Subsidy schemes
-
గృహాలపై సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకునే విధంగా గృహాలు, కమర్షియల్ భవనాలపై సౌరవి ద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకునేవారి కోసం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పా దక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)పై సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. 1–3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.18 వేలు, 3–10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.9 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. సమీక్షలో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
పేదల సుఖసంతోషాలే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
సింగరాయకొండ: పేద ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2047 సంవత్సరం నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తు న్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం 17 రకాల పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆయా పథకాల గురించి అందరికీ తెలిసేలా చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల పంచాయతీ భూతంవారిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు కొమ్మాలపాటి వెంకట రమణమ్మతో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. డ్రోన్ ద్వారా సాంకేతిక పద్ధతిలో చేస్తున్న వ్యవసాయం ద్వారా ఆమెకు కలిగిన లబ్ధిని, అనుభవాలను చెప్పాలని మోదీ కోరారు. రమణమ్మ మాట్లాడుతూ తాను ఎంఏ బీఈడీ చదివానన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా డ్రోన్ ద్వారా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. అందుకోసం ఆచార్య రంగా యూనివర్సిటీలో 12 రోజుల పాటు శిక్షణ పొందానన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకుంటున్నానని, నీటి అవసరం కూడా బాగా తగ్గిందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి రైతూ సాంకేతిక పద్ధతిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అలాగే సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలోని మరికొంతమందితోనూ ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నదని కొనియాడారు. అనంతరం 24 స్వయం సహాయ గ్రూపులకు రూ.4.80 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు. పారిశుధ్య పనులు చేస్తున్న క్లాప్ మిత్రలను సత్కరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఉజ్వల భారత్ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. డ్రోన్ వినియోగంలో శిక్షణ పొందిన రమణమ్మకు లైసెన్స్ పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ దినేష్‌కుమార్, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం జిల్లా ఇన్చార్జి ఎం.రామచంద్రుడు, జేసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఆధార్‌తో రూ. 90వేల కోట్ల ఆదా..
న్యూఢిల్లీ: అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల సబ్సిడీలను అందించేందుకు తోడ్పడుతున్న ఆధార్‌తో గణనీయంగా ఆదా అవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నకిలీ లబ్ధిదారులు, అనర్హులను ఏరివేయడం ద్వారా గతేడాది మార్చి ఆఖరు దాకా చూస్తే సుమారు రూ. 90,000 కోట్లు ఆదా అయినట్లు ఆయన వివరించారు. ‘ఆధార్ ప్రయోజనాలు’ అంశంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో చేసిన ఒక పోస్టులో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆధార్ వినియోగం ద్వారా భారత్ ఏటా రూ. 77,000 కోట్లు ఆదా చేసుకోగలదంటూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ‘ఆధార్‌తో ఆదా అయ్యే నిధులతో ఆయుష్మాన్ భారత్ స్థాయిలో మూడు పథకాలను అమలు చేయొచ్చు’ అని జైట్లీ తెలిపారు. కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీనిచ్చే ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద.. దాదాపు 10.74 కోట్ల పైగా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 7 లక్షల మంది పేద పేషెంట్లు.. ఉచిత వైద్య చికిత్స పొందినట్లు జైట్లీ పేర్కొన్నారు. 122 కోట్ల ఆధార్ నంబర్ల జారీ.. 2016లో ఆధార్ బిల్లును జారీ చేసినప్పట్నుంచీ 28 నెలల వ్యవధిలో 122 కోట్ల ఆధార్ నంబర్లను జారీ చేయడం జరిగిందని జైట్లీ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వయోజనుల్లో 99 శాతం మందికి ఆధార్ జారీ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఆధార్ ఆధారంగా ఇప్పటిదాకా లబ్ధిదారులకు బదలాయించిన సబ్సిడీల విలువ దాదాపు రూ. 1,69,868 కోట్ల మేర ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోవడం వల్ల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయి. ఇది భారత్‌లో మాత్రమే అమలవుతున్న ప్రత్యేక టెక్నాలజీ’ అని వివరించారు. -
ఎంబీసీల రాయితీ పథకాలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీసీ(అత్యంత వెనుకబడిన కులాలు)ల రాయితీ పథకాలకు లైన్ క్లియర్ అయ్యిం ది. ఇప్పటివరకు ఎంబీసీ జాబితాలో ఎవరున్నారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఎంబీసీ కార్పొరేషన్ రెండేళ్ల నుంచి ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నా.. కార్పొరేషన్ పరిధిలోకి ఏయే కులాలు వస్తాయనే అంశం తేలకపోవడంతో ఆ నిధులు ఖర్చు చేయలేదు. 36 కులాలను ఎంబీసీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా కులాలకు చెంది న కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ఎంబీసీ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న యంత్రాంగం.. వారి కోసం ప్రత్యేకంగా రాయితీ పథకాలను రూపొందిస్తోంది. వీటికి తోడు వృత్తి నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించిన అధికారులు.. తాజా ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తున్నారు. 20 వేల మందికి నేరుగా రాయితీ.. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ఎంబీసీ కార్పొరేషన్ రాయితీ రుణాలను నేరుగా ఇవ్వాలని భావిస్తోంది. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా నేరుగా రాయితీని విడుదల చేయనుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్లో అమల్లో ఉన్న ఈ నిబంధనలను ఎంబీసీ కార్పొరేషన్ కూడా అడాప్ట్ చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అత్యవసర కోటా కింద 20 వేల మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ పథకాన్ని అమలు చేయనుంది. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు నెలాఖరులోగా కార్యాచరణ రూపొందించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించనుంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టనుంది. అక్టోబర్ నాటికి 20 వేల యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. దీనికి రూ.200 కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేస్తోంది. ఎంబీసీ కులాల్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ సమన్యాయం చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. -
అంకెలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం
కంకిపాడు(పెనమలూరు): జిల్లా ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే జిల్లా అభివృద్ధి చెందుతోందంటూ జిల్లా యంత్రాంగం అంకెలగారడీతో ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేయటం దౌర్భగ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై అభూత కల్పనలు çకలెక్టరే సృష్టించటం శోచనీయమన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. అర్థం లేని నిబంధనలతో రైతుని రోడ్డుపైకి లాగే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. జిల్లాలో ఎందరు కౌలుదారులున్నారో?, ఎంత సాగు జరుగుతుందో? కౌలురైతులకు ఎంత రుణం ఇచ్చారో జిల్లా అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కౌలుదారులకు సక్రమంగా రుణాలు, సబ్సిడీ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులది కాదా? అని ప్రశ్నించారు. ధాన్యం అమ్మిన తరువాత నెల రోజులకూ డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారన్నారు. మినుము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కనీసం 10 శాతం కూడా కొనుగోళ్లు చేపట్టలేదని, బహిరంగ మార్కెట్లో రూ.3,800 నుంచి రూ.4300లకే క్వింటా మినుములు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి మద్దతు ధరకు మినుములు ఎలాంటి నిబంధనలు విధించకుండా కొనాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు డబ్బులు కూడా ఏడాదిగా అందడం లేదని కలెక్టరు గుర్తించాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 వేల కోట్లు నిధులు కేటాయిస్తే ఆ పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని విమర్శించారు. సీఎం, మంత్రుల భవనాల ఆధునికీకరణలకు రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. డెల్టా పనులు జాప్యం వల్ల తెలంగాణలో బీమా ప్రాజెక్టు పూర్తయ్యి అక్కడ 20 టీఎంసీల సాగునీరు నిల్వ అవుతుందని, సాగునీటి నష్టాన్ని, సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. మంత్రి ఉమా దద్దమ్మ.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతగాని తనం వలన జిల్లాలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఆయన, పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు నాలుక చీరేందుకు కూడా వెనుకాడరని, సిగ్గుతెచ్చుకుని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్, మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామినేని రమాదేవి పాల్గొన్నారు. -
మత్స్యకారులకు రాయితీ పథకాలు
అనంతపురం అగ్రికల్చర్ : రాయితీతో అమలు చేస్తున్న పథకాలను చేపల పెంపకం, అమ్మకందారులు వినియోగించుకోవాలని మత్స్యశాఖ సహాయ సంచాలకులు నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో పథకాలపై మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... వలలు, బోట్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ఐస్‌బాక్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ వర్గాలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 90 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కన్సల్టెంట్లు డాక్టర్ జ్ఞానేశ్వరరావు, డాక్టర్ ప్రవళిక, ఎఫ్డీఓలు రామాంజినేయులు, పుల్లయ్య, ఫిలిప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ!
- 600 యూనిట్లకు రూ. 18 లక్షల సబ్సిడీ మంజూరు - సబ్సిడీ పోను 18 బస్తాల మట్టి మిశ్రమం సహా యూనిట్ ధర రూ. 3 వేలు - మట్టి మిశ్రమం వద్దనుకుంటే రూ. వెయ్యి తగ్గింపు సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండించుకోదలచిన హైదరాబాద్ మహాన గరవాసులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిపంట కిట్లపై సబ్సిడీ పథకానికి పచ్చజెండా ఊపింది. 4 నెలల్లో 600 యూనిట్ల పంపిణీ ద్వారా నగరంలోని మేడల మీద, ఖాళీ స్థలాల్లో 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరల పెంపకాన్ని ప్రోత్స హించాలన్నది లక్ష్యం. యూనిట్ ధర రూ. 6 వేలు. సగం సబ్సిడీ పోను లబ్ధిదారు రూ. 3 వేలు చెల్లించాలి. యూనిట్లో భాగంగా 4 సిల్పాలిన్ (40 చదరపు అడుగులు) బెడ్స్, దేశవాళీ విత్తనాలు, వేపపిండి, వేపనూనె, ఇతర పరికరా లతోపాటు 18 బస్తాల మట్టి మిశ్రమం (ఎర్రమట్టి 50%+ పశువుల ఎరువు 25%+ కొబ్బరిపొట్టు 25%) ఇస్తారు. మట్టిమి శ్రమం వద్దనుకునే వారు రూ. వెయ్యి తగ్గించి చెల్లించే సదుపాయం ఉందని ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) విజయకుమార్ ‘సాక్షి’తో చెప్పా రు. మొదటి పంటకు టమాటా, వంగ, మిరప, క్యాప్సికం నారు, తర్వాత రెండు పంటలకు సరిపడా విత్తనాలు కూడా ఇస్తామన్నారు. సబ్సిడీ కిట్లతో సంబంధం లేకుండా కూడా 50% సబ్సిడీతో దేశవాళీ విత్తనాలను అందు బాటులో ఉంచుతున్నామన్నారు. ఇంటి పంటల సాగుపై ప్రతి 15 రోజులకోసారి వర్క్‌షాపులు నిర్వహిం చనున్నట్లు విజయ కుమార్ వివరించారు. ఇంటిపంట సబ్సిడీ కిట్లను పొందాల నుకునే నగరవాసులు http://horticulture. tg.nic.in/ వెబ్సైట్లో ‘డౌన్లోడ్స్’ నుంచి దరఖాస్తును పొందవచ్చు. మట్టి మిశ్రమం తోపాటు ఇంటిపంట కిట్ కావాలనుకునే వారు రూ. 3 వేలు, మట్టి మిశ్రమం వద్దను కునే వారు రూ. 2 వేలకు ‘డిప్యూటీ డెరైక్టర్ హార్టికల్చర్, గవర్నమెంట్ గార్డెన్స్, హైద రాబాద్’ పేరిట డీడీ తీయాలి. పూరించిన దరఖా స్తుకు డీడీ జత చేసి రెడ్‌హిల్స్‌లో నాంపల్లి కోర్టుల పక్కన గల హార్ట్టికల్చర్ ట్రైనింగ్‌ఇన్‌స్టిట్యూట్(హెచ్‌టీఐ)లో అధి కారులకు అందజేసి.. కిట్‌ను తీసుకెళ్ల వచ్చ ని విజయకుమార్ వివరించారు. వివరాల కు ఉద్యాన విస్తరణాధికారి నవీన్ (99491 61042) లేదా ఉద్యాన అధికారిణి అరుణ (8374449458)ను సంప్రదించవచ్చు. publicgardens@gmail.comకు మెయిల్ ఇవ్వొచ్చు. - ‘ఇంటిపంట’ డెస్క్ 14న గార్డెనింగ్ మీట్! వచ్చే ఆదివారం(14వ తేదీ) సాయంత్రం 3-6 గంటల మధ్య ‘లామకాన్’లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ మీట్ జరుగుతుంది. ప్రవేశం ఉచితం. ఈ నెల 7లోగా కృష్ణ కుందుర్తి (kksrinivas24@hotmail.com)కి మెయిల్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవచ్చు. -
పాల ఉత్పత్తిని పెంచేందుకే సబ్సిడీ పథకాలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకే ప్రభుత్వం సబ్సిడీ పథకాలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ జిల్లా డిఫ్యూటి డెరైక్టర్ సి.తిరుపతిరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తిని పెంచడంలో భాగంగానే గతేడాది డిసెంబర్ 1న పాల ధరలను పెంచినట్లు ఆయన తెలిపారు. రైతులకు పశుదాణా, ముడి పదార్థాలు, పచ్చిగడ్డి, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగినందున వారు నష్టపోకుడదనే ప్రభుత్వం ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపుతో గేదె పాలకు లీటర్ ధరపై నాణ్యతను బట్టి గరిష్ఠంగా 0.50 పైసలు, ఆవు పాలకు లీటరుధరపై నాణ్యతను బట్టి గరిష్ఠంగా 0.27 పైసలు పెంచినట్లు ఆయన తెలిపారు. కల్తీలేని నాణ్యమైన పాలను ఆయా గ్రామాల్లోని విజయ పాల సేకరణ కేంద్రానికి తీసుకువెళ్ళి సరియైన ధరను పొందవచ్చన్నారు. కోనుగోలులో ఎవరైనా ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తన దృష్టికి తీసుకువ స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ప్రభుత్వ సబ్సిడిలను వినియోగించుకోవాలి విజయ పాల సేకరణ కేంద్రంలో క్రమం తప్పకుండా పాలను సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని తిరుపతిరెడ్డి తెలిపారు. పాడి రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని అభివృధ్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరారు. తమ సంస్థ సహకారంతో తక్కువ ధరకు విజయ పశువుల దాణాను పాడి రైతులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏభైశాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు, లవణ మిశ్రమం( మినరల్ మిక్చర్), గాలి కుంటువ్యాధి నివారణ టీకాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా 75శాతం సబ్సిడీపై నట్టల నివారణ మందులను ఇస్తున్నామన్నారు. ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు వచ్చే రోగాలను గుర్తించి, మందులను సరాఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల బీమా, చాఫ్ కట్టర్స్, కృతిమ గర్భధారణ లాంటి సాంకేతిక సదుపాయాలను కల్పిస్తున్నమని తెలిపారు.అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ డెయిరీ ఆవరణలో ఎ.పి.బి.ఎన్ పశుగ్రాసం పెంచి రైతులకు గడ్డి కాండం మొక్కలు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.