టారో : 9 ఏప్రిల్‌ నుంచి 15 ఏప్రిల్‌ 2017 వరకు | Tarot: 9 April to 15 April 2017 | Sakshi
Sakshi News home page

టారో : 9 ఏప్రిల్‌ నుంచి 15 ఏప్రిల్‌ 2017 వరకు

Published Sun, Apr 9 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

టారో : 9 ఏప్రిల్‌ నుంచి 15 ఏప్రిల్‌ 2017 వరకు

టారో : 9 ఏప్రిల్‌ నుంచి 15 ఏప్రిల్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఉత్సాహంతో పనులు చకచకా చే స్తారు. ముఖ్య విషయాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే అవమానం తప్పదు. మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కెరీర్‌ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.
కలిసొచ్చే రంగు: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు. కెరీర్‌లో లేదా మీ జీవితంలో భారీ మార్పు చేర్పులుండవచ్చు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే అవకాశం మీ తలుపు తట్టబోతోంది.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. ప్రాక్టికల్‌గా ఉండటం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారం. అనవసరంగా గతాన్ని తవ్వుకుంటూ కూచోవద్దు. అధికార యోగం లేదా పదవీయోగం తలుపు తడుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. వారసత్వపు ఆస్తులు కలిసి రావడం వల్ల సంపద పెరుగుతుంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కెరీర్‌పరంగా మార్పు చేర్పులుండవచ్చు.
కలిసొచ్చే రంగు: బూడిదరంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
బుర్రకు పదును పెట్టి, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతే అంతా శుభమే! ఒక విషయంలో సందిగ్ధత నెలకొనవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపడతారు లేదా కొత్తవారితో పనిచేయవలసి రావచ్చు. పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. అననుకూలతలనూ అధిగమిస్తారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ తలుపు తడతాయి. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
కలిసొచ్చే రంగు: నారింజ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి  వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి.
కలిసొచ్చే రంగు: నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీ కెరీర్‌ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో‡మార్పు చేర్పులు చేసుకుంటారు. తొందరపడి మాట ఇవ్వడం లేదా మొహమాటానికి పోయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టి, మంచి. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మౌనంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు.
కలిసొచ్చే రంగు: వంకాయరంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు వస్తుంది. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మొహమాటంతో మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోకపోతే మునిగిపోతారు. కుటుంబ వ్యవహారాలలో పట్టీపట్టనట్టు ఉండే మీ ధోరణి మంచిది కాదు.
కలిసొచ్చే రంగు: గోధుమ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. విసుగువల్ల, తప్పదన్నట్లు పని చేసి, నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యంలో అప్రమత్తత అవసరం.
కలిసొచ్చే రంగు: నలుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఉన్నతమైన హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టినకొద్దీ, మీకు మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది.
కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కెరీర్‌పరమైన విషయాలలో మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆదాయ వ్యయాలలో ప్రణాళిక ప్రకారం నడుచుకోండి.
కలిసొచ్చే రంగు: నారింజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement