజ్ షరీఫ్‌కు స్పష్టం చేశారు. ఇది ఆ రెండు దేశాల ప్రయోజనాలతో పాటు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనాలకు మేలు చేస్తుందని తెలిపారు. కశ్మీరీలపై మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, భారత సైన్యం అక్కడ అఘాయిత్యాలు చేస్తోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన వివరాలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. బాన్ కీ మూన్ కు అందించారు. కశ్మీర్లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన హత్యలపై స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు. అయితే, ఎన్నిసార్లు ఐక్యరాజ్యసమితిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని చూసినా పాకిస్థాన్‌కు మాత్రం భంగపాటు తప్పడం లేదు. ఈసారి కూడా సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మరోసారి పాక్ వాదనను తిప్పికొట్టారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య మాత్రమేనని, అందువల్ల ఇందులో అంతర్జాతీయ జోక్యానికి తావులేదని తెలిపారు. అలాగే ఆయన తన ప్రసంగంలో కూడా ఎక్కడా కశ్మీర్ అంశాన్ని అస్సలు ప్రస్తావించలేదు. మయన్మార్, శ్రీలంకలలో నెలకొన్న పరిస్థితులు, కొరియన్ ద్వీపంలో, మధ్యప్రాచ్యంలో అస్థిరతను గురించి మాట్లాడారు తప్ప కశ్మీర్ ఊసెత్తలేదు. ఇది పాకిస్థాన్‌కు పెద్ద భంగపాటుగా మిగిలింది. నవాజ్ షరీఫ్ మాత్రం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడేటప్పుడు కశ్మీర్ సమస్యను ఐరాస పరిష్కరించాలని కోరారు. కేవలం భారత్, పాక్ రెండు దేశాలూ కోరితే మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారానికి తమవంతు సాయం అందిస్తామని బాన్ కీ మూన్ కార్యాలయం ఇంతకుముందు కూడా పలుమార్లు తెలిపింది. -
ఇస్ ఇండియన్‌కో నికాలో!
న్యూయార్క్: పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ భారతీయ టీవీచానెల్ జర్నలిస్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎన్డీటీవీ జర్నలిస్టు పట్ల కొంత దురుసుగా ప్రవర్తిస్తూ.. ’ఇస్ ఇండియన్‌కో నికాలో’ (ఈ భారతీయుడ్ని వెళ్లగొట్టండి) అంటూ బయటకు పంపించారు. జమ్మూకశ్మీర్‌లోని యూరిలో తాజా ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లోని రూజ్వెల్ట్ హోటల్లో పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ జర్నలిస్టులెవరినీ అనుమతించలేదు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీటీవీ జర్నలిస్టు నమ్రత బ్రార్‌ను బయటకు పంపించారు. అంతేకాకుండా 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడిపై భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పాక్ నాయకత్వం జవాబు దాటవేసింది. న్యూయార్క్‌లో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారతీయ విలేకరుల ప్రశ్నలను పూర్తి తోసిపుచ్చుతూ.. వారిని ఏమాత్రం పట్టించుకోనట్టు వ్యవహరించారు. మరోవైపు మాత్రం జమ్ముకశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, బ్రిటన్ ప్రధాని థెరిసా మేలతో సమావేశాల్లో మొసలి కన్నీరు కార్చారు. -
ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ఎలాగైనా ప్రస్తావిస్తాం: పాక్
జమ్ము కశ్మీర్లో భారత్ సాగిస్తున్న 'రాజ్య ఉగ్రవాదం' అంశాన్ని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో 'ఎలాగైనా' తాము ప్రస్తావిస్తామని పాకిస్థాన్ అంటోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చాలా బలంగా ప్రస్తావిస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు. పాకిస్థాన్ ఎప్పుడూ జమ్ము కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ప్రస్తావిస్తూనే ఉందని, గత సంవత్సరం కూడా నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ఈ అంశం గురించి గట్టిగా మాట్లాడారని ఆయన అన్నారు. కశ్మీర్ లోయలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యదేశాలలో చాలా వరకు గుర్తించాయని చెప్పారు. -
చిన్న దీవి నుంచి ప్రపంచంలో అతిపెద్ద పదవికి..
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితికి కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు. దాదాపు 193 దేశాల సభ్యత్వం గల ఈ అంతర్జాతీయ సంస్థకు అతి చిన్న ద్వీపం అయిన ఫిజీకి చెందిన వ్యక్తి ఈ అత్యున్నత బాధ్యతలు స్వీకరించనున్నారు. బాన్ కీ మూన్ స్థానంలో ఆయన కొనసాగనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు సోమవారం ఎన్నికలు జరగగా ఫిజీకి చెందిన పీటర్ థామ్సన్ విజయం సాధించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ 94 ఓట్లు పోలయ్యాయి. ఆయనతోపాటు ఈ పదవికి పోటీపడిన సిప్రస్ కు చెందిన ఆండ్రియాస్ మావ్రోయిన్నిస్ 90 ఓట్లు వచ్చాయి. దీంతో థామ్సన్ విజయం ఖరారైంది. ఈసారి ఫసిపిక్ దేశాలకు చెందిన వ్యక్తులకు ఈ పదవిని దక్కించుకునే అవకాశం రావడంతో ఫిజీ రాయభారి థామ్సన్‌ను ఈ అదృష్టం వరించింది. గతంలో ఒక అభ్యర్థిని ప్రతిపాదించగా దానికి ఏకాభిప్రాయం తెలిపేవారు. అయితే, ఈసారి అలా కుదరకపోవడంతో 193 దేశాల సభ్యత్వం ఉన్న ఈ సంస్థలో ప్రధాన అంగమైన జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. అమెరికాలో చోటుచేసుకుంటున్న అవినీతి అంశాలపైనే థామ్సన్ తన దృష్టిని పెట్టనున్నారట. భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి థామ్సన్ అత్యంత అనూకూలమైన వ్యక్తి. అంతేకాకుండా భద్రతామండలి పునర్నియామకం జరగాలని చెప్పే వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. సెప్టెంబర్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
మేం 'గే'లు కాదు...
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వి ఆర్ నాట్ గేస్' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పశ్చిమ దేశాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త హక్కులు అంటూ ఆ దేశాలు తెరపైకి తీసుకొస్తున్న నూతన విధానాలు మా ప్రజల విలువ, సంస్కృతి, నమ్మకాలపై ప్రభావం చూపిస్తాయని ముగాబే పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండంలో ఎల్జీబీటీ విధానాలు, హక్కులు అధికంగా ఉన్న దేశం జింబాబ్వే అన్న విషయం అందరికి విదితమే. తమ దేశస్థులను స్వలింగ సంపర్కం చేసే వారిగా ఇతర దేశాలు భావిస్తుండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్వలింగ సంపర్కం చేసే వారు 'పందులు, మేకలు, ఇతర జంతువుల కన్నా హీనం' అంటూ 2013లోనూ ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే.