‘స్వలింగ సంపర్కం’పై రగడ
పదేళ్లకు పైగా సాగిన న్యాయ వివాదంలో స్వలింగ సంపర్కులకు ఈ ఏడాది ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కం నేరమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే దాన్ని నేరాల జాబితా నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సహజవిరుద్ధ శృంగారం, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష వేయొచ్చనని చెబుతున్న ఐపీసీ సెక్షన్ 377ను సుప్రీం కోర్టు సమర్థించింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పును డిసెంబర్ 11న తోసిపుచ్చింది. అయితే కోర్టు తీర్పు తమ జీవించే హక్కును కాలరాసిందంటూ స్వలింగ సంపర్కులు నిరసనకు దిగారు.