Demanding Moscow Withdraws Its Troops: యూఎన్ జనరల్ అసెంబ్లీ ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొగాలని డిమాండ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతవారం నుంచి ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా పై ప్రపంచదేశాల నుంచి తీవ్రమైన ఆగ్రహం వెల్లువెత్తుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్థం గురించి చర్చించేందుకు సుమారు 100కు పైగా దేశాలు సమావేశమయ్యారు.
ఈ నేపథ్యంలో మాస్కో తన దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరరూ దౌత్యవేత్తలచే ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రజాస్వామ్యానికి అగ్నిపరీక్షలా సాగుతున్న నిరుకుశ ప్రభుత్వాలను సరైన మార్గంలో పెట్టేలా ఈ తీర్మానం ఉంటుందని యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశం పేర్కొంది. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమన్ పుతిన్‌కి కనువిప్పు కలిగించేలా శక్తివంతమైన మందలింపు చర్యగా అభివర్ణించింది.
అయితే ఈ తీర్మానం ఆమెదించాలంటే రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి. అంతేకాదు భద్రతామండలిలో ఈ తీర్మానాన్ని సమర్పించక మునుపే రష్యా వీటో చేసే అవకాశం లేదు. అంతేకాదు ఈ తీర్మానానికి 193 మంది సభ్యులతో కూడిన బలమైన సంస్థల అత్యధిక మెజార్టీ మద్దతు ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉంచాలనే పుతిన్ నిర్ణయాన్ని యూఎన్ తీవ్రంగా ఖండించింది.
ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఏమి లాభం ఉండదని చైనా కూడా నొక్కి చెబుతోంది. గతవారం రష్యాని కట్టడి చేసే దిశగా పశ్చిమ దేశాలు పలు కఠిన ఆంక్షలు విధించాయి. స్విఫ్ట్ నుంచి డిస్‌కనెక్టం చేయడం వంటి వాటిని సైతం రష్యా లక్ష్య పెట్టక పోగా ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు అడ్డుకట్టే వేసేందుకు ప్రపంచ దేశాలన్ని ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఓటింగ్ నిర్వహించే యోచన చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment