వారఫలాలు | Varaphalalu in this week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Aug 26 2018 3:46 AM | Last Updated on Sun, Aug 26 2018 3:46 AM

Varaphalalu in this week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పట్టింది బంగారమా అన్నట్లుగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. చిరకాల ప్రత్యర్థులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపట్ల మరింత ఆప్యాయత చూపుతారు. గతం నుంచి వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఓర్పు, నేర్పుతో వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత లబ్ధి చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. కళారంగం వారి యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ముఖ్య నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. విద్యార్థులు నిరాశ చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి ఉద్యోగాలలో అనుకోని మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాల యత్నాలలో ఆటంకాలు. వారం చివరిలో శుభవార్తలు. ధనలాభం. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఇంటాబయటా వ్యతిరేకత పెరుగుతుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలించవు. వారం ప్రారంభంలో ఆస్తిలాభం. విందువినోదాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రావచ్చు. రాజకీయవర్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వార ం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాల కోసం అన్వేషణ. బంధువులతో విభేదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో చికాకులు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో విందువినోదాలు. వస్తు, వస్త్రలాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మీది ఫలితం మరొకదిగా ఉంటుంది. నిర్ణయాలలో కాస్త నిదానం పాటించండి. జీవిత భాగస్వామితో విభేదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఇతరుల విషయాయలలో జోక్యం వద్దు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వేడుకల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులలో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు అంగీకరించరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ నిర్మాణాలలో ఆటంకాలు. విద్యార్థులకు ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. విలువైన డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, మార్పులు. కళారంగం వారికి ప్రయత్నాలు అనుకూలించవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు పడుతుంది. జీవిత భాగస్వామి నుంచి కొంత లాభం చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అవి కొంచెం మిమ్మల్ని చిరాకు పరుస్తుంటాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు

టారో (26 ఆగస్టు నుంచి 1 సెప్టెంబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ధ్యానంతో ఊరట పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ: ముదురు గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు. గడచిన సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విజయాలకు కారకులు మీరే అయినా, ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలనుకుంటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడికి, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వ్యాయామం కొనసాగిస్తారు. వైద్యుల సలహాతో ఆహార అలవాట్లలో మార్పులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఇంటా బయటా వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. ఒక కఠోర వాస్తవం మీ కలల సౌధాన్ని కుప్పకూల్చేసే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్లుగానో నిలుపుకున్న ఆశలు చెల్లాచెదురు కావడంతో బాగా కలత చెందుతారు. వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు. శక్తులు కూడదీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలసివస్తాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులు తలపెడతారు. సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. నాయకత్వ పాత్రలో మీ దార్శనికత ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పథకాలను ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు. పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రియతములతో విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వ్యక్తిగత అంశాలు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి. మరింత క్రియాశీలంగా ఆలోచిస్తారు. ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నీలం

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు. భయాన్ని పూర్తిగా జయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు. విజయాలు సాధిస్తారు. పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఇతరులు మీ సలహాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని విహార యాత్రలకు వెళతారు. దేవాలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు


- ఇన్సియా ,టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement