టారో : 2 ఏప్రిల్‌ నుంచి 8 ఏప్రిల్‌ 2017 వరకు | Tarot: from April 2 to April 8, 2017 | Sakshi
Sakshi News home page

టారో : 2 ఏప్రిల్‌ నుంచి 8 ఏప్రిల్‌ 2017 వరకు

Published Sun, Apr 2 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

టారో :  2 ఏప్రిల్‌ నుంచి 8 ఏప్రిల్‌ 2017 వరకు

టారో : 2 ఏప్రిల్‌ నుంచి 8 ఏప్రిల్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకుంటారు. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెట్టుబడులు ఫలప్రదం అవుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగు చూస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కల్యాణ ఘడియలు మోగవచ్చు సంసిద్ధంగా ఉండండి. సన్నిహితుల సాయం లభిస్తుంది.
కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
పగటికలలు మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. న్యాయపరమైన వివాదాలలో అనవసర జాప్యం మిమ్మల్ని కుంగదీస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. మంచి వక్తగా గుర్తింపు పొందుతారు. గురువులు లేదా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుంటారు. కుటుంబపరంగా సంతృప్తి.
కలిసొచ్చే రంగు: నారింజ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. విజయాల బాటలో నడుస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో పలుకుబడి గల వ్యక్తులు పరిచయం అవుతారు. జీవితంలో పెద్ద మలుపునకు దారితీయవచ్చు. పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి.
కలిసొచ్చే రంగు: నీలం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి. అంచనా వ్యాపారాలు, జూదం వంటి వ్యసనాల జోలికి వెళ్లవద్దు. అవకాశాలకోసం నిశిత పరిశీలన చేస్తారు. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసి రావచ్చు. మీ మనసులో ఉన్న ఆలోచనలకు, లక్ష్యాలకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వండి.  పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కెరీర్‌ పరంగా మంచి అవకాశాలు వస్తాయి.
కలిసొచ్చే రంగు: గులాబీ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
చాలా అవిశ్రాంతంగా గడుపుతారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచిం^è ండి. సానుకూల భావనలతో ఉండండి. పెట్టుబడులలోఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. జిమ్‌ లేదా యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వారమంతా ఉల్లాసంగా పని చేస్తారు. అదే మిమ్మల్ని విజయాలబాటలో నడిపిస్తుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. పిల్లల విషయమై మంచి వార్తలు వింటారు.
కలిసొచ్చే రంగు: వంకాయరంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వ్యాపార విస్తరణకు మంచి అవకాశం లభిస్తుంది. మీ సహాయ సహకారాల కోసం టీమంతా ఎదురు చూస్తుంటుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. అలసిపోయిన శరీరాన్నీ మనస్సునూ సేదతీర్చడానికి విందు వినోదాలలో గడుపుతారు. విహార యాత్రలు చేసేందుకు తగిన సంసిద్ధతలో ఉంటారు. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు.  
కలిసి వచ్చే రంగు: తెలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
నిత్యం పనుల ఒత్తిడితో అలసిపోయిన మీరు సేదతీర్చుకోవడానికి ఇష్టమైన వారితో కలసి పిక్నిక్‌కు లేదా దూరప్రాంతాలకు విహారయాత్రలకు వెళదామని ఆలోచన చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మీ సన్నిహితులకు వచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపించి, వారి అభినందనలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి.  

కలిసివచ్చే రంగు: వెండి
ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదే కానీ, అలాగని కుటుంబ జీవితాన్ని త్యాగం చేయకూడదు కదా... ప్రణాళికాబద్ధంగా పని చేసి, ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. వెన్నుపోటు దారుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అవసరం.
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టుల ద్వారా ఆశించినంత ఆదాయం లభించకపోవడం నిరాశకు గురి చేస్తుంది. రోజూ ఉదయమే లేలేత సూర్యకిరణాలలో స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. మీ విజ్ఞానంతో, సృజనాత్మకతతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలను, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. గృహ సంబంధమైన కొత్తవస్తువులు లేదా బంగారం కొంటారు.  
కలిసి వచ్చే రంగు: బంగారు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
శక్తిసామర్థ్యాలతో పనులు పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో ప్రజా సంబంధాలను మెరుగు పరచుకుంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. మనసు చెప్పిన మాట వినండి. కొత్త ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది.
కలిసి వచ్చే రంగు: నారింజ లేదా కాషాయం

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనుకున్న పనులను ధైర్యంగా ప్రారంభించండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంటారు.
కలిసి వచ్చే రంగు: గోధుమరంగు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement