కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి | young man killed with Electric shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి

Published Mon, Oct 5 2015 8:23 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

young man killed with Electric shock

ఈతకు వెళ్లిన ఆ యువకుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. విజయవాడ నగరంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాత రాజీవ్‌నగర్‌కు చెందిన జవ్వాది దుర్గారావు(16) తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళ్తుంటాడు.  సోమవారం స్నేహితులతో కలసి అంబాజీపురం వద్ద కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లాడు.

ఒడ్డుకు చేరిన తర్వాత కాలువలో చెప్పులు పడిపోవటంతో వాటిని తీసుకునేందుకు పక్కనే ఉన్న కరెంటు స్తంభం జీవైర్‌ను పట్టుకున్నాడు. అయితే, అది సర్వీసు వైరును తాకి ఉండటంతో విద్యుత్ ప్రసారం జరిగి అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement