
యాంకర్ అనసూయ సోషల్ మీడియా ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై తనకు నచ్చిన విధంగా స్పందిస్తుంది. ట్రోల్ చేసినా పట్టించుకోదు. ఇంకా చెప్పాలి అంటే ‘మీరు ఎంత ట్రోల్ చేస్తే నేను అంత డేరింగ్‌గా మాట్లాడుతా’అన్నట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్టింగ్స్ ఉంటాయి. తాజాగా అనసూయ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట్ వైరల్‌గా మారాయి.
తాజాగా అనసూయ అభిమానులతో ఆన్‌లైన్ చాటింగ్‌లో పాల్గొంది. ఈ క్రమంలో ఓ అభిమాని మీరు నిజంగా లిబరల్, మెట్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ‘మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్ ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు వారితో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్‌లైన్‌లో మాత్రం చాలా సార్లు అనుభవమైంది’అని ఓపెన్‌గా సమాధానం చెప్పింది.
ఇదే చాట్‌లో అనసూయ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మరో నెటిజన్ మీరు మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ ఎప్పుడు చేస్తారు? అని అడగ్గా.. ‘టీఆర్పీ కోసం మేకర్స్ చేస్తే అవమానకర స్టంట్స్ పోతేకాని నేను రాను. నేను కూడా బుల్లితెరను మిస్ అవుతున్నాను’ అని అనసూయ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment