సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అస్పైర్ స్పేసెస్ మియాపూర్‌లో 10.18 ఎకరాల విస్తీర్ణంలో అమేయా పేరిట లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. 16.50 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,066 ఫ్లాట్లుంటాయి. 9 బ్లాక్‌లలో స్టిల్ట్+13 అంతస్తులలో నిర్మాణం ఉంటుంది. 1,210 చ.అ. నుంచి 1,940 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. హెచ్‌ఎండీఏ, రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్‌లో ధర చ.అ.కు రూ.4,849. డిసెంబర్ 2024 వరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని అస్పైర్ స్పేసెస్ ఎండీ టీవీ నర్సింహా రెడ్డి చెప్పారు. అమేయా ప్రాజెక్ట్‌కు ఆర్టి్కటెక్ట్‌గా జెన్‌సెస్ కంపెనీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ నిర్వహిస్తుంది. ల్యాండ్‌స్కేపింగ్‌ను టెర్రా ఫర్మా చేస్తుంది.
30కి పైగా ఆధునిక వసతులు..
ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. 50 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్‌తో పాటు 30కి పైగా ఆధునిక వసతులుంటాయి. పిల్లల కోసం టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ కోసం డే కేర్ అండ్ ఎన్‌రిచ్‌మెంట్ సెంటర్‌లు ఉంటాయి. యోగా, మెడిటేషన్ చేసుకోవటం కోసం ఆక్సిజన్ డిసిగ్నేటెడ్ స్పేసెస్, బిల్డింగ్ పైన టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సెంటల్ కోర్ట్ యార్డ్ ల్యాండ్‌స్కేపింగ్, ఇండోర్ మరియు ఔట్‌డోర్ జిమ్ ఏర్పాట్లుంటాయి. మల్టీపర్పస్ బాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, మినీ థియేటర్, కల్చరల్ సెంటర్, స్పా, సెలూన్ పార్లర్, కాఫీ షాప్, గ్రాసరీ స్టోర్ ఉంటుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్వా్కష్ కోర్ట్ వంటివి ఉంటాయి. జాగింగ్ ట్రాక్, రెఫ్లెక్సాలజీ పాత్ ఉంటుంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన వర్క్ స్టేషన్స్ ఉంటాయి. 24 గంటలు వైఫై అందుబాటులో ఉంటుంది. కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ రూమ్స్ ఉంటాయి.
లొకేషన్ హైలైట్స్..
మియాపూర్ మెట్రో స్టేషన్‌కి 5 నిమిషాలు దూరంలో అమేయా ప్రాజెక్ట్ ఉంటుంది. హైటెక్‌సిటీ 10 కి.మీ., ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు చేరువలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, సెనీటా గ్లోబల్ స్కూల్, కెన్నిడీ గ్లోబల్ స్కూల్, సాన్‌ఫోర్డ్ గ్లోబల్ స్కూల్, సిల్వర్ ఓక్స్ వంటి పాఠశాలలున్నాయి. ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్, ల్యాండ్‌మార్క్ ఆసుపత్రి, అంకురా హాస్పిటల్, రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రులు 15 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉన్నాయి. జీఎస్ ఎం మాల్, మంజీరామాల్, ఫోరం మాల్, శరత్ క్యాపిటల్ మాల్, ఐకియా వంటివి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment