టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు | Taro January 28 to January 22, 2017 | Sakshi
Sakshi News home page

టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు

Published Sun, Jan 22 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు

టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని చూసి, మీ సహోద్యోగులు అసూయపడతారు.  పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. భయాందోళనలు వదిలేసి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
కలిసి వచ్చే రంగు: పచ్చబంగారు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అవిశ్రాంతంగా పని చేసి, ప్రాజెక్టును పూర్తి చేస్తారు. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు, తెలివితేటలకు మరింత పదును పెట్టుకుని, మీ వాక్చాతుర్యంతో మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు చెప్పినట్లు నడచుకోండి. ఇతరులను మీరు గౌరవిస్తేనే, వారు మిమ్మల్ని గౌరవిస్తారని తెలుసుకోండి.
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
స్నేహితులతో, బంధుమిత్రులతో కలసి సరదాగా గడుపుతూ మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సంతోషంగా గడుపుతారు.
కలిసివచ్చే రంగు: లేత గులాబీ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఉద్యోగ భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. రోజులు సాఫీగా గడవడం లేదనిపించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడం, సృజనాత్మకంగా పనులు చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తిరుగుతుంది.
కలిసి వచ్చే రంగు: ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఏదో కలలో జరిగినట్లుగా నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో చకచకా పనులు పూర్తి చేస్తారు. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. ప్రతిదానికీ కుటుంబసభ్యులమీద, కిందిస్థాయి ఉద్యోగుల మీద ఆధారపడకుండా మీపనులు మీరు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టిపెట్టండి.
కలిసి వచ్చే రంగు: ముదురాకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
 కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి.
కలిసి వచ్చే రంగు: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను లేదా పంటి నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీచుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు.  
కలిసి వచ్చే రంగు: గులాబీ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటివి అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు  పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.  
కలిసి వచ్చే రంగు: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు.  ఏనాడో తెగిపోయిన ఒక బంధాన్ని మీ ప్రేమతో తిరిగి అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. బహుమతులు అందుతాయి. గతాన్ని తలచుకుని కుమిలిపోవద్దు. వర్తమానంలో ఏం చేయాలో ఆలోచించండి.
కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. హుందాగా ముందుకు సాగండి. దిగువస్థాయి వారితో కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు.
కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. సహోద్యోగుల సహకార లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. పరోపకారగుణాన్ని అలవరచుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మొహమాటానికి పోయి తలకు మించిన బాధ్యతలను నెత్తికెత్తుకోవడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది.
కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈ వారం మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. శుభవార్తలను అందుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు కోరుకున్న వారి ప్రేమను పొందుతారు. ఆధ్యాత్మికతను అలవరచుకుంటారు. మీ నిక్కచ్చితనం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు
కలిసి వచ్చే రంగు: నీలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement