భూతాపోన్నతి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం కొత్త కొత్త ఇంధనాల వేటలో పడింది. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఏ ముడిసరుకు నుంచైనా ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఆహారపు వ్యర్థాలతోపాటు తడిచెత్త (పంది వ్యర్థం తదితరాలు)లతో డీజిల్ లాంటి ఇంధనం తయారు చేయడంలో విజయం సాధించారు. సాధారణ డీజిల్‌కు ఈ కొత్త ఇంధనాన్ని కలుపుకుంటే సామర్థ్యం పెరగడంతోపాటు కాలుష్యమూ తగ్గుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న బ్రజేంద్ర శర్మ అనే శాస్త్రవేత్త తెలిపారు.
అమెరికాలో ఏటా దాదాపు 8 కోట్ల టన్నుల తడిచెత్త వృథా అవుతుంటుందని ఇందులో ఏ కొంచెం ఇంధనంగా మారినా ఎంతో ప్రయోజనం ఉంటుందని బ్రజేంద్ర వివరించారు. పది నుంచి 20 శాతం ఇంధనాన్ని డీజిల్‌లో కలిపితే చాలు శక్తి ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం తాము ఓ నమూనా యంత్రాన్ని తయారు చేశామని, ఒక టన్ను తడిచెత్తతో 30 గ్యాలన్ల బయోక్రూడ్ ఆయిల్ తయారు చేయవచ్చునని, వాహానలపై కూడా బిగించుకోగల మోడల్ ప్లాంట్ తయారీ కూడా సాధ్యమని వివరించారు.
తడిచెత్తతో కొత్త ఇంధనం...
Published Thu, Dec 6 2018 12:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment