Migration of people
-
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్‌లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
ఈ గాలి.. ఈ నేలా..
‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..’ అంటూ బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ విదేశాలకు వెళ్లిన వృత్తి నిపుణులు రూట్ మార్చారు. ‘ఈ గాలి..ఈ నేలా అని పాడుకుంటూ తిరిగి నగరానికి వచ్చేస్తున్నారు. అలా వచ్చేస్తున్న మన దేశీయుల్లో సిటీకి చెందిన వారితో పాటు ఇతర నగరాలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఈ అనూహ్యమైన పోకడని వెల్లడించింది ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్.. నివేదిక. విదేశీ ఉద్యోగాల్లో ఇమడలేకపోతున్న యువ నిపుణులు పని వెతుక్కుంటూ నగరానికి తిరిగి వచ్చేస్తున్నారు. ఈ రివర్స్ మైగ్రేషన్ అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల నుంచి బాగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మొబిలిటీ ట్రెండ్స్‌పై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెలువరించిన తాజా నివేదిక ఈ విశేషాలను వెల్లడించింది. విదేశాల్లో ఉంటూ అక్కడ పని చేయడానికి ఇష్టపడే భారతీయుల సంఖ్య 2020లో 78 శాతం కాగా అది మూడేళ్లు తిరిగేసరికి 2023 కల్లా.. 54 శాతానికి పడిపోయిందని పేర్కొంది. విదేశాల్లో చేస్తున్న పనిపట్ల అయిష్టతతో భారత్‌కు వలసలు పెరిగాయని, ఇలా తిరిగొస్తున్న వారిలో అత్యధికులు ఎంచుకుంటున్న టాప్ 3 నగరాలుగా వరుసగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయని తేలి్చంది. కారణాలెన్నో... ఇలా విదేశీ ఉద్యోగాలపై మోజు తగ్గిపోతుండడానికి ‘ఆర్థిక, వృత్తి పరమైన కారణాలతో పాటు అనేక అంశాలు‘ కీలకంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ‘ప్రధానంగా ఆరి్థక అంశాలతో పాటు వృత్తి పరమైన వృద్ధి అవకాశాల కోసం మాత్రమే ఇలా వలస వెళ్లాలని భావిస్తారు. ఆ విధంగా చూస్తే ఇలా తిరిగి వస్తున్నవారిలో ఉద్యోగ అవకాశాల నాణ్యత కోసం 52 శాతం మంది, ఆదాయం, జీవన వ్యయం కోసం, 37 శాతం ఆవిష్కరణ డిజిటలైజేషన్ కోసం 29 శాతం మంది విదేశాలను వదలాలని నిర్ణయించుకుంటున్నారు. కుటుంబ అనుకూల వాతావరణం, భద్రత, జీవన నాణ్యత కూడా ప్రధాన కారకాలు‘ అని నివేదిక వెల్లడించింది. మన నగరానికే ఎందుకంటే... ఇలా విదేశాల నుంచి మన దేశానికి తిరిగి వస్తున్నవారిలో అత్యధికులు నగరాన్ని ఎంచుకోవడానికి నగరంలో ఐటీ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం, జీవన వ్యయం తక్కువగా ఉండడం, నగరం సురక్షితం అనే ఇమేజ్... వంటివి కారణాలుగా ఇటీవల నగరానికి మకాం మార్చిన వారు చెబుతున్నారు. ‘కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను కాబట్టి అమెరికాలో మంచి ఉద్యోగం వస్తుందని ఆశించాను. కానీ నేను ఆశించింది జరగలేదు. పైగా నా మీద ఆధారపడి నా భార్య నాతో వచ్చేసింది, జీవితం గడపడానికి నేను ఒక కనీ్వనియన్స్ స్టోర్‌లో ఉద్యోగం చేయాల్సి వచి్చంది. ఇలా లాభం లేదని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చాను’ అని ఎస్.సుదర్శన్ రావు చెప్పారు. అతను వెళ్లే ముందు నగరంలో తనకి ఆరంకెల జీతంతో ఉద్యోగం ఇచి్చన అదే కంపెనీ..తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనికి మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని అందించింది ‘ కేవలం ఐటీ రంగంలోనే కాదు, ఫైనాన్స్, ఫార్మా తదితర రంగాలలో కూడా నగరంలో మంచి అవకాశాలు ఉన్నాయి‘ అని మరో ఉద్యోగి చరణ్ అంటున్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఖైతాన్ ఖురేషీ కూడా తన కెనడియన్ కలలను వదులుకుని నగరానికి వచ్చేశారు. ‘కెనడాలో నా నెలవారీ ఖర్చులు అక్కడ నేను సంపాదించగలిగిన దానికంటే చాలా ఎక్కువ. పైగా నేను ఎడ్యుకేషన్ లోన్ కూడా చెల్లించాల్సి ఉంది. వచ్చే నెల బడ్జెట్‌కు కేటాయింపుల కంటే ఇండియాకు టిక్కెట్ కొనడమే చౌక అని అనుకున్నా’ అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు. మాట సాయం కీలకమే... విదేశాల్లో మనవారికి కొరవడుతున్న ఎమోషనల్ సపోర్ట్ కూడా కీలకమని వీరు అంటున్నారు. తమ రివర్స్ మైగ్రేషన్‌కు భావోద్వేగ మద్దతు లభించకపోవడం కూడా కొందరు కారణాలుగా పేర్కొన్నారు. ‘బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ తర్వాత అమెరికాలో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించడం నా అదృష్టంగా భావించాను. అయితే మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం, ఇంటి పనులతో పాటు తీవ్రమైన పని షెడ్యూల్..అది నిర్వర్తించడానికి కనీస అవసరమైన భావోద్వేగ మద్దతు లేకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది’ అని నగరానికి తిరిగి వచ్చి ఇక్కడ తనవారితో కలిసి ఆనందంగా గడుపుతున్న అద్నాన్ అన్నారు. -
రూ.270కి మూడు ఇళ్లు
రోమ్: ఇటలీలో నాలుగైదేళ్ల కిందటి వరకు కొన్ని గ్రామాలకు వెళితే కారు చౌకగా ఇళ్లు లభించేవి. ఒక డాలర్ ఇస్తే చాలు ఇక ఇల్లు వారి పేరు మీద రిజిస్టర్ అయిపోయేది. సిసిలీలో ఒక మారుమూల విసిరేసినట్టున్న ఇల్లు కొనడానికి ఒక డాలర్ ఖర్చు పెడితే చాలు. దీనికి కారణం ఆ ప్రాంతం నుంచి ప్రజల వలసలే. కాలిఫోర్నియాకు చెందిన రుబియా డేనియల్స్ అనే మహిళ 2019లో కేవలం 3.30 డాలర్లకి (రూ.270) మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. ఈ నాలుగేళ్లలో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఆమె కొనుగోలు చేసిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆ ఇళ్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఒక ఇంట్లో తానుంటానని, మరొకటి ఆర్ట్ గ్యాలరీగా మార్చి, ఇంకొకటి అద్దెకిస్తానని చెబుతున్నారు. -
40 రోజులు.. 200 కోట్ల ప్రయాణాలు
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్ యున్’లూనార్ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి మొదలైన ‘చున్ యున్’వేడుకల 40 రోజుల సమయంలో చైనీయులు దేశ, విదేశాల నుంచి సొంతూళ్లకు 200 కోట్ల ప్రయాణాలు సాగించనున్నట్లు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 99.5% ఎక్కువని, 2019 ప్రయాణాల్లో 70.3% అని చైనా రవాణా శాఖ తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వలస సందర్భంగా పేర్కొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 నుంచి చైనీయులు కొత్త ఏడాది ఉత్సవాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండిపోయారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో ఈసారి భారీగా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి అధికారికంగా మొదలయ్యే లూనార్ కొత్త ఏడాది ఉత్సవాలు 40 రోజులపాటు కొనసాగుతాయి. జనమంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే దేశం కోవిడ్‌తో సతమతమవుతుండగా, కోట్లాదిగా జనం రాకపోకలు సాగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కేసులు పెరిగితే, ఆస్పత్రుల్లో సరిపడా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేవని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కోవిడ్ పరీక్షలను నిలిపివేసి చికిత్సలు, వ్యాక్సిన్ల పంపిణీపై దృష్టి పెట్టింది. మార్చి 31వ తేదీ వరకు బాధితులకయ్యే చికిత్స ఖర్చులో 60% తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది. జనరిక్ కరోనా టీకా పాక్స్‌లోవిడ్‌ను చైనాలో తయారు చేసి, పంపిణీ చేసే విషయమై ఫైజర్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. -
హెచ్1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారులకు భారీ ఊరట లభించింది. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్పందించడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి ట్రంప్ సర్కార్ మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ అనుమతులు మంజూరు చేసింది. హెచ్1బీ, గ్రీన్‌కార్డులకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు స్పందించడానికి గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. వీసా పొడిగింపు విజ్ఞప్తులు (ఎన్–14), తిరస్కరణ నోటీసులు, ఉపసంహరణ నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడుల ఉపసంహరణ, ముగింపు నోటీసులు, ఫారమ్ ఐ–290బీ సమర్పణలు, దరఖాస్తు నోటీసులు వంటి వాటిపై అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడానికి గడువు పెంచింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులపై ఉన్న గడువు తేదీ తర్వాత మరో రెండు నెలలపాటు వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఫారమ్ ఐ–290బీ నింపి పంపించడానికి ఈ ప్రకటన విడుదలైన నుంచి 60 రోజుల వరకు గడువు ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటుకు వీలు కల్పించే గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు ఉన్నారు. -
నీతాకే మన ఓటు
నీతా శోధ.. పద్దెనిమిదేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఎందుకు వచ్చిందో ఇండియాలో ఆమెను ఎవరూ అడగలేదు. ఆనాటి నుంచీ ఆమె ఇండియాలో పౌరసత్వం లేకుండానే ఉంది. పౌరసత్వం ఉందా లేదా అని ఎవరూ ఆమెను అడగలేదు. పౌరసత్వం ఎవరు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఎందుకు తీసుకోవాలో తెలియక కావచ్చు.. ఆమె కూడా పౌరసత్వం గురించి ఆలోచించలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి, రాజస్థాన్‌లో ఉండిపోయింది. నాలుగు నెలల క్రితం (ఈ పౌరసత్వ గొడవ మొదలు కాకముందు) స్థానిక అధికారులు తమ పని తాము చేసుకుపోతున్న క్రమంలో.. ఏనాడో వలస వచ్చిన నీతా శోధాకు భారత పౌరసత్వం (బర్త్ సర్టిఫికెట్) వచ్చింది. ఆ అర్హతతో ఇప్పుడామె రాజస్థాన్‌లోని నట్వారా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు! గెలిస్తే దేనికోసం కృషి చేస్తారు అనే ప్రశ్నకు.. ఆమె చెప్పిన సమాధానం.. గ్రామంలో అంతా చక్కగా చదువుకోవాలి. స్త్రీలకు ఏదైనా సంపాదన ఉండాలి. మొదట ఈ రెండిటి కోసం పని చేస్తాను.. అని. భారతదేశంలోని గ్రామాలకు ఇప్పుడు కావలసినవి కూడా ఇవే. -
కార్వీలో వాటా విక్రయం?
ప్రతీ ప్రతికూల పరిస్థితి నుంచి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవచ్చనేది తెలుసుకునేందుకు మా గ్రూప్ ఒక కేస్ స్టడీ లాంటిది అని కార్వీ తన పోర్టల్‌లో గర్వంగా చెబుతుంది. కానీ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బైటపడుతుంది.. మళ్లీ ఎలా నిలదొక్కుకుంటుంది.. అన్నది వేచిచూడాలి. సాక్షి, బిజినెస్ విభాగం: ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టి... ఆ డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిందనే వ్యవహారంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సర్వీస్ నుంచి క్లయింట్ల వలస మొదలైంది. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని సెబీ ఉత్తర్వులివ్వటంతో... రెండు రోజులుగా ప్రస్తుత క్లయింట్లు పెద్ద సంఖ్యలో నానక్‌రామ్‌గూడలోని కార్వీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి షేర్ ట్రాన్స్ఫర్ స్లిప్పులు తెచ్చుకుంటున్నారు. వాటిని తమ కార్వీ బ్రాంచీలో ఇచ్చి... తమకున్న వేరే డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేయాలని అడుగుతున్నారు. బదిలీ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తవుతుందని కార్వీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా తరలిపోతున్న క్లయింట్ల సంఖ్య భారీగానే ఉండటంతో... ఇది కార్వీ బ్రోకింగ్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ బ్రోకరేజీ క్లయింట్లలో 20– 22 శాతం వాటా కార్వీదే. ఇపుడు ఈ వాటా తగ్గనుంది. వాటా విక్రయానికి అడుగులు? నిబంధనలకు విరుద్ధంగా క్లయింట్ల షేర్లను తాకట్టు పెట్టి, ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. తనఖా పెట్టి తెచ్చుకున్న మొత్తం ఎంతనేది ఇప్పటిదాకా స్పష్టంగా బయటకు రాలేదు. ఎన్ఎస్ఈ తన నివేదికలో... ఇలా తెచ్చిన రూ.1,096 కోట్లను కేఎస్‌బీఎల్ తన రియల్టీ విభాగానికి మళ్లించిందని పేర్కొంది. అయితే కంపెనీ దాదాపు రూ. 2,000 కోట్లు పైగా డిఫాల్ట్ అయ్యిందనే వార్తలొస్తున్నాయి. కార్వీ మాత్రం ఈ అంకెలన్నీ తప్పంటోంది. ‘‘150–180 మంది క్లయింట్లకే చెల్లింపులు జరపాల్సి ఉంది. బకాయి రూ. 25–30 కోట్లు మాత్రమే’’ అని సంస్థ చైర్మన్ సి. పార్థసారథి చెప్పారు. 15 రోజుల్లో దీన్ని చెల్లిస్తామన్నారాయన. ఈలోగా నిధుల సమీకరణకు తమ కంపెనీల్లో ఒకదాన్లో వ్యూహాత్మక వాటా విక్రయించే దిశగా కార్వీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డీల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘‘ఈ డీల్‌తో వచ్చే నిధులు పూర్తిగా సరిపోకపోయినా ప్రస్తుతానికి లిక్విడిటీ సమస్య నుంచి గట్టెక్కుతాం’’ అని కార్వీ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్‌బ్రోకింగ్ నుంచి క్లయింట్ల వలసలపై స్పందిస్తూ... ‘‘వలసల ప్రభావం ఉంటుంది. కానీ అది మేం కోలుకోలేనంత స్థాయిలో ఉండకపోవచ్చు. మా వాటా తగ్గుతుంది. కొన్నాళ్ల పాటు విస్తరణ ఉండకపోవచ్చు. కానీ దీన్నుంచి బయటపడతాం’’ అని ఆ వర్గాలు ధీమా వ్యక్తంచేశాయి. సంక్షోభానికి ఆద్యం... ఐఎల్ఎఫ్ఎస్!! అతివేగంగా విస్తరించే ఏ సంస్థయినా... సంక్షోభాలు వచ్చినపుడు సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. కార్వీ కూడా అలాగే విస్తరించింది. రూ.1.5 లక్షల పెట్టుబడితో 1983లో అయిదుగురు యువ చార్టర్డ్ అకౌంటెంట్లు దీన్ని ఆరంభించారు. రిజిస్ట్రీ సేవల సంస్థగా మొదలై... ఆ తర్వాత రిటైల్ బ్రోకింగ్, డెట్ మార్కెట్, కమోడిటీలు, రియల్టీ, ఆన్లైన్ బ్రోకింగ్ ఇలా పలు విభాగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం ఆయా వ్యాపార విభాగాల్లో టాప్ 5 కంపెనీల్లో ఒకటి. వివిధ మార్గాల్లో 7 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 600 కార్పొరేట్ సంస్థలకు సేవలందిస్తోంది. తాజాగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తాక కార్వీకి కష్టాలు మొదలయ్యాయి. బ్రోకింగ్ సంస్థలకు తమ క్లయింట్లకు మార్జిన్ ఇవ్వటానికి లిక్విడిటీ అవసరం. అప్పటిదాకా దాదాపు రూ.500 కోట్ల మేర కమర్షియల్ పేపర్లను బ్యాంకుల వద్ద పెట్టి... ఆ మొత్తాన్ని కార్వీ తన లిక్విడిటీ అవసరాలకు వాడుకునేది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తరవాత బ్యాంకులు ఈ కమర్షియల్ పేపర్లకు విముఖత చూపించాయి. దాంతో లిక్విడిటీ సమస్య మొదలైంది. దీనికితోడు కార్వీ కాల్‌సెంటర్ సహా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు చేస్తోంది. చంద్రబాబునాయుడి హయాంలో ఏపీ ప్రభుత్వం నుంచి కొంత బకాయిలు రావాల్సి ఉండగా... ఆ కాంట్రాక్టు ఇప్పుడు కూడా కొనసాగుతోంది కనుక కొంత మొత్తం చేతికందినట్లు తెలిసింది. యూపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిలిపేయటంతో అక్కడ బకాయిలుండిపోయాయి. ఇలా అన్ని వైపుల నుంచీ కష్టాలు చుట్టుముట్టడంతో లిక్విడిటీ కోసం కార్వీ తన క్లయింట్ల షేర్లను తనఖా పెట్టేది. ‘పూల్’ అకౌంట్లో ఉంటేనే తనఖా!! కార్వీ తన ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపేది. ‘మీ షేర్లను పూల్ అకౌంట్లోకి మళ్లించటం మీకు సమ్మతమేనా?’ అని అడిగేది. అంగీకరించిన వారికి 2.5 శాతం మొత్తం అదనంగా చెల్లిస్తామని చెప్పేది. వద్దన్న వారివి తప్ప మిగతా వారి షేర్లన్నీ పూల్ అకౌంట్లోకి మళ్లించి... వాటిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినట్లు సమాచారం. అయితే బ్యాంకులు కొన్ని కంపెనీల షేర్లనే తనఖా పెట్టుకుంటాయి. వాటిపై కూడా 50–60 శాతాన్నే రుణంగా ఇస్తాయి. కార్వీ ఇప్పటిదాకా ఈ రూపంలో ఎంత రుణం సేకరించిందనే విషయం స్పష్టం కావటం లేదు. ‘‘సెబీ నిబంధనల మేరకు అన్ని బ్రోకింగ్ కంపెనీలూ ఇలా షేర్లను తనఖా పెట్టడం మామూలే. మేమూ అలాగే చేశాం. అక్టోబర్‌లో తనిఖీల సందర్భంగా వద్దని చెప్పాక నిలిపేశాం’’ అని కార్వీ చెబుతోంది. ఇది నియంత్రణ సంస్థల వైఫల్యం కాదా? కార్వీ అవకతవకల్ని అక్టోబర్‌లో సెబీ, ఎక్సే్ఛంజీలు పసిగట్టినపుడు వివిధ ఖాతాల్లో 21 వేల పైచిలుకు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. వీటిని సరిదిద్దుకునేందుకు సమయమిచ్చినా కార్వీ కొన్ని షేర్లనే తనఖా నుంచి విడిపించగలిగింది. అందుకే కొత్త క్లయింట్లను తీసుకోరాదని కంపెనీకి సెబీ ఆదేశాలిచ్చింది. మరి, కళ్ల ముందే ఇంత భారీగా అవకతవకలు జరుగుతుంటే నియంత్రణ సంస్థలు, స్టాక్ ఎక్సే్చంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఏం చేసినట్లు? బ్రోకరేజీ సంస్థలు సక్రమంగా లావాదేవీలు జరుపుతున్నాయా లేదా అన్నది తరచూ తనిఖీ చేయడం ఎక్సే్చంజీల బాధ్యత. ఆ బాధ్యతను అవి సక్రమంగా నెరవేరిస్తే ఇలాంటి వాటిని ముందే గుర్తించాలి కదా? డీమ్యాట్ ఖాతాల్లో ఏం జరుగుతోందన్నది డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌కి పట్టింపు ఉండటం లేదనే విమర్శలూ ఉన్నాయి. ఇక చిన్న చిన్న రుణాలకు వంద కండీషన్లు పెట్టే బ్యాంకులు.. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎవరి షేర్లు.. ఎవరు తనఖా పెడుతున్నారు వంటివేమీ పట్టించుకోకుండా అలా ఎలా ఇచ్చేశాయన్నది మరో ప్రశ్న. నిఘా వ్యవస్థను టెక్నాలజీతో పటిష్టం చేస్తున్నామంటూ చెప్పుకునే సెబీ.. చాన్నాళ్లుగా కార్వీ, ఇతర బ్రోకరేజీ సంస్థల మీద సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఎందుకు గుర్తించలే దన్నది మరో విమర్శ. మరి అంతిమంగా ఇన్వెస్టర్లు నష్టపోతే వీటికి బాధ్యత ఎవరిది? -
పట్నం దిక్కుకు
సాక్షి, హైదరాబాద్ : పల్లె దిగాలుగా పట్నం బాట పట్టింది. కూలి అడ్డాల్లో పనుల కోసం తండ్లాడుతోంది. రైతులు, వ్యవసాయ కూలీలు వలస వచ్చినా పట్నంలోనూ చేతినిండా పనుల్లేవు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలవుతున్నా ఇరవై మూడు జిల్లాల్లో వర్షాల జాడలేదు. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పనులు ముం దుకు సాగడంలేదు. దిక్కుతోచని స్థితిలో రైతులు, వ్యవసాయ కూలీలు నగరానికి చేరుతున్నారు. ఫలితంగా నగరంలో ఏ కూలి అడ్డా చూసినా రైతులు, వ్యవసాయ కూలీలతో కిటకిటలాడుతోంది. వారంతా భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, హోటళ్లలో సర్వర్లుగా చేరిపోతున్నారు. వర్షాలు వచ్చి పొలం పనులు ముందుకు సాగే వరకు తమకు కష్టాలు తప్పవని, పిల్లల చదువులు, ఇతర ఖర్చుల కోసమైనా ఊరును వదిలిరాక తప్పలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. అయితే, తాజాగా వలస వచ్చిన రైతు కూలీల్లో అత్యధికులు భవన నిర్మాణ కార్మికులుగా, కాస్త రాయటం, చదవటం వచ్చినవారు సెక్యూరిటీ గార్డులుగా, స్టోర్ కీపర్లుగా పనులకు కుదిరిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఎర్రకుంట పరిధిలోని సురేష్‌నగర్ ఊరుకుఊరే నగరానికి వచ్చేసింది. ఈ ఊరిజనమంతా అశోక్‌నగర్‌లోని విక్టోరియా కేఫ్ అడ్డాపై కూలి పనుల కోసం వచ్చి పోయేవారి చుట్టూ చేరి ప్రాధేయపడుతున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. అయితే, తమకు కాలం గడిచేందుకు ఏ పనిచెప్పినా చేస్తామని, అవసరమైతే ఎక్కువ సమయమైనా పనిచేస్తామని రైతులు, కూలీలు నగరవాసులకు ఆఫర్ ఇస్తుండటం విశేషం. 23 జిల్లాల్లో వానల్లేవు... తెలంగాణ జిల్లాల్లో కేవలం ఒక్క నారాయణపేట జిల్లాలోనే సాధారణ సగటుకు మించి వర్షపాతం నమోదైంది. ఏకంగా 23 జిల్లాల్లో దారుణ పరిస్థితులుండగా అందులో ఖమ్మం, మంచిర్యాల, సూర్యాపేట, భద్రాద్రి–కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో అత్యల్ప వర్షం కురిసింది. రైతులు, కూలీల దైన్యం వారి మాటల్లో... వానలు లేక.. పనుల కోసం మాది బాన్సువాడ, నాకు రెండెకరాల పొలం ఉంది. వర్షాలు పడతాయని ఎంతో ఆశతో వరిపంటకు ఏర్పాట్లు చేసుకున్నాను. వానలు కురుస్తాయని ఎదురు చూశాను. కానీ, వర్షం పడే సూచనలు కనపడలేదు. దీంతో పంటకు చేసుకున్న ఏర్పాట్లు వృథా అయ్యాయి. చేసేది లేక పట్నం వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాను. – సంజీవ్, బాన్స్వాడ కౌలు రైతుకు కష్టాలే... పోయినేడాది కౌలు చేస్తే వర్షాల్లేక పంటలు పండలేదు. 10 రోజుల కింద వచ్చి గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో ఉంటున్నం. నా భార్య, నేను కూలీ పనులు చేస్తేనే ఇల్లు గడుస్తది. నా కొడుకు పాండురంగ బీటెక్ చేసినా మూడేళ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నడు. కూలీ పనుల కోసం ఇక్కడికొస్తే వారంలో 3 రోజులు ఖాళీగా ఉంటున్నం. –సల్లూరి అబ్బాయి, వీరాపురం, భూపాలపల్లి 10 రోజులకు 3 రోజులే పని మాది మహబూబాబాద్ జిల్లా. నాకు మూడెకరాల పొలం ఉంది. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కంది పండించేవాడిని. వర్షాలు కురవకపోవడంతో వలస వచ్చిన. బండమైసమ్మనగర్‌లో భార్యతో ఉంటున్న. ఇంటి కిరాయి రూ.3 వేలు. ఇద్దరి పిల్లలను మా అమ్మ దగ్గర పెట్టి వచ్చినం. అడ్డా మీద 10 రోజులు నిలబడితే మూడ్రోజులే పని దొరికింది. ఇక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఊళ్లె బత్కలేక.. పట్నం వొచ్చిన.. రెండెకరాల చెలక ఉంది. వానల్లేక, ఊళ్లో బత్కలేక వలస వచ్చిన. గచ్చిబౌలి అంజయ్య నగర్లో భార్యతో కలసి ఉంటున్న. చిన్న కొడుకు అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుండు. ఆపరేషన్ చేయించినం. మందులకు పైసలు పంపిస్తున్నం. డిగ్రీ చేసిన పెద్ద కొడుకు జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండు. – బి.శ్రీనివాస్. పాడిపల్లి, నారాయణపేట్ అడ్డా మీద గంటల తరబడి... నా కూతురు డిగ్రీ, కొడుకు పది చదువుతున్నరు. ఊర్లో కూలి పనుల్లేవ్. రెండ్నెల్ల క్రితం అంజయ్యనగర్‌కు వచ్చి భార్యతో కలసి కూలీకి వెళుతున్న. ఇద్దరికీ రోజూ కూలి దొరికితే వెయ్యి రూపాయలు వస్తయి. ఒక్కోరోజు ఒక్కరికే కూలి దొరుకుతుంది. పని కోసం అడ్డాపై నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నం. – ఉప్పరి నారాయణ. గోపన్‌పల్లి, దేవరకద్ర -
కరువు తరిమిన బతుకులు
చంద్రబాబుతో పాటే కరువూ రావడంతో చినుకు జాడ లేక..సాగు నీరందక పొలాలన్నీ బీళ్లువారుతున్నాయి. ఉన్న ఊళ్లో చేసేందుకు పనుల్లేవు. ఉపాధి హామీ పనులూ అరకొరే. మరి ఇల్లుగడిచేదెట్టా.. పొట్టచేతపట్టుకుని పెట్టా బేడా సర్దుకుని వయసుడిగిన కన్నవాళ్లను ఇళ్ల దగ్గరే వదిలి..భార్యాబిడ్డలతో సుదూర ప్రాంతాలకు వలసెళ్తున్నారు. ఇలా..ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉపాధి కల్పనలో పాలకుల నిర్లక్ష్యం పల్లె జనం పాలిట శాపమవుతోంది. సాక్షి, చీరాల: పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం ప్రాంతంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో కుటుంబ పోషణ కోసం వివిధ గ్రామాల్లో ప్రజలు పొట్ట చేత పట్టుకుని భార్యబిడ్డలతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, బోధన్, నిర్మల్, ఆర్మూర్ మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికీ సుమారు 13 నుంచి 15 వేల మంది వరకు వలసబాట పట్టారు. దీనితో గృహాల వద్ద వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాల్లో ప్రజలు కుటుంబాలను పోషించుకునేందుకు వలసలు వెళ్లారు. నాలుగేళ్లుగా కరువు పరిస్థితులు రావటం, మార్కాపురం ప్రాంతంలోని పలకల గనుల్లో పనులు లేకపోవటం, పొలాలు పండకపోవటంతో కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారింది. దీంతో ఈ ప్రాంత రైతులు ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్తున్నారు. మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం, కొట్టాలపల్లె, భూపతిపల్లె, బొడిచర్ల, బొందలపాడు, మాల్యవంతునిపాడు, పిచ్చిగుంటపల్లి, మాలపాటిపల్లె, తూర్పుపల్లి, బోడపాడు, తదితర గ్రామాల నుంచి వలసలు వెళ్లారు. అలాగే తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె, మీర్జాపేట, నాగెళ్లముడుపు, కారుమానుపల్లె, చెన్నారెడ్డిపల్లె, తర్లుపాడు, సీతానాగులవరం, కలుజువ్వలపాడు, తుమ్మలచెరువు, కొనకనమిట్ల మండలంలోని చినారికట్ల, పెదారికట్ల, గొట్లగట్టు, వింజవర్తిపాడు, మర్రిపాలెం, పొదిలి మండలంలోని నందిపాలెం, తలమళ్ల, ఇంకా పలు గ్రామాల ప్రజలు వలసలు వెళ్లారు. వీరందరూ తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే కాంట్రాక్టర్ల దగ్గర రైల్వే కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, బెంగళూరు నగరంలో వాచ్మెన్లుగా, పని మనుషులుగా పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ స్వగ్రామాల్లో ఉంటున్న తల్లిదండ్రులకు నెలకు నాలుగైదు వేల రూపాయలు పంపుతూ నాలుగైదు నెలలకు ఒకసారి వచ్చి వారిని చూసి యోగక్షేమాలు తెలుసుకుని వెళ్తుంటారు. దీంతో వారి పిల్లలు కూడా బడి మానేసి తల్లిదండ్రులతో వెళ్లిపోతున్నారు. గత ఏడాది కూడా మార్కాపురం ప్రాంతంలో వర్షాలు లేకపోవటంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. చెరువులో నీళ్లు రాక తాగునీటి సమస్య ఏర్పడింది. ప్రతి గ్రామంలో ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. ఆపదలో ఆదుకునే పాడి పరిశ్రమ కూడా గ్రాసం కొరతతో ఇబ్బందిగా మారిందని పలువురు రైతులు గేదెలను కబేళాలకు అమ్మి వలసలు పోయారు. ఇంటిని చూసుకునేందుకు వృద్ధులైన తల్లిదండ్రులను కాపలాగా ఉంచారు. మార్కాపురం ప్రాంతంలో ఎటుచూసినా చుక్క నీరు లేని చెరువులు బీడు భూములు దర్శనమిస్తున్నాయి. గతంలో పలకల పరిశ్రమ రైతులను, కూలీలను ఆదుకునేది. పలకల పరిశ్రమలో సంక్షోభం రావటంతో ఎగుమతి ఆర్డర్లు లేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. దీంతో సుమారు 5 వేల మంది కార్మికులు వీధిన పడ్డారు. వీరందరూ వలస బాట పట్టారు. మరో వైపు భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఆ రంగంలో పని చేసే సుమారు 2 వేల మంది కార్మికులు కూడా వలసలు వెళ్లారు. వలసలు తప్ప బతికే పరిస్థితి ఏదీ.. పుల్లలచెరువు మండలంలోని పుల్లలచెరువు, వెంకటరెడ్డిపల్లి, రాచకొండ, మల్లాపాలెం, అక్కపాలెం, గంగవరం గ్రామాల్లోని ప్రజలు వలస వెళ్లిక తప్పడం లేదు. ఈ ప్రాంతంలో సాగు నీరు లేక ఇక్కడ పంటలు పండకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇతర జిల్లాలకు చెరుకు నరకడానికో..లేక వరి కోతల కోసమో వెళ్తున్నారు. ఇటీవల వలస వెళ్లి వస్తున్న వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం నుంచి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేటప్పడు మాచర్ల వద్ద లారీ ప్రమాదానికి గురై చాలా మంది గాయపడ్డారు. ఇటువంటి సంఘటనలు అనేకం. మంచి నాయకుడు వచ్చి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలు సక్రమంగా జీవనం సాగించే పరిస్థితి లేదు. ‘మగ్గం’ వదిలి మట్టి పనులకు.. అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన చీరలు నేసే చేనేతల చేతులు ఇప్పుడు మట్టి పని కోసం వెంపర్లాడుతున్నాయి. కన్న బిడ్డల కడుపు నింపేందుకు సిమెంట్, ఇటుకరాళ్లు పట్టి మోసేందుకు పరుగులు పెడుతున్నాయి. మరికొందరు వంటల పని, షెడ్డుల్లో లారీ క్లీనర్ల అవతారం ఎత్తుతున్నారు. మరికొంత మంది కార్మికులు బార్లలో సర్వర్లుగానూ, పెట్రోల్ బంకుల్లో హెల్పర్లుగాను పని చేస్తున్నారు. పిల్లలను పస్తులుంచలేక.. మగ్గం పనితో అర్థాకలితో భార్య, పిల్లలను పస్తులుంచలేక చేనేత కార్మికులు బేల్దారి పనుల కోసం ఒంగోలు, బాపట్ల, కావలి, చీరాల, ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. చేనేతలు అధికంగా ఉండే చీరాల ప్రాంతంలో ఈపూరుపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు రెండు వేల మందికి పైగా చేనేత కార్మికులు మట్టి పనుల కోసం రోజూ ఒంగోలు వెళ్తున్నారు. మరికొంత మంది చీరాల, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో బేల్దారి పనులకు వెళ్తున్నారు. ఈపూరుపాలెం, తోటవారిపాలెం నుంచే వెయ్యి మంది వరకు బేల్దారి పనులకు వెళ్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకే చీరాల రైల్వేస్టేషన్లో చేతిలో క్యారియర్ పట్టుకొని వందలాది మంది చేనేత కార్మికులు పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు వెళ్లేందుకు వేచి ఉంటారు. ఈపూరుపాలెం, జాండ్రపేట, వేటపాలెం స్టేషన్లలో కూడా పాసింజర్ రైళ్లు మట్టి పనికి వెళ్లే కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి. పొట్టచేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు.. కనిగిరి నియోజకవర్గంలోనూ వలస జీవులు ఎక్కువే. నియోజకవర్గం నుంచి ఏటా దాదాపు పది వేల మందికిపైగా వలస వెళ్తుంటారు. ఎక్కువగా పీసీపల్లి మండలం అలవలపాడు, వడ్డెరపాలెం, ఇర్లపాడు, సీఎస్‌పురం మండలం అయ్యవారిపల్లి, పెదరాజుపాలెం, డీజీపేట, అంబవరం, చెన్నపనాయునిపల్లి, కె.అగ్రహారం, సీఎస్‌పురం, వడ్డెపాలెం, అయ్యలూరివారిపల్లి, హెచ్‌ఎంపాడు మండలంలోని కొత్తూరు, పాపిరెడ్డిపల్లి, ఉమ్మనపల్లి, మహమ్మదాపురం, రామాయపల్లి, వెలిగండ్ల మండలంలోని మోటుపల్లి, ఇమ్మడిచెరువు, గణేశుని కండ్రిక, రాళ్లపల్లి, పామూరు మండలంలో కంభాలదిన్నె, పామూరు పట్టణం, గోపాలపురం, వగ్గంపల్లి, బోడవాడ, కనిగిరి మండలం వాగుపల్లి, చిన ఇర్లపాడు, వడ్డెపాలెం గ్రామాల నుంచి వలస వెళ్తుంటారు. సీఎస్‌పురం మండలం వాళ్లు బెంగళూరు, పూణె, చెన్నై తదితర నగరాలకు వలస వెళ్లి..బేల్దారి పనులు, చిన్నచిన్న హోటళ్లు నిర్వహించుకుంటుంటారు. మిగిలిన మండలాల వాళ్లు తెలంగాణ జిల్లాలకు వలస వెళ్లి మట్టి పనులు, బేల్దారి పనులు చేస్తుంటారు. -
వలసలు బాధించాయి..
‘తెలంగాణ జిల్లాల నుంచి మొదటగా గుజరాత్, మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేసేవారు. ఆ తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్లడం ప్రారంభమైంది. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావనతో వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది’ అని త్రిలోక్ చందన్‌గౌడ్ చెప్పారు. ఆయన ‘గల్ఫ్ వలస కార్మికుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు’ అంశంపై పరిశోధనలను చేసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2017లో ఈయన పరిశోధన ముగిసింది. గల్ఫ్ వలస కార్మికులపై పరిశోధనలను నిర్వహించిన తొలి రిసెర్చ్ స్కాలర్‌గా గుర్తింపు పొందిన త్రిలోక్ చందన్‌గౌడ్ అనుభవాలు ఆయన మాటల్లోనే... – ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ మా స్వస్థలం సంగారెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎంఏ సోషియాలజీ, ఎంఫిల్ చేశాను. పీహెచ్‌డీలో ఏ సామాజిక అంశం ఎంచుకోవాలనే విషయంలో కొంత ఆలోచించాను. అంతకుముందు ఉన్నత చదువులలో భాగంగా కొన్ని సదస్సులలో పాల్గొన్నాను. ఆ సెమినార్లలో గల్ఫ్ వలస కార్మికుల ఆంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ చర్చల సందర్భంగా కార్మికుల కష్టాలు తెలుసుకున్న నాకు కన్నీళ్లు వచ్చాయి. మా ప్రాంతంలో గల్ఫ్ వలసలు లేనప్పటికీ ఆ అంశంపై పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస ఎందుకు వెళ్తున్నారు, వలస కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగయ్యాయా అనే ఆంశంపై పరిశోధన చేయడం వల్ల వలస జీవులకు కొంతైనా ప్రయోజనం కలుగుతుందని భావించాను. అంతేకాక గల్ఫ్ వలసలపై ఇంత వరకు పరిశోధనలు జరగలేదు. నా ద్వారానే పరి శోధనలు మొదలు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా పరిశోధనలకు అనేక మంది ప్రోత్సాహాన్ని అందించారు. పలు అంశాలపై పరిశోధన గల్ఫ్ కంటే ముందు అనేక మంది పొరుగు రాష్ట్రాల్లోని బట్టల మిల్లుల్లో ఉపాధి పొందడానికి వెళ్లేవారు. 1960–70 మధ్య కాలంలో వలసలు మొదలయ్యాయి. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి మొదట సూరత్, గుజరాత్, భీవండి, ముంబై తదితర ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో పనిచేయడానికి కార్మికులు వలస వెళ్లేవారు. తెలంగాణలో వ్యవసాయం ప్రధాన వృత్తి అయినా.. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావన, ఇతర కారణాల వల్ల వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది. అలాగే కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావం అధికం కావడంతో గ్రామాల్లో యువకులను నక్సల్స్ అనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేసే వారు. దీంతో యువకులు పోలీసు దాడుల నుంచి తప్పించుకోవడానికి ముంబైకి.. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పయనమయ్యారు. అప్పట్లో గల్ఫ్ దేశాల్లో చమురు తవ్వకాలకు తోడు భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి కార్మికులు ఎంతో మంది అవసరం అయ్యారు. ముంబై కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. చమురు తవ్వకాలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారికి గల్ఫ్ దేశాల్లో ఎక్కువ వేతనం లభించడంతో వలసలు క్రమంగా పెరిగాయి. ఈ వలసలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశాను. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా వలసలు ఉన్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి పురుషుల వలసలు ఎక్కువగా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మహిళలు అరబ్‌షేక్‌ల ఇళ్లలో పనిచేయడానికి వెళ్తున్నారు. ఈ అంశాలపై లోతుగా పరిశోధన చేశాను. గల్ఫ్ దేశాల్లో వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఆంశంపై అధ్యయనం చేశాను. రీసెర్చిలో భాగంగా ఆ దేశాల్లో పర్యటించి కార్మికులను కలుసుకున్నాను. కార్మికుల ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి, పనికి తగ్గ వేతనం, సామాజిక భద్రత తదితర అంశాలపై ఐదేళ్ల పాటు పరిశోధన నిర్వహించా. గల్ఫ్ వలసలపై పరిశోధనలు నిర్వహించిన అనుభవంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిర్వహించిన సెమి నార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను. తాజాగా 2018 మార్చిలో నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ప్రవాసీ సంక్షేమ వేదిక తరఫున హాజరయ్యాను. ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన ముసాయిదాపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను వినిపించాను. అలాగే ఢిల్లీ, గుజ్రాత్, కేరళ, తమిళనాడు, మహా రాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వలస కార్మికుల అంశాలపై నిర్వహించిన సెమినార్లలో పాల్గొని వలస కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కార్మికుల పక్షాన డిమాండ్లను వినిపించాను. పరిశోధనలు కొనసాగిస్తున్నా.. గల్ఫ్ వలస కార్మికుల ఆంశంపై పీహెచ్డీ పూర్తిచేసినా ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టు డాక్టర్ ఫెల్లోషిప్ పొందుతున్నాను. సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడానికి మా పరిశోధనలు దోహదపడతాయని ఆశిస్తున్నాం. -
సంస్కృతుల సమ్మిళితం...
కన్నడిగుల సౌ‘భాగ్య’నగరం నిజాంల కాలంలోనే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్పోర్ట్, వస్త్ర, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 1972లో భారీ వలసలు... కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్సుఖ్నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. శాకాహారం... శైవాచారం... కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రత్యేక పండుగ ‘యాడమాస్’ ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగలను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లలో తలపాగా... కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. - పిల్లి రాంచందర్ కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి. - నాగ్నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్ -
వలస జీవుల తంటాలు
మోర్తాడ్:మోర్తాడ్ మండలం తొర్తికి చెందిన పోచయ్య ఉపాధి కోసం ముంబాయిలో ఉంటున్నాడు. సమగ్ర సర్వే కోసం రెండు రోజుల కింద స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే, స్థానికంగా నివాసం ఉండటం లేదం టూ ఆయన వివరాలు సేకరించడానికి ఎన్యూమరేటర్లు స్పష్టం చేశారు. దోంచందకు చెందిన సంజీవ్‌కుమార్ ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తూ నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సర్వేలో వివరాలను న మోదు చేయించుకునేందుకు కుటుంబం సహా స్వగ్రామానికి వచ్చారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉంటున్న వా రి వివరాలు సేకరించడానికి తమకు ఇబ్బంది లేదని, నిజామాబాద్‌లో ఉంటున్నవారి వివరాలను మాత్రం ఇక్కడ సేకరించమని సర్వే బృందం తేల్చి చెప్పింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలా మంది నిరాశకు గురయ్యారు. ఎవరూ పట్టించుకోక సర్వే కోసం ఎన్నో తంటాలు పడుతూ స్వగ్రామాలకు చేరుకున్నవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వా రి కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఉన్న ఊరిలో ఉపాధి లేక ముంబాయి, పూణే, భీవండితోపాటు ఇతర పట్టణాలకు వలస వెళ్లిన తెలంగాణవాసులు సర్వే కోసం సొంత ఊళ్లకు వస్తే వివరాలను న మోదు చేయక పోవడంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం చో టు చేసుకుంది. తమ వివరాలను నమోదు చేయడం లేదంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం లే కపోయింది. అందుబాటులో ఉన్న అధికారులకు ఫో న్ చేస్తే వారు విసుక్కున్నారు. కొందరు అధికారులు తమ సెల్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో జనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్టిక్కర్ల గొడవ సర్వే నిర్వహించడానికి గుర్తింపు కోసం స్టిక్కర్లను అతికించారు. కొన్ని ఇళ్లకు అతికించలేదు. స్టిక్కర్లతో సంబంధం లేకుండా సర్వే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా, స్టిక్కర్లు లేని కారణంగా ఎన్నో ఇళ్లలో కుటుంబ సభ్యుల వివరాలను సర్వే బృందం నమోదు చేయలేదు. స్టిక్కర్లు అతికించిన రోజున సిబ్బంది నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే సర్వే రోజున వివరాలను సేకరించారు. సర్వే విధివిధానాలు అర్థం కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సర్వేపై ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రచారం చేసినా సర్వేలోని ఆంశాలు, వివరాలు సేకరించిన తీరుతో జనంలో అపోహలు మరింత ఎక్కువయ్యాయి. -
వలస జీవులకు ‘సర్వే’ దెబ్బ
కుల్కచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కుటుంబ సమగ్ర సర్వే’ నియోజకవర్గంలోని వలస జీవులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. ఎక్కడున్నా సరే ఈ నెల 19న జరిగే సర్వేకు హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. వీటి ఆధారంగానే రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్ తదితర సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉపాధి లేక పనుల కోసం ముంబయి, పూణే ,షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు , దుబాయి,ఉగాండా దేశాలకు ఎంతోమంది వలసలు పోయారు. వీరందరూ తిరిగి రావాలంటే ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల,గండేడ్,దోమ,పూడూరు,పరిగి మండలాల నుంచి 40 శాతం ప్రజలు వలసలోనే ఉన్నారు. కుటుంబంలో ఒక్కరైతే రావచ్చుగాని కుటుంబమంతా అంటే చాల కష్టమని వారు వాపోతున్నారు. ఒక్క రోజు మాత్రమే సెలవు కుటుంబ సమగ్ర సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం 19న ఒక్క రోజును మాత్రమే సెలవుదినంగా ప్రకటించిం ది. అయితే పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు 18న విధులు నిర్వహించుకొని అదే రోజు గ్రామాలకు రావాలంటే చాలా ఇబ్బంది. 19న రావాలంటే ఆ రోజు రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వమే వాడుకుంటుంది. ప్రైవేటు వాహనాలను కూడా ప్రభుత్వం వాడుకుంటుంది. దీంతో సర్వేకు రావాలనుకునేవారికి రవాణా కూడా సమస్యగానే మారనుంది.