టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు | Taro from December 11 to December 17 2016 to | Sakshi
Sakshi News home page

టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు

Published Sat, Dec 10 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు

టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు

 మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
 ఈవారమంతా చాలా సానుకూలంగా ఉంటుంది. విజయవంతంగా గడుస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీ కోరికలను నెరవేర్చుకుంటారు. భావోద్వేగాలపరంగా చాలా బలంగా ఉంటారు.
 కలిసొచ్చే రంగు: నారింజ
 
 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
 ఈవారం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, వారిని సంతోషపెడతారు. మీరు కూడా అందంగా, ఆనందంగా కనిపిస్తారు. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది కానీ, మరికొంచెం జాగ్రత్త అవసరం. మీ ప్రాధాన్యతాక్రమాలను మార్చుకోవాల్సి ఉంటుంది.
 కలిసొచ్చే రంగు: ఆకాశనీలం  
 
 మిథునం (మే 21 - జూన్ 20)
 అదృష్టం, ఆర్థికభద్రత మీ వెన్నంటే ఉంటాయి. మీ స్వీయశక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకోవలసిన తరుణం ఇది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. చాలాకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య తొలగిపోతుంది. పరిష్కృతమవుతుంది. దాంతో ఒకవిధమైన నిశ్చింతతో ఉంటారు. మీ చిక్కులను మీరే నేర్పుగా పరిష్కరించుకుంటారు.
 కలిసొచ్చే రంగు: గోధుమరంగు
 
 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
 మీరు అసాధ్యాలుగా భావించినవన్నీ సుసాధ్యాలవుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గరకొచ్చేసినట్లే! మీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించవద్దు, ఇతరుల వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు. బంధుత్వమంటే మీకు ఎంత ఇష్టమైనప్పటికీ, మీకు ఇష్టమైన వారితో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఆందోళన వద్దు. మీకు మంచే జరుగుతుంది.
  కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు
 
 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
 శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. విందు వినోదాలలో, విహార యాత్రలలో సేదదీరడం వల్ల మీరు పునరుత్సాహం పొందుతారు. మనసు మాట వినండి. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోండి. మీ ప్రతిభ, సామర్థ్యాలు మీకు విలువని తెచ్చిపెట్టవచ్చు కానీ, సామాజిక సంబంధాలూ అవసరమే అని గ్రహించండి. పనిలో కొత్త ప్రయోగాలు మంచిది కాదు.
 కలిసొచ్చేరంగు: నారింజ
 
 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
 మీ సృజనాత్మకతే మీకు శ్రీరామ రక్ష. పెద్దవాళ్ల నుంచి మీకో మంచి వార్త అందుతుంది. అది మీ కెరీర్‌నే మలుపు తిప్పుతుంది. సామాజిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటారు. అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామికీ మీకూ అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్త అవసరం. సమస్యలు మిమ్మల్ని నీరు గార్చేందుకు కాదు, మీకు పాఠాలు చెప్పేందుకే అని గ్రహించండి.
 కలిసొచ్చే రంగు: తెలుపు
 
 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
 కలిగిన ప్రతికోరికనూ తీర్చుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించండి. మీ జీవితాశయం నెరవేరేందుకు చాలా సమయం పడుతుందని నిరాశ పడవద్దు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండాలి.. అవిశ్రాంతంగా పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త ఉద్యోగాలు, వృత్తి, వ్యాపకాలకు ఇది తగిన సమయం.
 కలిసొచ్చే రంగు: నీలం
 
 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
 మీరు కోరుకున్నవాటిని పొందడానికి, మీ మనసులోని కోరికలను, భావాలను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం. మీ బంధంలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. అలాగే సంతోషం కూడా. మీ దైనందిన వ్యవహారాలతో తీరికలేకుండా గడుపుతారు. మీ వృత్తి, వ్యాపకాలలోకి బంధుమిత్రులు, స్నేహితులను తీసుకు వస్తారు లేదా వారి పనులలో మీరు పాలుపంచుకుంటారు.
 కలిసొచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు
 
 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
 సంసిద్ధంగా లేకపోవడం వల్ల అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. జరిగిన దాని గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మితిమీరకుండా చూసుకోవడం మంచిది. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి. మీ సానుకూల దృక్పథమే మీకు మేలు చేస్తుంది. చిన్ననాటి స్నేహితుల రాక ఊరట కలిగిస్తుంది.
 కలిసొచ్చే రంగు: వెండిరంగు
 
 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
 నూత్న గృహం లేదా వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మనసు చెప్పిన మాట వినండి. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు.
 కలిసొచ్చే రంగు: ఊదా
 
 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
 మీరు గీసుకున్న గిరి నుంచి బయట పడటం మేలు చేస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరిగే కొన్ని సంఘటనలు జరగవచ్చు. సృజనాత్మకంగా పని చేసి, మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచన అవసరం. ప్రేమ వ్యవహారాలో కొంత నిరాశ కలగవచ్చు. అనుకోని తగాదాలు, వ్యవహారాలలో వేలు పెట్టవలసి రావడం ఇబ్బంది కలిగించవచ్చు.
 కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
 జాగ్రత్త, మెలకువ అవసరం. కొత్త ఆలోచనలను సృజనాత్మకంగా అమలు చేసి, మంచి ఫలితాలు, ప్రశంసలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఉపకరిస్తుంది. భార్య లేదా భార్య తరఫు బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు.
 కలిసొచ్చే రంగు: కాఫీ పొడి రంగు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement