ఇద్దరు స్వలింగ భాగస్వాముల మధ్య జరిగిన ఘర్షణలో 18 ఏళ్ల యువకుడు తన భాగస్వామిని కాల్చి చంపాడు. వాళ్లిద్దరి మధ్య సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని.. సదరు యువకుడి తల్లిపై ఆ రెండో భాగస్వామి దాడి చేయడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడి తల్లికి, చనిపోయిన వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దాంతో అతడు ఆమెను చంపబోతుండగా ఈ యువకుడు అతడిని కాల్చి చంపాడని పోలీసు ఇన్స్పెక్టర్ పి.డి. పర్మార్ చెప్పారు. అహ్మదబాద్ బాపునగర్ ప్రాంతంలోని చున్వల్ నగర్ మురికివాడలో ఈ సంఘటన జరిగింది.
సంఘటనకు ముందు హతుడు చేతిలో రివాల్వర్ పట్టుకుని నిందితుడి తల్లిని బెదిరించాడని, అతడు చంపుతాడన్న భయంతో ఈ యువకుడు అతడి చేతుల్లోంచి నాటు తుపాకిని లాక్కుని మూడు రౌండ్ల కాల్పులు జరిపాడని, దాంతో అతడు అక్కడికక్కడే మరణించడని పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య ఏడాది కాలంగా సంబంధం ఉంది. నిందితుడి తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
స్వలింగ భాగస్వామిని కాల్చిచంపిన యువకుడు
Published Sat, Oct 4 2014 7:32 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement