వారఫలాలు | Varafalalu in this week 09 dec 2018 | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Dec 9 2018 2:12 AM | Last Updated on Sun, Dec 9 2018 2:12 AM

Varafalalu in this week 09 dec 2018 - Sakshi

9 డిసెంబర్‌ నుంచి 15 డిసెంబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు,  ఇంక్రిమెంట్లు. రాజకీయ,కళారంగాల వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి సాఫీగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కారవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. దూరపు బం«ధువులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  చికాకులు తొలగుతాయి, కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  ఉన్నతహోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన ముఖ్య పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వాహనయోగం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, నేరేడురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పూర్వపు మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. అందర్నీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు.  ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలించే సమయం. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో పురోగతి, ఆశించిన లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు, విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి కాగలవు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన,గృహయోగాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.  వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  చివరిలో అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో విభేదాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. గులాబీ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
విఖ్యాంతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సా«ధిస్తారు. ఇంటిలో శుభకార్యాల సందడి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
భవిష్యత్‌పై ఆశలు చిగురిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి, కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (9 డిసెంబర్‌ నుంచి  15 డిసెంబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఊహాలోకంలో విహరిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవడంతో కొంత చిరాకు పడతారు. ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. కుటుంబ వ్యాపారాలకు బాసటగా నిలుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ధైర్య సాహసాలతో అవరోధాలను అధిగమిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. కళారంగంలోని వారు సత్కారాలు పొందుతారు.
లక్కీ కలర్‌: ఎరుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఆనందభరితంగా ఉంటారు. కొత్త మిత్రులు ఏర్పడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పని ఒత్తిడి నుంచి కొంత విరామం దొరుకుతుంది. కొత్త ఆలోచనలతో సొంత వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని భావిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లను అధిగమించాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొన్ని మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆలోచనా సరళిని మార్చుకుంటారు. సానుకూల దృక్పథాన్ని మరింతగా పెంచుకుంటారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ప్రత్యర్థులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. చిరకాల స్వప్నాల్లో ఒకటి సాకారమవుతుంది.
లక్కీ కలర్‌: మీగడ రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
దివ్యమైన కాలం. దివ్యత్వం మిమ్మల్ని ఆవరించుకుని ఉంటుంది. ఈ దివ్యత్వం మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. నిరాడంబరతతోనే జనాలను ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు కొంత మనస్తాపం కలిగించే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి ప్రాధాన్యమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సుదూర విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. బంధం విడిపోకుండా ఉండాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: పసుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
సృజనాత్మక కళారంగాల్లోని వారికి అద్భుతమైన కాలం. కళాకారులకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక ఫలితాలు దక్కే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి కొత్త అవకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు చదువుపై మరింతగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏకాగ్రత కోసం ధ్యానాన్ని ఆశ్రయించడం వల్ల ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకుంటారు. కొన్ని పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆర్థిక లాభాలాను మదింపు వేసుకుంటారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు తలపెడతారు. మనసైన వ్యక్తితో ప్రేమలో పడతారు. నిస్సహాయులైన వృద్ధులకు చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. వైఖరిలో సానుకూలతను పెంచుకుంటనే ఆశించిన విజయాలను సాధించగలరు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. సవాళ్లను స్వీకరిస్తారు. కీలకమైన సమస్యల పరిష్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధనపై దృష్టి సారిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జోడీ దొరికే సూచనలు ఉన్నాయి. బంధువులను ఆదుకుంటారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వినోదభరితంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరకాలంగా కలుసుకోని బాల్య మిత్రులను కలుసుకుంటారు. మధురమైన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభించే ముందు పెద్దల ఆశీస్సులు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి స్థానచలనం ఉండవచ్చు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. అసాధ్యమనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించి సహచరులను ఆశ్చర్యానికి లోను చేస్తారు.
లక్కీ కలర్‌: నలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సహనాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని సహచరులతో స్పర్థలకు, వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇబ్బందికరమైన వ్యక్తుల కారణంగా సహనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. పని ఒత్తిడి కారణంగా అలసటకు లోనవుతారు. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముక్కుసూటి ధోరణి వల్ల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ధ్యానమార్గం ద్వారా సాంత్వన పొందగలరు.
లక్కీ కలర్‌: వెండిరంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కుటుంబంలో సంతోషపూరితమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు తలపెడతారు. మనసుకు నచ్చిన మిత్రుల సమక్షాన్ని ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. కొందరికి పదోన్నతులు దక్కవచ్చు. జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రేమించిన భాగస్వామితో పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు పెద్దల ఆమోదం లభిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వస్త్రాలంకరణ, కేశాలంకరణలపై దృష్టి పెంచుతారు.
లక్కీ కలర్‌: గులాబి

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అనే నానుడి మీ ప్రస్తుత పరిస్థితికి చక్కగా వర్తిస్తుంది. లక్ష్య సాధన కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు రహస్యంగా మీపై కుతంత్రాలకు పాల్పడే సూచనలు ఉన్నాయి. దైవబలం అనుకూలంగా ఉన్నందున భయపడాల్సిన పని లేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రియతముల వద్ద మనసులోని మాటను బయటపెడతారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఏకాగ్రత లోపిస్తుంది. నిరాసక్తత ఆవరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం క్షేమం. కీలకమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు, వాటిని మీ పై అధికారులకు పంపే ముందు ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవడం మంచిది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది. కుటుంబ పరిస్థితులు కొంత అశాంతిని కలిగిస్తాయి. ఆత్మవిమర్శ చేసుకుంటారు. జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
లక్కీ కలర్‌: లేతనీలం
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement