ఒక లడ్డూ బాబు విజయగాథ!
విజేత
ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను.
‘‘నా బరువు ఎనభై కిలోలా?’’ అనుకున్నాను...ఆందోళన పడ్డాను. మరిచిపోయాను.
కొంతకాలానికి...
‘‘నా బరువు తొంబై కిలోలా?’’ అనుకున్నాను...మరికొంత ఆందోళన పడ్డాను. మళ్లీ మరిచిపోయాను.
మరి కొంత కాలానికి...
‘‘నా బరువు 108 కిలోలా?’’ ఆవేదన పడ్డాను...అమ్మోఅనుకున్నాను. మరచిపోలేక పోయాను.
‘‘నన్ను నా పేరుతో కాకుండా నిక్ నేమ్‌లతో వెక్కిరించే కాలం వచ్చింది’’ అని వణికి పోయాను.
ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను.
ఆటలు ఆడమని ఒకరు సలహా ఇచ్చారు. హమ్మయ్యా...నాకు క్రికెట్ ఆడడం వచ్చు. చాలా రోజుల తరువాత ప్లే గ్రౌండ్‌లోకి దిగాను.
‘‘ఈత కొట్టి చూడు..’’ అని మరొకరు సలహా ఇచ్చారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగాను. ఏదో కొత్త శక్తి వచ్చి చేరినట్లు అనిపించేది. ఒత్తిడిని చేత్తో తీసేసినట్లు హాయిగా ఉండేది. మా అమ్మ ప్రాణాయమం గురించి చెప్పారు. ఆ దారిలో కూడా వెళ్లాను. ఆరోగ్యవంతమైన శరీరానికి అది ఎంత అవసరమో తెలిసింది.
బరువుతో ఉన్నప్పుడు తీయించుకున్న నా ఫొటో ఎప్పుడూ నా పర్స్‌లో ఉండేది. రోజూ పడుకునే ముందు ఆ ఫోటోని చూస్తూ పడుకునేవాడిని. అలా బరువు తగ్గాలనే పట్టుదల పెరిగింది. ఇప్పుడు నా బరువు 70 కిలోలు!
- సాహిల్ ర్యాలీ, మోడల్