మత్స్యకారులకు రాయితీ పథకాలు | subsidy schemes of fishiculture | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు రాయితీ పథకాలు

Published Wed, Oct 26 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

subsidy schemes of fishiculture

అనంతపురం అగ్రికల్చర్‌ : రాయితీతో అమలు చేస్తున్న పథకాలను చేపల పెంపకం, అమ్మకందారులు వినియోగించుకోవాలని మత్స్యశాఖ సహాయ సంచాలకులు నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో పథకాలపై మత్స్యకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... వలలు, బోట్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ఐస్‌బాక్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ వర్గాలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 90 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు.  కార్యక్రమంలో కన్సల్టెంట్లు డాక్టర్‌ జ్ఞానేశ్వరరావు, డాక్టర్‌ ప్రవళిక, ఎఫ్‌డీఓలు రామాంజినేయులు, పుల్లయ్య, ఫిలిప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement