
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వే
భోగాపురం : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయూ లేదా అన్న అంశంపై కేంద్ర మానిటరింగ్ కమిటీ (జాతీయ పర్యవేక్షణ కమిటీ సభ్యులు) సభ్యులు శనివారం ముంజేరు గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఉపాధి పనులను పరిశీలించి, వేతనదారులకు రో జుకు ఎంత వేతనం వస్తున్నది అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పూర్తిస్థాయిలో పనులు కల్పిస్తున్నారా లేదా అన్న విషయూన్ని కూడా ఆరా తీశా రు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్యం, ఐఎస్‌ఎల్ మరుగుదొడ్లు వినియోగంపై పరిశీలించి, పంచాయతీ కార్యాల యంలో హౌసింగ్, ఉపాధి, ఐకేపీ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో వృద్ధాప్య, వికలాంగ, విం తంతు పింఛన్లు అందుకుంటున్న వారితో మాట్లాడారు. వారు ఎన్ని ఏళ్ల నుంచి పింఛన్లు అందుకుంటున్నారో అడిగి రికార్డులు పరిశీలించారు.
అయితే చాలామంది వారికి ఇస్తున్న రూ. 200 పింఛన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో అన్ని మండలాల్లో నాలుగు పంచాయతీల చొప్పున పరిశీలన చేస్తున్నామన్నారు. భోగాపురం మండలంలో ద ల్లిపేట, కవులవా డ, లింగాలవలసతో పాటు ముంజేరులో నాలుగు రోజు లుగా సర్వే నిర్వహించినట్టు తెలిపారు.మండలంలో ప్ర జలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వారికి అదనంగా అందించాల్సిన సంక్షేమ పథకాలు వంటి వాటిపై నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ ప్రాజెక్టు అధికారి ఎస్. అప్పలనాయుడు, డీఆర్‌డీఏ ఏపీడీ వి.డి.ఆర్ ప్రసాద్, భోగాపురం క్లస్టర్ ఏపీడీ సత్యనారాయణ, డిప్యూటీ ఎస్‌ఓ కె.వి రామారా వు, ఇన్‌చార్జి ఎంఈఓ ఎన్.సుజాత, ఉపాధి ఏపీఓ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.