టారో : 23 ఏప్రిల్‌ నుంచి 29 ఏప్రిల్‌ 2017 వరకు | Tarot: from 23 April to 29 April 2017 | Sakshi
Sakshi News home page

టారో : 23 ఏప్రిల్‌ నుంచి 29 ఏప్రిల్‌ 2017 వరకు

Published Sat, Apr 22 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

టారో : 23 ఏప్రిల్‌ నుంచి 29 ఏప్రిల్‌ 2017 వరకు

టారో : 23 ఏప్రిల్‌ నుంచి 29 ఏప్రిల్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పనిలో బాధ్యతాయుతంగా మెలిగి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉరవడిని కనిపెడతారు. లక్ష్యాలను నిర్ణయించుకుని పని చేస్తే మెరుగైన ఫలితాలను పొందగలమని గ్రహిస్తారు. ఈ వారం మీ స్నేహితుడి నుంచి ఒక శుభవార్తను అందుకుంటారు. ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండటం అవసరం అని తెలుసుకోండి.
కలిసొచ్చే రంగు: గులాబీ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
పనిప్రదేశంలో కొత్త సవాళ్లు, కొన్ని ప్రతిబంధకాలూ ఏర్పడవచ్చు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోక, సహోద్యోగుల సహకారంతో తగిన చర్యలు చేపట్టండి. ఎంతోకాలంగా ఒక వ్యాపారం ఆరంభించడానికి లేదా కొత్త ఆదాయ మార్గం కోసం ఎంతోకాలంగా మీరు చూస్తున్న ఎదురు చూపులు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేయడానికి ఇది తగిన సమయం. ప్రేమలో మీకున్న చిక్కులు తొలగుతాయి.
కలిసొచ్చే రంగు: నీలాకాశం

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వల్లనే విజయానికి చేరువ అవుతారని గ్రహించండి. పాత జ్ఞాపకాలు కొంత బాధపెట్టవచ్చు. అయితే గతంలోని చేదును మాత్రమే కాకుండా, తీపి అనుభవాలనూ నెమరు వేసుకోవడం మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ప్రేమ విషయంలో కొద్దిపాటి చొరవ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది.
కలిసొచ్చే రంగు: పచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఏది  ముఖ్యమైనదో కాదో అవగాహన ఏర్పరచుకుని అందుకు తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: గోధుమ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు.
కలిసొచ్చే రంగు: నీలం

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఐకమత్యమే బలం అన్నట్లుగా అందరినీ కలుపుకుంటూ పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం మీరు మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. బద్ధకమనే మీ శత్రువును వదిలించుకుంటే మంచిది. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త.
కలిసొచ్చే రంగు: వంకాయ రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్‌ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి.
కలిసొచ్చే రంగు: నలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది  తగిన సమయం కాదు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్‌ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు.
కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
పాత బాకీలనుంచి, అనారోగ్య సమస్యలనుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు.
కలిసిచ్చే రంగు: దొండపండు రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
చాలా కాలంగా మీరు అణగదొక్కి ఉంచిన సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. జాగ్రత్త. ఇది మీ ప్రస్తుత జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే మీకు బాగా కావలసిన వారి పలుకుబడిని ఉపయోగించి, తిరిగి ఆ సమస్యలను అణిచేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్స తీసుకుంటారు. అనవసర వివాదాల జోలికి వెళ్లద్దు.
కలిసొచ్చే రంగు: కాఫీ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్త విషయాలను నేర్చుకోవాలన్న మీ జిజ్ఞాసను ఈ వారంలో తీర్చుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ కళ అందరినీ అలరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. భావోద్వేగాలలో మునిగి తేలతారు.
కలిసొచ్చే రంగు: తెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement