Turkish President Recep Tayyip Erdogan
-
ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. యూఎన్ 78వ సర్వ సభ్య సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వివాదాస్పదంగా మారింది. భారత్- పాక్ మధ్య కశ్మీర్ వివాదం ఇంకా కొనసాగుతుండటం దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైతుందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని మరోసారి చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుర్కియే ఈ అంశంపై మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ' ఇండియా, పాకిస్థాన్‌లు స్వాతంత్య్రం తెచ్చుకుని 75 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనకపోవడం దురదృష్టకరం. కశ్మీర్లో ఇప్పటికైన శాంతి నెలకొనే విధంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోవాలి.' అని ఐక్యరాజ్య సమితి వేదికగా ఎర్డోగాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన జీ20కి హాజరైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. వారం రోజులకే ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని యూఎన్‌లో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. సభ్య దేశాల సంఖ్య పెంచాలి: ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలక పాత్ర పోషించడంపై ఎర్డోగాన్ శుభపరిణామం అని అన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉండగా.. కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత స్థానంలో ఉండటం సరికాదని అన్నారు. భద్రతా మండలిలో ఉన్న 20 దేశాలను విడతలవారిగా శాశ్వత సభ్యులుగా మార్చాలని కోరారు. ఇదీ చదవండి: జాగ్రత్త.. కెనడాలోని భారతీయులకు కేంద్రం హెచ్చరికలు -
కశ్మీర్లోకి టర్కీ కిరాయి సైనికులు!
న్యూఢిల్లీ: కశ్మీర్లోకి టర్కీ తూర్పు సిరియా నుంచి కిరాయి సైనికులను పంపుతోందని ఏఎన్ఎఫ్ న్యూస్ తెలిపింది. త్వరలో ఇక్కడ నుంచి కశ్మీరుకు చేరాలని సిరియాలోని సులేమన్‌షా బ్రిగేడ్స్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అబు ఇమ్షా తన అనుచరులకు సూచించారని స్థానిక వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. త్వరలో కశ్మీర్‌కు వెళ్లే వారి జాబితాను టర్కీ అధికారులు ఇతర టెర్రరిస్టు కమాండర్లను అడిగి తయారు చేస్తారని అబు ఇమ్షా చెప్పాడు. ఈ జాబితాలో పేరు నమోదు చేయించుకున్నవారికి 2 వేల డాలర్లు ముడతాయని వివరించాడు. ఇదంతా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పన్నాగమని గ్రీకు జర్నలిస్టు అండ్రియాస్ మౌంట్‌జొరాలియస్ ఒక నివేదికలో వెల్లడించారు. ఇస్లాం ప్రపంచంలో సౌదీ డామినేషన్‌ను సవాలు చేసేందుకు ఎర్డోగాన్ యత్నిస్తున్నారని, ఆగ్నేయాసియాలో ముస్లింలపై పట్టు సాధించేందుకు కశ్మీర్ విషయంలో పాక్‌కు మద్దతు పలుకుతున్నారని ఆండ్రియాస్ చెప్పారు. అయితే భారత్‌లో టర్కీ రాయబారి ఈ వార్తలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన సందర్భంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. అలాగే పలుమార్లు పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ అంశంలో టర్కీ తలదూరుస్తుందన్న వార్తలపై రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టర్కీ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌పై వేటు
అంకారా : టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ కేంద్ర బ్యాంకు గవర్నరు మురాత్ సెటింకాయను అనూహ్యంగా పదవినుంచి తప్పించారు. ఆయన స్థానంలో డిప్యూటీ గవర్నర్ మురత్ ఉయిసాల్ ను నియమించారు. ఈ మేరకు శనివారం అధికారిక గెజిట్‌ను ఉటంకిస్లూ బ్లూం బర్గ్ నివేదించింది. ప్రభుత్వానికి, కేంద్ర బ్యాంకు గవర్నకు మధ్య నెలకొన్నవివాదం జూన్ 12 నాటిపాలసీ రివ్యూ తరువాత మరింత ముదిరింది. కీలక వడ్డీరేట్ల యథాతథం నిర్ణయం చివరికి గవర్నర్ ఉద్వాసనకు దారితీసిందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం అక్కడి మార్కెట్లను భారీగా ప్రభావితం చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే కిందికి దిగజారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టర్కీ ప్రస్తుత వాస్తవ రేటు 8.3 శాతానికి చేరుకున్న కొద్ది రోజుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ విశ్వసనీయతను అణగదొక్కడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని లండన్ కు చెందిన వ్యూహకర్త పియోటర్ మాటిస్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం డబుల్ డిప్ మాంద్య ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారిగా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. సెంట్రల్ బ్యాంకు తదుపరి విధాన నిర్ణయం జూలై 25 న జరగాల్సి ఉంది. మురాత్ నాలుగేళ్ల పదవీకాలం 2020లో ముగియనుంది. టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇటీవల తిరిగి మాంద్యంలోకి జారుకుంది. దశాబ్దకాలం తర్వాత మరోసారి మాంద్యంలోకి పడిపోవడం సర్వత్రా ఆందోళ రేపింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధితోపాటు ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ అధ్యక్షుడు రెసెప్ తెయిప్ ఎర్డోగాన్ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని ఆర్థిక వేత్తలు అంచనావేశారు. గత ఏడాదిలో డాలర్ మారకంలో టర్కీ కరెన్సీ లిరా 30 శాతం మేర క్షీణించింది. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతులు మరింత భారమైన సంగతి తెలిసిందే. -
చిన్నారి బనా సేఫ్.. అధ్యక్షుడి వద్ద ప్రత్యక్షం
అంకారా: అతి పిన్న వయస్సులోనే తమ దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యలను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ మొత్తం ప్రపంచ దృష్టినే ఆకర్షించిన సిరియాలోని అలెప్పో నగరానికి చెందిన ఏడేళ్ల చిన్నారి బనా అల్ అబెద్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆ పాపను ప్రేమగా దగ్గరకు తీసుకొని ఎత్తుకొని మురిపించాడు. ఇంత చిన్న వయసులోనే భయానక దృశ్యాలను ఒక బాధ్యతగా కళ్లకు కట్టినట్లు చూపిన ఆ పాపను ప్రత్యక్షంగా చూసి అధ్యక్షుడు ముగ్దుడయ్యారు.(ప్రియమైన ప్రపంచమా మళ్లీ కలుద్దాం.. సెలవు) అంకారాలోని తన ప్యాలెస్‌లో ఈ చిన్నారిని ఎర్డోగన్ కలిశారు. సిరియాలోని ప్రముఖ నగరం అలెప్పోలో ప్రభుత్వ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అలెప్పోలో ఉగ్రమూకలను తరిమి వేయాలనే లక్ష్యంతో చేసే బాంబుల దాడుల కారణంగా ఎంతో మంది అమాయకులు బలవ్వడమే కాకుండా నగరమంతటా విధ్వంసం జరిగింది. ఎక్కడ ఎప్పుడు బాంబు పడుతోందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యాలన్నింటిని బనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరించింది. వీడియోలను పోస్ట్ చేసింది. చివరి ట్వీట్ గా తమ ఇంటిపై బాంబు పడిందని, తాము బ్రతికి ఉంటే మళ్లీ కలుస్తామంటూ చెప్పింది. ('గుడ్ మార్నింగ్.. మేమింకా బతికే ఉన్నాం') అనంతరం ట్విట్టర్ ఖాతా నుంచి మాయమైంది. దీంతో ఆ పాపకు ఏమై ఉంటుందో అని ప్రతి ఒక్కరూ ఆందోళన పడ్డారు. ఎట్టకేలకు అక్కడ నుంచి తరలించిన బలగాలు వారిని సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో బనా తన కుటుంబంతో కలిసి ఎర్డోగన్‌ను కలిసింది. ఈపాపకు ట్విట్టర్లో దాదాపు 3,33,000మంది ఫాలోవర్లు ఉన్నారు. వాళ్లమ్మ ఓ ఆంగ్ల టీచర్. ఆమెనే బనా పేరు మీద ట్విట్టర్ ఖాతా తెరిచింది. అంతకుముందే ఈ పాప కుటుంబానికి ఆశ్రయం ఇస్తామని టర్కీ ప్రకటించింది. అయితే, వారు ఎప్పుడు సిరియా సరిహద్దు దాటి వెళ్లారనే విషయం మాత్రం తెలియదు. -
100మంది టీచర్లపై పాక్ వేటు
లాహోర్: వెంటనే తమ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా టర్కీకి చెందిన 100మంది టీచర్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 20నాటికి కుటుంబ సభ్యులతో సహా ఖాళీ చేసి ఏ ఒక్కరు ఉండకుండా వెళ్లిపోవాలని చెప్పింది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజులపర్యటనలో భాగంగా నేడు ఇస్లామాబాద్ వస్తుండగా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతర్గత వ్యవహారాల మంత్రివర్గ సమాచారం ప్రకారం.. మూడు రోజుల్లోగా పాక్ ను విడిచి వెళ్లాలని టర్కీ టీచర్లకు చెప్పారంట. మొత్తం 108మంది టీచర్లు ఇక్కడ విద్యను బోధిస్తున్నారని, అయితే, వారి వీసాల గడువు పూర్తవడం, వాటిని మరింత పొడిగించేందుకు నిరాకరించడంతో వారిని పంపిస్తున్నామని పాక్ అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ పాఠశాలను నడుపుతున్న వ్యక్తి అమెరికాలోని పాక్ సంతతికి చెందిన ఫెతుల్లా గులెన్ అనే ముస్లిం మతాచార్యుడు. అయితే, ఆయనను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గతంలో తీవ్రంగా విమర్శించారు. దీన్ని మనసులో పెట్టుకొని వారి వీసా గడువు పెంచనీయకుండా ఫెతుల్లా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి వారిని వెంటనే పంపించేందుకు ఒప్పించినట్లు తెలిసింది. పాక్ నిర్ణయంపై పాక్-టర్కీ స్కూళ్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒత్తిళ్లకు తలొగ్గే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించాయి. ఎర్డోగన్ పర్యటన తర్వాత పాక్ నిర్ణయంలో మార్పు వస్తుందేమో చూడాలి.