Car loans
-
కారు లోన్ ముందుగా చెల్లించడం ఎలా? తెలుసుకోండి!
ఒకేసారి ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – వెంకట్రామన్ శ్రీనివాసన్ మీకు ఈక్విటీల గురించి మెరుగైన అవగాహన ఉంటే అప్పుడు లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులను కేటాయించుకోవచ్చు. తద్వారా పోర్ట్‌ఫోలియోని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మరింత మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అన్ని రకాల మార్కెట్ విలువ కలిగి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా మార్కెట్ విభాగాలకు ఫ్లెక్సీక్యాప్‌లో కేటాయింపులు వేర్వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు ఫ్లెక్సీక్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయిపులు చేస్తుంటాయి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు తక్కువ కేటాయింపులు చేస్తుంటాయి. అందుకని పెట్టుబడి మొత్తాన్ని ఒకే ఫ్లెక్సీక్యాప్ పథకంలో కాకుండా, కనీసం మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక విడిగా లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాబోదు. ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు అయితే ఒకవైపు ఫ్లెక్సీక్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు 15 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సమకూర్చుకోవచ్చు. నేను రూ.7 లక్షలు రుణంపై కారు కొనుగోలు చేశాను. దీన్ని ముందుగా తీర్చివేయాలన్నది నా ప్రణాళిక. ఇందుకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుకూలమైన పథకాలు ఏవి? పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ ఫండ్‌లో రాబడులను ప్రతి మూడేళ్లకోసారి వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయమేనా? – ఆదిత్య బి కారు రుణాన్ని ముందుగా తీర్చివేయాలనుకోవడం మంచి నిర్ణయం. విలువ తరిగిపోయే కారు వంటి ఆస్తి కోసం రుణం తీసుకోవడం సూచనీయం కాదు. మీరు మీ కారు రుణాన్ని ఏడేళ్లలోపు తీర్చివేయాలని అనుకుంటున్నారు. కనుక స్వల్పం నుంచి మధ్యస్థ కాలానికి వీలుగా మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను కాపాడుకోవడంతోపాటు, రాబడులు కూడా ఇక్కడ కీలకం అవుతాయి. మీ కారు రుణాన్ని ముందుగా చెల్లించి వేయడం కోసం మీరు హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీతోపాటు డెట్‌లోనూ ఈ పథకాలు పెట్టుబడులు పెడతాయి. దీంతో మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మార్కెట్ల పతనం, అస్థిరతలను ఎదుర్కొనే రక్షణ ఉంటుంది. మూడేళ్ల తర్వాత మీ కారు రుణాన్ని ముందుగా చెల్లించి వేయడం కోసం ప్రతి నెలా ఆదాయంలో మిగులును అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మూడు నుంచి నాలుగేళ్లలోపే కారు రుణం తీర్చివేయాలని అనుకుంటే అందుకోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కారు రుణాన్ని ముందుగా వదిలించుకునేందుకు మీవద్ద నెలవారీ మిగిలే మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ అనేది మిడ్‌క్యాప్ పథకం. మిడ్‌క్యాప్ ఫండ్స్ సహజంగా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులు ఇవ్వగలవు. కనుక మూడేళ్లకోసారి లాభాలను వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం అవ్వదు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎస్బీఐ గుడ్‌న్యూస్, హోంలోన్ ఆఫ్ర్ పొడిగింపు, ఇక కార్ లోన్లపై..!
SBI Festive Offer: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.పండుగ సీజన్లో కార్ లోన్ తీసుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా కారు కనాలనుకునే కస్టమర్ల లోన్లపై తాజా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ 2024, జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. హోమ్లోన్లపై రాయితీ పొడిగింపు అంతేకాదు హోమ్లోన్లపై అందిస్తున్న రాయితీని పొడిగించింది. గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల (bps) తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆఫర్నురానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో పొడిగించింది. డిసెంబరు 2023 దాకా తగ్గింపు వడ్డీరేట్లు వర్తిస్తాయిని బ్యాంకు వెల్లడించింది. (ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా) సంవత్సరానికి ఆటో రుణంపై బ్యాంకు MCLR రేటు 8.55 శాతం. గ్రీన్ కార్ లోన్ (ఎలక్ట్రిక్ వెహికల్) 9.65 శాతం నుండి 9.35 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. కస్టమరల క్రెడిట్ స్కోర్లు , విభిన్న కాలవ్యవధుల ప్రకారం వివిధ కార్ లోన్ రేట్లు నిర్ధారిస్తుంది. అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ కోసం గరిష్ట కాలవ్యవధి 7 సంవత్సరాలు. కారు ఆన్-రోడ్ ధరమొత్తంలో 90 శాతం వరకు రుణం ఇవ్వవచ్చు.ఈ లోన్ ద్వారా కొత్త ప్యాసింజర్ కారు, మల్టీ యుటిలిటీ వెహికల్ , SUVని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీ తీసుకోబడదు. అలాగే ఏడాది తరువాత త కస్టమర్‌పై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీ ఉండదు. కారు రుణాలపై పరిమిత కాల వ్యవధిలో అందిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ పొందాలంటే కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) అవసరమైన పత్రాలు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఫారం 16, ఐడీ కార్డు (పాన్ ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) లాంటివి ఇవ్వవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ ఎలా పొందాలి? ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ తీసుకోవడానికి, బ్యాంకు యాప్ యోనోకులాగిన్ అవ్వాలి. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ వివరాలను ధృవీకరించడంతోపాటు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ వస్తుంది దీన్ని సంబంధిత బ్యాంకు శాఖలో సమర్పించాలి. Make your festive season more joyful by driving home your dream car with amazing Car Loan deals!#SBI #CarLoan #FestiveOffers pic.twitter.com/MEAmMEAZJx — State Bank of India (@TheOfficialSBI) September 23, 2023 -
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్..!
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందించింది. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లను వరుసగా 35 బేసిక్ పాయింట్స్, 50 బేసిక్ పాయింట్స్ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై 6.50 శాతం, వాహన రుణాలపై 6.85 శాతం వడ్డీరేట్లకే రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. ఈ వడ్డీరేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. చదవండి: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్స్‌పై డిస్కౌంట్లు వడ్డీరేట్ల తగ్గింపు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 6.85 శాతం మేర, వాహన రుణాలపై 7.35 శాతం మేర వడ్డీ రేట్లు ఉండేవి. పండుగ సీజన్ సందర్భంగా పలు బ్యాంకింగ్ సంస్థలు వడ్డీరేట్లను తగ్గించాయి. పండుగ సీజన్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం హోమ్లోన్స్, వెహికల్ లోన్స్‌పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను తగ్గించింది. చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లు..!
త్వరలో రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు రిటైల్ లోన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించనుంది. హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించే వడ్డీరేట్లపై సుమారు 0.25 శాతం మాఫీని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును కూడా అందిస్తోంది. గృహ రుణాలు 6.75 శాతం నుంచి , కారు రుణాలు 7.00శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతాయి. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) కస్టమర్లు బాబ్ వరల్డ్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎమ్ హెచ్.టీ. సోలంకీ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో రిటైల్ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడంతో కస్టమర్లకు తమ బ్యాంకు తరపునుంచి పండుగ ఉత్సాహాన్ని అందించాలని భావిస్తున్నామన్నారు. బ్యాంక్ కస్టమర్లకు కొత్త రుణాలు అందించడం కోసం గృహ రుణాలు, కారు రుణాలపై ఆకర్షణీయమైన ప్రతిపాదనతో బీవోబీ ముందుకు వచ్చిందన్నారు. తక్కువ వడ్డీరేట్లకు కస్టమర్లు రుణాలను పొందవచ్చునని పేర్కొన్నారు. ఆయా రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహయింపు వస్తుందని తెలిపారు. చదవండి: SBI Home Loan: పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం -
ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పండుగ రాక ముందే తన రిటైల్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. బ్యాంకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసినట్లు ప్రకటించింది. గతంలో గృహ రుణాలపై ఆఫర్ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారు రుణాలపై, బంగారం రుణాలపై, వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను 100 శాతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తుంది. యోనో(యు ఓన్లీ నీడ్ వన్ యాప్) అనేది ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్. యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను పొందవచ్చని తెలిపింది. యోనో ద్వారా బంగారు రుణాలను పొందే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. వారు సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి బంగారు రుణాలను పొందవచ్చు అని పేర్కొంది. అంతేగాక, యోనో ద్వారా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులందరికీ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. Get drenched in happiness, as it's raining offers with SBI. Avail a 100% Processing Fee waiver on Car Loan, Gold Loan and Personal Loan. Know more at https://t.co/8gV2D7FEFG#SBI #CarLoan #GoldLoan #PersonalLoan #ItsRainingOffersWithSBI pic.twitter.com/fTcMvYShyq — State Bank of India (@TheOfficialSBI) August 16, 2021 కోవిడ్ యోధులకు వడ్డీ రాయితీ వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారుల కొరకు ప్రాసెసింగ్ ఫీజుల్లో బ్యాంకు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు 50 బీపీఎస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ప్రకటించింది. కారు, బంగారు రుణాలకు కూడా ఈ ఆఫర్ త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్లను’ ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెలల టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇది 2021 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబరు 14 వరకు అమల్లో ఉండనుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 6.70 శాతం వద్ద నుంచి ప్రారంభమవుతుంది. -
కారు రుణం మరింత సులువు
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ వేదికను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా దరఖాస్తు చేసుకుని వినియోగదార్లు సులభంగా కారు రుణం పొందవచ్చు. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ సేవలను 2020 డిసెంబరులో కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టింది. ఇప్పుడీ వేదికను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించేందుకు కంపెనీ 14 బ్యాంకులతో చేతులు కలిపింది. వీటిలో నచ్చిన బ్యాంకును కస్టమర్లు ఎంచుకోవచ్చు. ‘షోరూంలకు వచ్చే ముందే కార్లు, ఫైనాన్స్ వివరాల కోసం వినియోగదార్లు ఆన్లైన్లో వెతుకుతున్నారు. మారుతున్న కస్టమర్ల తీరును దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చింది. ఈ సేవలు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల పైచిలుకు విజిటర్లు నమోదయ్యారు’ అని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఎస్బీఐ పండుగ ధమాకా..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా పండుగ సీజన్ ఆఫర్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గృహ .. వాహన రుణాలు, ప్రాసెసింగ్ ఫీజులు మాఫీ, ప్రీ–అప్రూవ్డ్ డిజిటల్ రుణాలు మొదలైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘అత్యంత తక్కువగా 8.70 శాతం వడ్డీ రేటు నుంచి కారు రుణాలు అందిస్తున్నాం. పండుగ సీజన్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు‘ అని బ్యాంకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వడ్డీ రేట్ల మార్పులకు సంబంధించి ఈ రుణాలపై ప్రతికూల ప్రభావాలేమీ ఉండవని వివరించింది. యోనో వంటి సొంత డిజిటల్ ప్లాట్‌ఫాం నుంచి లేదా వెబ్సైట్ ద్వారా కారు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి వడ్డీపై 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) మేర తగ్గింపు కూడా పొందవచ్చు. వేతన జీవులు కారు ఆన్ రోడ్ ధరలో 90 శాతం దాకా రుణంగా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటిదాకా అమల్లో ఉంటాయన్నది మాత్రం ఎస్బీఐ వెల్లడించలేదు. చౌకగా గృహ రుణాలు.. సెప్టెంబర్ 1 నుంచి ప్రస్తుత, కొత్త గృహ రుణాలన్నింటికి రెపో రేట్ ఆధారిత వడ్డీ రేట్లు వర్తింపచేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇటీవలే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత వడ్డీ రేటును (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా గృహ రుణాలపై వడ్డీ రేటు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. మరోవైపు రూ. 20 లక్షల దాకా వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ రేటు అత్యంత తక్కువగా 10.75% నుంచి ప్రారంభమవుతుందని ఎస్బీఐ తెలిపింది. సుదీర్ఘంగా 6 సంవత్సరాల పాటు చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇక ఎస్బీఐలో శాలరీ అకౌంటు ఉన్న ఖాతాదారులు యోనో యాప్ ద్వారా రూ. 5 లక్షల దాకా ప్రీ–అప్రూవ్డ్ రుణాలను పొందవచ్చని వివరించింది. అటు విద్యా రుణాలపై వడ్డీ రేటు 8.25% నుంచి ప్రారంభమవుతుందని ఎస్బీఐ తెలిపింది. దేశీయంగా విద్యకు రూ.50 లక్షల దాకా, విదేశీ చదువు కోసం రూ.1.50 కోట్ల దాకా రుణాలు పొందవచ్చు. సుదీర్ఘంగా 15 ఏళ్ల పాటు రుణాల చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని, తద్వారా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చని ఎస్బీఐ వివరించింది. రెపోతో బల్క్ డిపాజిట్ రేట్ల అనుసంధానం.. రిజర్వ్ బ్యాంక్ తగ్గించే పాలసీ రేట్ల ప్రయో జనాలను ఖాతాదారులకు బదలాయించాలంటే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించేలా బ్యాంకుల ను ఆర్బీఐ ఆదేశించాలని ఎస్బీఐ ఒక నివేదికలో పేర్కొంది. చిన్న డిపాజిట్‌దారులు, సీనియర్ సిటిజన్స్ ప్రయోజనాలను దెబ్బతీయకుండా, అటు నిధుల సమీకరణ వ్యయాలను బ్యాంకులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ‘ఎకోర్యాప్’ నివేదికలో వివరించింది. ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే స్వచ్ఛందంగా తమ వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించాయి. రూ. 2 కోట్ల పైబడిన డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో వీటి వాటా సుమారు 30 శాతంగా ఉంటుందని అంచనా. చాలామటుకు బల్క్ డిపాజిట్లు పెద్ద సంస్థల నుంచి ఉంటాయని, చిన్న డిపాజిటర్లతో పోలిస్తే ఇవి వడ్డీ రేట్ల పరంగా కాస్త రిస్కులు భరించగలిగే అవకాశం ఉంటుందని ఎస్బీఐ నివేదిక వివరించింది. రుణాలపైనా, డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను రెపోతో అనుసంధానించాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకులకు సూచించిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఓబీసీ నుంచి రెపో ఆధారిత రుణాలు.. ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ) ఇకపై గృహ, వాహన రుణాలను రెపో ఆధారిత వడ్డీ రేట్లకు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 8.35% నుంచి, వాహన రుణాలపై రేటు 8.70% నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఎంసీఎల్ఆర్ లేదా రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లలో ఏదో ఒక దాన్ని కస్టమర్లు ఎంచుకోవచ్చని వివరించింది. -
పండుగ సీజన్ : ఎస్బీఐ తీపి కబురు
సాక్షి, ముంబై : అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజను రద్దు చేసినట్టు ప్రకటించింది. రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్బీఐ ముందుగానే తన కస్టమర్లకు ఈ తీపి కబురు అందించింది. కార్ల రుణాలపై 8.70 శాతం వడ్డీని వసూలు చేయనుంది. యోనో యాప్ లేదా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు వడ్డీ రేటుపై మరో 25 బీపీఎస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. అలాగే వేతన జీవులైన బ్యాంకు కస్టమర్లు కారు ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. -
గృహ, కారు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్
గృహ, కారు కొనుగోలుదారులకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ, కారు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రిటైల్ రుణాలను పెంచడానికి, హోమ్, ఆటో రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త వడ్డీరేట్ల ప్రకారం 8.30 శాతానికి గృహ రుణాలను, 8.70 శాతానికి ఆటో రుణాలను ఆఫర్ చేయనున్నట్టు ఎస్బీఐ పేర్కొంది. ఈ వడ్డీరేట్లు అర్హులైన వేతన కస్టమర్లందరికీ వర్తిస్తాయని, రూ.30 లక్షల వరకున్న రుణాలకు వార్షికంగా 8.30 శాతం వడ్డీరేటును విధించనున్నట్టు బ్యాంకు తెలిపింది. కారు రుణాల వడ్డీరేట్లు వార్షికంగా 8.70 శాతం నుంచి 9.20 శాతం మధ్యలో ఉండన్నాయి. అంతకముందు ఈ రేంజ్ 8.75 శాతం నుంచి 9.25 శాతం మధ్యలో ఉంది. అసలైన రేటు రుణ మొత్తం, వ్యక్తి క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. 2017 నవంబర్ 1 నుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. అలాగే మెచ్యూరిటీస్లకు వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు కూడా ఎస్బీఐ పేర్కొంది. అంతేకాక ప్రస్తుతమున్న ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేటును కూడా బ్యాంకు తగ్గించింది. అంతకముందు 6.5 శాతమున్న వడ్డీరేటును ప్రస్తుతం 6.25 శాతానికి తగ్గించినట్టు బ్యాంకు తన వెబ్సైట్లో తెలిపింది. -
కారు రుణాలపై ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
పసిడి, వ్యక్తిగత రుణాలపై కూడా సగం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ పరిమిత కాలానికి కారు, బంగారం, వ్యక్తిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే గృహ రుణాల టేకోవర్‌పై ఈ తరహా ఆఫర్ ఇస్తున్నట్లు వివరించింది. తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా కారు లోన్స్‌పై 100% ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసినట్లు పేర్కొంది. అలాగే అక్టోబర్ 31 దాకా బంగారం రుణాలపై 50 శాతం మేర మినహాయింపు కల్పిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇక, సెప్టెంబర్ 30 దాకా వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ స్కీముపై 50% మేర ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసినట్లు పేర్కొంది. బీఎస్ఈలో సోమవారం ఎస్బీఐ షేరు 1.44% క్షీణించి రూ. 274.65 వద్ద ముగిసింది. పొదుపు ఖాతాలపై దేనా బ్యాంక్ వడ్డీ తగ్గింపు దేనా బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అరశాతం తగ్గించింది. ఇకపై రూ. 25 లక్షల దాకా డిపాజిట్లు ఉండే సేవింగ్స్ అకౌంట్లపై 3.5% వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది. అయితే, రూ. 25 లక్షలకు పైబడిన మొత్తాలపై మాత్రం యధాప్రకారంగా 4% వడ్డీ రేటు కొనసాగుతుందని వివరించింది. -
కార్ల రుణాలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వివిధ ఫైనాన్స్ కార్పొ రేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఇవ్వదలచిన కార్ల రుణాలకు బ్రేక్ పడింది. ఉబెర్ క్యాబ్స్ సంస్థ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం తల పెట్టిన డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంపై స్పష్టత లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 2016–17లో డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు రాష్ట్రవ్యాప్తంగా 21,910 దరఖాస్తులు స్వీకరించాయి. ఆర్థిక సంవ త్సరం ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకూ లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఎంపికపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ప్రణాళికలకే ఆమోదం.. 2017–18 ఆర్థిక ఏడాదికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏప్రిల్1తో అమల్లోకి రానుంది. ఈ క్రమంలో కార్పొరేషన్లు కొత్త ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ఇప్పటివరకున్న పథకాలన్నీ భిన్నరూపు సంతరించుకోనున్నాయి. ప్రస్తుత ఏడాదిలో కార్పొరేషన్ల ద్వారా అమలైన పలు కార్యక్రమాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంలోనూ మార్పులు, చేర్పులు జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే వచ్చిన దరఖాస్తులు అటకెక్కినట్లేనని తెలుస్తోంది. -
పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు
♦ డాక్యుమెంటేషన్ ఫీజు కూడా రద్దు ♦ సెప్టెంబర్ 30 వరకూ ఆఫర్ న్యూఢిల్లీ: కొత్త గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలను ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రద్దు చేసింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు ఉండని ఈ ‘మాన్సూన్ బొనాంజా’ ఆఫర్ సెప్టెం బర్ 30 వరకూ ఉంటుందని పీఎన్బీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాలు ముఖ్యంగా గృహ, కారు, విద్యా రుణాలపైననే దృష్టి పెడతామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించిన తొలి బ్యాంక్ తమదేనని తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ ఇటీవల 0.25 శాతం వరకూ తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్‌కు రూ.5,367 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ స్థాయి త్రైమాసిక నష్టాలు వచ్చిన ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్ రూ.307 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,281 కోట్లుగా ఉన్న బ్యాంక్ మొండిబకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మూడు రెట్లకు పైగా పెరిగి రూ.11,380 కోట్లకు ఎగిశాయి. స్థూల మొండిబకాయిలు 6.55% నుంచి 12.9 శాతానికి, నికర మొండి బకాయిలు 4.06% నుంచి 8.61 శాతానికి పెరిగాయి. -
కారు రుణం పేరుతో బ్యాంకులకు బురిడీ
బంజారాహిల్స్: బ్యాంకుల్లో కారు రుణాలు తీసుకుంటూ తప్పుడు ధ్రువపత్రాలతో వాయిదాలు ఎగ్గొట్టిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కర్నేందుల విజయ్‌కుమార్ చాణుక్య అలియాస్ కె.జయకుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అడ్డాల వీరవెంకట సత్యనారాయణమూర్తి అలియాస్ మూర్తి అడ్డాల కలసి బంజారాహిల్స్‌లోని సిండికేట్ బ్యాంకు శాఖలో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి కారు రుణాలు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకుండా పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారు స్టేట్‌బ్యాంకు ఆఫ్ మైసూర్, సిండికేట్ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలలో కూడా తప్పుడు పత్రాలు పెట్టి కారు రుణాలతో పాటు స్థల రుణాలు కూడా తీసుకొని చీట్ చేసినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ జూబ్లీహిల్స్, ఆబిడ్స్, సైఫాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు కేసుల్లో నిందితులని గతంలో కూడా చెన్నైతో పాటు మాదాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో 12 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలింది. వారి నుంచి రెండు ఇన్నోవా కార్లు, రెండు వెర్నా కార్లు, 23 ఐఫోన్లు, ఆరు మొబైల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఏడు రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు.ఇలాంటి వారిపట్ల బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. -
మహిళలకు ఎస్బీఐ నజరానా
* 10 శాతానికే కార్ల కొనుగోళ్లకు రుణం * హర్ ఘర్ హర్కార్ స్కీమ్ ఖాతాదారులకు ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళ గృహరుణదారులకు కార్ల రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. హర్ ఘర్ హర్ కార్ స్కీమ్ కింద వడ్డీరేటును పావుశాతం తగ్గిస్తున్నామని ఎస్బీఐ సోమవారం తెలిపిం ది. హర్ ఘర్ స్కీమ్ కింద గృహరుణం పొందిన మహిళలు 10%కే కార్ల కొనుగోళ్లకు రుణాలు పొందవచ్చని పేర్కొంది. ఈ స్కీమ్పరిధిలోనికి రాని మహి ళలకు 10.25% వడ్డీరేటు వర్తిస్తుందని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హర్ ఘర్ స్కీమ్ కింద మహిళలకు ఇచ్చే కొత్త గృహ రుణాలపై వడ్డీరేట్లను 10.10% నుంచి 9.85%కి తగ్గించింది. కాగా ఎంక్యాష్ పేరుతో నగదు బదిలీ ఫీచర్‌ను ఎస్బీఐ ప్రారంభించింది. ఈ ఫీచర్లో భాగంగా ఎస్బీఐ ఖాతాదారులు, ఎస్బీఐ/ఇతర బ్యాంకుల్లో ఖాతాలున్న ఇతరులకు వారి అకౌంట్ వివరాలు తెలియకపోయినా, నగదు పంపొచ్చు.