![Housing Bills are not Paying By officers - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/6/6.jpg.webp?itok=b__FKfrD)
చీరాల టౌన్ : ‘వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ అప్పులు చేసి మరీ సొంత గృహాన్ని నిర్మించుకున్నా. ఇంటికి మరుగుదొడ్డి లేకపోవడంతో ఇటీవల వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నా. కానీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు’ అని నాగులపాడు తూర్పువారివీధికి చెందిన మంగనూరు తులశమ్మ వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
రైతులను ఆదుకోండి సార్..
చీరాల టౌన్: ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు సకాలంలో సాగునీరు అందడంలేదని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వెంకటాపురానికి చెందిన భీమనాథం సుబ్బారెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తాను 12 ఎకరాలు పొగాకు సాగుచేస్తే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నానని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment