‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ! | 'Intipanta' subsidy of 50% of the kits! | Sakshi
Sakshi News home page

‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ!

Published Sat, Sep 6 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ!

‘ఇంటిపంట’ కిట్లపై 50% సబ్సిడీ!

- 600 యూనిట్లకు రూ. 18 లక్షల సబ్సిడీ మంజూరు
- సబ్సిడీ పోను 18 బస్తాల మట్టి మిశ్రమం సహా యూనిట్ ధర రూ. 3 వేలు
- మట్టి మిశ్రమం వద్దనుకుంటే రూ. వెయ్యి తగ్గింపు
సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండించుకోదలచిన హైదరాబాద్ మహాన గరవాసులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిపంట కిట్లపై సబ్సిడీ పథకానికి పచ్చజెండా ఊపింది. 4 నెలల్లో 600 యూనిట్ల పంపిణీ ద్వారా నగరంలోని మేడల మీద, ఖాళీ స్థలాల్లో 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరల పెంపకాన్ని ప్రోత్స హించాలన్నది లక్ష్యం. యూనిట్ ధర రూ. 6 వేలు. సగం సబ్సిడీ పోను లబ్ధిదారు రూ. 3 వేలు చెల్లించాలి. యూనిట్‌లో భాగంగా 4 సిల్పాలిన్ (40 చదరపు అడుగులు) బెడ్స్, దేశవాళీ విత్తనాలు, వేపపిండి, వేపనూనె, ఇతర పరికరా లతోపాటు 18 బస్తాల మట్టి మిశ్రమం (ఎర్రమట్టి 50%+ పశువుల ఎరువు 25%+ కొబ్బరిపొట్టు 25%) ఇస్తారు. మట్టిమి శ్రమం వద్దనుకునే వారు రూ. వెయ్యి తగ్గించి చెల్లించే సదుపాయం ఉందని ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ (పబ్లిక్ గార్డెన్స్) విజయకుమార్ ‘సాక్షి’తో చెప్పా రు.

మొదటి పంటకు టమాటా, వంగ, మిరప, క్యాప్సికం నారు, తర్వాత రెండు పంటలకు సరిపడా విత్తనాలు కూడా ఇస్తామన్నారు. సబ్సిడీ కిట్లతో సంబంధం లేకుండా కూడా 50% సబ్సిడీతో దేశవాళీ విత్తనాలను అందు బాటులో ఉంచుతున్నామన్నారు. ఇంటి పంటల సాగుపై ప్రతి 15 రోజులకోసారి వర్క్‌షాపులు నిర్వహిం చనున్నట్లు విజయ కుమార్ వివరించారు. ఇంటిపంట సబ్సిడీ కిట్లను పొందాల నుకునే నగరవాసులు   http://horticulture. tg.nic.in/ వెబ్‌సైట్‌లో ‘డౌన్‌లోడ్స్’ నుంచి దరఖాస్తును పొందవచ్చు.

మట్టి మిశ్రమం తోపాటు ఇంటిపంట కిట్ కావాలనుకునే వారు రూ. 3 వేలు, మట్టి మిశ్రమం వద్దను కునే వారు రూ. 2 వేలకు ‘డిప్యూటీ డెరైక్టర్ హార్టికల్చర్, గవర్నమెంట్ గార్డెన్స్, హైద రాబాద్’ పేరిట డీడీ తీయాలి. పూరించిన దరఖా స్తుకు డీడీ జత చేసి రెడ్‌హిల్స్‌లో నాంపల్లి కోర్టుల పక్కన గల హార్ట్టికల్చర్ ట్రైనింగ్‌ఇన్‌స్టిట్యూట్(హెచ్‌టీఐ)లో అధి కారులకు అందజేసి.. కిట్‌ను తీసుకెళ్ల వచ్చ ని విజయకుమార్ వివరించారు. వివరాల కు ఉద్యాన విస్తరణాధికారి నవీన్ (99491 61042) లేదా ఉద్యాన అధికారిణి అరుణ (8374449458)ను సంప్రదించవచ్చు.  publicgardens@gmail.comకు మెయిల్ ఇవ్వొచ్చు.
 - ‘ఇంటిపంట’ డెస్క్

 14న గార్డెనింగ్ మీట్!
 వచ్చే ఆదివారం(14వ తేదీ) సాయంత్రం 3-6 గంటల మధ్య ‘లామకాన్’లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ మీట్ జరుగుతుంది. ప్రవేశం ఉచితం. ఈ నెల 7లోగా కృష్ణ కుందుర్తి (kksrinivas24@hotmail.com)కి మెయిల్ ఇచ్చి పేరు నమోదు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement