టారో 30 ఏప్రిల్‌ నుంచి 6 మే 2017 వరకు | Tarot from 30 April to 6 May 2017 | Sakshi
Sakshi News home page

టారో 30 ఏప్రిల్‌ నుంచి 6 మే 2017 వరకు

Published Sun, Apr 30 2017 2:41 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

టారో 30 ఏప్రిల్‌ నుంచి 6 మే 2017 వరకు

టారో 30 ఏప్రిల్‌ నుంచి 6 మే 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో సాగిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, వీపునొప్పి, కొద్దిపాటి మానసిక ఒత్తిడి బాధించవచ్చు. సంగీత చికిత్స లేదా ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
కలిసొచ్చే రంగు: పసుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. మీ కలలు నిజం అయే అవకాశం కలుగుతుంది.Sపలుకుబడిగల వ్యక్తుల సహకారం లభిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ వారం ప్రయోజనం చేకూరుతుంది. మీ ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
కలిసొచ్చే రంగు: వంకాయ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి మంచి కబురు అందుతుంది. చదువుకు సంబంధించిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. విందు వినోదాలలో తీరుబడి లేకుండా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకుని, వేగంగా పని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
కలిసి వచ్చే రంగు: » ంగారం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
పాతబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. నూత్న శక్తి సామర్థ్యాలతో ఉత్సాహంగా పని చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశీయానం చేయవలసి రావచ్చు. ఒక స్త్రీ మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పెట్టిన పెట్టుబడల నుంచి లాభపడతారు. మార్నింగ్‌ వాక్, యోగ వంటివి కొనసాగించడం మంచిది.
కలిసివచ్చే రంగు: గోధుమ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్డర్లు అందుతాయి.
కలిసివచ్చే రంగు: ఎరుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది.  కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది.
కలిసొచ్చే రంగు: మావిచిగురు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి.  మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. మీ కష్టసుఖాలను స్నేహితులకు చెప్పుకుని ఉపశమనం పొందుతారు.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు చేసిన పనులకు  పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దానికి ఓర్చుకోలేక మిమ్మల్ని చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. తెలివిగా తిప్పికొట్టడం అలవరచుకోండి. నూతన గృహ లేదా వాహన యోగం ఉంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు.
కలిసొచ్చే రంగు: నీలం

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే అనివార్య కారణాల వల్ల పనులు ఆలస్యం అవవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో అప్రమత్తత అవసరం.  
కలిసొచ్చే రంగు: బూడిదరంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. Ðఅవకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. భాగస్వామి సహకారం లభిస్తుంది.
కలిసొచ్చే రంగు: వెండి

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్‌నిక్‌కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి.
కలిసొచ్చే రంగు: నారింజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement