ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 36 గ్రామాల్లో హౌసింగ్ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వం సీబీసీఐడీని ఆదేశించిన విషయం విధితమే. దీంతో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో అధికారులు కొద్ది నెలలుగా విచారణ చేశారు. సీబీసీఐడీ వరంగల్ జోన్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో అధికారులు మండల కేంద్రంలోని తిమ్మాపూర్‌లో ఇంటింటా తిరుగుతూ 1,340 ఇళ్లను సోదా చేశారు. తమవిచారణలో 199 ఇళ్లలో పలు విధాలుగా అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ప్రకటించారు. కాగా సంబంధిత నివాసదారులకు బుధవారం నోటీసులు అందజేసి గురువారం జరిగే విచారణకు హాజరుకావాలని కోరారు.
దీంతో సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు గురువారం హాజరై న వారిలో నుంచి మొదటి రోజు 80 మందిని విచారించినట్లు సీబీసీఐడీ అదికారులు తెలిపారు. కాగా, తమ విచారణలో బాధితులు పలు వివరాలు తెలియజేసినట్లు సమాచారం. కాగా రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, వీవో గ్రూపులు, హౌసింగ్ అధికారులు, సిబ్బంది కొందరి పేర్ల పై బిల్లులు కాజేసినట్లు బాధితులు తెలిపారని సమాచా రం. విచారణ పూర్తి కాగానే విచారణ, విషయాలతో పా టు దోషుల వివరాలను వెల్లడిస్తామని అధికారులు పే ర్కొంటున్నారు. సీబీసీఐడీ సీఐలు రఘుపతి, చేరాలు, ఎస్సైలు రాఘవులు, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
హౌసింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
Published Fri, May 8 2015 2:28 AM | Last Updated on Fri, May 25 2018 5:49 PM
Advertisement