
ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిదే!
మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అవలక్షణంగా పరిగణిస్తాం.
పరిపరి శోధన
మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అవలక్షణంగా పరిగణిస్తాం. అలాంటి లక్షణం ఉన్నవారికి కాస్త దూరంగా మెలగుతాం. వారిపై రకరకాల వ్యాఖ్యానాలూ చేస్తుంటాం. అయితే, ఆత్మవిశ్వాసం కాస్త మితిమీరితే మరేం ఫర్వాలేదని, అలాంటి వారే కార్యసాధకులు కాగలరని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు.
అన్నీ తమకే తెలుసునంటూ అందరి వద్దా ప్రగల్భాలు పలికేవారిని తీసిపారేయడం తగదని అంటున్నారు. అలాంటి వాళ్లలో దూసుకుపోయే లక్షణం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఏ రంగంలోనైనా అలాంటి వాళ్లు కార్యసాధకులుగా నిలవగలరని తమ అధ్యయనంలో తేలిందని పెన్సిల్వేనియాలోని ఫ్రాంక్లిన్ అండ్ మార్షల్ కాలేజీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.