టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు | Taro: from December 10 to December 4, 2016, to | Sakshi
Sakshi News home page

టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు

Published Sat, Dec 3 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు

టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
 ఒత్తిళ్లు, చికాకులు, కోపాలు, ఇతరులతో వివాదాలు మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేయవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలిగే నేర్పరితనం అలవడుతుంది. కెరీర్ పరంగా కొత్తమార్గాలు ఆవిష్కృతమవుతాయి. తికమకలు, పరధ్యానాలను పక్కన పెట్టండి. ప్రశాంతంగా పని చేసుకోండి.
 కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
 మీరనుకున్న పనులన్నీ నెరవేరాయన్న సంతృప్తి కలుగుతుంది. అయితే మీలోని స్తబ్దతను, నిస్తేజాన్ని తొలగించుకోండి. సరైన సంబంధం కుదురుతుంది. ఒక ఇంటి వాళ్లవుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని, గుర్తింపును పొందుతారు. అభద్రతాభావాన్ని విడనాడి, ధైర్యంగా, నిశ్చింతగా ఉండండి. ఒక స్త్రీ మూలంగా అదృష్టం, ఆస్తి కలిసి వస్తుంది. 
 కలిసొచ్చే రంగు: ఎరుపు      
 
 మిథునం (మే 21 - జూన్ 20)
 కీర్తిప్రతిష్ఠలు, విజయం వరిస్తాయి. ఆర్థికంగా కొంత అభద్రత, అస్థిరత ఉండవచ్చు. భయపడకండి. ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఒంటరితనం, ఏదో కోల్పోయిన  భావనలు వెంటాడవచ్చు. ఆధ్యాత్మికతను అలవరచుకోండి. ప్రశాంతత అదే వస్తుంది. పనిపరంగా అంతా సవ్యంగా సాగుతుంది. ఆఫీసులో అంతా మిమ్మల్ని మెచ్చుకునేలా పని చేస్తారు. ప్రయాణాలు, సాహసాలు చేస్తారు.
 కలిసొచ్చే రంగు: లేత గులాబీ
 
 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
 ఒంటరితనం, ఏదో కోల్పోయానన్న భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లండి. అన్నీ ఉన్నాయన్న సంతృప్తి కలుగుతుంది. పనిలో మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. అయితే మౌనంగా విధులను నిర్వహించడమే కాదు, మీ హక్కులను గురించి గుర్తు చేసుకోండి. ఆర్థికభద్రత కలుగుతుంది. సాహసాలు, ప్రయాణాలు చేస్తారు. పాతను వదిలి కొత్తదనాన్ని అలవరచుకుంటారు. 
 కలిసొచ్చే రంగు: పగడం రంగు
 
 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
 ఈవారమంతా మీకు ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. భావసారూప్యత కలిగిన వారితో కలిసి ప్రయాణిస్తారు. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు.
 కలిసొచ్చే రంగు: మబ్బురంగు
 
 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
 పనులలో కొద్దిపాటి అడ్డంకులు, అవరోధాలు తప్పకపోవచ్చు. కష్టించి పని చేయండి. మేలు జరుగుతుంది. ఈ వారం మీ జీవితం మలుపు తిరిగే మంచి సంఘటనలు జరగవచ్చు. పనిలో కొత్తపంథాను అనుసరించి, సృజనాత్మకంగా పని చేయండి. భారీమొత్తాలలో  దీర్ఘకాలిక పెట్టుబడులు అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఇంకొంచె జాగ్రత్త తీసుకోవడం మంచిది. 
 కలిసొచ్చే రంగు: పాచిరంగు
 
 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
 ఈవారం మీరు అన్ని విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా, మెలకువగా ఉండటం అవసరం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న మీరు సమయస్ఫూర్తి వ్యవహరించడం, లౌక్యంగా మాట్లాడటం అవసరమని గ్రహించండి. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకోండి.     
 కలిసొచ్చే రంగు: ఎరుపు
 
 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
 పగటికలలు కనడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, నిజాయితీతో పని చేయడం ఎంతో మేలు చేస్తుంది. కొత్త పని లేదా ప్రాజెక్టులో క్షణం తీరికలేకుండా గడుపుతారు. రకరకాల అవకాశాలు మీ తలుపు ఒకేసారి తడతాయి. మీకు నచ్చినది, మీరు చేయగలిగినది ఎంచుకుని కెరీర్‌ను మీరు అనుకున్నట్లుగా తీర్చిదిద్దుకోండి. మీ పుట్టినరోజు తర్వాత నుంచి మీకు మనశ్శాంతి, ఊరట లభిస్తాయి.  
 కలిసొచ్చే రంగు: లేత గులాబీ
 
 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
 ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కళ్యాణ ఘడియలు సమీపించాయి. ఆర్థిక భద్రత, స్థిరత్వం కలుగుతాయి. అయితే అందుకు మరికొంత సమయం ఉంది. ఆందోళన చెందకండి. పని, ప్రయాణాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. మీరు ఉద్యోగులైతే వ్యాపారావకాశం మీ తలుపు తడుతుంది. వ్యాపారులైతే ఉద్యోగావకాశం వరిస్తుంది.       
 కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
 విజయం మీ వెంటే ఉంటుంది. గుర్తింపు, కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. అందుకు తగ్గట్టు పని చేయాలి కదా! సానుకూల భావనలు, సాను కూల ఆలోచనలు మీకెంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీ ప్రేమ ఫలించేందుకు, మీ విషయం పెద్దల వరకు వెళ్లేందుకు ఒకరి సాయం లభిస్తుంది.
 కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ
 
 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
 తగిన ప్రణాళిక లేకపోవటం, సిద్ధంగా ఉండకపోవడం వల్ల కొద్దిపాటి ఆందోళన, అనిశ్చితి, గందరగోళం తప్పకపోవచ్చు. ఇవన్నీ మీ స్వయంకృతాపరాధాలే. గతం గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, దానినుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం అవసరమే కానీ, అతి వద్దు. ప్రేమవ్యవహారాలలో కొంచెం వేగిరపాటు ఉండచ్చు. మీ సానుకూల భావనలు మీకెంతో మేలు చేస్తాయి. 
 కలిసొచ్చే రంగు: వెండిరంగు
 
 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
 మీపాటికి మీరు ప్రశాంతంగా గడుపుతారు. తెలియనివారికి మీరు కొంచెం అహంభావి అనిపింవచ్చుగాక.. అయినా, మీ గురించి తెలిసిన తర్వాత మీరెంత స్నేహశీలి అన్నదీ వారికే అర్థం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేస్తారు. గతంలోని చేదు జ్ఞాపకాలు, బాధలు, భయాల నుంచి నెమ్మదిగా బయట పడతారు. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకుని వారి కోరికను తీరుస్తారు. 
 కలిసొచ్చే రంగు: బూడిదరంగు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement