టారో: 18 డిసెంబర్‌ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు | Taro from 18 December to 24 December 2016 | Sakshi
Sakshi News home page

టారో: 18 డిసెంబర్‌ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు

Published Sun, Dec 18 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

టారో: 18 డిసెంబర్‌ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు

టారో: 18 డిసెంబర్‌ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పూర్తిగా అంకితభావంతో పని చేయమన్నది ఈ వారం వీరికి చెప్పదగ్గ సూచన. అలాగే ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అధికారం కోసం మీరు పడుతున్న ఆరాటం ఫలించే అవకాశాలున్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఏమాత్రం తొందరలేకుండా నిశితంగా ఆలోచించి తీసుకోవడం మంచిది.
కలిసి వచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లడానికి  అనుకూలమైన కాలం ఇది. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదు. లేదంటే మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ముక్కుసూటి మనస్తత్వం అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు, కాస్త పట్టువిడుపు ధోరణిని అలవరచుకోండి. స్నేహితులు, మీ కింది స్థాయి వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీకు చాలా అనుకూలమైన వారమిది. పనిలో కొత్త పద్ధతులు నేర్చుకుని, వాటిని విజయవంతంగా అమలు చేసి, మంచి పేరు, ప్రశంసలు తెచ్చుకుంటారు. బృందంతో కలిసి మీరు చేసే పని విజయవంతమవుతుంది. మీకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే అవకాశం వస్తుంది. కెరీర్‌ మలుపు తిరిగే అవకాశం ఉంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవడం మేలు చేస్తుంది.
కలిసి వచ్చే రంగు: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఏదో అద్భుతం జరిగినట్లుగా మీ ప్రేమ ఫలిస్తుంది. పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. భౌతిక శక్తులమీదనే కాదు, ఆధ్యాత్మికత మీద కూడా మనసు పెట్టి, నమ్మకంతో పని చేస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు.
కలిసి వచ్చేరంగు: పాలమీగడ రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీకు అన్నివిధాలుగా కలిసి వచ్చే కాలమిది. గొప్ప అవకాశాల కోసం, మంచి సమయం కోసం మీ నిరీక్షణ ఫలిస్తుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. ప్రేమ విషయంలో కొంత నైరాశ్యం, ఎదురుదెబ్బలూ తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించ వలసిన సమయమిది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు.
కలిసి వచ్చే రంగు: వెండిరంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కుటుంబపరంగా మీకు ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. అంకితభావంతో కష్టపడి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించి, దానిని ఆచరణలో పెట్టి ఘనవిజయాన్ని సాధిస్తారు. ఆఫీసులో పెండింగ్‌ పనులు పూర్తి చేయడం సత్ఫలితాలనిస్తుంది. మీ విల్‌ పవర్‌ మీకు మంచి చేస్తుంది. రానున్న సంవత్సరంలో మీ లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకుంటారు.
కలిసి వచ్చే రంగు: గచ్చకాయ రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
గులాబీ చెట్టుకు ఎన్ని ముళ్లున్నా, ఎంత గాలిఒత్తిడి ఎదురైనా తట్టుకుని అందమైన పూలనే ఇచ్చినట్లు మీరు కూడా అన్ని రకాల ఒత్తిళ్లనూ తట్టుకుని అందరికీ ఆనందాన్నే పంచుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అలసిన మనస్సును, శరీరాన్ని విహార యాత్రలతో సేదదీర్చేందుకు ఇది తగిన సమయం. ఈవారంలో మీ కెరీర్‌ మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది.
కలిసి వచ్చే రంగు: వంకాయరంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీరు త్యాగాలు చేయవలసిన సమయం. బాగా కష్టపడి పని చేయాల్సిన సమయం కూడా. ఒక్కోసారి మీ ప్రేమను కూడా త్యాగం చేయక తప్పదు. పనిపరంగా మీకు చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడూ పని అంటూ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. ఉద్యోగ భద్రత కోసం చిన్న చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది. దేనిలోనైనా ఉదాశీనత పనికి రాదు.
కలిసి వచ్చే రంగు: గోధుమ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆర్థికంగా మీకు అనూహ్యమైన లాభాలు కళ్లజూస్తారు. ధనయోగం కలుగుతుంది. కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది. భగవంతుడి మీద భారం వేసి, ధైర్యం చేసి మీరు వేసే ప్రతి అడుగూ మిమ్మల్ని లక్ష్యసాధనకు, విజయానికి చేరువ చేస్తాయి. మీ సృజనాత్మకత మీకెంతో ఉపయోగపడుతుంది. ఎన్ని పనులున్నా, కుటుంబాన్ని, స్నేహితులను దూరం చేసుకోవద్దు. విద్యార్థులకు అనుకూల కాలమిది.
కలిసి వచ్చే రంగు: లేత గులాబీ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
పనిపరంగా కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. అనూహ్యంగా విజయం సాధించి, ఎంతోకాలంగా మీరనుభవిస్తున్న మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకుంటారు. కొత్తగా ఒక మంచి ఆదాయ మార్గాన్ని తెలుసుకుంటారు.  అన్ని గాయాలనూ మాన్పగలిగే గొప్ప శక్తి కాలానికి ఉందని గ్రహించండి.
కలిసి వచ్చే రంగు: పొద్దుతిరుగుడు పువ్వు వన్నె

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
గతంలో మీరు చేసిన ఒక మంచి పని ప్రస్తుతం మీకెంతో మేలు చేస్తుంది. దానిమేలు భవిష్యత్తులో కూడా ఉంటుంది. బహుశ ఇది మీరు రాసిన వీలునామా లేదా మీ పూర్వుల ఆస్తిపాస్తులకు సంబంధించి మీరు తీసుకున్న ఒక ముందుజాగ్రత్త కావచ్చు. లక్ష్యసాధనలో విజయాన్ని అందుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. డబ్బు, విజయంతో ఆనందంగా తిరిగి వస్తారు.
కలిసి వచ్చే రంగు: లేత నీలం

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ చిరకాల కోరిక తీరుతుంది. పనిపరంగా, కెరీర్‌పరంగా ఏది ముందో, ఏది వెనకో తేల్చుకోలేని గందరగోళంలో చిక్కుకుంటారు. ఒత్తిడి మూలంగా ఏకాగ్రత కోల్పోయి, లక్ష్యసాధనకు మీరు వేసుకున్న ప్రణాళికలో మార్పులు అనివార్యం అవుతాయి. గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా, శాంతంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని గ్రహించండి.
కలిసి వచ్చే రంగు: బంగారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement