న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. యూఎన్ 78వ సర్వ సభ్య సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. భారత్- పాక్ మధ్య కశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతుండటం దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైతుందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని మరోసారి చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుర్కియే ఈ అంశంపై మద్దతునిస్తుందని పేర్కొన్నారు.
' ఇండియా, పాకిస్థాన్‌లు స్వాతంత్య్రం తెచ్చుకుని 75 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరం. కశ్మీర్‌లో ఇప్పటికైన శాంతి నెలకొనే విధంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోవాలి.' అని ఐక్యరాజ్య సమితి వేదికగా ఎర్డోగాన్ అన్నారు.
ఢిల్లీలో జరిగిన జీ20కి హాజరైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. వారం రోజులకే ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని యూఎన్‌లో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది.
సభ్య దేశాల సంఖ్య పెంచాలి:
ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలక పాత్ర పోషించడంపై ఎర్డోగాన్ శుభపరిణామం అని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉండగా.. కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత స్థానంలో ఉండటం సరికాదని అన్నారు. భద్రతా మండలిలో ఉన్న 20 దేశాలను విడతలవారిగా శాశ్వత సభ్యులుగా మార్చాలని కోరారు.
ఇదీ చదవండి: జాగ్రత్త.. కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు
Comments
Please login to add a commentAdd a comment