సాక్షి, హైదరాబాద్: సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకునే విధంగా గృహాలు, కమర్షియల్ భవనాలపై సౌరవి ద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకునేవారి కోసం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పునరుత్పా దక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)పై సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. 1–3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.18 వేలు, 3–10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.9 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. సమీక్షలో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment