![Union Cabinet approves extension for PMAY Urban - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/11/pmay.jpg.webp?itok=ivtQxFSJ)
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)–అర్బన్ పథకాన్ని 2024 డిసెంబర్ 31వ తేదీ వరకూ కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి దేశంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని 2015 జూన్‌లో ప్రారంభించారు.
ఈ ఏడాది మార్చి 31 నాటికి మంజూరు చేసిన 122.69 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థన మేరకు పథకాన్ని 2024 డిసెంబర్ 31 కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు)
Comments
Please login to add a commentAdd a comment