టారో : 5 మార్చి నుంచి 11 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
మీకు ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనుక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు.
కలిసొచ్చే రంగు: గోధుమ
మిథునం (మే 21 – జూన్ 20)
వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠ, హోదాలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఒక విషయంలో ముఖ్యనిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇతరులకు అది కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి.
కలిసొచ్చే రంగు: దొండపండు
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. అయితే మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు.
కలిసొచ్చే రంగు: లేత నారింజ
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.
కలిసొచ్చే రంగు: తెలుపు
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
కలిసొచ్చే రంగు: ఊదా
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి.
కలిసొచ్చే రంగు: పసుపు
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొద్దిగా ఒడిదుడుకులతో కూడి ఉండవచ్చు. అంతమాత్రాన మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో... దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది.
కలిసొచ్చే రంగు: వెండి
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలుతీర్చేస్తారు. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి.
కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ధ్యానంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. మీ పూజలు నిరాడంబరంగా ఉండాలి. హంగూ ఆర్భాటాలు అక్కరలేదు. ఆర్థికంగా కొద్దిపాటి మందకొడితనం నెలకొనవచ్చు కానీ, నిరుత్సాహ పడకండి. సానుకూలంగా తీసుకోండి. వృత్తిపరంగా, పనిపరంగా మిమ్మల్ని ఆవరించి ఉన్న కొన్ని భ్రమలు తొలగి, నిజాలు బయటపడతాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తాయి.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అన్ని విషయాల్లోనూ మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా!
కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ