కాంగ్రెస్ పాలనలో అంతులేని అవినీతి
దోమకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో హౌసింగ్‌లో అంతులేని అవినీతి జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మండలంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 593 గ్రామాల్లో హౌసిం గ్ బిల్లుల విషయంలో అధికారులు సర్వే చేయగా *235 కోట్లు అవినీతి జరిగినట్లు తేలిందన్నారు.
దీనిపై సీఎం సీరియస్‌గా ఉన్నారని రాష్ట్రమంతా సర్వే నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా రు. వేల కోట్లలో అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో 39 లక్షల మంది రైతులు *లక్షలోపు రుణం తీసుకున్నావారు ఉన్నారని, వాటిని మాఫీ చేయడానికి మం త్రి మండలి నిర్ణయించిందన్నారు. దీంతో ప్రభుత్వం పై *20 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఈనెల 7న సీఎం జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. వచ్చే వి ద్యాసంవత్సం నుంచి మండలానికి ఒక గురుకుల పాఠశాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఇం దుకోసం 15 ఎకరాలలో పాఠశాల నిర్మాంచి, వెయ్యి మంది బాల బాలికలకు చదువుకోవడానికి సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బోగస్ కార్డులను తొల గిస్తామన్నారు.
19న ఇళ్లలోనే ఉండండి
ఈనెల 19వ తేదీన జరగనున్న సర్వే కోసం కుటుం బసభ్యులంతా ఇళ్లల్లోనే ఉండాలన్నారు. సర్వేలో ప్రతి విషయాన్ని పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో మొత్తం 6లక్షల 96వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. మండలానికి 600 మంది అధికారులు విధులు నిర్వహిస్తారని, ఒక్కో అధికారి 30 కుటుంబాలను సర్వే చేస్తారని తెలిపారు.
బిందుసేద్యానికి * 370 కోట్లు నిధులు...
రాష్ట్రంలో బిందు సేద్యానికి *370 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో లక్షా 25 వేల ఎకరాల్లో బిందు సేద్యం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన జిల్లాకు *45 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలో 11 వేల 250 ఎకరాల్లో బిం దు సేద్యం చేయాలని నిర్ణయించామన్నారు. తుం పర్లు, బిందు సేద్యం వల్ల రైతులకు ప్రయోజనం ఉం టుందని కూరగాయలు సాగు చేయాలని రైతులను కో రారు. దీని కోసం రైతులకు * లక్షవరకు సబ్సిడీపై రు ణం అందజేస్తామన్నారు.
డ్వాక్రా సంఘాలకు గేదెల కొనుగోలుకు వడ్డీలేని రుణాన్ని అందిస్తామని తె లిపారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చిన ట్లు చెప్పారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్, డీసీఏంఏస్ చైర్మన్ ముజీబుద్దీన్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జేడీఏ నర్సింహ పాల్గొన్నారు.