కొందరూ మనకళ్ల ముందే అధిక బరువుతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడినవాళ్లు అద్భుతం చేసినట్లు స్లిమ్‌గా అయ్యిపోతారు. వాళ్లను చూడగానే భలే బరువు తగ్గారనిపిస్తుంది. అచ్చం అలానే హౌసింగ్ డాట్ కమ్ సీఈవో జస్ట్ రెండేళ్లలోనే చాలా బరువు తగ్గి తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన వెయిట్ లాస్ జర్నీ ఎలా మొదలయ్యిందంటే..
హౌసింగ్ డాట్ కామ్ సీఈవో ధ్రవ్ అగర్వాలా 2021 నుంచి గుండోపోటు, గుండెల్లో మంట వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇబ్బందులకు గురిచేసిన ఆ అనారోగ్య సమస్యలే అతడిని బరువు తగ్గేందుకు ప్రేరేపించాయి. ఆ గుండె జబ్బు కారణంగా ఆయన ఫేస్ చేసిన సమస్యలే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేశాయి. అప్పుడు ఆయన దాదాపు 151 కిలోలు బరువు ఉన్నాడు. ఆ టైంలో ప్రీ డయాబెటిక్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు.
వీటితోపాటు స్లీప్ ఆప్నీయా కూడా వచ్చింది. దీంతో ధ్రువ్ ఎలాగైన బరువు తగ్గాల్సిందే అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు. అందుకని మంచి ఫిట్‌నెస్‌ర్‌ని నియమించుకున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఆస్పత్రులకు లేదంటే బెడ్‌లకే పరిమితమవ్వడం తనను బాగా బాధించిందని అంటాడు ధ్రువ్. ఇక ఫిట్‌నెస్ నిపుణుడు సమక్షంలో రోజుకు రెండుసార్లు వ్యాయామ కసరత్తులు చేసేలా దృష్టి పెట్టారు. కిలోమీటర్లు చొప్పున నడక, కేలరీలు తక్కువుగా ఉన్నా ఆహారం తీసుకోవడం వంటివి చేశారు. ముఖ్యంగా రోజువారి దాదాపు 17 వందల కేలరీలను తగ్గించాడు.
నోటిని కంట్రోల్ చేసుకునేలా ఏదైనా వర్కౌట్‌లలో బిజీగా ఉండేవాడు. వాటి తోపాటు ఆల్కహాల్, ప్రాసెస్ చేసి, వేయించిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వండిన కూరగాయాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు. రాత్రిపూట కాల్చిన చికెన్ లేదా చేపలతో సెలెరీ లేదా ఆస్పరాగస్ సూప్ వంటివి తీసుకునేవాడు. అలాగే చక్కటి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, దోసకాయలు, క్యారెట్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకునేవాడు. దీంతో ధ్రువ్ అనూహ్యంగా తన బరువులో సగానికి పైగా తగ్గిపోయాడు.
పైగా తనకు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంటే ఇష్టమని, ఆయనంత బరువే ఉండాలని గట్టిగా కోరుకోవడంతోనే ఇది సాధ్యమయ్యిందని ఆనందగా చెబుతున్నారు ధ్రువ్. తాను మరింతగా బరువు తగ్గేలా స్విమ్మింగ్, రన్నింగ్ వంటి వాటిపై కూడా దృష్టిపెట్టానని చెప్పాడు. తన వార్డ్‌బోర్డ్‌లో దుస్తులను మార్చి ఇష్టమైన ఫ్యాషన్ దుస్తులను ధరించడం చాలా అద్భుతంగా అనిపించని అన్నాడు ధ్రువ్. నిజానికి ధ్రువ్ చిన్నతనంలో కోల్‌కతాలో పెరిగారు. ఆయన బాల్యంలో ఎక్కువగా క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడేవారు.
అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం వంటివి చేయకపోవడంతో ఆయన విపరీతంగా బరువు పెరిగిపోవడం జరిగింది. ఏదీఏమైతేనేం అనారోగ్యం సమస్య ఆరోగ్యంపపై స్ప్రుహ కలిగించి, స్లిమ్‌గా అయ్యేలా చేసింది. అధిక బరువు కాదు సమస్య తగ్గాలనే స్పిరిట్ ఉండాలి. అది ఉంటే ఈజీగా తగ్గిపోవచ్చని ధ్రువ్ చేసి చూపించారు.
(చదవండి: సమ్మర్‌లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!)
Comments
Please login to add a commentAdd a comment