మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఉద్వేగభరితంగా, సాహసోపేతంగా సాగిపోతుందీవారమంతా! ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు క్రీడలలో పాల్గొనండి.
కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో కూడి ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు మీకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి.
కలిసొచ్చే రంగు: పచ్చ
మిథునం (మే 21 – జూన్ 20)
ఈ వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలిస్తుంది.
కలిసి వచ్చే రంగు: తెలుపు
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
పాతబంధాలు బలపడతాయి. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. మీ హితులకు, సన్నిహితులకు ఏ సమస్య వచ్చినా, వారికి మీరే గుర్తుకొస్తారు. వారికి తగిన పరిష్కారం చూపించి, ఆత్మసంతృప్తి పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల విషయంలో భయం వదిలి సంగీత చికిత్స తీసుకోండి.
కలిసివచ్చే రంగు: వంకాయ
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
కలిసివచ్చే రంగు: ఎరుపు
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది.
కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి.
కలిసి వచ్చే రంగు: ఎరుపు
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
కలిసి వచ్చే రంగు: బూడిద
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు.
కలిసి వచ్చే రంగు: ఊదా
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.
కలిసి వచ్చే రంగు: బంగారు
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.
కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆర్థికవనరులు సమకూరుతాయి. గత చేదుజ్ఞాపకాలను మరచిపోండి. వాటినుంచి అనుభవ పాఠాలను నేర్చుకోండి. ధనపరంగా త్వరలోనే ఒక శుభవార్త అందుకుంటారు. గతంలో మీ చేజారిపోయిందనుకున్న ఒక అవకాశం తిరిగి మీ తలుపు తడుతుంది. ఈసారి జారవిడుచుకోరు. మీ జీవితభాగస్వామి నుంచి మీకో అనూహ్య కానుక అందుతుంది.
కలిసొచ్చే రంగు: సిరా నీలం
టారో :19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు
Published Sat, Feb 18 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
Advertisement
Advertisement