రోమ్: ఇటలీలో నాలుగైదేళ్ల కిందటి వరకు కొన్ని గ్రామాలకు వెళితే కారు చౌకగా ఇళ్లు లభించేవి. ఒక డాలర్ ఇస్తే చాలు ఇక ఇల్లు వారి పేరు మీద రిజిస్టర్ అయిపోయేది. సిసిలీలో ఒక మారుమూల విసిరేసినట్టున్న ఇల్లు కొనడానికి ఒక డాలర్ ఖర్చు పెడితే చాలు. దీనికి కారణం ఆ ప్రాంతం నుంచి ప్రజల వలసలే.
కాలిఫోర్నియాకు చెందిన రుబియా డేనియల్స్ అనే మహిళ 2019లో కేవలం 3.30 డాలర్లకి (రూ.270) మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. ఈ నాలుగేళ్లలో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఆమె కొనుగోలు చేసిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆ ఇళ్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఒక ఇంట్లో తానుంటానని, మరొకటి ఆర్ట్ గ్యాలరీగా మార్చి, ఇంకొకటి అద్దెకిస్తానని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment