Driver Empowerment Scheme
-
ట్రైకార్ ద్వారా డ్రైవర్ ఎంపవర్మెంట్
సాక్షి, హైదరాబాద్: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని ట్రైకార్ (తెలంగాణ ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్‌లో నిష్ణాతులైన ఎస్టీ యువతకు రాయితీ పద్ధతిలో వాహనాలు ఇచ్చేం దుకు ఉపక్రమించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 500 మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. బుధవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తు తం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లోని ఎస్టీలకే వర్తింపజేస్తున్నప్పటికీ.. త్వరలో గ్రామీణ ప్రాం తాల్లోని యువతకు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వాహనాల ద్వారా క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగంతో అనుసంధానమై ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేయాలని, వచ్చే నెలాఖరులోగా లబ్ధిదారులందరికీ పూర్తిస్థాయిలో వాహనాలు పంపిణీ చేసేలా చర్య లు తీసుకోవాలని ట్రైకార్ యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్‌లో శిక్షణ.. ఉపాధి..
- డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం తీసుకురానున్న ప్రభుత్వం - నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు రాయితీపై రుణం - అనంతరం ఉబెర్ సంస్థలో కొనసాగేలా అవకాశం సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకాన్ని గతేడాది అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది దరఖాస్తులతోనే ముగిసింది. తాజాగా 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థలకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఈ క్రమంలో డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జూలై ఒకటి నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షణ తర్వాత రుణం.. డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద లబ్ధి పొందిన వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మార్గదర్శకాల రూపకల్పనలో అధికారులు నిబంధనలు కఠినతరం చేయనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి డ్రైవింగ్‌లో వారి ప్రావిణ్యాన్ని తెలుసుకుంటారు. తర్వాత శిక్షణ ఇచ్చి.. రాయితీ రుణంతో కారు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తారు. క్యాబ్‌లో నిర్వహించేలా ఉబెర్ సంస్థతో ప్రభుత్వం ఒప్పం దం కుదుర్చుకోనుంది. 2016–17 వార్షిక సంవత్సరం చివర్లో ఈ పథకం కింద ఆర్థిక సహకార సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 21,106 దరఖాస్తులు స్వీకరించాయి. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతోపాటు రాయితీ రుణాలకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు. ఆయా శాఖల అధికారులు వాటి పరిశీలన చేపట్టలేదు. తాజాగా సరికొత్త నిబంధనలు రూపొందిస్తు న్న నేపథ్యంలో యంత్రాంగం కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. -
కార్ల రుణాలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వివిధ ఫైనాన్స్ కార్పొ రేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఇవ్వదలచిన కార్ల రుణాలకు బ్రేక్ పడింది. ఉబెర్ క్యాబ్స్ సంస్థ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం తల పెట్టిన డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంపై స్పష్టత లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 2016–17లో డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు రాష్ట్రవ్యాప్తంగా 21,910 దరఖాస్తులు స్వీకరించాయి. ఆర్థిక సంవ త్సరం ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకూ లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఎంపికపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ప్రణాళికలకే ఆమోదం.. 2017–18 ఆర్థిక ఏడాదికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏప్రిల్1తో అమల్లోకి రానుంది. ఈ క్రమంలో కార్పొరేషన్లు కొత్త ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ఇప్పటివరకున్న పథకాలన్నీ భిన్నరూపు సంతరించుకోనున్నాయి. ప్రస్తుత ఏడాదిలో కార్పొరేషన్ల ద్వారా అమలైన పలు కార్యక్రమాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంలోనూ మార్పులు, చేర్పులు జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే వచ్చిన దరఖాస్తులు అటకెక్కినట్లేనని తెలుస్తోంది.