play ground
-
ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!
ప్రపంచంలోని చిన్నారుల క్రీడా మైదానాల్లో ఇదే అతిపెద్దది. బ్రిటన్‌లో ఆనిక్ పట్టణంలోని ఆనిక్ గార్డెన్లో ఉన్న ఈ మైదానం పేరు లిలిడోరీ. ఆనిక్ కోటను ఆనుకుని ఉన్న 1300 హెక్టార్ల స్థలంలో ఆనిక్ గార్డెన్‌ను, అందులోని క్రీడామైదానాన్ని నార్తంబర్లండ్ తొలి డ్యూక్ హఫ్ పెర్సీ 1750 సంవత్సరంలో ప్రారంభించారు. ఇందులో పిల్లల వినోదానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, జారుడుబండలు, రోలర్కోస్టర్లు, చరిత్రను ప్రతిబింబించే ముప్పయి కలప ఇళ్లు, ప్రాచీన పురాణ పాత్రల శిల్పాలు వంటి ఆకర్షణలే కాకుండా, పిల్లలకు ప్రత్యేకంగా కథలు చెప్పుకొనే చోటు కూడా ఉండటం విశేషం. (చదవండి: -
ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలు.. ఆలోచన బాగుందన్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఫ్లై ఓవర్ల కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచడం, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే నవీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఆలోచించి.. ఫ్లైఓవర్ కింద బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధనుంజయ్ అనే యువకుడు ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఇది అద్భుతమైన ఆలోచన.. నవీ ముంబైలో ఫ్లై ఓవర్ల కింద ఆట స్థలాలను నిర్మించినట్లు అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ పట్టణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అని అతడు ట్వీట్ చేశాడు ఈ ట్వీట్‌పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది మంచి ఆలోచన అని మంత్రి సైతం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి తరహా క్రీడా వేదికలను అందుబాటులోకి తీసుకురావొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. Let’s get this done in a few places in Hyderabad @arvindkumar_ias Looks like a nice idea https://t.co/o0CVTaYxqb — KTR (@KTRBRS) March 27, 2023 -
పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా శారదా విద్యాలయ క్రీడా మైదానం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న శారదా విద్యాలయలో ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో విశిష్ట వ్యక్తులు పాల్గొంటూ.. విద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం (జనవరి 31) జరిగిన వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా.. తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గౌరవ అతిథిగా పాల్గొని, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఐదు నెట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు, అథ్లెటిక్స్ కొరకు ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు శ్రీ మైనేని పాల్గొన్నారు. వీరితో పాటు శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ శ్రీ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు. కాగా, నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో వై సత్యనారాయణ గారు 1922లో శారదా విద్యాలయ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను నాటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 1450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శారదా విద్యాలయకు 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
Viral Video: అలా కాదు ఇలా.. ఇలా జారాలి.. జర్రుమని..
పిల్లల్ని ఆటస్థలంలో వదిలేస్తే వాళ్ల ఆటలకి హద్దే ఉండదు. ఎగరడాలు, దూకడాలు, జారడాలు.. ఒకటేమిటి అన్నీ చేస్తారు. అయితే పిల్లలే కాదు మాకు ఆటలంటే సరదానే అని ఒక ఎలుగుబంటి దానిపిల్ల ఆడి మరీ నిరూపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అవి ఎలా ఆడుకున్నాయో మీరే చూడండి. ఈ వీడియోలో అమ్మ ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి ఎలా వచ్చాయోగానీ స్కూల్ ప్లే గ్రౌండ్లోకి రావడం కనిపిస్తుంది. వాటికి అక్కడి ఆట స్థలంలో స్లైడ్ కనిపించింది. ఇంకేముంది. తల్లి ఎలుగుబంటి ఎక్కి కూర్చుంది. పాపం ఎలుగుబంటి పిల్లకు మాత్రం ఏం చేయాలో ఎలా ఆడాలో తెలియక తికమక పడిపోతూ అటూఇటూ తిరుగుతుంటే పైన కూర్చున్న అమ్మ ఎలుగుబంటి పెద్ద స్లైడ్‌లో నుంచి సర్రుమని జారి కిందికి వచ్చింది. ఇదిగో ఇలా జారాలని చెప్పినట్టు పిల్ల ఎలుగుబంటికి అర్థమైంది. వెంటనే తను కూడా చిన్న స్లైడ్‌లో నుంచి జారి కిందికి వచ్చింది. ఇక తల్లి పిల్ల ఒకదానిపై ఒకటి పడి సరదాగా ఆడుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీనిని నార్త్ కరొలినాలోని ఇస్సాక్ డెక్సన్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ బెట్సీ స్టాక్ స్లేగర్ ఫేస్ బుక్‌లో ‘దిస్ మేడ్ మై డే - ప్లే గ్రౌండ్ ఎట్ స్కూల్.. వాచ్ ది హోల్ థింగ్!! క్యప్షన్‌తో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో విపరీతంగా షేర్ కావడమేకాకుండా వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ కొంటె ఎలుగుబంట్లను ప్రేమిస్తున్నానని ఒకరు, ఇవి రెండూ సరదాగా ఆడుకుంటున్న దృశ్యం చూడటానికి చాలా బాగుందని మరొకరు కామెంట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. -
గ్రేటర్ ఆస్తులు అన్యాక్రాంతం
సాక్షి, సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పిల్లలు ఆడుకునేందుకు తగినన్ని ఆటస్థలాలు లేవు. బస్తీల్లోని పేదలు చిన్నపాటి వేడుకలు చేసుకునేందుకు వారు భరించగలిగే స్థితిలో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు లేవు. అలాంటి వారికి ఉపశమనం కలిగించేవి జీహెచ్ఎంసీకి చెందిన కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాలు మాత్రమే. ఇప్పుడు అవి కూడా పరాయి చేతుల్లోకి పోయాయి. జీహెచ్ఎంసీ చేపట్టిన ఫంక్షన్‌హాళ్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన కమ్యూనిటీ హాళ్లు, ఆటస్థలాలను పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, మహిళలకు స్వీయ రక్షణ, ఆర్థిక అవకాశాలు, తదితర పేర్లతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇలా శేరిలింగంపల్లి జోన్లో ఒక కమ్యూనిటీ హాల్‌ను, ఒక ప్లేగ్రౌండ్‌ను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. జోన్‌లోని ఓల్డ్ ఎంఐజీ వివేకానంద ప్లేగ్రౌండ్‌లోని కమ్యూనిటీ హాల్‌ను బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ హెడ్ హెల్డ్ హైఫౌండేషన్(హెచ్హెచ్హెచ్ఎఫ్)కుఅప్పగించాలని నిర్ణయించారు. నిరక్షరాస్యులు, తక్కువ విద్యార్హతలున్న యువతకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు, వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు ఏడాదిపాటు ఈ కమ్యూనిటీ హాల్‌ను తమకు ఇవ్వాల్సిందిగా సదరు సంస్థ కోరింది. ఆర్నెళ్లకు ఒక బ్యాచ్ వంతున రెండు బ్యాచ్‌లకు ఏడాది పాటు శిక్షణ కోర్సులు నిర్వహించడమే కాక, వారికి ఉద్యోగాలొచ్చేందుకు కూడా సహకరిస్తామని, ఇప్పటికే తమకు ఎన్నో సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నాయని పేర్కొనడంతో దానికి కమ్యూనిటీ హాల్‌ను ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యువత, మహిళలకు ఉపాధి పేరుతో.. మరో సంస్థ.. ఇంకా పేరు ఆమోదం పొందకుండానే గోపన్‌పల్లి ప్లేగ్రౌండ్‌ను, మహిళా భవన్‌ను వినియోగించుకోవడానికి జీహెచ్ఎంసీని కోరింది. జైభారతి(ఉమెన్ బైక్స్) అనే సంస్థ వాహిని అసోసియేట్స్ పేరిట దీన్ని ఇవ్వాలని కోరింది. వాహిని అసోసియేట్ అనే ఈ పేరు ఇంకా ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంటూనే ప్లేగ్రౌండ్‌లో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ, స్పోర్ట్స్ శిక్షణ ఇస్తామని పేర్కొంది. తద్వారా మహిళలు ఆర్థిక స్వతంత్రాన్ని పొందడమేకాక ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని విజ్ఞప్తి చేయడంతో దానికి ఇచ్చేందుకు ఓకే చేశారు. శిక్షణ అనంతరం ఆయా సంస్థల్లో నియామకాలకు కూడా కృషి చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా మహిళలకు కెరీర్ గైడెన్స్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో పాటు ఆయా అంశాల్లో అవగాహన.. ప్రభుత్వపరంగా అందే స్కీమ్‌లు వంటివాటి గురించి వివరించి వారికి తగిన తోడ్పాటునిస్తామనడంతో నాయకులు ఇచ్చేందుకు అంగీకరించారు. అమలుపై అనుమానాలు నిరుపేద యువతకు, మహిళలకు తగిన ఉపాధి కల్పించేందుకు ముందుకొస్తే ఎవరూ కాదనరు. బహుశా జీహెచ్ఎంసీ కూడా అలాగే భావించి ఉండవచ్చు. కానీ.. ఒక కార్యక్రమం కోసం ఆయా స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు పొందిన సంస్థలు మొదట్లో కొంతకాలం బాగానే పనిచేసినప్పటికీ, తర్వాత తమ వ్యాపారం, లాభాలు చూసుకోవడంపైనే దృష్టి సారిస్తున్నాయి. ఉచితంగా ప్రభుత్వ/జీహెచ్ఎంసీ స్థలాలను పొందేందుకే ఎత్తుగడనే అభిప్రాయముంది. అందుకు ‘లూకేఫ్’(లగ్జరీ టాయిలెట్)లను ప్రజలు ఉదాహరణగా చూపుతున్నారు. నగరంలో తగినన్ని పబ్లిక్ టాయిలెట్లు లేనందున ఓ ప్రైవేట్ సంస్థకు లూకేఫ్‌ల ఏర్పాటుకు నామమాత్రపు ధరకు పదేళ్లపాటు లీజుకిచ్చారు. అది ఉచితంగా పబ్లిక్ టాయిలెట్లను నిర్వహించడంతో పాటు కియోస్క్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో టీ, కాఫీల నుంచి స్నాక్స్, టిఫిన్లు, కూల్‌డ్రింక్స్ వంటివి విక్రయిస్తున్నారు. అంతే విస్తీర్ణంలో, అదేరకమైన దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే నగర ప్రధాన రహదారుల్లో నెలకు రూ. 20 వేల వరకు అద్దె చెల్లించాలి. అద్దె లేకుండా కేవలం లగ్జరీ టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట బాగా వ్యాపారం జరిగే ఎన్టీఆర్ గార్డెన్ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒప్పందం ప్రకారం మొత్తం 66కు గాను 22 లూకేఫ్‌లు మూణ్నెళ్లలోగా ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ దాదాపు ఏడాదైనా పది కూడా ఏర్పాటు చేయలేదు. అయినా సరే జీహెచ్ఎంసీలో పట్టించుకున్న వారు లేరు. ఎక్కడ వ్యాపారావకాశం ఉంటుందో అలాంటి కొన్నిచోట్ల మాత్రమే ఆ పదీ చేశారు. ఎక్కడ ఎన్ని ఏర్పాటయ్యాయో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కనీస సమాచారం లేదు. అంతా జోన్లకు అప్పగించామని చెబుతూ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. జోన్లు, సర్కిళ్లలో జరిగే పనులపై తనిఖీలుండవు. దాంతో అక్కడ ఇష్టారాజ్యంగా మారింది. వీటిని ఏర్పాటు చేసిన చోట కూడా టాయిలెట్ల నిర్వహణను పట్టించుకున్నది లేదు. వాస్తవానికి అవి పబ్లిక్ టాయిలెట్లని ప్రజలకు తెలియడమే కష్టంగా ఉంది. -
పాఠశాలలకు సమీపంలో మద్యం దుకాణమా..!
భోగాపురం: ఓ పక్క ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. మరో పక్క గ్రామదేవత పైడితల్లి అమ్మవారి వనుము.. ఇంకోవైపు జాతీయ రహదారి.. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ దుకాణం ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భోగాపురం మండల కేంద్రంలో బట్టికాలువ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని (లైసెన్స్ జీఎల్ఎస్ నంబర్ 30 (ఏ 4 షాపు) నాయుడు వైన్స్) పోలిపల్లి గ్రామానికి మార్చేందుకు సదరు షాపు యజమాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే గ్రామానికి చేరువలో వైఎస్సార్సీపీ నాయకుడుకి చెందిన మద్యం దుకాణం ఉంది. అతడిని ఇబ్బంది పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు నాయుడు వైన్స్‌ను అక్కడే ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అనుకున్నదే తడువుగా పాఠశాల, గ్రామదేవత వనుము, జాతీయ రహదారి మధ్యలో అధికార పార్టీ నాయకుడికి చెందిన స్థలంలో షాపు ఏర్పాటుకి షెడ్ కూడా నిర్మించేశారు. అయితే జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు మాసాల కిందట కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, అబ్కారీశాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సూపరింటిండెంట్, భోగాపురం సీఐ ఇలా ప్రతీ ఒక్కరికీ ఫిర్యాదుతో పాటు షాపు ఏర్పాటు వల్ల ఏర్పడే ఇబ్బందులను వివరించారు. అలాగే ఆ స్థలంలో షాపు పెట్టకుండా నిలుపుదల చేయాలంటూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ అబ్కారీ శాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో డిప్యూటీ క మిషనర్ పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం సు ప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం సదరు స్థలంలో షాపు ఏ ర్పాటు చేయడానికి కుదరదంటూ కమిషనర్‌కి ఈ ఏడా ది మార్చి 27న నివేదిక పంపించారు. దీనిపై కమిషనర్ మార్చి 28న విజయవాడలో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తుల అభ్యంతరాన్ని నేరుగా తెలుసుకున్నారు. అధికారులపై ఒత్తిడి.. అయితే షాపు పెట్టడానికి అవకాశం లేదన్న విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఏకంగా మంత్రులతో అబ్కారీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో మార్చి 30న అబ్కారీశాఖ అధికారులు మళ్లీ షెడ్‌ను పరిశీలించి కొలతలు వేశారు. షాపు పెట్టే స్థలం కూడా అధికార పార్టీ వారికి చెందినది కావడంతో అధికారులు నిబంధనలకు పాతర వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అబ్కారీశాఖ సీఐ బహుదూర్ వద్ద ప్రస్తావించగా, మద్యం దుకాణాన్ని భోగాపురం నుంచి పోలిపల్లికి మార్చేందుకు ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఈ ఫైల్ కమిషనర్ వద్ద ఉందన్నారు. మద్యం షాపు పెట్టేందుకు నిర్మాణం చేసిన షెడ్ నిబంధనల ప్రకారం ఉందా? లేదా? అని ప్రశ్నించగా నిబంధనల ప్రకారం ఉంటే షాపు ఎప్పుడో ప్రారంభమయ్యేది కదా అని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా ఈ అంశం తమ చేతిలో లేదని కమిషనర్ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుందన్నారు. -
కాంగ్రెస్ రైతు గర్జన ఎవరికోసం?
తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సీఎం కేసీఆర్ కల ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా మల్లన్నసాగర్ కట్టి తీరుతాం సింగూరు జలాలు నిజామాబాద్, మెదక్ జిల్లాలకే... భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిజామాబాద్ : కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రైతు గర్జన పేరుతో హంగామా చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ జిల్లాల్లో తిరిగితే పరిస్థితి తెలిసేదన్నారు. అధికారంలో కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు చేసే రైతుగర్జన ఎవరికోసమో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి అదనంగా 2,642 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 23.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఆయన మాక్లూర్ మండలంలోని గుత్ప, జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లిల వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మునిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమి చేస్తున్నారో రైతు గర్జనలో చెప్తారా? లేక మా వల్లే నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్లేగ్రౌండ్‌లా మారిందని చెప్తారా? అని హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పుడు కర్ణాటక మునిగిపోయేంత వర్షాలు పడితే తప్ప నిజాంసాగర్‌లోకి నీరు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నింపాలన్న ప్రయత్నాన్ని ఓ వైపు అడ్డుకుంటూ.. మరోవైపు రైతు గర్జన చేయడం ప్రజాద్రోహం అవుతుందని పేర్కొన్నారు. వారిని ప్రజలే తరిమికొడతారన్నారు. సింగూరు జలాలను గత పాలకులు హైదరాబాద్ నగరానికి తాగునీటికోసం తరలించడం వల్ల మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా జలాలను తరలిస్తున్నందున సింగూరు జలాలను ఈ రెండు జిల్లాల ఆయకట్టుకే కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు రెండు పంటలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు గోదావరి జలాలతో నింపాల్సిన ఆవశ్యకత ఉన్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రీ–ఇంజినీరింగ్‌తో తెలంగాణలోని కోటి ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి, కృష్ణా జలాలను మళ్లించే భారీ సాగునీటి పథకాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఇంద్రావతి, పెన్‌గంగ, ప్రాణహిత నదులు 360 రోజులు నిండుగా ప్రవహిస్తాయని, గోదావరిలో భాగంగా లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయలకు అతీతంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. శాశ్వత కరువు నివారణకు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకోసం బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతానికంటే భిన్నంగా భూనిర్వాసితులకు రెండింతల పరిహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించి నిజామాబాద్ జిల్లా రైతులకు ద్రోహం చేయరాదని మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్షాలకు సూచించారు. మిషన్ కాకతీయ కింద వందలాది చెరువులను పునరుద్ధరించినప్పటికీ వర్షాలు లేనందున వాటిలోకి నీరు చేరలేదని పేర్కొన్నారు. హరితహారం అమలులో జిల్లాను ముందు నిలిపినందుకు జిల్లా కలెక్టర్ యోగితారాణాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ కలెక్టర్ అవార్డు వచ్చిందన్నారు. జిల్లాలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలని సూచించార. సమృద్ధిగా చెట్లు ఉన్నప్పుడే వర్షాలు పడి చెరువులు నిండుతాయని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వం అవసరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంతటి చారిత్రక అవసరంగా నిలిచిందో.. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అంతే అవసరం అని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాయకత్వాన్ని పటిష్ట పరచాలని పిలుపునిచ్చారు. మంజీర నదిపై పొరుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆరోపించారు. జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చే నిజాంసాగర్ ప్రాజెక్టును నింపేందుకోసం కాళేశ్వరం ఎత్తిపోతల పతకానికి మహారాష్ట్రతో మనప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఒకటిన్నర సంవత్సరాలు సుదీర్ఘంగా అన్ని అంశాలను చర్చించిన తర్వాతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం తుదిరూపు ఇచ్చిందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునర్వైభవం తెచ్చేందుకు మల్లన్నసాగర్ రిజర్వాయర్ అవసరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, వీజీ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లాడెన్ ఇల్లు శ్మశానమా, ప్లే గ్రౌండా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో ఐదేళ్ల క్రితం అమెరికా నిర్వహించిన ఆపరేషన్‌లో మరణించిన అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ నివాసాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అన్న అంశంపై పాక్ సైన్యానికి, స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవ జరుగుతోంది. దాన్ని శ్మశాన వాటిక చేయాలని ఇప్పటికే అక్కడ ప్రహారి గోడను నిర్మించిన సైన్యం వాదిస్తుండగా, పిల్లల ప్లే గ్రౌండ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ స్థలం దాదాపు 3,800 చదరపు గజాలు ఉంది. 2011లో అమెరికా సైన్యం నిర్వహించిన ప్రత్యేక కమాండో ఆపరేషన్‌లో అక్కడున్న ఇంట్లో ఒసామా బిన్ లాడెన్ మరణించాడు. అనంతరం అదొక స్మారక కేంద్రంగా మారకూడదనే ఉద్దేశంతో స్థానిక రాష్ర్ట ప్రభుత్వం అక్కడున్న భవనాన్ని కూల్చేసింది. ఆ తర్వాత పాక్ సైన్యం ఆ స్థలానికి మూడు పక్కల ప్రహారి గోడను నిర్మించింది. 'ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా మేము రక్షిస్తూ వచ్చాం. ఆ ప్రాంతంలో శ్మశాన స్థలం దొరక్క చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే దీన్ని శ్మశాన స్థలంగా మారిస్తేనే బాగుంటుంది' అని సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న అబోటాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న జుల్ఫికర్ అలీ భుట్టో మీడియాతో వ్యాఖ్యానించారు. 'అక్కడ శ్మశానం నిర్మించేందుకు మేం ఏమాత్రం ఒప్పుకోం. ఈ ఏడాది నిధులు విడుదల కాగానే మేము అక్కడ పిల్లల క్రీడా స్థల నిర్మాణ పనులు చేపడతాం'అని కైబర్ ఫంఖ్తుక్వా ప్రొవిజనల్ ప్రభుత్వానికి చెందిన ముస్తాక్ ఘని స్పష్టం చేశారు. ఇళ్ల మధ్యన శ్మశానాన్ని నిర్మించేందుకు ప్రజలెవరూ ఒప్పుకోరని, అక్కడ తాము మూడు ప్లే గ్రౌండ్లను నిర్మించాలనుకుంటున్నామని ముస్తాక్ వ్యాఖ్యానించారు. తమ పరిధిలో ఉన్న ఆ వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునే అధికారం తమకుందని, త్వరలోనే ప్రావిన్స్ ప్రభుత్వాన్ని తాము కలుసుకొని సమస్యను పరిష్కరించుకుంటామని భుట్టో తెలిపారు. -
గిరిసిగలో మణిహారం
వెంకటగిరిటౌన్: వెంకటగిరి సంస్థానాధీశుల పాలన, చేనేతల నైపుణ్యంతో వెంకటగిరి చీర అంతర్జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో వెంకటగిరిది ప్రత్యేక స్థానం. వెంకటగిరి-తిరుపతి మార్గంలో పట్టణ శివారులో పది ఎకరాల సువిశాల ప్రశాంత వాతావరణంలో ఏర్పాటైన తారకరామా క్రీడాప్రాంగణంలో అత్యాధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు క్రికెట్ పిచ్‌లు రూపుదిద్దుకున్నాయి. వీటిని బుధవారం ప్రారంభించనున్నారు. 90వ దశకంలో ఏర్పాటై ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడాప్రాంగణం అభివృద్ధిలో వెంకటగిరి రాజా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ క్రికెట్పోటీ ల్లో ఇండియా టీంకు మేనేజర్‌గా ఓ పర్యాయం బాధ్యతలు నిర్వహించిన వెలుగోటి సత్యప్రసాద్ యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి క్రికెట్‌క్లబ్ అధ్యక్షుడిగా, సౌత్‌జోన్‌జట్టు పర్యవేక్షుడిగా వ్యవహరిస్తున్నారు. స్టేడియం అభివృద్ధిలో ఆయన కృషి చేశారు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.60 లక్షల నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు పిచ్‌లను తయారు చేశారు. ఆరునెలలుగా జరు గుతున్న ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేశారు. పిచ్‌లో సాధారణ స్ప్రింక్లర్లతోపాటు భూమిలోపలి నుంచి నీళ్లు వచ్చేలా స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు. మైదానంలో పచ్చిక ఏర్పాటుకే రూ.6 లక్షల వరకూ ఖర్చుచేసినట్టు స్టేడియం నిర్వాహుకులు తెలి పారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్పోటీలకు వేదిక కానుందని నిర్వాహుకులు తెలిపారు. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి రాక నేడు కొత్త పిచ్‌లను ప్రారంభించేందుకు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు బుధవారం వెంకటగిరి రానున్నారు. ఏసీఏ డెరైక్టర్, అంతర్జాతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్కే ప్రసాద్ మంగళవారం వెంకటగిరి చేరుకున్నారు. -
ఒక లడ్డూ బాబు విజయగాథ!
విజేత ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను. ‘‘నా బరువు ఎనభై కిలోలా?’’ అనుకున్నాను...ఆందోళన పడ్డాను. మరిచిపోయాను. కొంతకాలానికి... ‘‘నా బరువు తొంబై కిలోలా?’’ అనుకున్నాను...మరికొంత ఆందోళన పడ్డాను. మళ్లీ మరిచిపోయాను. మరి కొంత కాలానికి... ‘‘నా బరువు 108 కిలోలా?’’ ఆవేదన పడ్డాను...అమ్మోఅనుకున్నాను. మరచిపోలేక పోయాను. ‘‘నన్ను నా పేరుతో కాకుండా నిక్ నేమ్‌లతో వెక్కిరించే కాలం వచ్చింది’’ అని వణికి పోయాను. ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను. ఆటలు ఆడమని ఒకరు సలహా ఇచ్చారు. హమ్మయ్యా...నాకు క్రికెట్ ఆడడం వచ్చు. చాలా రోజుల తరువాత ప్లే గ్రౌండ్లోకి దిగాను. ‘‘ఈత కొట్టి చూడు..’’ అని మరొకరు సలహా ఇచ్చారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగాను. ఏదో కొత్త శక్తి వచ్చి చేరినట్లు అనిపించేది. ఒత్తిడిని చేత్తో తీసేసినట్లు హాయిగా ఉండేది. మా అమ్మ ప్రాణాయమం గురించి చెప్పారు. ఆ దారిలో కూడా వెళ్లాను. ఆరోగ్యవంతమైన శరీరానికి అది ఎంత అవసరమో తెలిసింది. బరువుతో ఉన్నప్పుడు తీయించుకున్న నా ఫొటో ఎప్పుడూ నా పర్స్‌లో ఉండేది. రోజూ పడుకునే ముందు ఆ ఫోటోని చూస్తూ పడుకునేవాడిని. అలా బరువు తగ్గాలనే పట్టుదల పెరిగింది. ఇప్పుడు నా బరువు 70 కిలోలు! - సాహిల్ ర్యాలీ, మోడల్ -
ఆగిన గుండెలు
రాజంపేట రూరల్/రైల్వేకోడూరు అర్బన్/ప్రొద్దుటూరు టౌన్ న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో గుండెలు పగులుతున్నాయి. రాజంపేటలో ఒకరు, రైల్వేకోడూరులో మరో యువకుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి బలిదానం అయ్యారు. రాజంపేట ప్రభుత్వ క్రీడామైదానంలో శనివారం జరిగిన రణభేరి సభలో చిట్వేలి మండలం మైలుపల్లెకు చెందిన లైన్మెన్ ఆర్.వెంకట్రావు(47) ఆకస్మికంగా మృతిచెందారు. జై సమైక్యాంధ్ర అంటూ ఒక్క సారిగా కుప్పకూలడంతో ఆయనను వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు సిబ్బంది పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యులతో పరీక్షలు చేయించారు. వైద్యులు కూడా మృతిచెందిన విషయాన్ని ధృవీకరించారు. నెల్లూరుజిల్లా గూడూరుకు చెందిన వెంకట్రావుకు బద్వేలుకు చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. కాగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. రణభేరి సభలో సమైక్య నినాదాలు చేస్తూ గుండెపోటుతో మృతిచెందిన వెంకట్రావు కుటుంబానికి రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ మేడా మల్లికార్జునరెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సభలోనే ప్రకటించారు. భావోద్వేగానికి గురై.. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన భావోద్వేగానికి గురై రైల్వేకోడూరుకు చెందిన ఉంగరాల రాకేష్(35) మృతిచెందారు. న్యూకృష్ణానగర్‌కు చెందిన రాకేష్ సమైక్యాంధ్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఢిల్లీలో శుక్రవారం కోర్ కమిటీ తెలంగాణా విషయమై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భావోద్వేగానికి గురై శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు భార్య మయూరి తెలిపారు. మృతుడికి కూతురు సాయి, కొడుకు బబ్లూ ఉన్నారు. గుండెపోటుకు గురై.. సమైక్య ఉద్యమంలో పాల్గొని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుకు గురై ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసులు (45) మృతి చెందాడు. శనివారం సమైక్యాంధ్రా కోసం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్లిన శ్రీనివాసులు గుండెపోటుకు గురై కుప్పకూలారు.