
గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందించింది. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లను వరుసగా 35 బేసిక్ పాయింట్స్, 50 బేసిక్ పాయింట్స్ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై 6.50 శాతం, వాహన రుణాలపై 6.85 శాతం వడ్డీరేట్లకే రుణాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. ఈ వడ్డీరేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
చదవండి: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్స్‌పై డిస్కౌంట్‌లు
వడ్డీరేట్ల తగ్గింపు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై 6.85 శాతం మేర, వాహన రుణాలపై 7.35 శాతం మేర వడ్డీ రేట్లు ఉండేవి. పండుగ సీజన్ సందర్భంగా పలు బ్యాంకింగ్ సంస్థలు వడ్డీరేట్లను తగ్గించాయి. పండుగ సీజన్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం హోమ్‌లోన్స్, వెహికల్ లోన్స్‌పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను తగ్గించింది.
చదవండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..!
Comments
Please login to add a commentAdd a comment