సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా కోలుకుంటోంది. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు ఈ రంగం రికవరీలో బ్యాక్‌బోన్‌గా నిలబడుతున్నాయని మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్స్ సర్వీసెస్ సర్వే తెలిపింది. ఈ నగరాల్లోని గృహ యజమానులు సీరియస్ విక్రయదారులుగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది.
► గృహాల విక్రయాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చెన్నై, పుణే, ముంబై నగరాలు ఉన్నాయి. సులభమైన రవాణా, మెట్రో కనెక్టివిటీ మెరుగ్గా ఉండటమే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాపరీ్టల విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలిపింది. సరసమైన గృహాలతో పాటు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపర్టీల మీదే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
► 500ల కంటే ఎక్కువ నగరాల్లో ఓనర్ సర్వీసెస్ సేవలను వినియోగించుకుంటున్నారు. జనాభా పరంగా చూస్తే.. మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్ సర్వీస్ వినియోగదారుల్లో 80 శాతం పురుషులు, 20 శాతం మహిళలు కస్టమర్లుగా ఉన్నారు. 50 శాతం మంది కస్టమర్లు 40–45 ఏళ్ల పైబడిన వాళ్లే ఉన్నారు. 60 శాతం మంది యూజర్లు వేతనజీవులు కాగా.. 30 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నవాళ్లని రిపోర్ట్ తెలిపింది. 55 శాతం ఓనర్ సరీ్వసెస్ వినియోగదారులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల వాళ్లేనట.
► తక్కువ ధరలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డెవలపర్ల వివిధ పథకాల ప్రయోజనాలతో కొనుగోలుదారులు తమ చిన్న ఇళ్లను విక్రయించేసి.. వాటి స్థానంలో పెద్ద సైజు గృహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా కస్టమర్లకు కలిసొచ్చే అంశం. విక్రయదారులు అధిక లిక్విడిటీ కోసం ప్రాపర్టీలను దీర్ఘకాలం పాటు హోల్డింగ్‌లో పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కరోనా మహమ్మారితో చాలా మంది గృహ యజమానులు తమ ప్రాపరీ్టల విక్రయానికి డిజిటల్ రూపంలో విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
► గృహ యజమానులకు తమ ప్రాపర్టీల కోసం అద్దెదారులను వెతకటంతో పాటు ఆయా ప్రాపరీ్టలను విక్రయించే సేవలను కూడా అందిస్తుంది. గృహ యజమానులకు సులభంగా ప్రాపరీ్టలను విక్రయించేందుకు ఓనర్ సరీ్వసెస్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రొఫెషనల్ ఫొటో షూట్, ప్రాపర్టీ కంటెంట్ వివరణ, ఆన్‌లైన్ జాబితాలు, కస్టమర్ల ఆకర్షణ, రిలేషన్‌షిప్ మేనేజర్స్‌తో డీల్స్‌ను క్లోజ్ చేయడం వంటి ఎండ్ టు ఎండ్ సేవలను అందిస్తుంది. ఆయా సేవల ప్యాకేజీల ధరలు రూ.2,599–5,999 మధ్య ఉన్నాయి.
చదవండి:
అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment