పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు | Punjab National Bank waives processing fee for home, car loans till Sep 30 | Sakshi
Sakshi News home page

పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు

Published Tue, Jul 5 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు

పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు

డాక్యుమెంటేషన్ ఫీజు కూడా రద్దు
సెప్టెంబర్ 30 వరకూ ఆఫర్

 న్యూఢిల్లీ: కొత్త గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలను ప్రభుత్వ రంగ  పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) రద్దు చేసింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు ఉండని ఈ ‘మాన్‌సూన్ బొనాంజా’ ఆఫర్  సెప్టెం బర్ 30 వరకూ  ఉంటుందని పీఎన్‌బీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాలు ముఖ్యంగా గృహ, కారు, విద్యా రుణాలపైననే దృష్టి పెడతామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించిన తొలి బ్యాంక్ తమదేనని తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ ఇటీవల 0.25 శాతం వరకూ తగ్గించింది.

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్‌కు రూ.5,367 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ స్థాయి త్రైమాసిక నష్టాలు వచ్చిన ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్ రూ.307 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,281 కోట్లుగా ఉన్న బ్యాంక్ మొండిబకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మూడు రెట్లకు పైగా పెరిగి రూ.11,380 కోట్లకు ఎగిశాయి. స్థూల మొండిబకాయిలు 6.55% నుంచి 12.9 శాతానికి, నికర మొండి బకాయిలు 4.06% నుంచి 8.61 శాతానికి పెరిగాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement