కార్ల రుణాలకు బ్రేక్‌ | Driver Empowerment Scheme: Car loans have been stopped | Sakshi
Sakshi News home page

కార్ల రుణాలకు బ్రేక్‌

Published Thu, Mar 30 2017 4:33 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

కార్ల రుణాలకు బ్రేక్‌

కార్ల రుణాలకు బ్రేక్‌

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ఫైనాన్స్‌ కార్పొ రేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఇవ్వదలచిన కార్ల రుణాలకు బ్రేక్‌ పడింది. ఉబెర్‌ క్యాబ్స్‌ సంస్థ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం తల పెట్టిన డ్రైవర్‌ ఎంపవర్మెంట్‌ పథకంపై స్పష్టత లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

2016–17లో డ్రైవర్‌ ఎంపవర్మెంట్‌ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు రాష్ట్రవ్యాప్తంగా 21,910 దరఖాస్తులు స్వీకరించాయి. ఆర్థిక సంవ త్సరం ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకూ లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఎంపికపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.

కొత్త ప్రణాళికలకే ఆమోదం..
2017–18 ఆర్థిక ఏడాదికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఏప్రిల్‌1తో అమల్లోకి రానుంది. ఈ క్రమంలో కార్పొరేషన్లు కొత్త ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ఇప్పటివరకున్న పథకాలన్నీ భిన్నరూపు సంతరించుకోనున్నాయి. ప్రస్తుత ఏడాదిలో కార్పొరేషన్ల ద్వారా అమలైన పలు కార్యక్రమాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్‌ ఎంపవర్మెంట్‌ పథకంలోనూ మార్పులు, చేర్పులు జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే వచ్చిన దరఖాస్తులు అటకెక్కినట్లేనని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement