మహిళలకు ఎస్‌బీఐ నజరానా
* 10 శాతానికే కార్ల కొనుగోళ్లకు రుణం
* హర్ ఘర్ హర్‌కార్ స్కీమ్ ఖాతాదారులకు
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళ గృహరుణదారులకు కార్ల రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. హర్ ఘర్ హర్ కార్ స్కీమ్ కింద వడ్డీరేటును పావుశాతం తగ్గిస్తున్నామని ఎస్‌బీఐ సోమవారం తెలిపిం ది. హర్ ఘర్ స్కీమ్ కింద గృహరుణం పొందిన మహిళలు 10%కే కార్ల కొనుగోళ్లకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.
ఈ స్కీమ్‌పరిధిలోనికి రాని మహి ళలకు 10.25% వడ్డీరేటు వర్తిస్తుందని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హర్ ఘర్ స్కీమ్ కింద మహిళలకు ఇచ్చే కొత్త గృహ రుణాలపై వడ్డీరేట్లను 10.10% నుంచి 9.85%కి తగ్గించింది. కాగా ఎంక్యాష్ పేరుతో నగదు బదిలీ ఫీచర్‌ను ఎస్‌బీఐ ప్రారంభించింది. ఈ ఫీచర్‌లో భాగంగా ఎస్‌బీఐ ఖాతాదారులు, ఎస్‌బీఐ/ఇతర బ్యాంకుల్లో ఖాతాలున్న ఇతరులకు వారి అకౌంట్ వివరాలు తెలియకపోయినా, నగదు పంపొచ్చు.