Courage
-
సంతోషమే బలం
మానవుడు ఆనంద స్వరూపుడు. ఆనందం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిత్రంగా ఆ ప్రయత్నంలో దానినే విస్మరించటం, కోల్పోవటం జరుగుతుంది. ఆనందంగా ఉండటం సహజ స్థితి. అప్పుడే పుట్టిన పిల్లలు చూడండి. ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆకలి వేసినప్పుడో ఇబ్బంది కలిగినప్పుడో మాత్రమే ఏడుస్తారు. అది వాళ్ళు తమ భావాలను ప్రకటించగల ఒకే ఒక భాష. ఎవరికైనా కష్టం వస్తే బ్రహ్మాండంగా ఓదారుస్తాం – కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా? కలకాలం ఉండవు, మంచి కాలం ముందు ఉంది అని. తనదాకా వస్తే ధైర్యానికి మూలకారణమైన జ్ఞానం నశిస్తుంది. చదివిన చదువంతా నట్టేట్లో కలిసి΄ోతుంది. తెలివి΄ోయాక ఏమి ఉంటుంది? అందువల్ల శోకాన్ని మించిన శత్రువు లేదు అన్నది కౌసల్య. నిజమే కదా! ఆనందాన్ని క్రమక్రమంగా వయసుతోపాటు కోల్పోతున్నాడు మానవుడు. దానికి కారణం శోకం. అందుకే అర్జునుడు విషాదంలో కూరుకుపోయినప్పుడు శ్రీ కృష్ణుడు ‘‘నీకు శోకించే అధికారం లేదు’’ అని వరుసగా ఎన్నో శ్లోకాలలో నొక్కి వక్కాణించాడు. శోకం మనిషిని మానసికంగా క్రుంగదీస్తుంది. మనోబలం తగ్గటంతో శరీరం కూడా సరిగా సహకరించదు. అది అన్ని రుగ్మతలకి ఆహ్వానం. ‘‘ఈడుపు కాళ్ళు ఏడుపు మొఖం’’ అన్ని పనులకు ఆటంకం కలిగిస్తాయి. ఏడుపుగొట్టు ముఖం దరిదాపుల్లోకి ఏ శుభాలు రావు. ఎందుకంటే ఏడుపు మొహం రాగానే కాళ్ళు ఈడవటం జరుగుతుంది. ఇంక పనులు ఏమవుతాయి? విజయానికి మూలం ఉత్సాహం. శోకం ఉత్సాహాన్ని తరిమికొడుతుంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా? ‘‘శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః’’ ఎప్పుడూ జీవితంలో ఎవరినీ పల్లెత్తు మాట అనని కౌసల్య రాముడు వనవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు అని తిరిగి వచ్చిన సుమంత్రుడు చెప్పగానే శోకోపహతచేతస అయి దశరథుడితో నిష్ఠురంగా మాట్లాడుతుంది. దశరథుడు ఆమెను బ్రతిమాలుతుంటే తన తప్పు తెలుసుకుని ఈ మాటలు అంటుంది. తాను ఆ విధంగా కఠినంగా మాట్లాడటానికి శోకమే కారణం అని దానిని మించిన శత్రువు లోకంలో లేదు అంటుంది. నొప్పి వేరు, బాధ వేరు, శోకం వేరు. నొప్పి భౌతిక మైనది. శరీర సంబంధం. బాధ మనస్సుకి సంబంధించినది. శోకం మనస్సు లోలోపలి ΄÷రలలోకి చొచ్చుకొని ΄ోయి జీవుణ్ణి వేదనకి గురి చేస్తుంది. తనకో తనవారికో కష్టం కలిగింది అనే భావన జోడించబడి ఉంటుంది. ఎప్పుడైతే నేను, నా అన్న భావన కలిగిందో మనస్సు నిర్మలంగా, నిష్పక్ష΄ాతంగా ఆలోచించలేదు. ఎదుటివారి సమస్యలని తేలికగా పరిష్కరించగలవారు తమకి వచ్చిన చిన్న సమస్యని కూడా పరిష్కరించ లేక΄ోవటానికి ఇదే కారణం. అది తమది కాదు ఎవరిదో అని ఆలోచించగానే తాము అందులో ఉండరు గనుక వెంటనే పరిష్కారం లభిస్తుంది. శోకంలో ముందుగా వచ్చేదే ‘నేను’ అన్నది. దానితో ముందుగా ధైర్యం జారిపోతుంది. అర్జునుడికి వచ్చింది కూడా శోకమే. ధైర్యం కోల్పోవటం వల్ల శరీరం వణకటం, చేతిలో ఉన్న గాండీవం జారిపోవటం వంటివి జరిగాయి. ఆ శోకాన్ని పోగొట్టి ధైర్యాన్ని, దానికి మూలమైన జ్ఞానాన్ని ఇచ్చే ముందు నీకు శోకించే అర్హత, అధికారం లేదు అని గట్టిగా చె΄్పాడు. మరేం చేయాలి అంటే ‘‘సమస్యలు వస్తే క్రుంగి΄ోక వాటితో యుద్ధం చేయాలి.’’ అని ఆదేశించాడు. అది అర్జునుడికి మాత్రమే కాదు. భారతీయులు అందరూ. మనం అన్నివిధాల సమస్యలతోను ΄ోరాడి విజయం సాధించాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
International Womens Day 2022 : స్త్రీకి స్త్రీయే శత్రువా? నేను ఒప్పుకోను!
మాకూ హక్కులు కావాలి, మాకూ అవకాశాలు కావాలి అని మహిళలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నా ఇంకా లింగ-సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. తమ ఉనికితోపాటు, పురుషులతో సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జీ రాధారాణిని సాక్షి.కామ్ పలకరించింది. మహిళలందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అందించిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ‘‘ఇప్పటి యంగ్ జనరేషన్‌కు లింగ వివక్ష ఎక్కడ ఉంది అనిపించవచ్చు. చాలామంది టీనేజర్లకు ఈ విమెన్ డేస్ అవీ... అవసరమా అనిపిస్తుంది. కానీ వన్స్ పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలోకి ఎంటరైన ప్రతీ మహిళకు వివక్ష ఏ రూపంలో ఉంటుందనేది కనబడుతుంది. అర్థం అవుతుంది. తరతరాలుగా వివక్ష అనేది మనం జీవితాల్లో అంతర్లీనంగా జీర్ణించుకుపోయింది. గతంలో భార్యను భర్త కొట్టడం సహజమే కదా అన్నట్టుగా ఉండేవాళ్లం. ఈ పరిస్థితి నేడు మారినా ఇంకా చాలా మారాలి. ఈ కాస్త మార్పు అయినా మన పోరాటం, ప్రశ్నించడం మూలంగానే వచ్చాయి. ఆలోచించడం, ప్రశ్నించడం అనే ప్రక్రియ నిరంతరం సాగాలి. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ఉన్నాం. ఎక్కడ లోపాలున్నాయి అనేది రివ్యూ చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకునేలా సమీక్షించుకోవాలి. మార్పుకోసం అవగాహన పెంచుకొని ముందుకు పోవాలి. అదే మార్చి 8 ఉద్దేశం. మహిళలకు న్యాయవాద వృత్తి సవాలే! ఏ ప్రొఫెషన్‌ను లైట్ తీసుకోకూడదు ఏ ప్రొఫెషన్ అయినా డెడికేటెడ్‌గా కమిటెడ్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. వృత్తిని తేలిగ్గా తీసుకోకుండా, నిబద్ధతగా పనిచేసుకుంటూ పోవాలి. జ్యుడీషియల్ ప్రొఫెషన్లో సాధారణంగా సీనియర్లతో పోలిస్తే జూనియర్లకు అందులోనూ మహిళలకు ముఖ్యంగా క్రిమినల్ లాయర్స్‌కు వృత్తిలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ సక్సెస్ఫుల్ విమెన్‌గా నిలవాలంటే ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలి. నిరుత్సాహ పడకుండా తామేంటో నిరూపించుకోగలగాలి. కుటుంబ సహకారం లేకుండా మహిళలు ముందుకు పోవడం చాలా కష్టం. నిజానికి మన బాధ్యతలు, పనితీరును బట్టి ఇంట్లో వాళ్లు అవగాహన పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ వర్కింగ్ విమెన్ పిల్లల గ్రోత్‌కు చాలా ఉపయోగపడతాయి. నాకు నా భర్త సహకారం చాలా ఉంది. పెళ్లి తరువాతే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తరువాత ఆయన సపోర్టుతోనే ఏలూరులో సీఆర్ఆర్ (ఈవినింగ్) లా కాలేజీలోలా చేశాను. మా కుటుంబలో ఎవరూ లీగల్ ప్రొఫెషనల్స్ లేరు. తండ్రులు, తాతలు, తెలిసినవాళ్లు ఎవరూ లేకుండానే ఈ స్థాయికి రాగలిగాను. ఇలానే అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించి సాధించాలి. బార్ కౌన్సిల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి లీగల్ ప్రొఫెషనల్‌లోకి వచ్చేందుకు 33 శాతం రిజర్వేషన్ చాలా ఉపయోగపడుతోంది. చాలామంది మహిళలం సర్వీస్ కేండిడేట్స్‌గా వచ్చాం. అయితే బార్ నుంచి మహిళల ప్రాతినిధ్యం లభించకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. అక్కడ పురుషుల డామినేషన్ కారణంగా మోర్ విమెన్ రావడం లేదు. ఇది మారాలి. బార్ నుంచి మహిళా లాయర్లు పెరగాలి. అలాగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లేడీ రిప్రజెంటేటివ్‌గా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మహిళల రిప్రజెంటేషన్ పెరగాలి. డెసిషన్ మేకింగ్ పవర్ ముఖ్యం నా దృష్టిలో చదువుకోని స్త్రీ అయినా సరే స్వంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సాధికారత. అలాగే చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేక పోవడం దురదృష్టకరం. మహిళలకు విద్య, ఉద్యోగం రావడమే ఒక ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ మహిళల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇవ్వాలి. ఇస్తుంది కూడా. బయటికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఎలాగైనా జీవించవచ్చు అనే ధైర్యం విద్య ద్వారానే వస్తుంది. ఉద్యోగం చేయాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా లాంటి నిర్ణయాలు మహిళలు స్వయంగా తీసుకోగలగాలి. డెసిసిషన్ మేకింగ్ పవరే విమెన్‌కు కీలకం. మన ఇండియాలో చాలామంది మహిళలకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎంతమంది పిల్లలు కావాలి అనేది స్వయంగా నిర్ణయించుకునే స్థితిలో లేరు. అలాగే ట్రాన్సఫర్, ఉద్యోగంలో ప్రమోషన్ తీసుకోవాలా లేదా అనే సందిగ్దంలో చాలా మంది ఉద్యోగినులు కెరీర్‌ను వదులుకుంటున్నారు. పిల్లల కోసమో, భర్తల ఒత్తిడితోనో, లేదంటే కుటుంబం కారణంగానో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి. దీనికి నేటి మహిళలు ఆలోచించాలి. దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు ఎవరికి ఓటు వేయాలి అనే డెసిషన్ కూడా స్వయంగా మహిళలే తీసుకోవాలి. ఆ పవర్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనేది నేను అసలు విశ్వసించను. మహిళల్లో ఈ భావజాలం మారేలా అవగాహన కల్పించలేకపోవడమే లోపం. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కాగా 1963 జూన్ 29న రాధారాణి గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వంచారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను పట్టుదలగా సాధించి, ఉన్నత శిఖాలను అధిరోహించారు రాధారాణి. అంతేకాదు తాను కులాంతర వివాహం చేసుకుని, తన బిడ్డలకు కూడా కులాంతర వివాహాలను చేసి తానేంటో నిరూపించుకున్న రాధారాణిగారికి మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాట్సాఫ్!!! -సాక్షి వెబ్ స్పెషల్ -
లేనిపోని ధైర్యాలు
మాధవ్ శింగరాజు అందరూ ధైర్యస్తులే ఉండరు. అసలు ధైర్యంగా ఉండాల్సిన ఖర్మేమిటి ఆడపిల్లకు?! ధైర్యం ఎక్స్ట్రా లగేజ్. కాళ్లూచేతులు ఫ్రీగా కదిలే వీలు లేకుండా! నా కూతురికి స్కూల్ బ్యాగే ఎక్స్ట్రా లగేజ్ అని నేను అనుకుంటుంటే మీరంతా వచ్చి, బుక్స్‌తో పాటు ధైర్యాన్ని కూడా బ్యాగ్‌లో పెట్టి పంపు అని చెప్పడం ఏంటి? స్కూల్ బ్యాగ్‌లో బుక్స్ ఉండాలి. అందులో ధైర్యానికేం పని? పిడికిలి బిగించి, ఒక పంచ్ ఇవ్వగలిగిన ధైర్యం అనే బలం కూడా ఉండాలి నీ కూతురి చేతులకు అంటారు మీరు! పదీపన్నెండేళ్ల పిల్ల, పోనీ పద్దెనిమిదేళ్ల పిల్ల.. చేతి గోళ్లను చక్కగా ట్రిమ్ చేసుకుని డ్రెస్‌కి మ్యాచింగ్‌గా గోళ్ల రంగు వేసుకుని పెదనాన్న కూతురి ఫంక్షన్లో చూపించుకోవాలని ఉండదా తనకు! ఎవడికైనా డొక్కలో ఒక్కటిచ్చేందుకు నకుల్స్ని పొజిషన్లోకి తీసుకోవడం ఎలా అని థింక్ చెయ్యడానికి తనకేం పట్టిన దౌర్భాగ్యం? ఆఫీస్ వర్క్‌లో టార్గెట్ రీచ్ అయినందుకు వస్తున్న బోనస్‌తో తనకు ఇష్టమైనవాళ్లకు ఏమిచ్చి సర్ప్రైజ్ చెయ్యాలో ఆలోచనలు ఉండవా. తనకు! టోల్ గేట్ దగ్గర పగిలిన ఏ ఖాళీ సీసాపై కాలు పడుతుందోనని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు మనసులోనే స్కెచ్ వేసుకుంటూ నిద్ర లేవడానికి తనకేంటి అంత దిక్కుమాలినతనం? గోళ్ల రంగే కాదు, రాబోయే బోనసే కాదు.. ఇంకా ఏవో ఉంటాయి తన లోకంలో. అన్నీ అందమైనవి. సున్నితమైనవి. భవిష్యత్తును చక్కగా అల్లుకుని జీవితానికి జడగా వేసుకుంటూ ఉన్నవి. తన ఇల్లు, తన స్కూలు, ఇంటి నుంచి స్కూలుకు వెళ్లొచ్చే తన దారి.. దారి కూడా తనదే కదా. ఇంట్లో ఉండటానికి ధైర్యం అక్కర్లేదు. స్కూల్లో ఉండటానికి ధైర్యం అక్కర్లేదు. మధ్య దారిలో ఈ ధైర్యం నస ఏమిటి? ధైర్యాన్ని నూరి పోయడానికి చుట్టూ ఇంతమంది కల్వంలో పంచ్‌లు, పిన్నులు, పెప్పర్ స్ప్రేలు నూరుతూ కూర్చోవడం ఏమిటి నా కూతురికి ఇవ్వడానికి! నాజూకుగా ఉంటాయి తన చేతులు. నోట్‌బుక్కులు రెండెక్కువైతేనే ఆ రోజంతా చేతులు గుంజేస్తాయి. మీరేమో పిడికిలి బిగించమంటారు. మృదువుగా ఉంటుంది తన మనసు. బొద్దింకల మీదికి స్ప్రే కొడుతుంటేనే.. ‘పాపం.. నాన్నా..’ అని కళ్లు మూసుకుంటుంది. మీరేమో బండెడన్నం తినే రాక్షసుడి మీద తననే పెప్పర్ స్ప్రే కొట్టమంటారు. ‘పిల్లని ధైర్యంగా పెంచకపోతే ఎలా?’ అంటారు. పిల్ల హాయిగా పెరగాలి గానీ, ధైర్యంగా పెరగడం ఏంటి? ధైర్యంగా ఉండాల్సొస్తుందని ఏమాత్రం అనుకోని ఒక కూతురు.. ధైర్యం గురించి ఆలోచించడానికే భయపడిన ఒక కూతురు.. తన లోపలి ధైర్యం కన్నా, బయట ప్రపంచంలోని మంచినే ఎక్కువగా నమ్ముకున్న కూతురు.. తన నమ్మకానికే కదా తను ఆహుతైపోయింది! ధైర్యం లేకపోయినందుకా?! ‘నిర్భయ’ దెబ్బకి కూడా దేశం ఇంతగా సొమ్మసిల్లిపోలేదు. బహుశా ‘దిశ’ తన ఫోన్లోంచి చెల్లితో మాట్లాడిన చివరి మాటల్లోని.. ‘నాకు భయం అవుతోంది పాపా..’ అన్న మాటే మళ్లీ మళ్లీ గుర్తొచ్చి దేశానికి నిద్ర పట్టకుండా చేస్తుండవచ్చు. ‘దిశ’ నిందితుల్ని ఎన్కౌంటర్ చేయకముందు వరకు ప్రతి రెండు కళ్లూ మౌనంగా వెలిగిన రెండు కొవ్వొత్తులే. ప్రతి రెండు చేతులూ దిశకు న్యాయం వెతుకుతున్న రెండు కాగడాలే. ఎవరు చేయాల్సింది వారు చేశారు. ఎవరు చెప్పగలిగింది వారు చెప్పారు. చట్టం ‘సీన్ ఆఫ్ అఫెన్స్’ గుర్తుకు రాకుండా ప్రియాంక పేరుపై ‘దిశ’ అనే గుడ్డను కప్పేసింది. ఏడేళ్ల క్రితం జ్యోతీసింగ్పై ‘నిర్భయ’ను కప్పినట్లు. మృతురాలికి, ఆమె కుటుంబానికి రెస్పెక్ట్ ఇవ్వడానికే కావచ్చు.. నిజంగా ఆ పేర్లు ఉన్న అమ్మాయిల రెస్పెక్ట్ మాటేమిటనే ఆలోచనను కూడా రానివ్వని మూడ్‌లోకి వెళ్లిపోయింది దేశం. ఆపదలో ఉన్న అమ్మాయి వెంట ధైర్యం ఎంత తోడుగా ఉంటుందో మనం చేసే ఈ సంస్కారవంతమైన నామకరణలు, మన ధర్మాగ్రహ వ్యక్తీకరణలు.. ఆపదలో పడబోయే అమ్మాయిలకు అంతకుమించి తోడుగా ఉండబోయేదేమైనా ఉంటే మంచిదే. ‘దిశ’ ఘటన తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు.. రాత్రి తొమ్మిది – ఉదయం ఆరు మధ్య బయట చిక్కుకుపోయిన మహిళల్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను తీసుకున్నాయి. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. బాధితురాలు ఎక్కడ కంప్లయింట్ చేసినా ‘ఇది మా పరిధిలోకి రాదు’ అనకుండా అక్కడికక్కడే కేసు నమోదు చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జీరో ఎఫ్.ఐ.ఆర్.’ను అమల్లోకి తెచ్చింది. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. గ్రామాల్లో జులాయిల వివరాలు సేకరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. దేశవ్యాప్తంగా మహిళల రక్షణపై ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తున్నాయి హోమ్ శాఖలు. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసం. ఆఖరికి దిశ నిందితుల ఎన్కౌంటర్ కూడా జరిగింది. అదీ ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పడం కోసమే కావచ్చు! నా కూతురి చుట్టూ ఇంత ధైర్యం ఉన్నప్పుడు నా కూతురెందుకు పనిగట్టుకుని మరీ మళ్లీ ధైర్యంగా ఉండాలి. తన చిరునవ్వుల్లో తనుండటం మాని, తన ఊహలతో తను గుసగుసలాడటం మాని, తన క్లాస్‌లోని ఫస్ట్ ర్యాంకర్‌తో తను పోటీ పడటం మాని, తనెంతో ఇష్టంగా చేరిన వర్క్‌లో.. ఉద్యోగంలో మనసు పెట్టడం మాని.. ఇవన్నీ మాని.. ధైర్యంగా ఉండటం కోసం నా కూతురెందుకు తన మైండ్‌ని, తన బాడీని ధైర్యం అనే మందుగుండు సామగ్రితో నింపుకుని బయటికి అడుగు పెట్టే ప్రతిసారీ అంతా సవ్యంగా ఉందా లేదా అని బొట్టునో, బట్టల్నో చూసుకున్నట్లు అద్దమెందుకు చూసుకోవాలి?! -
డప్పు
తరగతిలో ఉండగా ఆఫీసులో పిలుస్తున్నారని వచ్చి చెప్పాడు అటెండర్. పాఠం వింటున్న అన్బరసన్‌కు ఎందుకు రమ్మంటున్నారో అర్థంకాలేదు. పక్కనున్న ఫ్రెండ్ తిరుమాల్ను ఒకసారి చూసి అటెండర్ వెనకే వెళ్లాడు. ఆఫీసులోని కుర్చీలో ఆదుర్దాగా కూర్చున్నాడు. సీలింగ్ఫ్యాన్ శబ్దంకూడా భయం గొలుపుతున్నట్టుగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత అక్కడున్న అధికారి అతణ్ణి పిలవగానే ఆయన ఎదుటకు వెళ్లి నిలబడ్డాడు. అతని కాళ్లు సన్నగా వణుకుతున్నాయి. ఆ అధికారి అతణ్ణి చూసీ చూడనట్టుగా అడిగాడు: ‘‘నువ్వేనా అన్బరసన్? తిరుమాల్ నీ ఫ్రెండా?’’ అన్బరసన్‌కు గొంతు పెగల్లేదు. అతనికే వినిపించనంత మెల్లగా బదులిచ్చాడు: ’’ఔను!’’ ‘‘ఏంలేదు, వాళ్ల నాన్నకు సీరియస్‌గా ఉందట. ఫోనొచ్చింది. అతణ్ణి వెంటబెట్టుకొని ఇప్పుడే బయలుదేరు. కానీ ఈ విషయం అతనికి చెప్పొద్దు.’’ అన్బరసన్ ముఖం మాడిపోయింది. అతను కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం జరిగిందీ చెప్పమన్నాడు. ఆ అధికారి అన్ని విషయాలూ చెప్పాక అతని ముఖం మరింత కళా విహీనమైంది. తరగతికి వెళ్లే దారిలో అతనికి దడ ఎక్కువైంది. తిరుమాల్కు ఏమని చెప్పి తీసుకెళ్లాలి? గబగబ బట్టల్ని బ్యాగులోకి కుక్కుతుంటే మళ్లీ అన్బరసన్‌ను అడిగాడు తిరుమాల్: ‘‘రేయ్, మా నాన్నకు ఏమైందిరా బామ్మర్దీ? ఆయనకు ఏమంట్రా? చెప్పరా!’’పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపైనా అణచుకోవటానికి వీలుకాలేకపోయింది. తిరుమాల్ను పట్టుకొని భోరుమన్నాడు అన్బరసన్.‘‘ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయాడ్రా. హార్ట్ అటాక్ అంట్రా.’’స్పహతప్పి దబ్బుమని క్రిందపడ్డాడు తిరుమాల్. అన్బరసన్ అరిచిన అరుపుకు హాస్టల్ వార్డన్లు ఇద్దరు పరుగెత్తుకొచ్చారు... రైల్వేస్టేషన్కొచ్చేలోపు బాగా నీరసించిపోయాడు తిరుమాల్. పదేపదే ఏడుపు తన్నుకొచ్చి ఏదేదో గొణగసాగాడు. అతని శరీరం సన్నగా వణుకుతోంది. చిన్నచిన్న సమస్యలకు కూడా అతను ఎంత తీవ్రంగా స్పందిస్తాడో అన్బరసన్కూ తెలుసు. వాళ్ల ఊరికి వెళ్లటానికి కోవై నుండి బయలుదేరే రైలొకటి మధ్యాహ్నం ఉంది. అందులో ఎలాగో వాళ్లు కూర్చోవటానికి కాస్త చోటు సంపాదించారు. ఫోన్లో బంధువులిద్దరికి ఫోన్‌చేసి భోరుమని ఏడ్చాడు తిరుమాల్. దు:ఖాన్ని ఆపుకుంటూ మళ్లీ ఎవరెవరితోనో మాట్లాడుతూ ఏడవసాగాడు. స్థిరంగా ఒకచోట కూర్చోలేక లేచి అటుఇటు నడిచాడు. ఆ కంపార్టుమెంటులో ఉన్నవాళ్లు అతణ్ణే వింతగా చూడ్డం మొదలుపెట్టారు. ‘‘అతనితో కలిసి నువ్వూ ఏడుస్తూ ఉండిపోబాకయ్యా. అతణ్ణి జాగ్రత్తగా తీసుకెళ్లి ఊరు చేర్చు.’’ హాస్టల్ వార్డెన్లు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అన్బరసన్‌కు. వెంటనే తిరుమాల్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని ఆఫ్చేశాడు. టీ కొని బలవంతంగా అతనిచేత తాగించాడు. సీట్లో కూర్చోమని చెప్పి అతణ్ణే చూడసాగాడు అన్బరసన్. వాళ్ల కళ్లనూ, మనసులనూ చల్లబరిచేటట్టు చేసింది కిటికీ నుండి వీస్తున్న గాలులు. తిరుమాల్ లాగానే తన మనసుకూడా దు:ఖపూరితమైనప్పటికీ తన ఆలోచనల్ని తనలోనే దాచుకున్నాడు అన్బరసన్. అయినప్పటికీ మురుసుకుంటున్న ఆలోచనలను అతను అడ్డుకోలేకపోయాడు. తిరుమాల్ వాళ్ల నాన్నను అతను ‘గోపాల్ మామయ్య’ అనే పిలుస్తాడు. ఆయనంటే అతనికి చాలా ఇష్టం. ఆయన్ను ఎలా పిలవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘మామయ్య’ అని పిలవమని చెప్పింది కూడా ఆయనే.‘‘ఒరేయ్ అన్బు, నన్ను మామయ్య అనే పిలవరా. మీ అమ్మ శెల్వి ఉన్నదే ఆమె నాకు చెల్లెలు రా. నేను చూస్తూ పెరిగిన ఆడపిల్లరా’’గోపాల్ మామయ్య భూముల్ని తరతరాలుగా అన్బరసన్ తాత, తర్వాత అతని తండ్రి పైరు చేసేవాళ్లు. ఇరవై ఎకరాలకు పైగానే ఉంటుందని తాత చెప్పేవాడు.‘తేన్మ’ ను తాకుతూ ప్రవహించే ఏటి ఒడ్డున ఉండే భూములు. పైరూ పంటలతో ఎప్పుడూ పచ్చదనంతో నిండి ఉండేది. హరిజనవాడ పడమటి వీధిలో వాళ్లకొక సొంత ఇల్లు ఉన్నప్పటికీ, గోపాల్ ఇంటికి ఆనుకొని ఉన్న ఆ పొలంబావి మూలలో ఒక గుడిసె ఉండేది. దాని పక్కనే విస్తారమైన ఖాళీ స్థలం ఉండేది. అన్బరసన్ ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. అతనూ తిరుమాల్ జతగానే ఈతకొట్టటం నేర్చుకున్నారు. జతగానే ఎక్కడికైనా వెళ్లేవాళ్లు. ఊరి తిరునాళ్లలోనూ, పెండ్లి ఊరేగింపుల్లోనూ జతగానే మేళానికి ముందు ఆడేవాళ్లు. ఊరికి దగ్గరగా ఉండే అడవిలో తిరిగే పక్షుల్నీ, ఉడుతల్నీ వెతుక్కుంటూ తిరిగేవాళ్లు. కొండ పైభాగాన ఉండే జలపాతంలోకి దిగి చేపలు పట్టేవాళ్లు.అన్బరసన్ తోడుంటే తిరుమాల్ ఇంటిని కూడా మరిచిపోయేవాడు. నక్షత్రాలను, చందమామను చూస్తూ, నులక మంచంమీద పడుకొని రాత్రుల్లో అన్బరసన్తో కలిసి హాయిగా నిద్రలోకి జారిపోయేవాడు. ఇంటి నుండి అతణ్ణి వెతుక్కుంటూ అతని చిన్నాన్న వచ్చి పిలిచినా అతను వెళ్లేవాడు కాదు. గోపాల్ కూడా అతణ్ణి ఏమీ అనేవాడు కాదు. రైలు సేలంను దాటింది. పొమ్మిడి వరకూ వచ్చే అడవినీ, భూముల్నీ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ల దగ్గరున్న మాటల్ని దూరంగా తరిమేసి మొండిగా వాళ్లకు తోడుగా ఉండిపోయింది దు:ఖం. వాళ్లిద్దరూ ఊళ్లో ఉన్న బడిలోనే చదువుకున్నారు. ఊళ్లో పెద్దమనిషిగా ఉంటూ తన కొడుకును మాత్రం బయటూళ్లో చదివిస్తే ప్రజలు తప్పుగా అనుకుంటారని అలాగే వదిలేశాడు గోపాల్. వాళ్లిద్దరూ చేతిలో చెయ్యేసుకొని బడికి వెళ్లటం అప్పటినుండే మొదలైంది. తరగతిలోనూ వాళ్లిద్దరూ పక్కపక్కనే కూర్చునే వాళ్లు. బడికి వెళ్లేందుకు ఎప్పుడూ అన్బరసన్ తొందరగా తయారైపోవటం మామూలు. అతను తన ఇంటినుండి బయలుదేరి తిరుమాల్ ఇంటి అరుగుమీదకొచ్చి కూర్చుని అతనికోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. వాళ్లది పెద్ద ఇల్లు. బయటినుండి లోపలికి చూస్తే అంతా స్పష్టంగా కనిపించేది. అంత పెద్ద ఇంటిని చూస్తున్నకొద్దీ అతని కళ్లూ పెద్దవయ్యేవి. ఒకరోజు అలా చూస్తున్న అన్బరసన్‌ను లాక్కెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు తిరుమాల్. అతని తల్లి అదిరిపడి వాణ్ణి గట్టిగా అరిచింది. ఆమెను కోప్పడి, గోపాల్ అన్బరసన్‌కు ఏవో తినుబండారాల్నిచ్చి పంపించాడు.‘‘చిన్నపిల్లల్ని అలా కోపంగా అరుస్తావేం? వస్తే రానీ... వదిలెయ్!’’అన్బరసన్ వాళ్లనాన్న ఊరి తోటోడిగా ఉండటంవల్లనూ, ఆ ఊళ్లోనూ చుట్టుపక్కలా లేచే చావులకు డప్పు కొట్టటానికి అన్బరసన్‌ను కూడా తనతోపాటు తీసుకెళ్లేవాడు. మొదట్లో బాగానే అనిపించింది, తర్వాత నచ్చకుండాపోయింది. తనతోపాటు చదువుకునే వాళ్లిండ్లల్లోని చావులకూ, వాళ్ల వీధుల్లోనూ డప్పుకొట్టటం వల్ల వాళ్లు తననుచూసి ఎగతాళిగా నవ్వుకోవటాన్ని అర్థంచేసుకున్నాడు అన్బరసన్. అతను డప్పుకొట్టటానికి నిరాకరించినందుకు వాళ్లనాన్న అరుస్తున్నప్పుడల్లావాడి వయసు ఆయనకు అడ్డుగా నిలిచేది. ‘‘అన్నను పిలచకపో.’’ అనేవాడు.‘‘అన్న పెద్ద ఇస్కూలు సదువుతున్నాడురా. నీకేంటీ, నువ్వు సిన్నపిలగాడివేగా?’’‘‘నాతో చదువుకునే పిలకాయలు నన్నుచూసి ఎగతాళి చేస్తున్నారు.’’‘‘ఔను. ఈ ఇంటిని వెతుక్కుంటా వొచ్చి పుట్టినావు సూడూ. మరి ఇట్టాటివాటికంతా సిగ్గుపడతా కూసుంటే అవుతుందా రా?’’ అన్బరసన్ బడికి రాలేదంటే, అతను డప్పుకోట్టటం కోసమే వెళ్లుంటాడని తిరుమాల్ అనుకోవటం మామూలైపోయింది. మరునాడు అతణ్ణి చూడగానే తిరుమాల్ మొదట దాని గురించే అడిగేవాడు: ‘‘నిన్నఎక్కడ్రా మేళం కొట్టావు?’’ అతని నుండి ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా అన్బరసన్ మౌనం వహించేవాడు. అతని మౌనం తిరుమాల్కు ఏదో తెలియజేస్తున్నట్టుగా ఉండటంతో అలా అడగటం క్రమంగా తగ్గించేశాడు. వాళ్లిద్దరూ జతగానే ఇంటర్మీడియెట్‌కు వెళ్లారు. బావా బామ్మర్దులని పిలుచుకునేందుకు అలవాటుపడ్డారు. పుట్టినరోజప్పుడు ఒకరికొకరు కేక్‌లు కట్‌చేసి, తరగతిని సందడి చేశారు. ఎంత బాగా లెక్కలు చేసినప్పటికీ అన్బరసన్‌కు పూర్తి మార్కులు వెయ్యని వెంకటాచలపతి లెక్చరర్‌తో తిరుమాల్ గొడవకు దిగేవాడు. ‘‘ఒరేయ్. నువ్వూ వాడూ ఎవర్రా? బావా బామ్మర్దులని కలవరిస్తున్నారు? ఏం, పిల్లనిచ్చి పిల్లను తీసుకోబోతారా ఏంటీ?’’ అని అడిగినవాళ్లకు ఔననే బదులు చెప్పేవాడు అన్బరసన్. అన్బరసన్, తిరుమాల్ ఒకే డిగ్రీ కాలేజీలో చదవటానికి చేరారు. హాస్టల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు జరిగిన ఫంక్షన్లో అన్బరసన్‌ను డప్పు వాయించమని అందరూ అడిగినప్పుడు అతను అదిరిపడ్డాడు.అతను నిరాకరించగానే అందరూ అతణ్ణి వింతగా చూశారు. అవమానంతో వెనక్కు తిరిగిన అన్బరసన్‌కు తిరుమాల్ నవ్వు మరింత బాధను కలిగించింది.‘‘ఏరా బామ్మర్దీ కాదంటున్నావు? ఏదో సరదా కోసమే కదరా ఇదంతా? వాయించరా’’‘‘నావల్ల కాదురా. నాకు డప్పుకొట్టటం వచ్చని వీళ్లకెందుకు చెప్పావు?’’‘‘ఇందులో తప్పేముందిరా. ఇది ఒక స్కిల్లు రా!’’‘‘ఇది స్కిల్లు అయితే, దీన్ని నువ్వెందుకు నేర్చుకోలేదు?’’ ‘సారీరా బామ్మర్దీ.’’ అన్నాడు తిరుమాల్. ఆ సంఘటనతో మొదటిసారిగా వాళ్లు కొన్నాళ్లువరకూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండిపోయారు...రైలు తిరుపత్తూరును దాగానే ఊరు వచ్చేసిందని ఏడవటం మొదలుపెట్టాడు తిరుమాల్. ఇంకా ఊరు రాలేదని చెప్పి అతణ్ణి కూర్చోబెట్టిన అన్బరసన్, ఆంబూరులో దిగగానే ఊళ్లోకి వెళ్లటానికి మోటర్‌బైక్‌లను తీసుకురమ్మని స్నేహితులకు ఫోన్లో చెప్పాడు. ఆంబూరు రైల్వేస్టేషన్లో ఇద్దరు స్నేహితులు తమతమ బైక్‌లతో సిద్దంగా ఉన్నారు. మనిషికొక బైక్‌లో వాళ్లు కూర్చున్నారు. తిరుమాల్కు ఏడుపు మొదలైంది. వాళ్లు ఊళ్లోకి ప్రవేశిస్తుండగా డప్పుల శబ్దాలు భయానకంగా వినిపిస్తున్నాయి. ఇంటి ముందు బైక్‌ను ఆపేలోపే తిరుమాల్ ఏడుస్తూ లోపలికి పరుగెత్తాడు. అతని వెనకే అన్బరసన్కూడా వెళ్లాడు. వాళ్లిద్దరూ అద్దాలపెట్టెమీద పడి ఒకరినొకరు వాటేసుకుని భోరుమని ఏడ్చారు. తిరుమాల్ వాళ్లమ్మ కొడుకును పట్టుకొని బావురుమంది. ‘‘ఒరేయ్ తిరు. మీ నాన్న మనల్ని ఒంటరిగా వదిలి వెళ్లిపోయడ్రా... ఏమండీ, మన బిడ్డొచ్చాడు చూడండీ. లేచి వాణ్ణి రారా అని పిలవండీ.’’ పందిట్లో ఉన్న ఆడవాళ్ల శోకాలు మరింత పెద్దవయ్యాయి...ఎదురింటి అరుగుమీద కూర్చుని ఉన్నాడు తిరుమాల్. అన్బరసన్ అతని పక్కనే ఉన్నాడు. అతని తల్లి ఏడుపు మాత్రం ఆగకుండా వినిపిస్తూనే ఉంది. ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. తిరుమాల్లోని అంత కఠినమైన మౌనాన్ని అంతకు మునుపు ఎప్పుడూ చూళ్లేదు అన్బరసన్.ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన తండ్రి శవం తిరుమాల్ను కుదిపేస్తోంది. అతను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.తిరుమాల్ ఒక్కడే కొడుకు కావటంవల్ల మురిపెంగా పెరిగాడు. తన తండ్రి చేతిని పట్టుకుని పంటపొలాల్ని చుట్టి వస్తున్నప్పుడు అన్బరసన్ తాత అతణ్ణి ప్రేమగా ‘చిన్నయ్యా’ అనేవాడు. గోపాల్, కొడుకును ఎప్పుడూ తిట్టింది లేదు. అతణ్ణి కాలేజీ హాస్టల్లో చేర్చటానికి వెళ్లినపుడు తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవటం ఇంకా తిరుమాల్ కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ అతనికి దు:ఖం పొంగుకురాసాగింది.తిరుమాల్ అద్దాల పెట్టె దగ్గరకు వెళ్లటానికి ప్రయత్నించినప్పుడల్లా ఊరి మగాళ్లు కొందరు అన్బరసన్‌ను పిలిచి అతణ్ణి దూరంగా తీసుకెళ్లమని చెబుతున్నారు. బంధువులతో ఒకట్రెండు మాటలే మాట్లాడిన తిరుమాల్ వచ్చినప్పటి నుండి అన్బరసన్ చేతిని పట్టుకునే తిరిగాడు. అతనే కనుక లేకపొయ్యుంటే ఈ ప్రపంచంలో తాను ఒంటరిగా మిగిలిపోయేవాణ్ణని ఆలోచించి వణికిపోయాడు. కొందరు స్నేహితులు అతణ్ణి కంట్రోల్ చెయ్యటానికి అతనిచేత మద్యం తాగించారు. ఆ రాత్రి ఎక్కడ పడుకున్నారో ఇద్దరికీ తెలియదు. ఎండ పైకొచ్చేకొద్దీ మనుషులు రావటం ఎక్కువైంది. డప్పు శబ్దమూ, టపాకాయల శబ్దమూ చెవులను గింగిరాలెత్తిస్తున్నాయి. అన్బరసన్ డప్పు వాయిస్తున్న తన పెదనాన్ననూ, అతని కొడుకునూ చూస్తూ ఉండిపోయాడు. తన తండ్రి తోటి పనిని వదిలేసినప్పటి నుండి తన చిన్నాన్నలు, పెదనాన్నలు ఆ బాధ్యతను తీసుకున్నట్టుగా అర్థంచేసుకున్నాడు. ఆ వీధివీధంతా పూల పరిమళమూ, అగరువత్తుల వాసనతో నిండిపోయింది. పాడెను కట్టటమూ, గుంతను తవ్వటమూ అన్బరసన్ వాళ్లనాన్నే ముందుండి జరిపిస్తున్నట్టుగా ఉంది. సమయం గడుస్తున్నకొద్దీ అక్కడున్నవాళ్లు తొందరపెట్టసాగారు. ‘‘జరగాల్సింది చూడండయ్యా. రావుకాలానికి ముందే ఎత్తేయ్యాలి.’’గోపాల్ శరీరాన్ని అద్దాలపెట్టెలో నుండి బయటికి తీసి ఒక కట్టెమంచంమీద పడుకోబెట్టారు. నూనె, శీకాయపొడి రసం వేర్వేరు గిన్నెల్లో పెట్టారు. ‘‘దాయాదులు, ఒకింటోళ్లందరూ ప్రదక్షిణం చేసొచ్చి నూనె అంటండయ్యా, నీళ్లు పొయ్యాలి.’’ కార్యాన్ని నిర్వహిస్తున్న పెద్దాయన చెప్పగానే బంధువులు శవాన్ని ప్రదక్షిణం చెయ్యటం కోసం తయారయ్యారు. తిరుమాల్ను తీసుకురమ్మని ఎవరో గట్టిగా చెప్పారు. నీరసంగా ఉన్న అతణ్ణి అన్బరసన్ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. తండ్రి శవాన్ని చూడగానే మళ్లీ దు:ఖం పొంగుకొచ్చి ఏడ్చాడు తిరుమాల్. అతనితో కలిసి అన్బరసన్ కూడా ఏడ్చాడు. ఏడుపూ, కన్నీళ్లతో కదిలి వరుసలో వాళ్లిద్దరూ శవాన్ని మూడుసార్లు చుట్టొచ్చి తలకు నూనెను అంటారు. తండ్రి ఒంటిమీద నీళ్లు పోస్తున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు తిరుమాల్.పాడెను తీసుకొచ్చి గోపాల్ శవాన్ని దానిమీద పడుకోబెట్టారు. అప్పుడు ఆడవాళ్ల ఏడుపు శబ్దం గుండెల్ని పిండేస్తున్నట్టుగా అనిపించింది. ఊరేగింపు మొదలుకాగానే చాకలివాళ్లు పాడెకు ముందు పాత చీరలను పరుస్తూ వెళ్లారు. పాడెమీద వువ్వులూ చిల్లరా విసరబడింది. నిప్పుచట్టితో నడుస్తున్న తిరుమాల్ను నడిపించుకుంటూ అన్బరసన్ పాడెకు ముందు నడిచాడు. కొన్ని సమయాల్లో అతను పాడెను మోసేవాళ్లతో కలిసి భుజం మార్చుకున్నాడు. చావు ఎత్తిన రెండు రోజులకంతా ఊళ్లో పుకార్లు లేచాయి. ఆ సాయంత్రం ఊరి పంచాయితీ జరగనున్నట్టుగా చెప్పుకున్నారు. ఊరంతా అన్బరసన్ గురించే మాట్లాడుకుంటున్నారని వాళ్లనాన్న చెప్పాడు. ‘‘ఏరా నాయనా అట్టా జేసినావ్? అతనెంత సావాసగాడైనప్పటికీ మనం ఏరే, ఆళ్లు ఏరే రా. తరతరాలుగా ఆళ్ళ నీడలో బతికే వోళ్లం మనం.’’ అంటూ యాస్టపోయాడు వాళ్ల తాత. ఊరంతా ఒక పెద్ద మృగంగా మారి అతని ముందు లేచి నిలబడింది. దాని ముఖం ఇంత భయానకంగా ఉంటుందా అనుకున్నాడు అన్బరసన్. ‘తిరుమాల్తో కలిసి గోపాల్మామయ్య శవాన్ని ప్రదక్షిణ చెయ్యటం ఎలా తప్పవుతుంది? ఇష్టంతో చేసింది ఎలా నేరమవుతుంది? ప్రేమను పంచాలని భావించే నన్నెందుకు తప్పుబడుతోంది ఈ ఊరు? గోపాల్ మామయ్య నాకు ఎంతో చేశారే?’ అని అతనిలో ఆలోచనలు సుడులు తిరగసాగాయి.‘‘ఔను. సదువుకున్న పిలగాడు దేన్నీ మనసులో దాసుకోకుండా చేసేశాడు. ఈ ఊరి పద్ధతులన్నీ వాడికెలా తెలస్తాయి? మనం కళ్లాల్లో తొక్కీ ఊడ్సీ పంపించేదేగా ఆళ్లు తింటారు. అప్పుడంతా మనమెవరమో తెలియదంటనా?’’ అమ్మ పనులు చేసుకుంటూ తనలో తాను కోపంగా అనుకుంటున్న మాటలే అన్బరసన్ మనసులోనూ కదలాడుతున్నాయి. అతను గోపాల్ మామయ్య శవాన్ని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవరో అరిచిన అరుపు ఇప్పుడు గట్టిగా ధ్వనించింది. దాంతోపాటు అతను తిరుమాల్తో కలిసి వాళ్ల వీధిలో ఆడుకుంటున్నప్పుడు అతణ్ణి తరమగొట్టిన గొంతు. నాన్న, గోపాల్మామయ్యను ‘నాయకరావ్’ అని ఆప్యాయంగా పిలిచిన గొంతూ, తాత ఆయన్ను ‘సామీ’ అన్న గొంతూ నలు దిక్కులనుండీ అతణ్ణి చుట్టుముట్టాయి.ఆ సాయంత్రం జరగబోయే ఊరి పంచాయతీకి ఎలా వెళ్లటమా అని అన్బరసన్ కలతపడుతున్నప్పుడు తిరుమాల్ తాను కూడా అక్కడికి వస్తానని చెప్పటం అతనికెంతో ఓదార్పునిచ్చింది. ‘‘కానీరా బామ్మర్దీ, చూసుకుందాం!’’ఊరికి మధ్యలో ఉంది రచ్చబండ. అక్కడ జనం బాగానే గుమిగూడారు. పెద్దమనుషులు కొందరు రావిచెట్టు కిందున్న రాతిబండమీద కూర్చొని ఉన్నారు. ఒకపక్కన ఆదుర్దాగా నిలబడున్న అన్బరసన్తో కలిసి తిరుమాల్కూడా నిలబడున్నాడు. వాళ్లకు తోడుగా అన్బరసన్ వాళ్ల నాన్న, తాత ఉన్నారు. వాళ్లు అప్పటికే మాట్లాడుకుని ఉంటారని అన్బరసన్‌కు అనిపించింది. ఒక పెద్దమనిషి నోరు విప్పాడు: ‘‘పడుకోవటానికి చోటిస్తే చాపనే లాక్కుంటార్రా? స్నేహితుడంటే గుమ్మం దగ్గరే నిలబడాలి. మాతో కలిసి మీరూ శవాన్ని చుడితే ఏమిటర్థం? మాకు మీరు దాయాదులా? భాగస్తులా? ఆ... గోపాల్ గాంధీ అదీఇదీ అని మాట్లాడుతూ గొప్ప లక్ష్యంతో ఉండిపోయాడు.అందుకనీ అతనింటి ఉప్పు తిని అతనికే ద్రోహం చేస్త్రారా?’’ ఎవరూ మాట్లాడలేదు. అన్బరసన్ వాళ్ల నాన్న మాత్రం వినయంగా అన్నాడు: ‘‘ఏదో అమాయకుడు. తెలియకుండా చేసేశాడు!’’‘అమాయకుడని వొదిలేస్తే రేపు అందరూ ఇలాగే చేస్తారు. ఎవడికీ భయం లేకుండాపోతుంది. అందుకనీ... ఊరి పంచాయతిలో నిర్ణయించాలనుకున్నది ఇదే. ఇకమీదట మీరెవరూ మాకు డప్పు కొట్టటానికో, గుంత తవ్వటానికో, శవం ముందు శోకాలు పెట్టటానికో వద్దు. వేరే ఊరివాళ్లను పిలుచుకొచ్చి మేమే చూసుకుంటాం. దాంతోపాటు ఊరి కట్టుబాటును మీరిన మునిరత్నం ఇంటివాళ్లతో ఈ రోజుటి నుండి ఒక యేడాది వరకూ ఊళ్లో వున్న వాళ్లెవరూ సంబంధం పెట్టుకోకూడదు.’’అక్కడ గాఢమైన నిశ్శబ్దం నెలకొంది.ఊరి నిర్ణయం వినగానే అన్బరసన్ వణికిపోయాడు. తండ్రికేసి దీనంగా చూశాడతను. ఆయన ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నట్టుగా అనిపించింది. ఉన్నట్టుండి వేరొక గ్రహం మీద, భాష తెలియని, మనిషి భావాలు గ్రహించని ఒక గుంపు ముందర నిలబడున్నట్టుగా భయం కలిగింది. అతను ఏదో మాట్లాడ్డానికి నోరు తెరిచేలోపలే వాళ్ల నాన్న అతని చేతిని పట్టుకుని ఆపాడు.‘‘మీరు సెప్పిన ఆ మాటలే గొప్పవి. గోపాల్ నాయకర్ పొలంలో పనిజేశామన్న ఒక్క విషయానికే నేనూ తలవొంచుతున్నాను. అంతకుమించి ఇంకేమీ లేదు. ఊరి వాళ్లనుండి వెలి వేయ్యడాన్నంతా నేనొప్పుకోను. కాలం మారుతోంది. కాస్త మూతీ మొగమూ జూసి మాట్లాడండి. ఏదో సదువుకున్న పిలగాడు తెలియకుండా చేసేశాడు. మమ్మల్ని డప్పు వాయించొద్దన్నారు. సరే. తర్వాత బయటూళ్ల నుండి ఎందుకు మనుషుల్ని పిలచకొస్తారు. మీరే వాయించుకోండి?’’తండ్రి మాటలు ఊరి పెద్దమనుషుల్లో ఆవేశాన్ని తెప్పించాయి.‘‘ఏంట్రా మాటలు మీరుతున్నాయి? మాలాగా చదువుకుని ప్యాంటూ షర్టూ వేసుకుంటే అన్నీ మారిపోతాయా?’’ తిరుమాల్ వయస్సుండే ఒకడు ఉన్నట్టుండి పైకిలేచి అన్బరసన్‌ను తిడుతూ అతని మీదికి దూసుకెళ్లాడు. ‘‘ఏంటయ్యా వీళ్లతో ఇంకా మాలూ. వీళ్లతో అంతా మర్యాదగా మాట్లాడకూడదు. మావాణ్ణి ఒరేయ్ ఒరేయ్ అంటావ్. కలిసి తిరగతావ్? చెవుల్లో ఏం పూడుకుపోయింది?’’ దూసుకొచ్చినవాడి ముఖంలో ఒక్క గుద్దు గుద్ది పక్కకు తోసేశాడు తిరుమాల్. వాడు క్రింద పడగానేఊరి జనానుండి పెద్దగా అరుపులు వినిపించాయి. అన్బరసన్ వాళ్ల నాన్న ముందుకొచ్చి గట్టిగా అరిచాడు: ‘‘ఓ పెద్ద మనిషీ ఇదంతా ఏమీ బాగాలేదు!’’పెద్దవాళ్లల్లో ఒకళ్లిద్దరు లేచి గట్టిగా అరిచి గుంపును శాంతపరిచారు. అక్కడ మళ్లీ నిశబ్దం అలుముకుంది. దెబ్బతిన్నవాడు తిరుమాల్ను గుర్రుగా చూశాడు. ‘‘ఒరేయ్ తిరుమాల్. నువ్వు చిన్నవాడివి. నీకు పద్ధతులు అవీ తెలియవు. మాట్లాడకుండా ఉండు.’’తిరుమాల్ బదులుకు కోపంగా అన్నాడు. ‘‘చిన్నవాళ్లకూ పెద్దవాళ్లకూ ఒకటే న్యాయం. మా నాన్న శవాన్నేగా అన్బరసన్ ప్రదక్షిణ చేశాడు. పర్వాలేదు. ఆ విషయాన్ని పట్టుకుని ఊళ్లో సమస్యలొద్దు.వెలి వెయ్యటం అంటూ మాట్లాడితే తర్వాత నేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది.’’తిరుమాల్ మాటల తర్వాత ఊరి జనాలు మనిషికొక మాట మాట్లాడసాగారు. గుంపులో కలకలం బయలుదేరింది. ‘‘కలిసికట్టుతనం అంటూ లేని ఇదీ ఒక ఊరా?’’ పెద్దమనుషులు కోపంగా లేచి నిలబడగానే ఊరి జనం ఒక్కొక్కళ్లుగా లేచి వెళ్లిపోవటం మొదలుపెట్టారు. తిరుమాల్ అన్బరసన్ భుజాన్ని గట్టిగా పట్టుకుని...‘‘ఏరా బామ్మర్దీ?’’అన్నాడు. అంతేనంటూ తలాడిస్తూ అన్బరసన్ తల వంచుకొని నవ్వుకున్నాడు. తమిళ మూలం : అళగియ పెరియవన్ అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ -
బాబా చేసే చిత్రవిచిత్రాలు అంతరార్థాలు
యోగుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు విధానం. భక్తులైనవారికి ఆ తాదాత్మ్యబుద్ధి(ఎలాగైనా ఆ దర్శించుకుంటున్న యోగియందే బుద్ధి కలిగి ఆయన దృష్టిలోనే ఆలోచించగలిగిన తనం) గాని ఉన్న పక్షంలో తప్పక కొంత కాలానికి అర్థమౌతారు ఆ మహనీయులు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే భక్తులకి సహనం తక్కువ. ‘ఫలానావారి దగ్గరికి వెళ్లాను. దర్శించాను. వారం తిరక్కుండా ఈ మంచి జరిగింది...’ అనే ఈ తీరు లాభదృష్టి వారిది తప్ప మహనీయుల ద్వారా తెలుసుకోదగ్గ గొప్పదనాలేమిటనే తీరు ఆలోచన నూటికి తొంభైమందికి ఉండదనేది నూటికి నూరు పాళ్లు నిజం. అందుకే తమదైన దృష్టితో ఆలోచిస్తూ భక్తులు ‘ఫలానా స్వాములవారు ఇలా.. ఫలానా వారు అలా..’ అంటూ లో–దృష్టి లేకుండా నోరు పడేసుకుంటూ ఉంటారు. అలాంటి నిందలకి సాయి కూడా దూరంగా లేడు. ఆయన్ని ‘కోపిష్ఠి అనీ, ఎప్పుడేం చేస్తాడో అర్థం కానీయనివాడనీ, ఒకసారి గొప్పగా చూస్తూ మరోసారి తొక్కి వేస్తాడనీ..’ ఇలా మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఉన్నతత్వం గురించి తెలుసుకుందామని కనీసం ప్రయత్నించనివారూ కొంతకాలం ప్రయత్నించి అర్థం చేసుకోలేనివారున్నూ. ఏదో అయిపోతుంది..! డాక్టరు పండిత్ అనే ఆయన సాయి మీది సంపూర్ణ భక్తివిశ్వాసాలతో సాయిదర్శనానికి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి సాయి పూజకోసం అన్ని ఏర్పాట్లూ అయిపోయాయి. పూజా సామగ్రితో దాదాభట్ అనే భక్తుడు మసీదుకి వచ్చాడు. అతడు వెళ్తుంటే డాక్టర్ పండిత్ కూడా ఆయన వెంట సాయి వద్దకి అప్రయత్నంగా వెళ్లిపోయాడు.సాయి నుదుటికి ప్రతిరోజూ ఖండోబా అనే గ్రామదేవత ఆలయపూజారి మహల్సాపతి మాత్రమే చందనాన్ని త్రిపుండ్రాకారంలో (మూడు అడ్డగీతల రూపంలో) రాస్తూ ఉండేవాడు. దాదాభట్ సాయిపాదాల మీద పుష్పాలని వేయడం వంటివన్నీ ముగించి అలా ఉన్నంతలో అక్కడి సంప్రదాయం, పూజావిధానం గురించిన అవగాహన ఏ మాత్రమూ లేని డాక్టర్ పండిత్ వెంటనే ఆ పూజాద్రవ్యాలన్నీ ఉన్న పళ్లెంలో కన్పిస్తున్న చందనాన్ని స్వయంగా తీసి సాయి నుదుటిమీద త్రిపుండ్రాకారంలో రాసాడు. భక్తులంతా బెంబేలు పడిపోసాగారు. మహల్సాపతి తప్ప మరెవరూ ఆ పనిని చేయడానికి సాయి ఏనాడూ అంగీకరించడే! పైగా ఎవరైనా రాయబోతే అభ్యంతరాన్ని కూడా చెప్తూండేవాడే! అంతటి సాయి ఇలా చిన్నపిల్లవాని నుదుటికి తల్లి బొట్టుని పెడుతూ ఉంటే చక్కగా బుద్ధిగా పెట్టించుకున్నట్టు సాయి ఇలా మౌనంగా, ఇష్టంగా అంగీకరించడమేమిటి? అని అందరూ తమలో తాము అనుకోసాగారు. సాయి విషయంలో ఎవరికైనా లోపల అనుకోవడం మాత్రమే ఉంటుంది తప్ప, ధైర్యంగా నిలిచి అడిగే శక్తి ఉండదు. దానికి కారణం సాయి ఎక్కడా లో–అర్థం లేకుండా ఏ చేష్టనీ చేసి ఉండలేదు. చేయడు కాబట్టి.. ఎవరినీ ఆ చేష్టకారణంగా నొచ్చుకునేలా చేసి ఉండే తీరు మనస్తత్వం కలవాడు కాడు కాబట్టీ. ఆ పూట పూజంతా అయిపోయింది సవ్యంగా సక్రమంగా.ఆనాటి సాయంత్రం పూజాపళ్లెరాన్ని సాయివద్దకి ఉదయం తీసుకుని వెళ్లిన దాదాభట్టే సాయికి నమస్కరించి వినయంతో సాయీ! ఓ విషయాన్ని మనవి చేసుకోవచ్చా?’ అని అడిగి అనుమతినిచ్చినట్లుగా సాయి చిరునవ్వు నవ్వడంతో ‘ఉదయం డాక్టర్ పండిత్ తమ నుదుటన చందనాన్ని త్రిపుండ్రాకారంలో రాస్తూంటే మీరు మౌనంగానే ఉన్నారే! ఎప్పుడూ మహల్సాపతిని మాత్రమే అంగీకరిస్తూ మేం ఎవరం వచ్చినా తిరస్కరిస్తుంటే మీరు ఆ చందనలేపనాన్ని అలా ఎందుకు అంగీకరించారు?’ అని కొంత భయంతో కొంత ధైర్యంతో అడిగాడు.నిదానమైన కంఠస్వరంతో సాయి ఇలా అన్నాడు. ‘‘దాదాభట్టూ! అసలు విషయాన్ని విను. డాక్టర్ పండిత్ భక్తుడన్నమాట నిజమే. అయితే ఆయన కులవిధానం ప్రకారం బ్రాహ్మణుడు. అంతేకాదు. ఇంట్లో చక్కని సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణుడే తప్ప కేవలం జాతికి మాత్రమే బ్రాహ్మణునిగా కన్పించే ఏ కొందరివంటి వాడో కాడు. నేను నన్ను గమనించుకుని చూస్తే, ఏ పూజలకి అతిముఖ్యమైనది ఉపవసించడమనే దాన్ని బ్రాహ్మణులు పాటిస్తారో ఆ ఉపవాసవిధిని పాటించని వాణ్ణి.. ఉపవాసం అక్కరలేదని ఆ విధానాన్ని నిరసించేవాణ్ని కూడా. రోజూ ఉదయకాలంలోనే నిద్రలేచి స్నానమైతే తప్ప ఏ నిత్యదైనందిన కార్యక్రమాల్లోకి దిగనివారు బ్రాహ్మణులో, ఆ కార్యక్రమాల్లో ప్రారంభ కార్యక్రమం దైవపూజో ఆ విధానాన్ని కచ్చితంగా పాటించే జాతి వారిది. ఒక్కో సందర్భంలో స్నానాన్ని కూడా చేయని రోజులుంటాయి నా జీవితంలో. వాళ్ల జీవితాల్లో కుటుంబాల్లో స్త్రీలు అశుచిగా ఉండే మూడురోజులూ పైగా ఆ పైరోజును కూడా అశుచిగానే ఉన్నట్లు లెక్కిస్తూ 4 వరోజు ఉదయం స్నానాన్ని ముగించినా వంటావార్పు కార్యక్రమంలో భాగస్వాములు కానేకారు, అంతే కాక ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి పేరిట బాంధవ్యపు దగ్గరి దూరం తనాల లెక్క ప్రకారం ఇన్ని రోజులు, అన్ని రోజులు అంటూ అన్ని రోజులపాటు మైలుని (అంటు లేదా అశుచి) పాటించే లక్షణం వారిది.ఇలాంటి విధానం లేనేలేదు. ఎవరైనా మరణించిన సందర్భంలో మా ముసల్మానులలో. స్త్రీలకి సంబంధించిన విషయం నాకు అవసరం లేనిది కదా!ఇలా ఎన్ని విధాల పరిశీలించుకున్నా డాక్టర్ పండితానికి నాకూ ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయితే డాక్టరు పండిత్ నా వద్దకి వస్తూనే కేవలం ఆ ముఖంలో భక్తి తత్పరతని కన్పింపజేస్తూ వచ్చాడే తప్ప లోపల ఏ విధమైన బెరుకుతనమూ అతనిలో లేనే లేదు. బ్రాహ్మణుడినే ఆ ముసల్మానునికి సేవ చేయడమా? మైలపడిపోనా? ఈ తీరు ధోరణే అతనిలో లేదు.మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం – లోదృష్టితో అంతరాంతర విశేషాలని గమనించగలిగిన అవయవమూ కన్ను మాత్రమే. ఆ కారణంగా ఆ కన్ను తనలో దాగిన ఆంతర్యాన్ని బయటపెట్టకుండా ఉండనే లేదు. ఏదో ఒక దృక్కోణంలో వచ్చిన వ్యక్తి లో–దృష్టి ఏమైయుంటుందనే స్పష్టతని ఇచ్చి తీరుతుంది. ఆ దృష్టితో చూస్తే డాక్టరు పండితుని దృష్టి కేవలం భక్తి తత్పరతే తప్ప మరొక్కటి అందులో కన్పడనేలేదు. ఏదో ఓ సద్బ్రాహ్మణుడొచ్చి నానుదుటికి చందనాన్ని రాస్తే దాన్ని గమనించి మీరంతా నన్ను మరింత గొప్పవానిగా భావించాలనే ఆలోచనా ఊహా నాకు కలలో కూడా లేవు. ఉండవు కూడా. అతనిలో నాకు నచ్చింది కేవలం నిష్కల్మష భక్తి మాత్రమే ఉండటం. ఈ నిజాన్ని మనకి తెలియజేప్పేందుకు భగవంతుడు కూడా ఏదో ఒకే ఒక్క కులాన్ని లక్ష్యంగా చేసుకుని తాను జన్మించడం కాకుండా రామచంద్రునిగా క్షత్రియకులంలో కృష్ణమూర్తిగా గోపకులంలో యాదవునిగా..... ఇలా ఉద్భవించి కన్పిస్తాడు.చందనాన్ని రాయవలసిందని నేను అతణ్ణి ఆదేశించడం గానీ మరెవ్వరు గానీ సూచించనూ లేదు. అతనంత అతనే స్వయంగా చందనాన్ని చేతికి తీసుకుని నా నుదుటికి అందునా త్రిపుండ్రాకారంలో రాసాడంటే అది కూడా మానసిక నిష్కల్మషాభావానికి సాక్ష్యంగానే నేను భావిస్తున్నాను.ఈ తీరు తారతమ్య (ఎక్కువ తక్కువ అనే భేదం) భావాలని తొలగించుకోగలిగినప్పుడే భగవంతుని సమత్వాన్ని (అందరి విషయంలోనూ ఒకేలా ఉండగలిగిన తనాన్ని) దర్శించగలం! అందుకే ఆయనకున్న పేర్లలో ఒకటి ‘సమదర్శనః’ అనేది. ఒక్కోసారి....! అవును! నన్నొక్కసారి గమనిస్తూ నా వింత చేష్టలని దర్శిస్తూ భక్తులంతా తలకిందులైపోతూ ఉంటారు. అలా ఉండడాన్ని నేను గమనిస్తూనే ఉంటాను. మరి గమనిస్తూ ఉండి కూడా అలా ఎందుకు ప్రవర్తించాలి? అనేది భక్తుల ఆలోచన. ఇదే తెలుసుకోవాల్సిన రహస్యం.అనేక జాతులు, మతాలు, కులాలు, స్త్రీ, పురుష, బాల, వృద్ధ, వితంతు అనేక వృత్తిదారులైన వాళ్లు ఇక్కడికి వారివారి సహజ జన్మసంస్కారాలతో వస్తూంటే వారందరినీ ఒకే మార్గంలో నడిపించాలంటే కావలసింది ఏకత్వమార్గం. అగ్నిలో పచ్చని, తెల్లని, నల్లని, ఎర్రని... మృదువైన, కఠినమైన... ఎండిన, తడిగా ఉన్న, లోహరూపంగా ఉన్న, శరీర రూపంలో ఉన్న, ఏ పదార్థం పడినా.. అన్నీ అగ్ని రూపంలోనే అయిపోయి చివరికి ఒకేతీరు భస్మం ఎలా వస్తోందో అదే తీరుగా మీ అందరిలోని భిన్నత్వమూ పోయి ఏకత్వమే రావాలి. అందుకే ఈ తపనంతా!కొందరిచేత చందనాన్ని రాయనీయడనీ, కొందరికి మాత్రమే ఆ అవకాశాన్నిస్తాడనీ అనుకోవద్దు! ఆ డాక్టర్ పండిత్ హృదయం సంపూర్ణ నిష్కల్మషమయంగా ఉంది కాబట్టే నా లో–అభిప్రాయాన్ని తాను అడిగి తెలుసుకున్నట్టుగా ఆ చందనాన్ని ఏ బొట్టు పెట్టడం మాదిరిగా చుక్కబొట్టు పెట్టడం కాకుండానూ, కేవలం త్రిపుండ్రాకారంలోనూ మాత్రమే పెట్టడం జరిగింది! ఇది నిజంగా ఆశ్చర్యకరం కాదూ!ఎక్కడినుండో పడిన వర్షం చుక్కచుక్కగా పడి చిన్న సెలయేరుగా మారి, ఆ సెలయేళ్లన్నీ ఓ నదిగా మారి, ఆ నదులన్నీ సముద్రం వైపుకి వేగంగా పరుగెత్తుకుని వచ్చి సముద్రంలో కలుస్తూ సముద్రానికున్న లోతుతనాన్నీ, సముద్రానికున్న ఉప్పదనాన్నీ, సముద్రానికున్న కెరటపుతనాన్నీ, సముద్రానికున్న సుడిగుండాల పద్ధతినీ, అనుక్షణం ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్లే లక్షణాన్నీ అంటే నదికి వీటిలో ఏ ఒక్క విధానమూ లేకున్న తనాలని కలిగి ఉన్న సముద్రంలో ఐక్యమైపోతూ ఉంటే వద్దువద్దని సముద్రం అంటోందా? అందా? నేను కూడా నా భక్తుల అసమానతలని తొలగించాలని ప్రయత్నించేవాడినే తప్ప ‘నా మాటే సాగాలి’ అని భావించే నిరంకుశుణ్ణి కాను. ఏదో తీవ్రమైన ఆనందం ఉత్సాహంతో అనుకున్న క్షణంలో ఏదో పెద్ద భవంతిని నిర్మించాలని భక్తులంతా అనుకున్న వేళ అది సరికాని సమయమని స్పష్టంగా తెలిసిన నేను –వారి ఉత్సాహాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ పని మొత్తం పూర్తయిపోయేలా చేసి ఆ మీదట ఏవైనా తేడాలు ఉపద్రవాలూ జరిగితే ‘‘చెబుదామనే అనుకున్నానుగానీ మీ ఉత్సాహాన్ని చల్లార్చడం ఇష్టం లేక ఊరుకున్నాను’’ అని అంటే అది ఎంత ద్రోహం?? ఎంత అపచారం???నా మాటలు అప్పుడప్పుడు మీకు కఠినంగానూ పెళుసుగానూ అనిపించవచ్చు. వాటికి నేనేమీ పశ్చాత్తాపపడను. మరాఠా భాషలో ‘ఓవీ’లనే పేరిట (తెలుగులో కందం తేటగీతి పద్యాల్లా.. సంస్కృతంలో శార్దూలం మత్తేభం పద్యాల్లాగా.. ఆంగ్లంలో సానెట్స్.....) ఛందస్సులో ఒకటుంది. తెల్లబడాలనే ఉద్దేశంతో పిల్లవాడు జిల్లేడు పాలని ఒంటికి రాసుకోబోతుంటే... ఏముందో చూద్దామని పిల్లవాడు పాముల పుట్టలోకి చేతిని దూర్చబోతుంటే... చురకత్తి పదునుతో గోళ్లని తెంచుకుందామని పిల్లవాడు ప్రయత్నించబోతుంటే.. ఏ తల్లైనా ‘ఎంత ప్రయోజకుడు నా పుత్రుడు? అనుకుంటుందా? లేక చెళ్లున చెంపమీద ఒకటి వేస్తుందా?’ అని ఆ ఓవీకి అర్థం. అదే నా లక్షణం. లక్ష్యం కూడా.అల్లాహ్ అక్బర్ ఈ విధానాన్ని సరైనదని అంగీకరించాడూ అంగీకరిస్తున్నాడూ కాబట్టే ఇంత చిత్రవిచిత్ర విధానాలనీ చేష్టలనీ ప్రదర్శిస్తున్నా (నాకు తెలియని భావోద్వేగ స్థితిలోనే సుమా!) మీరంతా ఇక్కడే ఉంటూ లేదా ఎక్కడి నుండో వస్తూ అదే భక్తి తత్పరతలని చూపిస్తున్నారు.ఒక్కటి మాత్రం సత్యం.వర్షం వస్తోందనో ఎండ వేడిమి బాగా ఉందనో అలాంటి ఉద్దేశంతో బాటసారి, ఆ చెట్టు నీడని కాసేపు తలదాచుకున్నప్పుడు ఇంకా వర్షం కురుస్తోందనీ మీద పడుతున్నాయి చినుకులని అనిపించినా, చెట్టునీడ ఈ ఎండకి సరిపోలేదని అనిపించినా వెంటనే చెట్టుని విడిచిపోతాడు తప్ప చెట్టు ఆ బాటసారిని ప్రార్థించదు ఇక్కడే ఉండవలసిందని. ముగింపుగా మరోమాటని వినండి. ‘మీరు వెళ్లి ఆ డాక్టర్ పండితుడిని ‘నువ్వు ఎవరూ చెప్పకుండా ఆ చందనాన్ని అలాగే త్రిపుండ్రాకారంగా రాయాలని ఎందుకనుకున్నావు?’ అని అడగండి. అతడి దృష్టి నా దృష్టి ఆ సమయంలో ఒకేలా ప్రసరించింది కాబట్టి అతడు చెప్పేదాన్ని విని నిర్ణయించుకోండి’ అని ముగించాడు సాయి.భక్తుల్లో ఏ ఒక్కరూ ఆ సాహసాన్ని అవినయమౌతుందనే భావనతో ప్రశ్నించలేదు గానీ, దాదాభట్ మాత్రం డాక్టర్ని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు – ‘అప్పటివరకూ ఏదో భక్తునిగా వెళ్లాలని భావించాను గానీ ఆ సమయంలో నాకు సాయి సాక్షాత్తు నా జీవిత మార్గదర్శకుడైన గురువు’ అని అనిపించింది. అందుకే అప్రయత్నంగా ఆయన హృదయంలోనుండి ప్రసరించిన ఆ ఆజ్ఞకి అనుగుణంగా కాబోలు ఆ చందనాన్ని అలా త్రిపుండ్రాకారంలో నుదుటన రాశాను. ఈ అవకాశాన్ని ఎవరికీ సాయి ఇవ్వడనిగానీ, అందుకే మీరు (దాదాభట్) రాసి ఉండలేదని గానీ నాకు తెలియనే తెలియదు’ అన్నాడు.సాయి ప్రతి చేష్టలోనూ ఓ అంతరార్థం ఉండే ఉంటుంది. వాటి గురించి తెలుసుకోనంతకాలం ఆ చేష్టలన్నీ ఏవో ఏవోలా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ అర్థం తెలిసాక, లో–అర్థం అనుభవానికొచ్చాక ‘బాబాయే మా జీవితమార్గదర్శకుడు’ అనే స్థాయి భక్తులమై తీరుతాం నూటికి నూరుపాళ్లూ ఇది నిస్సందేహమైన విషయం.భక్తులే కాక పంచభూతాలు కూడా సాయి అధీనంలో ఉంటాయా? ఎప్పుడు ఎక్కడ? చూద్దాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
కుర్రాళ్లోయ్! గుర్రాలోయ్!!
బిన్నీ, సచిన్... అంతర్జాతీయ కంపెనీకి గుడ్‌బై చెప్పి... ఆ కంపెనీకే పోటీ అయ్యారు. భారీ ఈ–కామర్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. భవీష్... పనితో ప్రేమలో పడిపోయాడు. రోజుకు పద్దెనిమిది గంటలు దాంతోనే!! రొమన్ సైనీ... 21 ఏళ్లకే మెడిసిన్... తర్వాత ఏడాదికే సివిల్స్... అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగం!. అయినా... కిక్కు లేదని ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు.!!రితేష్... కాలేజీ చదువు మధ్యలో వదిలేసి... దేశ మంతా తిరిగాడు. ఆ అనుభవాలతో.. 18 ఏళ్లకే కంపెనీ పెట్టేశాడు. నందన్... ఓ అద్భుతమైన ఐడియాతో ఫెయిలయ్యాడు. అక్కడ నేర్చుకున్న పాఠాలతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. విజయం సాధించాడు. అభిరాజ్ భాల్, వరుణ ఖైతాన్... చక్కని విదేశీ ఉద్యోగాన్ని వదిలేశారు. ఏం చేయాలో తేల్చుకోకుండానే ఇండియాకు తిరిగొచ్చేశారు. వచ్చాక తొలి ప్రయత్నం ఫెయిల్యూరే. మరో ప్రయత్నం భారీ సక్సెస్ ఇచ్చింది. ఇక శ్రీనుబాబు ఫ్రమ్ శ్రీకాకుళం... పాతికేళ్లకే యంగ్ సైంటిస్ట్. అది అందుకునేటపుడు పుట్టిన ప్రశ్న... కంపెనీగా పరిష్కారమయింది. కనిక... ఆలోచనలెప్పుడూ నింగిలోనే. 18 ఏళ్లకే విమాన సంస్థలో ఉద్యోగం. కానీ 22 ఏళ్లకే క్యాన్సర్. డాక్టర్లు కష్టమన్నారు. ఆమె ధైర్యం వదల్లేదు. శరీరం కీమోథెరపీని తట్టుకుంది. మనసు మాత్రం ఓ ఐడియాతో ఆకాశాన్ని అందుకుంది. ఇంతకీ ఎవరు వీళ్లంతా..? ఫ్లిప్‌కార్ట్... ఓలా... అన్అకాడెమీ... ఓయో... స్విగ్గీ... అర్బన్ క్లాప్... పల్సస్... జెట్ సెట్ గో... వంటి దిగ్గజాల ఆవిష్కర్తలు. ‘చేయకుండా ఉండటం కంటే... నచ్చింది చేసి ఫెయిలయినా ఓకే’ అనే సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మిన ఈ నాటి యువతకు ప్రతినిధులు. వీళ్లేకాదు!! పెద్దగా పెట్టుబడి లేకపోయినా.. స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్‌లు పెట్టి విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్ అంబాసిడర్లు. చేసే పనేదో సీరియస్‌గా చెయ్యాలన్నదే వీరి సూత్రం. కాకపోతే వీరికి కలిసొస్తున్నదల్లా... రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ. దాని సాయంతోనే వీరు కొత్త సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. తమ జీవితాన్ని మార్చుకోవటమే కాదు... భారత ముఖచిత్రాన్నే మారుస్తున్నారు. అయితే పైన ప్రస్తావించిన కంపెనీలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ అగ్రిగేటర్లు. అంటే... అవసరం తీర్చేవారిని– అవసరం ఉన్నవారిని కలిపే మధ్యవర్తులన్న మాట. వీటికంటూ సొంత ఉత్పత్తులు, తయారీ కేంద్రాలు వంటివేవీ ఉండవు. ఉన్నదల్లా టెక్నాలజీయే. దాంతోనే ఇవి కొనుగోలుదార్లకు ఎలాంటి బాదరబందీ లేకుండా చేస్తున్నాయి. వారికీ, విక్రయదార్లకు మధ్య తాము ఉంటూ... అమ్మేవారికి సొమ్ము, కొనేవారికి సేవలు సరిగా దక్కేలా చేస్తున్నాయి. మొత్తంగా... ఓ అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి కొన్ని కంపెనీల సారథుల కథలే ఇవి... పదేళ్లు... 1.4 లక్షల కోట్లు!! పనిచేస్తున్న కంపెనీ... ఓ అంతర్జాతీయ దిగ్గజం. చేతిలో పెట్టుబడేదీ లేకుండా ఆ దిగ్గజాన్ని ఢీకొట్టాలంటే!!. ఎవరైనా నవ్విపోతారు.!!. సచిన్ బన్సల్– బిన్నీ బన్సల్ ఊరూ, పేరూ కలిసినా... ఎలాంటి బంధుత్వమూ లేదు. చండీగఢ్‌లో పుట్టి ఇద్దరూ అక్కడే చదువుకున్నారు. ఐఐటీ ఢిల్లీలో కలిశారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఐటీ రాజధాని బెంగళూరుకొచ్చారు. సచిన్ అమెజాన్‌లో చేరాడు. బిన్నీ బన్సల్ మాత్రం గూగుల్‌లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి ఫెయిలయ్యాడు. చివరకు తానూ అమెజాన్లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఇద్దరికీ ఒకటే అనిపించింది. తాము పనిచేస్తున్న అమెజాన్ స్థాయిలో దేశీ ఈ–కామర్స్ కంపెనీలేవీ సేవలందించటం లేదని!!. అంతే... సేవింగ్స్‌గా దాచుకున్న రూ.2 లక్షలూ పెట్టి... తమ ఫ్లాట్‌లోనే 2007లో ‘ఫ్లిప్‌కార్ట్’ను ఆరంభించారు. పుస్తకాలు విక్రయించేవారిని లిస్ట్ చేసి... అమెజాన్ మాదిరే ఆరంభంలో తామూ ఆన్లైన్లో పుస్తకాలు విక్రయించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇరువురి తల్లిదండ్రులూ నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. అది ఆరంభం. తరవాత బుక్స్ నుంచి ఇతరత్రా వస్తువులమ్మే సెల్లర్లను తమ సైట్లో లిస్ట్ చేయటం మొదలెట్టారు. అమెజాన్‌కు పోటీగా దేశీ ఈ–కామర్స్ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్నది తెలిసి... విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. వరసగా ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టారు. కంపెనీ విలువ పెరిగింది. ఇద్దరూ బిలియనీర్లయ్యారు. ఈ మధ్యే ఫ్లిప్‌కార్ట్‌ను రూ.1.4 లక్షల కోట్ల విలువతో అమెరికన్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. ‘‘మా కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. కాకపోతే ఈ–కామర్స్‌లో నాణ్యమైన సేవలందించటమే మా ప్రత్యేకతగా పనిచేశాం. దానిపైనే దృష్టిపెట్టాం. అందుకే నిలబడ్డాం’’ అంటారు బన్సల్ ద్వయం. క్యాబ్ డ్రైర్‌తో గొడవొస్తే...? ఉదయం ఏడుకు లేస్తే రాత్రి ఒంటి గంట వరకూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాడు భవీష్ అగర్వాల్. ఖాళీ దొరికితే సైక్లింగ్ చేస్తాడు. స్క్వాష్ ఆడతాడు. సినిమాలకు, మొబైల్ గేమ్స్‌కు మాత్రం చాలా దూరం. పుట్టింది లుథియానాలో. 2008లో ఐఐటీ బోంబే నుంచి పట్టా అందుకున్నాక మైక్రోసాఫ్ట్‌లో మంచి ఉద్యోగమొచ్చింది. రెండేళ్లే పని చేశాడు. కంప్యూటర్‌కు అతక్కుపోయే ఆ ఉద్యోగంలో కిక్కు లేదనిపించింది. రాజీనామా చేసేశాడు. ముంబయిలో వెబ్సైట్ పెట్టి... ఆన్లైన్లో వివిధ ట్రావెల్ కంపెనీల టూర్ ప్యాకేజీలను విక్రయించటం మొదలెట్టాడు. ‘ట్రావెల్ ఏజెంటుగా మిగిలిపోతావేమో’ అన్నారు అమ్మానాన్నా. ‘పర్వాలేదు కదా!!’ అనుకున్నాడు. ఓసారి బెంగళూరు నుంచి క్యాబ్‌లో బండిపురా నేషనల్ పార్క్‌కు వెళుతున్నాడు భవీష్. దార్లో ఆపేసిన క్యాబ్ డ్రైవర్... ముందు మాట్లాడింది తక్కువని, కాస్త ఎక్కువివ్వాలని పేచీ పెట్టాడు. అలా దార్లో బేరమాడటం భవీష్కు నచ్చలేదు. కుదరదన్నాడు. దీంతో డ్రైవరు దార్లోనే భవీష్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ క్యాబ్ డ్రైవరుపై ఫిర్యాదు చేసి, పోరాడమని సలహా ఇచ్చారు కొందరు. దాంతో లాభం లేదని గ్రహించాడు. ఇంకెవరికీ ఇలాంటివి జరగకుండా టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాడు. అలా పుట్టిందే... ఓలా!!. 2010లో మిత్రుడు అంకిత్ భాటి తోడవటంతో... ఓలా కొత్త మలుపు తిరిగింది. భారీ పెట్టుబడులొచ్చాయి. ఈ కంపెనీ విలువ... దాదాపు రూ.50 వేల కోట్లు!!. క్యాన్సర్ ఇచ్చిన ధైర్యం... ‘జెట్ సెట్ గో’ ఏ విమానంలోనైనా చూడండి! ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. గ్రౌండ్ స్టాఫ్‌లోనూ ఆడవాళ్లే. కానీ ఆ విమాన సంస్థల అధిపతులో? అంతా మగవారే. అదీ పరిస్థితి. అలాంటి రంగంలో స్థిరపడాలనుకుంది కనిక టేక్రీవాల్. 18 ఏళ్లకు ఎయిర్వేస్లో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాక ఎంబీఏ కోసం యూకే వెళ్లింది. కానీ ఎంబీఏ పూర్తవుతూనే 2011లో ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఓ డాక్టర్‌ను కలిసింది. ‘నీకింకా కొన్నిరోజులే మిగిలున్నాయి’ అన్నాడాయన. కానీ ఆమె ముందు ఆ క్యాన్సరే ఓడిపోయింది.‘‘అది వరమో, శాపమో అని చెప్పను. నా జీవితంలో అదో క్లిష్టమైన దశ. చాలా ధైర్యాన్ని, ఖాళీ సమయాన్ని ఇచ్చిన దశ’’ అంటారు కనిక. అప్పట్లో దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిగా భవిష్యత్ ప్రణాళిక కోసం కేటాయించింది. అక్కడే.. ఛార్టర్డ్ విమానాలను, హెలికాప్టర్లను అద్దెకిచ్చే ‘జెట్‌సెట్‌గో’ రూపుదిద్దుకుంది. సొంత విమానాలు, హెలికాప్టర్లు ఉన్న వారితో ఓ నెట్‌వర్క్‌ను రూపొందించి... అద్దెకు కావాలనుకున్న వారితో సంధానించటమే ఈ సంస్థ పని. అంటే.. ‘గగనతల ఓలా’ అన్నమాట. తల్లిదండ్రులు ఈ ఆలోచనకు ససేమిరా అన్నారు. విమానయాన రంగంలో మహిళలు రాణించలేరన్నారు. కానీ క్యాన్సర్‌ను గెలిచిన ఈ మొండిఘటం వినలేదు. పునీత్ దాల్మియా, యువరాజ్ సింగ్ వంటి వారిని కలిసింది. 2014లో ఆరంభించిన కొన్నాళ్లకే వారు పెట్టుబడులు పెట్టడంతో జెట్ సెట్‌గో నిలదొక్కుకుంది. రెండేళ్లు తిరక్కుండానే లాభాల్లోకీ వచ్చింది. కాలేజీ చదువు మధ్యలో ఆపేసి... రితేష్ అగర్వాల్ పుట్టింది ఒడిశాలోని కటక్‌లో. స్కూల్ చదువు అక్కడే సాగింది. కాలేజీలో అడుగు పెట్టాడు కానీ... అక్కడ ఇమడలేకపోయాడు. క్లాసురూమ్‌లో కన్నా బయటే నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాడు. చదువు మానేశాడు. గెస్ట్‌హౌస్‌లు, టూరిస్ట్ లాడ్జ్‌లు, బడ్జెట్ హాస్టళ్లను ఆన్లైన్లో లిస్ట్ చేయడానికి ‘ఓరావెల్’ పేరిట ఓ వెబ్సైట్ ఆరంభించాడు. దానికోసం దేశమంతా తిరిగాడు. చాలాచోట్ల బసచేశాడు. ఆయా హోటల్స్ లిస్ట్ చేస్తున్నపుడు... అక్కడ తను ఉండటానికి ఫ్రీగా గది ఇవ్వాలని అడిగేవాడు. ‘‘ఎవ్వరూ ఇవ్వలేదు. నేను వాళ్ల వ్యాపారాల్ని లిస్ట్ చేస్తున్నందుకు వాళ్లు ఆ మాత్రం కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యమనిపించింది’’ అంటాడు రితేష్. అయితే ఇలా దేశమంతా తిరగటంలో రితేష్‌కు పలు విషయాలు తెలిసొచ్చాయి. వాటిలో మొదటిది... చిన్న హోటళ్లు, బడ్జెట్ హోటళ్లలో గదులు ఏమాత్రం బాగులేవని.! ‘‘ఆన్లైన్లో హోటల్ గదిని ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే అది ఎలా ఉంటుందో తెలీదు. సిబ్బంది ఎలాంటివారో, భోజనం ఎలా ఉంటుందో... ఏమీ తెలీదు. ఇవన్నీ చూశాక... బడ్జెట్ హోటల్స్‌లో స్టార్ హోటల్ అనుభవాన్నిస్తే విజయం తథ్యమనిపించింది. ఇదే ఓయోకు బీజం వేసింది’’ అంటారు రితేష్. చిన్న బడ్జెట్ హోటల్స్‌తో ఒప్పందం చేసుకొని... వాటిలో కొన్ని గదుల్ని ఏసీతో, అందంగా, ఆరోగ్యకరంగా మార్చడం చేశాడు. ఫ్రీ వై–ఫై, టీవీ, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు చేశాడు. ఆన్లైన్లో ఫోటోలు కూడా ఉండటంతో... వాటికి ఆదరణ పెరిగింది. ఓయో రూమ్స్‌తో మొదలై... ఐదేళ్లలో ఓయో టౌన్హౌస్, ఓయో హోమ్స్, ఓయో సిల్వర్ కీ వంటి పలు విభాగాల్లోకి విస్తరించారు. ప్రస్తుతం చైనా, మలేషియా, నేపాల్లోనూ ఓయో సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ హోటల్ కంపెనీలతో సహా పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఓయోలో పెట్టుబడులు పెట్టాయి. ఇపుడు ఓయో విలువ... బిలియన్ డాలర్లపైనే! అంటే రూ.6,800 కోట్లపైమాటే. ఆ ఓటమి... చాలా నేర్పింది! నందన్ రెడ్డిది కడప. శ్రీహర్ష మాజేటిది విజయవాడ. ఒకరు ఎమ్మెస్సీ.. మరొకరు ఇంజినీరింగ్. కాకపోతే ఇద్దరూ చదివింది మాత్రం బిట్స్ పిలానీలోనే. శ్రీహర్ష ఇంజినీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. ఎవరైనా చేరేవారేమో!! కానీ శ్రీహర్ష వద్దనుకున్నాడు. క్యాట్ రాసి ఐఐఎం కోల్‌కతాలో చేరాడు. పూర్తవుతూనే లండన్‌లోని ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పిలిచింది. లండన్ బాగుంటుందని వెళ్ళాడు. సిటీ నచ్చింది కానీ అక్కడి ఉద్యోగం నచ్చలేదు. రెండేళ్లు చేసి వెనక్కి వచ్చేశాడు. స్నేహితుడు నందన్ కలిశాడు. నందన్ అప్పటికే చిన్న వ్యాపారాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘టెక్నాలజీ, ఉద్యోగాలు, లాజిస్టిక్స్’ మూడూ కలిసి ఉండే కంపెనీని పెడదామనుకున్నారు. సొంత వెబ్‌సైట్లున్న వ్యాపారులు... డెలివరీ చేయలేక ఈ–కామర్స్ సంస్థల్లో నమోదు చేసుకుంటున్నారని గ్రహించి... వారిని, డీటీడీసీ– ఫెడెక్స్– తదితర కొరియర్ సంస్థలను కలిపేలా ‘డెమొక్రటిక్ షిప్పింగ్’కు రూపకల్పన చేశారు. దీనికోసమే 2013లో ‘బండిల్’ను ఆరంభించారు. కాకపోతే దీనికి తగ్గ టెక్నాలజీని అభివృద్ధి చేయటం వారి వల్ల కాలేదు. ఆ పనిని ఓ కంపెనీకి అప్పగించారు. అది పూర్తయ్యేసరికి ఏడాదిపైనే పట్టింది. తాము తయారు చేయదలచుకున్న ఉత్పత్తి బయటికొచ్చేసరికి మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు సొంత డెలివరీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ‘‘మార్కెట్‌కు మా ఉత్పత్తి పనికిరాదని అర్థమైపోయింది. అదృష్టమేంటంటే మాకు వేరే ఉద్యోగులు లేరు. మేం తప్ప ఎవరూ ఇన్వెస్ట్ చేయలేదు కూడా. అప్పులు కూడా లేవు. ఏడాదిలోపే బండిల్‌ను మూసేశాం’’ అంటారు స్విగ్గీ ద్వయం.‘బండిల్’ ప్రయాణంలో వారికి కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. దేశంలో లాజిస్టిక్ కంపెనీలు దయనీయంగా ఉన్నాయని, వాటికి టెక్నాలజీ ఏమాత్రం అందుబాటులో లేదని తెలిసింది. దీంతో 2014 సెప్టెంబర్‌లో రెస్టారెంట్లను, వినియోగదార్లను తమ సొంత డెలివరీ యంత్రాంగంతో కలుపుతూ బెంగళూరులో స్విగ్గీని ఆరంభించారు. తరవాత వారికి మరో స్నేహితుడు రాహుల్ జైమిని వారికి తోడయ్యాడు. ఇపుడు దేశంలోని 13 నగరాల్లో సేవలందిస్తున్న స్విగ్గీకి 50 లక్షల మంది కస్టమర్లున్నారు. 25 వేల రెస్టారెంట్లతో ఒప్పందాలున్నాయి. భారీగా నిధులూ వచ్చాయి. సంస్థ విలువ... దాదాపు రూ.17వేల కోట్లు!!. ఫెయిల్యూర్‌తో... గెలిచారు! కాలేజీ నుంచి స్నేహితులైన అభిరాజ్ భాల్, వరుణ్ ఖైతాన్ ఇద్దరిదీ అమెరికాలోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో ఉద్యోగం. మంచి జీతం. కానీ ఇద్దరిదీ ఒకటే ఆలోచన. ఇండియాకి వెళ్లి ఏదో ఒక వ్యాపారం పెట్టాలని. ఎంత చర్చించుకున్నా ఏం వ్యాపారం పెట్టాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. అలా చర్చిస్తుంటే... ఏమీ చెయ్యకుండానే మిగిపోతామని భయమేసి... 2013లో ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ఇండియాకు తిరిగి వచ్చేశారు. చాలా ఆలోచించిన మీదట.. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఆన్‌డిమాండ్ సినిమాల్ని ప్రదర్శించే బాక్స్‌లను తయారు చెయ్యాలనుకుని... ‘సినిమాబాక్స్’ సంస్థను ఏర్పాటుచేశారు. ఆరునెలలు గడిచాయి. ఆ మార్కెట్ చాలా చిన్నదని, దాన్లో విస్తరణకు పెద్ద అవకాశాల్లేవని వారికి అర్థమైంది. అదేమీ జీవితాన్ని మార్చే టెక్నాలజీ కాదని భావించారు. బాధపడ్డా... మూసేశారు. ఇంతలో ‘బగ్గీ.ఇన్’ పేరిట రైడ్‌షేర్ సంస్థను నడుపుతున్న రాఘవ్‌చంద్ర కలిశాడు. తనదీ ఇలాంటి కథే. బగ్గీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో మూసేశాడు. అప్పుడు వీళ్ల దృష్టి దేశంలో అసంఘటితంగా ఉన్న వృత్తి పని కార్మికులపై పడింది. ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, యోగా ట్రెయినర్... ఇలా ఎవరు కావాలన్నా సామాన్యులు పడుతున్న బాధలు చూశారు. వారందరినీ ఆన్‌లైన్‌లోకి తెద్దామనుకున్నారు. ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నారు. అంతా నవ్వేశారు. అభిరాజ్, వరుణ్, రాఘవ్ మాత్రం ఎవరిమాటా వినలేదు. టెక్నాలజీ తోడుగా వృత్తి పనివాళ్లందరినీ ఒక వేదికపైకి తెస్తూ.. ‘అర్బన్‌క్లాప్’ను ఏర్పాటు చేశారు. ‘అవసరం నుంచి పుట్టిన ఏ ఆలోచనకైనా తిరుగుండదు’ అనే మాటను నిజం చేస్తూ అర్బన్ క్లాప్ ఇపుడు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా విస్తరించింది. వృత్తి నిపుణుల వివరాలు ఇవ్వటానికే పరిమితం కాకుండా... మొదటి నుంచీ దాన్ని తగిన ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మార్చటానికి ప్రయత్నించారు. ఫలితం... రతన్ టాటా దీన్లో పెట్టుబడి పెట్టారు. అంతేకాదు! యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ఇండియాకు వచ్చినపుడు వీరిని కలిసి అర్బన్‌క్లాప్ సేవల్ని అడిగి తెలుసుకున్నారు కూడా. కంపెనీ విలువ ఇదమిత్థంగా తెలియకపోయినా... ఇప్పటికే ఇది దాదాపు రూ.40 కోట్ల నిధుల్ని సమీకరించింది. కలెక్టరు గిరీ... కాదనుకున్నాడు!! ఏ యువకుడైనా ఇలా ఉండాలి అని రోమన్ సైనీని చూపించొచ్చు!! ఇలా ఉండకూడదు అని కూడా సైనీని కొందరు చూపిస్తారేమో!! ఎందుకంటే మెడిసిన్ చదివిన వెంటనే... 22 ఏళ్లకే సివిల్స్ రాసి సెలక్టయిపోయాడు. శిక్షణ పూర్తయ్యాక మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా సహాయ కలెక్టర్‌గా ఉద్యోగం కూడా వచ్చేసింది. పాతికేళ్లు కూడా రాకుండానే ఇలా సెటిలైపోతే ఇంకేం కావాలి..? సైనీని మాత్రం అసంతృప్తి తొలిచేస్తోంది. ఇంకేదో చెయ్యాలనే తపన కుదురుగా ఉండనివ్వటం లేదు. అంతే!!. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఇంట్లో వాళ్లు వద్దన్నారు. వినలేదు. తనకు మెడిసిన్, సివిల్ సర్వీస్ రాసిన అనుభవం ఉంది కనక వైద్యులు, ప్రోగ్రామర్లు, సివిల్ సర్వెంట్లు కావాలనుకున్న వారికి... పాఠాలు చెప్పి యూట్యూబ్‌లో పెట్టడం మొదలెట్టాడు. ఈ లెక్చర్లు చాలా మందికి పనికొచ్చాయి. ఓ పది మంది ఐఏఎస్‌లు తయారయ్యారు. తను ఉద్యోగం చేస్తే... ఒకడే! కానీ పది మంది ఐఏఎస్‌లను తయారు చేశాడు!! ఆ కిక్కు.. సైనీకి నచ్చింది. స్నేహితుడు గౌరవ్ ముంజల్‌తో కలిసి 2015 డిసెంబరు 15న లాంఛనంగా అన్అకాడెమీని ఆరంభించాడు. దానిపేరిట వందల వీడియోలు అప్లోడ్ చేశారు. తరవాత విద్యార్థులు, విద్యా నిపుణులు, లెక్చరర్లు తమ సొంత పాఠాల్ని ఎవరికి వారు అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశాడు. వీళ్లందరూ అందించే కంటెంట్... మారుమూల గ్రామాలకు చేరాలన్నది రోమన్ సైనీ ఆశయం. నాణ్యమైన విద్యకు దూరంగా ఉన్న పలు గ్రామాల్లోని విద్యార్థులు... నిపుణులైన విద్యావేత్తల తాలూకు పాఠాల్ని ఇలా ఆన్లైన్ ద్వారా అందుకోవచ్చన్నది తన ఆలోచన. ఈ మధ్యే అన్‌అకాడెమీలో అంతర్జాతీయ సంస్థలు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువ దాదాపు రూ.75–80 కోట్లు!!. ఏ డాక్టర్నైనా కన్సల్ట్ చేయొచ్చు!! సతీష్ కణ్ణన్, దీనదయాళన్ ఇద్దరూ ఐఐటీ మద్రాస్‌లో స్నేహితులు. 2012లో ఇంజినీరింగ్ పూర్తయి బయటికొచ్చాక సతీష్ పుణెలోని ఫిలిప్స్ హెల్త్‌కేర్‌లో చేరాడు. దీనదయాళన్ మాత్రం ఐఐటీలోని ఇన్నోవేషన్ సెంటర్లో డయాబెటిక్ రెటినోపతిని కనుక్కునే పరికరం తయారీలో మునిగిపోయాడు. ఏడాది ఉద్యోగం చేసిన సతీష్... ఉద్యోగంలో భాగంగా హెల్త్‌కేర్ సేవల్ని బాగా గమనించాడు. స్పెషలిస్టు వైద్యుల సేవలు సామాన్యులకు అందటం చాలా కష్టమవుతోందని తెలుసుకున్నాడు. దీన్ని టెక్నాలజీ సాయంతో అధిగమించాలని భావించి... దీనదయాళన్‌తో చెప్పాడు. ఇద్దరూ కలిసి 2013లో పాసర్జ్ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తమ ఆలోచనను అమల్లోకి తేవటంపై దృష్టిపెట్టారు.దాదాపు రెండేళ్ల కృషి తరవాత వారిద్దరూ డాక్స్‌యాప్‌ను అభివృద్ధి చేయగలిగారు. 2015లో డాక్స్‌యాప్‌ను ఆరంభించారు. స్పెషలిస్ట్ వైద్యులు, పేషెంట్లను కలిపే యాప్ ఇది. చాట్ లేదా కాల్ ఆధారంగా ఎవరైనా సరే... దేశంలోని ఏ స్పెషలిస్టు వైద్యుడినైనా 30 నిమిషాల్లోపే సంప్రతించవచ్చు.కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటిదగ్గరే ల్యాబ్‌టెస్టుల వంటి సేవలందిస్తున్న డాక్స్ యాప్‌లో గైనిక్, సైక్రియాట్రీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాక్, ఆంకాలజీ, న్యూరో, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వంటి విభాగాల్లో 1500కు పైగా వైద్యులున్నారు. ఇప్పటికే సంస్థలో పలు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాదాపు రూ.50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాయి. లా చదివి... ఆరోగ్య రంగంలోకి!! నయ్యా సగ్గి గురించి ఆమె తల్లికెప్పుడూ ఆందోళనే. ఎందుకంటే స్కూలు స్థాయిలో సగ్గి మార్కులు అంతంత మాత్రంగానే ఉండేవి. ‘పెద్దయ్యాక ఏమవుతావో’ అని తల్లి ఎప్పుడూ బెంగపడుతూనే ఉండేది. ముంబైకి చెందిన సగ్గి... అందరు పిల్లల్లానే ఆ వయసులో ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలూ లేకుండానే పెరిగింది. కాకపోతే అప్పుడప్పుడూ నేషనల్ లా స్కూల్లో చదివే తన సోదరి చెప్పే మాటలు మాత్రం ఆమెను ఆకర్షించేవి. ఒక దశలో... తానూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదవాలని ఫిక్సయిపోయింది. తల్లి ఆందోళన పెరిగిపోయింది. ‘తరవాత బాధ పడతావేమో!’ అని హెచ్చరించింది. సగ్గి తను గనక ఒక నిర్ణయం తీసుకుంటే... ఇక ఎవరి మాటా వినే ప్రసక్తే లేదు. కష్టమైన లా ఎంట్రన్స్ నెగ్గి... ఎన్‌ఎల్‌ఎస్‌లో సీటు సంపాదించింది. అదిగో... అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ‘అదంతా వేరే ప్రపంచం. ఆడుతూ పాడుతూ గడిచిపోయింది. కెజి బాలకృష్ణన్ వంటి న్యాయ మూర్తులతో పాటు విదేశీ న్యాయ నిపుణులనూ కలిసే అవకాశం దక్కింది’ అంటారామె. చదువుతున్నపుడే స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ కోసం పనిచేసింది సగ్గి. అదిగో... ఆ తపనే ఆమెకు ప్రతిష్ఠాత్మక ఫుల్బ్రైట్, హార్వర్డ్ స్కాలర్షిప్లు తెచ్చిపెట్టింది. హార్వర్డ్‌లో నాలుగేళ్లూ ఇట్టే గడిచిపోయాయి. ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, వాటిని భారీస్థాయికి తీసుకెళ్లటం వంటి అంశాలపై ఆమె ప్రాజెక్టు చేసింది. తరవాత ఇండియాకు తిరిగొచ్చింది. ‘ఏం చేసినా ఒక తరాన్ని ప్రభావితం చేయగలగాలి’ అనుకునే సగ్గి.. తన స్నేహితులు తల్లి కాబోయేటపుడు సరైన సమాచారం, ఉత్పత్తులు దొరక్క పడుతున్న ఇబ్బందులు గమనించింది. న్యూక్లియర్ కుటుంబాల కారణంగా... ఇంటర్నెట్లో టూర్ ప్యాకేజీలు, సినిమా టికెట్లు కూడా బుక్ చేసే తల్లిదండ్రులు... పిల్లల విషయంలో మాత్రం సరైన సలహా పొందలేకపోతున్నారని గ్రహించింది. పాత స్నేహితుడు మొహిత్కుమార్తో అన్నీ చర్చించింది. అదిగో... అక్కడే ‘బేబీ చక్ర’ రూపుదిద్దుకుంది. కాబోయే తల్లిదండ్రుల నుంచి.. బిడ్డను కన్న తల్లిదండ్రుల వరకూ వారికి కావాల్సిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా ఇప్పిస్తూ... వారికి మార్గ దర్శకత్వం వహించటమే బేబీ చక్ర పని. అంతేకాదు. బేబీ ఉత్పత్తులు, ఇతరత్రా సర్వీసులు అందించేవారు కూడా దీన్లో లిస్టయ్యారు. మొత్తమ్మీద పిల్లల జీవితానికి కావాల్సిన అన్నిటినీ సంస్థ అందిస్తోంది. ఇటీవలే రెండు దశలుగా నిధులు కూడా వచ్చాయి. తొలినాళ్లలోనే ముంబై ఏంజిల్స్ పెట్టుబడి పెట్టగా... తరవాత విదేశీ నిధులొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ సగ్గి తల్లికి కుమార్తె విషయంలో ఆందోళనే. వారానికోసారి ఫోన్ చేసి... ‘‘బేబీ చక్రలో కొత్తగా ఏం వచ్చాయి?’’ అని అడుగుతుంటుంది. వ్యాపారానికి ‘పల్స్’ దొరికింది..! శ్రీనుబాబుది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. రోజూ స్కూలుకు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అక్కడే ఇంటర్ పూర్తి చేశాడు. ఏయూలో బీఫార్మ్,. ఎంటెక్ బయోటెక్నాలజీ పూర్తయింది. పీహెచ్‌డీలో భాగంగా శరీరంలోని ప్రొటీన్లను విÔó్లషించి... మధుమేహ ముప్పును ముందే కనుక్కోవటంపై పరిశోధన చేశారు. 2006లో దక్షిణ కొరియాలోని సియోల్‌లో అంతర్జాతీయ ప్రొటియం ఆర్గనైజేషన్... ఈ పరిశోధన చేసినందుకు శ్రీనుబాబుకు యంగ్‌సైంటిస్ట్ అవార్డిచ్చింది. అపుడాయన వయసు 24 ఏళ్లు. ఈ రీసెర్చ్కోసం తాను ఆంధ్రా వర్సిటీతో పాటు వారి సిఫారసుతో హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్, సీసీఎంబీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పలు జర్నల్స్ చదివానని, అలాంటివి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. చెప్పటమే కాదు! ప్రతి యూనివర్సిటీ ప్రచురించే పరిశోధన పత్రాల్ని అందరికీ అందుబాటులో ఉంచే ‘ఓపెన్ యాక్సెస్ జర్నల్’ను ఆరంభించారు కూడా. దానికి అంతర్జాతీయ సంస్థల అనుమతి పొందారు. అదే ఒమిక్స్ ఇంటర్నేషనల్‌కు నాంది. ఇక్కడ ఇంకో చిక్కుంది. ఈ జర్నల్స్‌ను ఎడిట్ చేయటానికి ఏటా ఎడిటోరియల్ బోర్డు సమావేశమవుతుంది. అంతా వివిధ రంగాల్లో నిపుణులే కావటంతో విదేశాల్లో వారికి ఆతిథ్యమివ్వటం... సమావేశం నిర్వహించటం బాగా ఖర్చుతో కూడుకున్న పని. అది ఇంకో వ్యాపారానికి నాంది పలికింది. ఎడిటోరియల్ బోర్డు సమావేశాలప్పుడు దానికి హాజరయ్యే నిపుణులతో అక్కడే సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు శ్రీను బాబు. పల్సస్.కామ్ ద్వారా తాము ప్రచురించే జర్నల్స్‌ను చదివే 5 కోట్ల మంది పాఠకులకు ఆ సమాచారాన్ని చేరవేశారు. కావాల్సిన వారు ఆ సదస్సులకు హాజరు కావొచ్చన్నారు. అది ఊహించని విజయాన్నిచ్చింది. ఇపుడు ఏటా 3వేలకు పైగా సదస్సులు నిర్వహించే స్థాయికెళ్లారు. ‘ఒమిక్స్’కు ఇవన్నీ భారీ ఆదాయ మార్గాలుగా మారాయి. పరిశోధక జర్నల్స్‌ను జర్మన్, చైనీస్ తదిరత భాషల్లోకి అనువాదం చేస్తుండటంతో రెవెన్యూ బాగా పెరిగింది. టర్నోవర్ రూ.1,300 కోట్ల స్థాయికి చేరింది. ఉద్యోగుల సంఖ్య 4,800కి పెరిగింది. తాజాగా భారతీయ భాషల్లోకి ఈ జర్నల్స్‌ను అనువదించే ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టింది పల్సస్. ‘‘మన చుట్టూ వ్యాపారావకాశాలు ఉంటాయి. వాటిని చూడాలి. జనం సమస్యలకు పరిష్కారంగా ఏదైనా వ్యాపారాన్ని ఆరంభిస్తే... దానికి తిరుగుండదు’’ అంటారు శ్రీనుబాబు గేదెల. ఇవన్నీ ‘అగ్ర’గేటర్లు... అమెజాన్ ఒక్కవస్తువూ తయారు చెయ్యదు. ఏ వస్తువూ నేరుగా అమ్మదు. కానీ అమ్మేవారంతా ఈ సైట్లోనే ఉంటారు కనక ప్రపంచమంతా కొనేది అమెజాన్లోనే!! రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్దీ ఇలాంటి కథే. సొంతగా ఒక్క ట్యాక్సీ లేదు. కానీ ప్రపంచంలో అతిపెద్ద ట్యాక్సీ సర్వీస్ ఇదే! ఇటీవలే ఇది ప్రపంచ వ్యాప్తంగా 10వేల కోట్ల ట్రిప్పులను పూర్తిచేసుకుంది. ఇక సొంతగా ఒక్క హోటలూ లేని ‘ఎయిర్ బీఎన్బీ’... ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటాలిటీ సంస్థ. ఇంటర్నెట్ దిగ్గజం, నెంబర్ వన్ వీడియో ఛానెల్ యూట్యూబ్‌కు సొంత వీడియో ఒక్కటీ ఉండదు. ఇదే అగ్రిగేటింగ్ కంపెనీల మహత్యం. అవసరం ఉన్నవారిని– ఆ అవసరాన్ని తీర్చేవారిని ఒకే వేదికపైకి తేవటమే ఇవి చేసే పని. ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఇంటర్నెట్ సాయంతో యావత్తు ప్రపంచాన్నీ ఏలుతున్న ఈ టాప్ అగ్రిగేటర్లన్నీ... అగ్రరాజ్యం అమెరికాలో పురుడు పోసుకున్నవే. అమెరికన్ కంపెనీలే!వీటి స్ఫూర్తితో భారతీయ యువత మరింత ముందుకు వెళుతోంది. ఇక్కడి స్థానిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు వెదుకుతోంది. చేతిలో సొమ్ము లేకున్నా వీరికి దమ్ము పుష్కలంగా ఉంది. అమ్మానాన్నలు అంబానీలు కాకున్నా... ఉన్న ఉద్యోగానికి సైతం గుడ్‌బై కొట్టేసేంత తెంపరితనమూ ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఓలా వంటి యూనికార్న్‌లే కాదు. విద్యారంగంలో ఎడ్యుటర్, లెర్న్ సోషల్... రైడ్‌షేర్ రంగంలో జుగ్నూ, డ్రైవర్జ్... ట్రావెల్స్‌లో అభిబస్, రెడ్‌బస్... ఫుడ్ డెలివరీలో జొమాటో, హోలాషెఫ్... హెల్త్‌కేర్‌లో ప్రాక్టో, లైబ్రేట్... ఆతిథ్య రంగంలో నెస్ట్ ఎవే... గృహాలంకరణకు సంబంధించి లివ్ స్పేస్... లాజిస్టిక్స్‌లో లింక్, పోర్టర్... వినోద రంగంలో బుక్ మైషో... ఇవన్నీ ఆయా రంగాల్లో దేశీయంగా విజయం సాధించిన అగ్రిగేటర్లని చెప్పాలి. వీటిలో దాదాపు అన్ని కంపెనీల్లోకీ భారీగానే పెట్టుబడులొచ్చాయి. – మంథా రమణమూర్తి -
బాలయ్య మాస్టారు
సువర్ణ కదిపి లేపడంతో చటుక్కున మెలకువ వచ్చింది రఘురాంకు – ‘‘లేవండి. మావయ్యగారు ఇంత రాత్రివేళ బయటకు వెళుతున్నారు. అత్తయ్యగారు వద్దంటున్నా వినటంలేదు లేవండి’’.‘‘ఏంటి నువ్వంటోంది?’’ లుంగీ సరి చూసుకుని లేస్తూ భార్యను అడిగాడు. ‘‘అత్తయ్య, మావయ్య మాటలు వినబడుతుంటే తలుపు కొంచం వారగా తెరచివిన్నాను. ‘హోటల్ ఓపెన్‌గానే ఉంటుంది. వెళ్లొస్తాను’ అంటున్నారు మావయ్య. ‘అర్ధరాత్రి కావస్తోంది. ఇప్పుడేం వద్దు. నామాట వినండి. వొద్దు వెళ్లొద్దు’ అని అత్తయ్య బతిమలాడుతున్నారు. ఆయన ససేమిరా వినడంలేదు. ‘కాసేపట్లో వచ్చేస్తాను. నువ్వు పడుకో’ అంటున్నారు. ‘ఇంట్లో పిల్లలంతా ఉంటే మీరిలా ఇప్పుడు వెళ్ళడం బాగోలేదు. నామాట వినండి. పడుకోండి. అవతల కొడుకూ కోడలు, ఇటు అమ్మాయీ అల్లుడు ఉన్నారు. ఆరుగురు మనవలు, మనవరాళ్ళు ఇంట్లో ఉంటే ఇప్పుడు మీరిలా అర్ధరాత్రి దొంగచాటుగా బయటకు వెళ్ళడం.. ఛ ఛ. వొద్దండి. నామాట వినండి. పిల్లలు వింటే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి’ అని అత్తయ్య బతిమలాడుతున్నారు. కాని మావయ్య గారు ఏవీ వినే ధోరణిలో లేరు. అలా గుమ్మం వరకూ అత్తయ్యగారు బతిమలాడుతూనే ఉన్నారు. మావయ్యగారు మృదువుగా ఆమెను వారిస్తూ తలుపు తీసుకుని బయటకు వెళుతున్నారు. ఇక ఆగేలా లేరని మిమ్మల్ని లేపాను.’’ వివరంగా చెప్పింది సువర్ణ. ఏదో చిన్న విషయంగా కనిపిస్తున్నా నాన్నగారి గురించి తెలిసిన వారికీ ఇది పెద్ద విషయమేననిపించింది రఘురాంకు. బాలయ్య మాస్టారంటే చుట్టుపక్కల గ్రామాలు దాటి మండలాలు దాటి అసలు జిల్లాలో తెలియని వారు ఉండరు. గంగూరు జిల్లాపరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా, ఓ సిన్సియర్ మాస్టారుగా, అత్యుత్తమ నైతిక విలువలున్న పెద్ద మనిషిగా ఆయన ఓ హిమవన్నగం. ఎంతో మంది పెద్దలు, రాజకీయ నాయకులు, మేధావులు, టీచర్లు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గౌరవించే సమున్నత మూర్తిమత్వం ఆయనది.నిజానికి ఆయనలో రెండు పార్శా్వలు లేవు. ఇంటా బయటా ఎక్కడైనా అదే ప్రవర్తన. అదే వ్యక్తిత్వం. జీవితమంతా అదే నిబద్ధతతో రూపొందించుకున్న ఆదర్శప్రాయమైన జీవితం. పిల్లల్నీ అలాగే పెంచారు. అలాగే చదివించారు. కొడుకు రఘురాం, కూతురు సుజాత అలాగే పెరిగారు. చక్కగా మాస్టారు పెంచిన విధానంలోనే చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మంచి జంటలను ఎంపిక చేసి చక్కగా పెళ్ళిళ్ళు చేశారు. మళ్ళీ ఇద్దరూ చెరో ఇద్దరిని కని మాస్టారిని తాతను చేశారు. ఆయన ఆదర్శప్రాయంగా నిర్మించిన బాటలోనే పిల్లల జీవితాలు పూలపూల పరిమళతోటలుగా, సరాగాలసిరిమల్లె పందిళ్ళుగా, సుస్వరాల సుమగంధాలు విరజిమ్ముతున్నాయి. వారి కుటుంబాలు వాటి ప్రవర్తన, పాటిస్తున్న నైతిక విలువలు ఎందరో ఊరివారికి ఆదర్శనీయం. ప్రతి పండుగకూ రఘురాం కుటుంబం, సుజాత కుటుంబం పిల్లలతో మాస్టారింటికి వచ్చి తీరాల్సిందే. ఇది ఈసారి, ఈ సంక్రాంతికి కూడా జరిగింది. పగలల్లా పిల్లలూ పెద్దలూ ఎన్నో ఆటలాడారు. కబుర్లు చెప్పుకున్నారు. ఊర్లో తిరిగారు. పొలాల్లో ఎగిరారు. పాడిగేదెలతో ఆవు తువ్వాయిలతో ఎగిరిదూకారు. కోళ్ళ వెంట, బాతుల వెంట పరుగులెత్తారు. కొంగలతో, కోకిలలతో, పాడారు. ఊగారు. తూగారు. ఆడి ఆడి అలిసిపోయారు. అలసి సొలసి ఆనందించారు. మాస్టారు సతీమణి శ్యామలకు మాత్రం ఈ ఆటపాటలతో పాటు వంటింటి పనులన్నీ మీద పడ్డాయి. కోడల్ని, కూతుర్ని కూర్చోబెట్టి తనే అన్నీ చూసుకుంటోంది.. పండుగలకు ఇద్దరు పని మనుషులను పెట్టుకోమని మాస్టారు ఎంతగా బతిమలాడినా వొప్పుకోలేదు. చివరికి పిల్లలు అలా ఐతే ఇంటికి రాము అని సమ్మె ప్రకటిస్తే కొంచం మెత్తగిల్లింది. వచ్చే ఏడాది చూద్దాం అంది. కాని ఈ ఏడాదికే వొప్పుకుంది. కారణం ఓపిక సన్నగిల్లడమే. అదికూడా పని మనుషులు సహకారం వరకే గాని వంటలన్నీ తనే వండాలని వొప్పందం చేసుకుంది. అప్పుడే తనకు తృప్తి అని ప్రకటించింది శ్యామల. ఆ మాత్రమైనా వొప్పుకున్నందుకు తల్లి చేతివంట రుచి మరెవ్వరికీ రాదు కాబట్టి తమకు లొట్టల భాగ్యానికి లోటు రాదు కాబట్టి పెద్దలూ పిల్లలూ అంగీకరించారు.అలా ఈ సంక్రాంతి కూడా మరో చిరస్మరణీయమైన పండుగగా గడుస్తోంది. ఈరోజు మరపురాని విధంగా గడిచిందని అందరూ ఏకగ్రీవంగా ప్రకటించారు. దానికి ప్రధాన కారణం శ్యామల చేసిన పండుగ వంటలు. ఉదయం తలంటుకోగానే తినాలంటూ నాలుగు రకాల స్వీట్స్ వండేసింది. మళ్ళా అరగంటకు టిఫిన్లకు మరో నాలుగైదు రకాలు. అలా గంటగంటకూ, ప్రతి ఆటకు, పాటకు మధ్య మధ్య ఏదో వొకటి అందరి నోటికి అందిస్తూనే ఉన్నారు పనిమనుషులు. పిల్లలు ఎలా లొట్టలేస్తూ తింటున్నారో తిరిగి శ్యామలకు రిపోర్టు వెళుతూనే ఉన్నది. అలా పగలు, రాత్రి ప్రతి క్షణం మృదుమధురంగా గడిచింది.అంతా తిని అలసిసొలసి మామ్మకు, తాతకు థ్యాంక్స్ చెప్పి వారివారి గదుల్లోకి నిష్క్రమించారు. భుక్తాయాసంతో అంతా నిద్రకుపక్రమించారు. ఆ తర్వాత జరిగిందీ సంఘటన. అవతల హాలులో మాస్టారు, శ్యామల మాట్లాడుకుంటున్న మాటలు, విషయం కోడలు సువర్ణ చెవినపడ్డాయి. భర్త రఘురాంను లేపింది. రఘురాంకు తిండి మత్తు, నిద్ర మత్తు వదలిపోయాయి. లేచి లుంగీ సర్దుకున్నాడు. తల్లి శ్యామల లోపలికెళ్ళి తలుపేసుకుంది. ఆమెను అడగాలని ఉన్నా ఏమడిగితే ఏం చెబుతుందో.. ఏ భయంకర నిజాలు వినాల్సి వస్తుందోననిపించింది రఘురాంకు. బావను లేపుదామనుకున్నాడు. అతనో రకం. ఓవర్‌గా రియాక్ట్ అయ్యే బాపతు. విని ఏమంటాడో తెలియదు. చెల్లిని లేపితే? ఊహు.. బావ కూడా లేచొస్తాడు.సువర్ణే బెటరు. తనతో చెప్పి ఊరుకుంది. తనే ఏదైనా చెయ్యాలి. తల్లిదండ్రుల విషయంలో ఇప్పుడు, ఈ వయస్సులో, ఇలాంటి రాత్రివేళ ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటి దేవుడా అనుకుంటూ ప్యాంట్ వేసుకున్నాడు.‘‘ఏం చెయ్యబోతున్నారూ?’’ అంటూ దీర్ఘం తీసింది సువర్ణ, ఎగాదిగా చూస్తూ. ‘‘ఏం తోచటం లేదే’’ అన్నాడు షర్టు గుండీలు పెట్టుకుంటూ. తండ్రి ప్రవర్తన, తండ్రిపై సందేహం, తండ్రిని నిలదీసే సన్నివేశం జీవితంలో వస్తుందని ఎప్పుడూ ఊహించని రఘురాం ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకపోయినా చెప్పులు తొడుక్కుని బయటకు వచ్చాడు. ఇది ఎవరికీ చెప్పే సమస్య కాదని, తనే తేల్చుకోవాలని అస్పష్టంగా అనిపిస్తుంటే వెంటనే ఇంట్లోంచి బయటకు రావటం మినహా మరో మార్గం లేదు. బయట వీధి అంతా ప్రశాంతంగా ఉంది. అసలు ఊరంతా టీవీలు చూస్తూ నిద్రను ఆహ్వానిస్తోంది. గాలి హీటు తగ్గి చల్లచల్లగా గారాలు పోతోంది. నేలపై ఎండుటాకులు గాలికి మెల్లగా హాయిగా కదులుతున్నాయి. ఎక్కడో కుక్క పిల్ల మూలుగు లాంటిది దూరంగా వినిపిస్తోంది. వీధి దీపాలు అక్కడక్కడా ఎక్కువగా, అక్కడక్కడా తక్కువగా వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో దోమలు గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఏదో శబ్దం లాంటిది చెవికి సోకుతోంది. అటూ ఇటూ చూస్తూ కళ్ళు చికిలించి ముందుకు చూస్తూ లుంగీ సర్దుకుంటూ కదులుతున్నాడు. చటుక్కున ఓ సందేహం వచ్చింది. తనిప్పుడు ఎవరి కంటనైనా పడే అవకాశం ఎక్కువగా ఉంది. చూసిన వారెవరైనా పలకరిస్తే, ‘ఎక్కడికి రఘురాం బాబూ?’ అంటే? ‘ఇంత రాత్రేల బయటకు వచ్చారు. నాన్నగారికి చెప్పే వచ్చారా?’ అని డౌటు ప్రకటిస్తే? అటూ ఇటూ చూస్తూ తండ్రి జాడకోసం దూరంగా చూపు సారిస్తూ వడివడిగా నడుస్తున్నాడు. అనుకున్నట్లే జరిగింది. కొండారెడ్డి మావయ్య చూడనే చూశాడు. ‘‘ఏంటల్లుడూ.. ఏంటి ఇంత రాత్రేల రోడ్డుమీద షికారా! ఏంటి.. ఏంటికత?’’ కొంటెతనం మేళవించి, నవ్వుకలిపి వదిలాడు బాణంలాంటి డైలాగు. అంత రాత్రివేళ కూడా ఆయన మీసంమీద చెయ్యి వేసి మెలిదువ్వడం స్పష్టంగా కన్పిస్తోంది.కొండారెడ్డి బాలయ్యకు మంచి స్నేహితుడు. ఆయనపై జోక్ వెయ్యగల చనువు, ధైర్యం, అంతకుమించి నీతి నిజాయితీ గల పెద్ద రైతు. అచ్చతెలుగు రైతు అంటే కొండారెడ్డి మావయ్యే. విన్నవెంటనే కంగుతిన్నాడు రఘురాం. అంతలోనే ఆయన అంతరాత్రి కూడా ఫెళఫెళలాడే పేటేరు ఖద్దరు పంచెలో కనపడటం విస్మయం కలిగించింది. ‘‘నేను సరే. ఏదో కాస్త చల్లగాలి కోసం లుంగీతో బయటకొచ్చాను. నువ్వేంటి మావయ్యా! అర్ధరాత్రి కూడా సోగ్గాడు శోభన్‌బాబులా మెరిసిపోతున్నావ్?’’ అన్నాడు. సోగ్గాడు సినిమా ఆయన ఆరాధ్య సినిమా అని, శోభన్ బాబు అంటే ప్రాణం పెడతాడని రఘురాంకు క్షుణ్ణంగా తెలుసు. అనుకున్నట్లే కొండారెడ్డి పడిపోయాడు. ముసిముసిగా మొదలెట్టి హాయిగా ఆకాశందాకా వినిపించేలా భళ్ళు భళ్ళున నవ్వాడు. పెద్ద సిటీలో పెద్ద హోదాలో ఉన్న రఘురాం లాంటి ఆదర్శ యువకుడు తనతో కొంటెగా పరాచికాలాడటం ఆయనకెంతో ఆహ్లాదంగా అనిపించింది. కాసేపు కాలవ గట్టుకు తీసుకెళ్ళి కబుర్లు చెప్పుకుందామని ప్రతిపాదించబోయాడు గాని మాట్లాడుతూనే ముందుకు కదులుతున్న రఘురాం, ఏదో ఆలోచనలో ఉన్నట్లు గ్రహించి తానూ చుట్ట తాగడానికి ఇంట్లోంచి బయటకొచ్చాడు కాబట్టి ఆ పనిమీద ముందుకు సాగిపోయాడు. ‘హమ్మయ్య’ అనుకున్నాడు రఘురాం. అతనికి కొంచెం చెమట మొదలయ్యింది. ‘నాన్న ఎటు, ఎక్కడికి వెళ్ళినట్లు?’ నడకలో, ఆలోచనలో, వేగంపెరిగింది. మెడ అన్ని పక్కలకూ గిర్రునతిరుగితూ వెదుకుతోంది. బాలయ్య మాస్టారు కనబడలేదు. ఊరు ఊరుగా కొంచం పెద్దదే గాని షాపులు, షాపింగ్ సెంటర్లు, షాపింగ్ ఏరియా అంటూ లేదు. ప్రధాన రోడ్డు మీద మరో ప్రధాన కూడలి. సెంటర్ అంటారు అంతా. ఇప్పుడా సెంటర్ మెదట్లోకి ప్రవేశించాడు రఘురాం. తండ్రి కోసం వెతగదగ్గ చోటు అదే. ఇక్కడే, ఎవరైనా ఏదైనా కొనాలన్నా, అసలు ఈ ఊర్లో దొరికేవి ఏవిటో తెలుసుకోవాలన్నా ఇక్కడే. ఆ సరదా తీర్చుకోవాలి. ఇహ మిగిలింది అంతా నివాస ప్రాంతమే. ఆయా ప్రాంతాలలో తండ్రి కోసం వెదకనక్కరలేదు. మరి ఎటు వెళ్ళినట్లు? సెంటర్ వైపు నడక పెంచాడు.నాలుగడుగులు వేశాడో లేదో, ‘‘రఘు’’ అన్న పిలుపు చాలా దగ్గరలో వినపడి కాలికి ఏదో అడ్డుపడ్డట్లు ఆగిపోయాడు. కొంచం ఆశ్చర్యంతో అటే చూశాడు. ఆ చీకటిలో చిన్న గేదె దూడ లాంటి మనిషి ఆకారం. చొక్కా లేకుండా పంచతో కనిపించాడు. తనను పేరుపెట్టి పిలిచింది ఎవరో అని కళ్ళు చికిలించి చూసిన రఘురాం, చాలా తొందరలోనే ఆ శాల్తిని గుర్తుపట్టాడు. కోటేసు. ఉరఫ్ కోటేశ్వరరావు. కోటేశ్వరరావు రఘురాంకు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్మేట్. అంత సీరియస్‌గా చదువును తీసుకోనివాడు. ఎప్పుడూ క్లాస్‌కు సీరియస్‌గా వచ్చేవాడు కాదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవలు. తల్లి, తండ్రి కష్టపడేవారు. అయినా ఏవో చికాకులు, ఇబ్బందులు. అన్నింటికీ పర్యవసానం స్కూల్ మానేయడం. చెప్పినా అర్థం చేసుకోకపోవడం, అసలు వినడమే తక్కువ. ‘ఇంటికష్టాలు అన్నీ చదువుతో పోతాయిరా’ అని బాలయ్య మాష్టారు ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కించుకునేవాడు కాదు. అయితే రఘురాంకు చాలా ఇష్టం వాడంటే. కారణం అమాయకమైన మంచితనం. మంచి హాస్యదోరణి. స్నేహగుణం. ఎప్పుడూ వెన్నటి ఉండే ఆప్యాయత.ఇప్పుడు కూడా చూడగానే అప్రయత్నంగా పిలిచాడు. రఘురాం విని, చూసి, ఆగాడు.‘‘వొరే కోటేసూ’’ అంటూ ఎప్పటిలాగే ఆత్మీయంగా అతనివైపు నడిచాడు. కోటేసు కూడా అలాగే స్పందించాడు. కానీ కోటేసు దగ్గరకు రాకముందే గప్పున వచ్చింది సారా వాసన. బ్రేకు వేసినట్లు ఆగిపోయాడు రఘురాం. కోటేసు కూడా కాస్త దూరంగా ఆగి పలకరింపుగా నవ్వాడు. రాత్రి బయటకు రావటం వల్ల కలిగే ఇబ్బందుల్లో ఇదోకటని రఘురాంకు అర్థమైంది.‘‘రఘూ.. నువ్వే? ఎప్పుడొచ్చావ్! ఏంటి రాత్రి తిరుగుళ్ళేంటి. మాస్టార్ని పడుకోనిచ్చి రోడ్డెక్కావ్’’ నవ్వాడు. ఎక్కువగా నవ్వాడు. కోటేసు వొరే అనడం, ఏకవచనంతో సంభోదించడం మానేసి చాలా కాలం అయ్యింది. ‘‘నువ్వేంట్రా ఇంత రాత్రప్పుడు ఇట్టా రోడ్లమీద. ఆ పంచ ఏంటి? చొక్కా ఏది? తాగుడు ఎక్కువైయింది. అవునా!’’ కోపం నటిస్తూ మందిలిస్తున్నట్లు నిజమైన స్నేహితుడిలా చురుగ్గా అన్నాడు రఘురాం.ఆనందంతో మందు కిక్కులో మరింతగా నవ్వాడు. ‘‘నేను తాగి రాత్రుళ్ళు రోడ్డుమీద తిరగడం, తూలడం మావులే. గాని తవరేంటి ఇయ్యాల?’’ కోటేసు ఎలా అన్నా అసలు విషయం గుర్తొచ్చింది రఘురాంకు. ‘‘ఆ! నాన్నగారు ఏవన్నా కనపడ్డార్రా కోటేసూ.’’ ఆ ప్రశ్న అడగగలిగిన చనువున్న ఫ్రెండు కోటేసు వొక్కడే. ఈసారి నిజంగానే ఫెళ్ళున నవ్వాడు కోటేసు. సారా తాగిన నాలిక్కి కారం రుచి తగిలినంత తృప్తితో గుటకేసి నవ్వి నవ్వి అన్నాడు – ‘‘ఎవరు? బాలయ్య మేష్టారా! పగలేబెల్లు కోడితెగాని పాటం ఆపడు. రాత్రి ఏడుగంటల టీవీ వార్తలు సమాప్తం అనగానే ముసుగుపెట్టే బాలయ్య పంతులు ఇట్టా అర్ధరాత్రెల వీధిలోకి రావడం? ఏంటి నువ్వూ తాగావా?’’ మళ్ళీ భళ్ళుభళ్ళున నవ్వాడు. తాగి ఉన్న అతనితో లాభం లేదనుకుని ముందుకు కదిలాడు రఘురాం. సెంటర్ కూడలికి వచ్చాడు. అక్కడ చిన్న చిన్న కొట్లు కొన్ని ఉన్నాయి. అలాగే ఒకటీరెండు హోటళ్ళు లాంటివి. పెద్దసైజు బోర్డు రాయించిన భోజన హోటల్ ఉందిగాని భోజనం దొరికేది పగలే. అలాగే టీ బంకులు, మంగలిషాపు, ఇస్త్రీ దుకాణం లాంటివి ఆ సెంటర్ చుట్టుపక్కలా ఉన్నాయి. అలాగే ఊరి అన్ని ప్రాంతాలలో కూడా ఉన్నాయి. సెంటరుకు దగ్గరలోనున్న పక్క సందుల్లో సారా కొట్టు, కొత్తగా బార్, రెస్టారెంట్ లాంటివి కూడా వెలిశాయి. కొత్తగా చికెన్ దుకాణం, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మొదలెట్టారు. ఫ్లెక్సీల పుణ్యమా అని బోర్డుల అందచందాలు, తద్వారా సెంటరు రూపురేఖలు మారిపోయాయి. జనసందోహం లేని నిశ్శబ్దరాత్రి సెంటరు వెన్నెల్లో నగ్నసుందరిలా, ప్రాథమికమైన అందచందాలతో అది రఘురాం లాంటి వారిని కట్టిపడేస్తుంది. అలా సెంటరు మధ్య నిలబడి అంతా కలయ చూస్తున్న రఘురాం చూపు ఎదురుగ్గా ఉన్న సందువైపు మళ్లింది. అంతే! అటే చూస్తున్న రఘురాం నెత్తిన పిడుగు పడినట్లు మ్రాన్పడిపోయాడు.ఆ సందులో పట్టపగల్లా వెలిగిపోతున్న మెర్క్యురీలైటు కాంతిలో రంభ బార్–రెస్టారెంట్ మహాద్వారం నుండి తల వంచుకుని కాళ్ళకు అడ్డుపడకుండా పంచె ఎత్తి పట్టుకుని బయటకొచ్చి వడి వడిగా సాగిపోతున్న బాలయ్య మాష్టారు. తన కన్నతండ్రి, ఊరంతా కీర్తించే మహా మహోపాధ్యాయుడు. నైతిక శ్రేష్టుడు. ఆదర్శగురువు. ప్రశంసనీయ తండ్రి. అత్యుత్తమ భర్త. బార్లోంచి అర్ధరాత్రి బయటకు రావటం. అది తాను చూడటం. ఆదర్శ కుమారుడైన రఘురాం భరించలేకపోయాడు. బాధతో, దు:ఖంతో, ఏదో అవమానంతో అతను ముడుచుకుపోయాడు. హిమవన్నగం అంత తండ్రి సమున్నత వ్యక్తిత్వం వేగంగా కరగసాగింది. ఇది కొత్త అలవాటా, ఎప్పట్నుంచో ఉందా! ఉంటే ఇంతకాలం తనకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు. తల్లి కూడా తెలిసి భరిస్తోందా? పిల్లలకు తెలియకుండా ఎంతలా నటిస్తోంది? ఊర్లో ఎవరికీ తెలియదా! కనీసం కొండారెడ్డి మావయ్యకు తెలియదా. లేక ఇద్దరూ కలిసే తాగుతున్నారా?అసలు ఆయనే అలవాటు చేశాడా? కోటేసుగాడికి తెలుసా! ఇప్పుడేం చెయ్యాలి!పరిపరివిధాల ఆలోచనలు సాగిపోతున్నాయి. ఇంతలో సైకిల్ బెల్ శబ్దం దగ్గరగా మోగడంతో చటుక్కున కదిలాడు. తండ్రి కోసం సందులోకి చూశాడు. నిర్మానుష్యంగా ఉంది. చటుక్కున అన్ని వైపులా చూశాడు. బాలయ్య మాష్టారు కనపడలేదు. ఇంతలోనే ఎటు మాయమైపోయాడు? ఇంటికి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి. ఏడీ ఇటు నా ముందుగా వెళ్ళలేదు. మరి ఎటు వెళ్ళినట్లూ? ఇదేవిటో ఇవ్వాళ నాన్న విచిత్ర ప్రవర్తన వల్ల తనకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి అనుకుంటూ ఇంటివైపు తిరిగి వడివడిగా నడవసాగాడు. అలా వెళుతూనే అటూ ఇటూ చూడటం మానలేదు. ఊహాతీతంగా బాలయ్య మాష్టారు ఓ సందులో కనపడి వడివడిగా మరో సందులోకి మాయమయ్యాడు. ఈసారి గుండె ఆగినట్లయ్యింది రఘురాంకు– ‘ఇదేంటి! నాన్న, ది గ్రేట్ బాలయ్య మాష్టారు, ఆ సందులోకి వెళ్ళాడా! ఆ సందులోంచి వెళితే అలా అలా మరో సందు మరో సందు మా ఇంటికి చేరవచ్చు. అమ్మో అమ్మో అంటే నాన్న మెయిన్ రోడ్డు మీదికిరాకుండా సందు గొందుల్లోంచి బార్‌కు వెళ్లి తాగి తిరిగి ఇంటికి చేరుతున్నాడు’. సీన్ అంతా అర్థమయింది.ఈ వయసులో ఈయనకు ఇదేంబుద్ధి. కోపం ముంచుకొచ్చింది. ఉగ్రుడైపోయాడు. ఇవ్వాళ డైరెక్టుగా అడిగెయ్యాలి. మరింతగా ఆయన దిగజారకముందే, ఆయనను కట్టడి చేయాలి. అమ్మ ఎంత కుమిలి పోతోందో!వేగంగా ఇంటివైపు కదిలాడు. గుమ్మంలో నాన్న. అప్పుడే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అమ్మ గుమ్మంలో నిలబడి ఆయనను లోపలికి తీసుకెళ్ళటానికన్నట్లు నిలబడి ఉంది. ఆయన రాగానే ఆమె కంగారు పడుతూ అటూ ఇటూ చూడటం రఘురాంకు ఎంతో బాధ కలిగించింది. అతను కోపంతోనూ, ఆవేదనతోనూ కదిలిపోతున్నాడు.బాలయ్య మాష్టారు లోపలికి అడుగువేసాడు. శ్యామల అటూ ఇటూ చూసి తలుపు వేసుకోబోయింది. ‘‘అమ్మా! ఆగు.’’ అరుపులా గట్టిగా దృఢంగా అన్నాడు. అన్నంత వేగంగా గుమ్మం దగ్గరగా వెళ్లి లోపలికి అడుగువేసి అంతే వేగంగా తలుపులు మూశాడు. ఇద్దరూ మ్రాన్పడిపోయారు. అప్పుడు దాదాపు అర్ధరాత్రి కావొస్తోంది. బాలయ్య మాష్టారు, రఘురాం ఇద్దరూ వేగంతో, ఆందోళనతో చెమటపట్టి అలసటగా కన్పిస్తుంటే శ్యామల కంగారుగా ఉంది. లోపలి తలుపు కొంచం కదిపి అంతా తాను చూస్తున్నట్లు సువర్ణ ముగ్గురి దృష్టిలోకొచ్చింది. ‘‘ఎక్కడికెళ్ళి వస్తున్నారీ రాత్రివేళ?’’ చటుక్కున తండ్రిని నిలదీస్తున్నట్లు నేరుగా అడిగాడు. జీవితంలో తొలిసారి కొడుకు నిగ్గదీసి ప్రశ్నించడంతో నోటమాట రాలేదు బాలయ్య మాష్టారుకు. ఆయన పక్కకు కదిలిన శ్యామల, ఆయన చేతిలోని సంచి తీసుకుంది. అప్పుడు మెదటిసారి తండ్రి చేతిలో ఉన్న సంచిని చూసాడు రఘురాం. ఆమె ఆయనకు సపోర్టు చేస్తున్నట్లు భావించాడు.‘‘అమ్మా! నువ్వు ఆయనను సపోర్టు చెయ్యొద్దు.’’ అన్నాడు. అతని గొంతు అలా తండ్రిని నిగ్గదీసి అడగటం వారి జీవితంలో మొదటిసారి.‘‘అడుగుతున్నది మిమ్మల్నే నాన్నా! ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లి వస్తున్నారు?’’ మళ్లీ రెట్టించి అడిగాడు. ఇద్దరూ ముఖాలు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సువర్ణ బయటకొచ్చింది. ‘‘ఏవిటి మీ ప్రశ్న? మావయ్యగారు ఎక్కడికి వెళ్లివస్తే మీకెందుకూ. ఆయననే ప్రశ్నిస్తున్నారు. లోపలికి రండి. బాగా పొద్దుపోయింది. అత్తయ్యా! లోపలికి వెళ్ళండి.’’ విషయాన్ని చిన్నదిచేసి రఘురాంను లోపలికి తీసుకెళ్లడం ఆమె ప్రస్తుత కర్తవ్యం.‘‘నాన్న ఎక్కడికి వెళ్లి వస్తున్నారో తెలుసా?’’శ్యామల తెల్లబోయింది. వేగంగా అర్థం చేసుకుని అంతే వేగంగా స్పందించింది – ‘‘రఘూ! ఏవిటా ప్రశ్న. నాన్నగారినే..’’ ‘‘అవును. నాన్నగారినే అడుగుతున్నాను. నువ్వు అడ్డుకోకు.’’ ‘‘ఏవిటండీ! అర్ధరాత్రి ఈ ప్రశ్నలు. పొద్దున్నే మాట్లాడుకోవచ్చు.’’ సువర్ణ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ‘‘నాన్న ఎక్కడికి వెళ్లి వస్తున్నారో తెలిస్తే నువ్విలా మాట్లాడవ్’’ రఘురాం ఎమోషన్ పెరిగిపోతోంది. ‘‘ఏవిట్రా. ఏవిటీ మీటింగు.’’ కళ్ళు నలుముకుంటూ బయటకొచ్చి అడిగింది సుజాత. వెనక భర్త రాజు.‘‘నాన్నగారు ఈ రాత్రివేళ బార్‌కు వెళ్లి.. అంటే.. మందుకొట్టి వస్తున్నారు.’’ అంతా అవాక్కయ్యారు. రెండు నిమిషాలు మౌనం. రఘురాం ఏదో కంటిన్యూ చేయబోయాడు. శ్యామల అంది గట్టిగా – ‘‘రఘూ! మతిపోయి మాట్లాడుతున్నావా..’’. రఘు తగ్గలేదు – ‘‘అవును. నాన్నగారిని బార్ దగ్గర చూశాక నిజంగానే మతిపోయింది నాకు.’’ ఇంకా వివరంగా చెప్పాడు. కోడలు, కూతురు, అల్లుడు నోటమాట లేక అచేతనంగా నిలబడిపోయారు. ముందుగా కదిలింది బాలయ్య మాష్టారు. ‘‘వెళ్ళండి వెళ్ళండి. అంతా లోపలికి వెళ్ళండి. వండినవన్నీ అందరూ తిన్నాక మీ అమ్మకు ఏమీ మిగలలేదు. పిల్లలుకదా పోటీ పడి అన్నీ ఖాళీ చేసేశారు. ఆమె కాసిని నీళ్ళు తాగి పడుకోవడం చూసి నేనే ఏవన్నా తినడానికి తెద్దామని బయటకు వెళ్లాను. పల్లెటూరుకదా, ఇంత రాత్రి సారాకొట్టు, అదే, బారు తప్ప ఏవీలేవు. ఏదో వెజిటబుల్ పలావ్ వేడివేడిగా చేసి ఇచ్చాడు. అదే తెచ్చా. తిను శ్యామలా! చల్లారిపోతుంది.’’ వాతావరణాన్ని చల్లబరచడానికన్నట్లు నవ్వి ‘‘ఆ మాంకాలమ్మ సందులో పరుగు పరుగున వస్తుంటే కుక్కలువెంటబడ్డాయిరా రఘురామా..’’ అంటూ అందరివంకా చూస్తూ జోక్‌గా చెప్పి అందరినీ నవ్వించాడు బాలయ్య మాష్టారు అనే భర్త! మత్తి భానుమూర్తి -
పాత కొత్తకథ!
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఒకరోజు రాజుగారు వాళ్లను పిలిచి...‘‘నా కొడకల్లారా... లేచామా? తిన్నామా? పడుకున్నామా? అని కాకుండా... ఏదైనా చేయండ్రా’’ అని అరిచాడు.‘‘ఏం చేయమంటారేంటి?’’ పెద్దకొడుకు ఆవులిస్తూ అడిగాడు.‘‘వేటకెళ్లి చావండి’’ ఆదేశించాడు రాజు తల మీద కిరీటం సవరించుకుంటూ.‘‘నువ్వు తండ్రివేనా? తండ్రి రూపంలో ఉన్న శత్రువువా?’’ గట్టిగా అరిచాడు రెండో కొడుకు.‘‘తినడానికి తప్ప... నువ్వు నోరు తెరవగా చూడడం ఇదే ఫస్ట్‌టైమ్. ఎందుకంతలా ఫీలై పోతున్నావు? వేటకెళ్లమని చెప్పడం తప్పా?’’ రెండో కొడుకుని నిలదీయబోయాడు రాజు.‘‘ఇన్ని న్యూస్‌చానల్స్ వస్తున్నాయి. ఒక్కటైనా చూసి చస్తేగా... ఎంతసేపూ వందిమాగధుల పొగడ్తలు వినడంతోనే మీకు టైమ్ సరిపోతుంది’’ విసుగ్గా అన్నాడు మూడో కొడుకు. ‘‘నేను చెప్పిందానికి, న్యూస్చానల్స్కు ఏమిటోయ్ సంబంధం?’’ అడిగాడు రాజు. ‘‘సల్మానుఖాను కృష్ణజింకల కేసు గురించి తెలిస్తే... మీ నోటి నుంచి వేట అనే మాటే రాదు. ఈ కేసు పుణ్యమా అని సల్మానుఖాను ఎప్పుడు కటకటాల వెనక్కి వెళతాడో తెలియదు. మీ చేతులకు మట్టి అంటకుండా మమ్మల్ని కటకటాల వెనక్కి తొయ్యాలనేదే కదా మీ తొక్కలో ప్లాను’’ తండ్రి కళ్లలోకి సూటిగా చూస్తూ అరిచినంత పనిచేశాడు నాల్గో కొడుకు.‘‘వేటాడడం అనేది రాజుల తరతరాల సంప్రదాయం. సాహసప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం. మీకు వేటాడే దమ్ము లేక... సాకులు వెదుకుతున్నారు. కనీసం చేపలనైనా పట్టి చావండ్రా’’ అంటూ సింహాసనంపై నుంచి లేచి అటెటో వెళ్లిపోయాడు రాజు. ‘‘తియ్యండ్రా గాలాలు... ఇయ్యండ్రా వీళ్లకు’’ సేనాధిపతి గొంతు గట్టిగా వినిపించింది.మరుసటి రోజు పొద్దుటే వాగులనాగారం చెరువుకు వెళ్లారు రాకుమారులు.చెరువులో గాలాలు వేసి గట్టుపై ఉన్న చెట్టు కింద కూర్చొని పేకాడడం మొదలు పెట్టారు.గంటలు గడుస్తున్నా గాలాలకు చేప కాదు కదా చిన్న పీత కూడా పడలేదు.రాకుమారులకు విసుగొచ్చింది.‘‘ఏహే... తొక్కలో ఫిషింగ్. వెళ్దాం పదండి’’ సోదరులకు పిలుపునిచ్చాడు పెద్ద రాకుమారుడు.‘‘ఇలా ఇరిటేట్ అయితే ఎలా సోదరా? ఇక్కడ సమస్య అనేది చేప గురించి కాదు. మన సహనం గురించి. మనకు ఎంత సహనం ఉంది అని పరీక్షించడానికే తండ్రిగారు మనకు ఈ పరీక్ష పెట్టారు. ఈ చిన్న పరీక్షలో కూడా మనం నెగ్గక పోతే ఇంకేమైనా ఉందా?’’ అని హితవు చెప్పాడు చిన్న రాకుమారుడు.ఈలోపు ‘‘అయిదు వరహాలకు కిలో చేపలు...డెడ్ చీప్.... బంపర్ ఆఫర్’’ అని గట్టుకు ఒకవైపున అరుస్తున్నాడు ఒక జాలరి.‘హమ్మయ్య.... సమయానికి తిమింగలంలా వచ్చాడు’ అని జాలరి దగ్గరికి వెళ్లి చెరో చేప కొనుగోలు చేసి అంతఃపురానికి చేరుకున్నారు రాకుమారులు. ‘‘శబ్బాష్... ఇప్పుడనిపించార్రా నా కొడుకులని’’ కొడుకుల వైపు చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు రాజు.‘‘అది సరే... ఇప్పుడు వీటిని ఏం చేయమంటారు?’’ అడిగాడు పెద్ద రాకుమారుడు.‘‘నాయనలారా.... ఈ ఏడు చేపలను ఎండకు ఎండబెట్టండి. ఎండుచేపల పులుసు తినక చాలారోజులవుతుంది’’ అన్నాడు రాజు.‘‘అలాగే తండ్రి’’ అని రాజు చెప్పిన పని చేశారు కుమారులు.ఆరు చేపలు బ్రహ్మాండంగా ఎండాయి. ఏడో చేప మాత్రం... ఎండలేదు సరికదా.... ఎవరినో ఎండగడుతుంది.‘‘ఈ ఎండలకు బండలే పగులుతున్నాయి. చేపా.... చేపా... నువ్వెందుకు ఎండలేదు?’’ అడిగాడు రాజు.‘‘నా ఇష్టం. నా గురించి అడగడానికి నువ్వెవడివి?’’ గొంతు పెద్దది చేసింది చేప.‘‘నేను రాజును’’ గంభీరం ఉట్టి పడే కంఠంతో అన్నాడు రాజు.‘‘ఏ రాజువు? అప్పల్రాజువా? సుబ్బరాజువా? భీమరాజువా? ఏ రాజువి?’’ వెటకారంగా అంది చేప.‘‘ఆ రాజులలో ఏ రాజుని కాదు... ఐయామ్ ఎ కింగ్ యూ నో’’ మీసాలు మెలేస్తూ అన్నాడు రాజు.‘‘నువ్వు కింగ్ అయితే నేను కింగ్ ఫిష్‌ని. ఆషామాషీ చేపను కాదు. లా చదువుకున్నదాన్ని. చేపల హక్కుల సంఘానికి ప్రెసిడెంటుని’’ ఒకింత గర్వంగా అంది చేప.‘‘అయితే ఏంటంటావు ఇప్పుడు? ఎండకు ఎందుకు ఎండలేదో ముందు చెప్పు?’’ కోపంగా అడిగాడు రాజు.‘‘మళ్లీ అదే చెత్త ప్రశ్న వేస్తున్నావు. ఎండకు ఎండడమా! వానకు తడవడమా! అనేది నా చాయిస్. నువ్వెవరివయ్యా ఆర్డర్ వెయ్యడానికి. ఎడారిలో ఇసుక అమ్ముకునే ముఖం నువ్వూనూ’’ గట్టిగానే తిట్టింది చేప. ‘‘ ఏ ధైర్యంతో ఇంతలా ఎగురుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు’’ అయోమయంతో కూడిన ఆవేశంతో అరిచాడు రాజు. ‘‘ఫిష్ప్రొటెక్షన్ యాక్ట్ 2018 గురించి ఎప్పుడైనా విన్నావా? ఖచ్చితంగా విని ఉండవు. ఈ యాక్ట్ ప్రకారం... చేపలను పట్టడం, వాటిని పులుసు చేసుకోవడం, ఎండలో దండానికి వేలాడదీయడం... ఇలాంటి చర్యల ద్వారా చేపల జీవించే హక్కును కాలరాయడం... డబ్ల్యూపీసి 272/384 సెక్షన్ల ప్రకారం శిక్షార్హం. దీనికిగానూ పది సంవత్సరాల జైలుశిక్ష, పదిలక్షల జరిమానా విధించబడుతుంది’’ అని హెచ్చరించింది చేప. గజగజ వణికిపోయాడు రాజు.వన్స్ అపాన్ ఎ టైమ్... పొరుగు రాజ్యం రాజు తమ రాజ్యం మీదికి దండెత్తుకు వచ్చినప్పుడు కూడా ఈ రేంజ్లో వణక లేదు.‘‘ఏం బాసూ.... ఎండకు ఎందుకు ఎండలేదో చెప్పమంటావా?’’ కవ్వింపు చర్యలకు దిగింది చేప.‘‘అక్కర్లేదమ్మా... నువ్వు ఎండితే ఏమిటి? ఎండక పోతే ఏమిటి? బుద్ధి తక్కువై ఏదో వాగాను. నన్ను క్షమించమ్మా’’ అంటూ చేపకు సారీ చెప్పాడు రాజు.ఆ తరువాత...‘‘ఎవరక్కడా’’ అని కేకేశాడు.‘‘చెప్పండయ్యా’’ అంటూ పరుగెత్తుకు వచ్చారు భటులు.‘‘ ఈ చేపమ్మను పల్లకీలో ఎక్కించుకొని, మేళతాళాలతో వాగులనాగారం చెరువులో వదిలి రండి’’ అని ఆదేశించాడు రాజు. ‘‘అలాగేనయ్యా’’ అంటూ భటులు పరుగులు తీశారు. – యాకుబ్ పాషా -
లోపాలను సరిచేసుకుంటారా..?
సెల్ఫ్ చెక్ ప్రతిమనిషిలోనూ కొన్ని దోషాలు, లోపాలు ఉంటాయి. లోపాలు ఉండటం తప్పు కాదు, కాని వాటిని ఎవరయినా ఎత్తి చూపితే అంగీకరించే ధైర్యం ఉండాలి. వాటిని ఎత్తి చూపినందుకు కోపం తెచ్చుకోక సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మరీ మంచిది. 1. మీలో ఏ లోపం లేదు, మీరు చేసే పనులన్నీ కరెక్ట్ అనుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. ఎవరి తప్పు వారికి తెలీదు. అటువంటప్పుడు ఎదుటివారు మీలోని లోపాన్ని ఎత్తిచూపితే సరిచేసుకోవాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. లోపం ఉండటం దోషం కాదు, సరిచేసుకోవాలనుకోకపోవడమే తప్పు. ఎ. అవును బి. కాదు 4. లోపాలు లేని మనిషి ఉండరనే మాటను మీరు విశ్వసిస్తారు. ఎ. అవును బి. కాదు 5. ఎదుటి మనిషిలోని లోపాలను ఎత్తి చూపే ముందు మీలోని లోపాలను సరిదిద్దుకోవాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. ఎదుటి మనిషిలోని లోపాలని కాక సుగుణాల గురించి చర్చించుకోవటం మంచిదనే విషయంతో ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ లోపాలను మీ అంతట మీరే సవరించుకోవాలనే కాంక్ష మీలో ఎక్కువ. ఎ. అవును బి. కాదు 8. రామకృష్ణ పరమహంస వంటి వారు తనలోని లోపాలను సరిదిద్దుకున్న తరవాతే శిష్యులకు బోధ చేసేవారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. లోపం లేని వ్యక్తుల కోసం వెతుకులాడకూడదనే మాటతో మీరే ఏకీభవిస్తారు. ఎ. కాదు బి. అవును 10. భగవంతుడు లోపాలను పెట్టడమే కాక వాటిని సరిదిద్దుకునే విధానాలు కూడా చూపాడని మీరు నమ్ముతారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాలు ‘ఏ’ లు ఏడు కంటె ఎక్కువ వస్తే లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారని అర్థం. ‘బి’ లు ఏడు వస్తే మీలో ఉన్న లోపాలను అంగీకరించే తత్త్వం మీలో లేనట్లే. ‘ఏ’ లను సూచనలుగా భావించి మీలోని లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. -
ఆత్మన్యూనత... ఆత్మవిశ్వాసం
ఎన్నో మంచిగుణాలున్న వారు కూడా, తమలో ఒక చిన్న గుణాన్ని భూతద్దంలో చూస్తూ, తాము దేనికీ పనికిరామని భావిస్తూ, ఆత్మన్యూనతలో విలువైన కాలాన్నీ, జీవితాన్నీ వృథా చేసుకుంటుండటం చూస్తుంటాం. చక్కని మాటకారి కాదని, చూడచక్కని రూపం లేదని, పెద్ద చదువులు లేవని, సిరిసంపదలు లేవని, లలితకళలు లేవని, ఇవన్నీ కాకపోతే అదృష్టహీనులనీ పక్కవారితో పోల్చుకుంటూ అనుక్షణం బాధపడేవారు కోకొల్లలు. అటువంటి ఆత్మవిశ్వాసం లేనివారికి ధైర్యం కలిగించేలా చాణక్యుడు చక్కని ఉదాహరణను చెప్పాడు. మొగలి పొదలు బురదలో పెరుగుతాయి. విషసర్పాలు చుట్టుకుని ఉంటాయి. ఆకులనిండా ముళ్ళు ఉంటాయి. మొగలి పూరేకులు, ఆకులు వంకరగా, అడ్డదిడ్డంగా, క్రమపద్ధతి లేకుండా పెరుగుతాయి. ఇన్ని అవలక్షణాలున్నా మొగలిపూవుకున్న ఒకే ఒక సుగుణం మైమరపించే సువాసన మాత్రమే. ఆ ఒక్క పరిమళంతో అందరినీ ఇట్టే తనవైపునకు ఆకర్షిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనే ఒక్క సుగుణం ఉంటే చాలు... వారికి ఏ విధమైన ప్రత్యేకతలు లేకపోయినా ఎటువంటి వారైనా వారికి దాసోహ మనవలసిందే. -
హగ్ ఇస్తుంది ధైర్యం..భరోసా
► బాధల్లో ఉన్నవారిని హత్తుకుంటే రిలీఫ్ ► నేడు హగ్ డే ప్రేమనేది అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే పుట్టిన బిడ్డ ప్రపంచంలోకి రాగానే తల్లిని హత్తుకుని పడుకుంటుంది. ఆమె స్పర్శలో ఉండే ధైర్యం ప్రపంచంలో మరెవరూ ఇవ్వలేరు. మనం ఓడిపోయినప్పుడు ఓదార్పు కోసం ఆత్మీయుల స్పర్శ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మనిషిని మనిషిగా గుర్తించగలిగే ప్రేమను ఆత్మీయ ఆలింగనం కొండంత బలాన్ని ఇస్తుంది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరాకుగా ఉన్న కాంపౌండర్‌ను హత్తుకునే సన్నివేశంలో హీరో ప్రేమ ఒక చిన్న కౌగిలింతతో తెలుస్తుంది. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుతెచ్చుకున్న అమృతానందమయి అమ్మ కూడా భక్తులకు తన స్పర్శ ద్వారానే ప్రేమను చాటుతుంది. ఎన్ని కోట్లున్నా ఒంటరిగా అనుభవించడం ఏవరికీ చేతకాదు. అందుకే ప్రేమను తెలిపే ఆత్మీయ స్పర్శను హగ్ డేగా ప్రపంచం జరుపుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు ఒక్కో డేను జరుపుకుంటున్నారు ప్రేమికులు. ఆదివారం నిర్వహించే హగ్ డే ఇందులో భాగమే.. విశాఖపట్నం : ప్రపంచ దేశాల్లో మనుషుల మధ్య కులం, మతం, రంగు, అంతస్తు, హోదా ఇవన్నీ అడ్డు గోడల్లా నిలిచిపోతాయి. వాటిని అధిగమించేందుకు కొంత మంది ఈ హగ్డేను జరుపుకుంటారు. కొంత మంది యువతీ యువకులు పబ్లిక్ ప్లేస్ల్లో ఫ్రీ హగ్స్ పేరుతో బోర్డు పెట్టి నిలబడతారు. అంటే తమకు అంతస్తు, రంగు వంటి బాహ్య విషయాలపై ఆసక్తి లేదని మనుషులనందరినీ దగ్గరకు చేర్చుకోవడం ఇష్టమని అందువల్ల తనను ఎవరైనా హగ్ చేసుకోవచ్చని అర్థం. ఈ ప్రయోగం చాలా సక్సెస్ అయింది. కావాలంటే యూట్యూబ్‌లో ఫ్రీహగ్స్ అని టైప్ చేసి చూడండి చాలా వీడియోలు ఉంటాయి. ఏఆర్. రెహమాన్ ఫ్రీహగ్స్ పై జియాసే జియా అని ఒక ఫేమస్ ఆల్బమ్ కూడా చేశారు. ప్రపంచంలో ఉన్న మనుషుల మధ్య దూరాలు చెరిగిపోయేలా అందరం ఒక్కటవుదామనే నినాదంతో హగ్డే ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రేమికుల మధ్య.. అదే ప్రేమికుల మధ్య ఉండే ఆత్మీయత వేరు. పైన చెప్పినవన్నీ ప్రేమను అందించేవి కాని.. ఇక్కడ ప్రేమను కోరుకునేది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే అనుబంధం వారి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ వయసుతోపాటు పెరుగుతుంది. బ్రేకప్‌లతో విడిపోయే వారికి ఇవేమీ అర్థం కాకపోవచ్చు. కాని నిచ్చెలి చేతిలో చెయ్యివేసి కబుర్లు చెప్పుకోవడం హత్తుకోవడం జీవితాంతం మరచిపోలేని మధురానుభూతినిస్తుంది. అ స్పర్శ జీవితాంతం గుర్తుండిపోతుంది. హగ్డే ప్రేమికులకే కాదు... హగ్డేను అపార్థం చేసుకునేవాళ్లు కూడా లేకపోలేదు. కేవలం ప్రేమికులకు మాత్రమే హగ్డే అనుకుంటే పొరబాటే. తాత మనవరాలిని, తండ్రి కూతురిని, తల్లి కొడుకుని, అన్న చెల్లెల్ని, స్నేహితుల మధ్య ఇలా ఒకరి ప్రేమను ఒకరికి తెలపడానికి హగ్ అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అందుకే హగ్డేకు అంత ప్రాధాన్యం ఉంది. యువతీ యువకుల మధ్య... హగ్డేను జరుపుకునే వారిలో యువతీ యువకులు, ప్రేమికులు కూడా ఉంటారు. ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని తెలపడానికే ఆలింగనం ఒక అసంకల్పిత చర్యగా భావించాల్సి ఉంటుంది. చాలా కాలం తరువాత స్నేహితుడ్ని లేదా స్నేహితురాలిని చూస్తే ఆశ్చర్యంతో పాటు మనకు తెలియకుండానే వాళ్లను హత్తుకుంటాం. అంటే దానర్థం దురుద్దేశం కాదుగా. ఆస్ట్రేలియా, అమెరికా వంటి దశాల్లో వందల మంది స్టూడెంట్స్ హగ్గింగ్ క్యాంపెయిన్లు చేస్తారు. వాళ్లే మనుషుల దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటారు. -
నమ్మే ధైర్యం మీకుందా?
ఘోస్ట్ దెయ్యాల గురించి మాట్లాడుకునే ధైర్యం భయస్థులకు మాత్రమే ఉంటుంది! సో... భయం అన్నది ధైర్యవంతుల క్వాలిటీ. ఇంతకీ దెయ్యాలన గుర్తించడం ఎలా? మీ చుట్టుపక్కల దెయ్యం తిరుగుతోందని కనిపెట్టడం ఎలా? కొన్ని హింట్స్. ►మీరున్న చోట హఠాత్తుగా టెంపరేచర్ డౌన్ అయితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో తాకినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►అకారణంగా మీ చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీరు పెట్టని చోట పెట్టని వస్తువు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ► మీ కంటి చివర్ల నుంచి నీడలేవో కదలినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీ కనుచూపు మేరలో ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►బల్బులు వాటంతటవి వెలిగితే, ఫ్యాన్లు వాటంతటవి తిరగితే, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాటంతటవి పనిచేయడం మొదలుపెడితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో మెట్లు ఎక్కుతున్న లేదా దిగుతున్న చప్పుడు గానీ వినిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►గోడలపై, గ్లాసులపై అంతుచిక్కని (మానవాతీత) చేతి గుర్తులు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీ వెనుక ఎవరూ లేకున్నా, మీరు అద్దం చూసుకుంటున్నప్పుడు అద్దంలో వేరెవరో కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►ఇరుకైన గోడల నడుమ ఎవరో నడుస్తున్నట్లు చప్పుడు వినిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీకు మాత్రమే వినిపించేలా ఎవరైనా పెద్దగా ఏడుస్తుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►ఏదో చెప్పలేని వాసన.. అది మంచిదైనా, చెడ్డదైనా ముక్కు పుటాలకు తాకితే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ►మీ పిల్లి గానీ, కుక్క గానీ అకారణంగా ఒకేవైపు చూస్తూ, బెదురుముఖం పెట్టి అలా నిలబడిపోతే అక్కడ దెయ్యం ఉన్నట్లే. ఇవన్నీ... వదిలెయ్యండి. ఇప్పుటికిప్పుడు మీరు దెయ్యాన్ని చూడాలనుకుంటున్నారా? ఓసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. చూసుకున్నారా? దెయ్యం కనిపించలేదా?! అయితే... మీరు చూశారని చెప్పి దెయ్యం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి ఉంటుంది. (సరదాగా రాసిన ఐటమ్ ఇది. చప్పుడు చెయ్యకుండా పక్కవాళ్లకివ్వండి) -
డీఐజీకి శౌర్య పతకం
వరంగల్ : విధి నిర్వహణలో ఉత్తమ సేవలతో పాటు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు భారత ప్రభుత్వం వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్‌రావుకు పోలీస్ గ్యాలంటరీ అవార్డు(శౌర్య పతకం) ప్రకటించింది. ఇటీవల నల్లగొండ జిల్లా జానకీపురం సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అక్కడ ఎస్పీగా ప్రభాకర్‌రావు విధులు నిర్వర్తించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఉగ్రవాదులు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన టీంవర్క్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందున ఈ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల ప్రభాకర్‌రావు స్వగ్రామం. 1991 బ్యాచ్‌లో డీఎస్పీగా ఎంపికైన ఆయన జగిత్యాల డీఎస్పీగా మొదటి పోస్టింగ్ పొందారు. అనంతరం నెల్లూరు జిల్లా గూడూరు, నల్లగొండ, సరూర్‌నగర్‌లో పనిచేసి, నల్గొండ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. అక్కడ నుంచి అడిషన్ డీసీసీ(ట్రాఫిక్)గా హైదరాబాద్‌లో పనిచేశారు. ఎస్ఐబీ ఎస్పీగా, ఈస్ట్‌జోన్ డీసీపీ, జాయింట్ కమిషనర్(డిటెక్టివ్)గా సేవలందించారు. అనంతరం నల్గొండ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన ప్రభాకర్‌రావుకు పలువురు అభినందనలు తెలిపారు. -
నిప్పులాంటి మోసం
చేతనబడి ఒక మోస్తరు డాబా ఇల్లు. ఇంటి ముందు నలభై మంది సమావేశం కాదగిన విశాలమైన వరండా. అందులో ఒక పీఠం. దాని ముందు రకరకాల వస్తువులు. పూజలకు ఉపయోగించే మట్టి ప్రమిదలు, మూకుళ్లు, ఒక మూకుడులో పసుపు, ఒక మూకుడులో కుంకుమ, ఒక ఆకు దొన్నెలో సన్నని దారాలు, ఒక చోట నలుచదరంగా కత్తిరించిన కాగితాల దొంతర, ఒక ఇత్తడి పాత్రలో నిప్పులు, ఆ పక్కనే మరొక పాత్రలో సాంబ్రాణి... ఇలా వైవిధ్యమైన వాతావరణం నెలకొని ఉంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పూలమాల గ్రామానికి ఆ పొరుగునే ఉన్న పార్లపల్లి గ్రామం నుంచి వచ్చారు జ్యోతి, అనూరాధ. వారిలాగానే పెద్ద మరిమీడు, చిన్న మరిమీడు, మరికొన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు... అంతా ఓ పదిమందికి పైగా ఉన్నారు. వచ్చిన అందరినీ ఎంతో ఆప్యాయంగా... మేనమామలా ప్రేమగా పలకరిస్తున్నాడు ఓ వ్యక్తి. ఆ ఆత్మీయతకు ఒక్కొక్కరి మనసు తలుపులు తెరుచుకుంటోంది. అత్యంత నిగూఢంగా దాచుకున్న కష్టాన్ని ఆత్మీయుడి ముందు బయటపెట్టుకుంటూ కళ్లు తుడుచుకుంటున్నారు. గతంలో తనకొచ్చిన కష్టాలను వారితో పంచుకున్నాడాయన, వాటిని స్వామి చేత్తో తీసిపారేసినట్లు ఎలా తొలగించాడో చెబుతున్నాడు. సరైన చోటకే వచ్చామనే భరోసా కలుగుతోంది అక్కడున్న వారిలో.ఒక జంట తమ కూతురి పెళ్లికి ఇంకా ఎంత సమయం ఉందని అడిగారు. సంబంధాలు కుదిరినట్లే కుదిరి ఆగిపోతున్నాయని వాపోయారు. బాబా చిర్నవ్వుతో ‘‘మీ అమ్మాయికి అడ్డు వస్తున్న కీడు తొలగిపోతుంది’’ అన్నాడు ధైర్యం ఇస్తున్నట్లు. బాబా ఎదురుగా మట్టి కుండ మీద పెట్టే చిన్న మట్టిపాత్ర. కచ్చితంగా ఆ పాత్ర మధ్యలో తానొక స్పూను వేసి చూపించి మిగిలిన నెయ్యి వారిచేతనే పోయించాడు బాబా. కళ్లు మూసుకుని దీర్ఘంగా మంత్రాలు వల్లించాడు. నిమిషం లోపే పొగ మొదలైంది. ఆ వెంటనే మంట రాజుకుంది. మంట పెద్దదైంది. రెండు నిమిషాల్లో మంట చల్లారి బూడిద మిగిలింది. ‘‘మీ అమ్మాయికి అడ్డుపడుతున్న కీడు మండిపోయింది. ఇక మీ ఊరికి వెళ్లి, అమ్మాయి కీడు తొలగిపోయిందని బంధువులందరికీ చెప్పండి. ప్రయత్నాలు కొనసాగించండి. ఆర్నెల్లలో పెళ్లవుతుంది’’ సంతృప్తికరమైన సమాధానంతో ప్రఫుల్లమైన ముఖంతో లేచారు ఆ తల్లిదండ్రులు. వెళ్తూ వెళ్తూ సంతోషంగా దక్షిణ సమర్పించుకున్నారు. వెంటనే ఒకాయన... ‘రోజుకు ఆరు లీటర్ల పాలిచ్చే తన గేదె ఉన్నట్లుండి ఎండిపోయింద’ని బాబా ముందు వాపోయాడు. ఒక అంత్రాన్ని మంత్రించి ఇచ్చి గేదెకు కట్టమన్నాడు బాబా. దానిని జాగ్రత్తగా చొక్కా లోపలి జేబులో పెట్టుకుని, దక్షిణ తీశాడు ఆ రైతు. ఓ యువ దంపతులు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. వారిది అన్యోన్యమైన కాపురమేననిపిస్తోంది. ఈ వయసులో వీళ్లకు వచ్చిన కష్టమేంటో పాపం- అనుకుంటున్నారు అక్కడికొచ్చిన వాళ్లు. ‘‘మీకు పిల్లలు పుడతారు. బెంగ అక్కరలేదు’’ అన్నాడు బాబా. ఆశ్చర్యంగా చూశారు అందరూ. బాబా వారికి మంత్రించిన తాయెత్తు ఇచ్చి ‘నీ భార్య చేతికి కట్టు’ అని ఆదేశించాడు. అలాగే ఆ అమ్మాయికి మరో తాయెత్తు ఇచ్చి ‘ఇది నీ భర్తకు కట్టమ్మా’ అన్నాడు అనునయంగా. ఇక జ్యోతి, అనూరాధల వంతు... ఇద్దరూ ఇబ్బందిగా చూశారు. వారి సంశయాన్ని, వారిలో ఒక మోస్తరు సంపన్నతను గ్రహించిన బాబా వారిని మరికొంత సేపు ఆగమని, మిగిలిన వారిని పంపించేశాడు. ఇద్దరినీ మార్చి చూస్తూ... జ్యోతితో ‘‘నీ భర్త మరొక స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని నీకెప్పుడు తెలిసింది’’ అడిగాడు బాబా. అసలే ఆందోళనగా ఉన్న అనూరాధ ముఖం ఆ మాటతో పాలిపోయింది. ‘‘రెండేళ్ల నుంచి తెలుసు’’ నూతిలో నుంచి వచ్చినట్లు ఉంది ఆమె మాట. బాబా కళ్లు మూసుకుని ఏదో జపించాడు. పిడికిలి బిగించి నుదుటి మీద పెట్టుకున్నాడు. ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. క్షణాల్లోనే కళ్లు తెరిచాడు. కళ్లు ఎర్రగా మండుతున్నాయి. ముఖం రౌద్రంగా మారిపోయింది. గాల్లోకి చూస్తూ ‘‘అమాయకురాలి కాపురంలో నిప్పులు పోస్తావా’’ అని హుంకరించాడు. క్షణాల్లో స్థిమిత పడి జ్యోతి వైపు చూశాడు. ‘‘నీ భర్త మీద వశీకరణం జరిగింది’’ జ్యోతి వణికి పోతోంది. భయపడకు అన్నట్లు ఆమె భుజం చుట్టూ చేయి వేసి తడుతోంది అనూరాధ.‘‘ధైర్యంగా ఉండు. కష్టపెట్టే వాళ్లున్నట్లే ఆదుకునే వాళ్లూ ఉంటారు. కీడును తొలగిద్దాం’’ అన్నాడు బాబా. కళ్లు తుడుచుకుంటూ అలాగేనన్నట్లు తలూపింది. ‘‘చిన్న హోమం చేద్దాం. నెయ్యి ఉందా’’ వారి చెంత ఉన్న పూజసామగ్రి వైపు చూశాడు బాబా. అనూరాధ పైకి లేచి ‘‘ఈ ఊళ్లో నెయ్యి దొరికే దుకాణాలున్నాయా? ఎటు వెళ్లాలి’’ అని వివరాలడుగుతోంది. ఆత్మీయుడు జోక్యం చేసుకున్నాడు. ‘‘కొత్త చోట వాళ్లేం ఇబ్బంది పడతారు పైగా ఆడవాళ్లు పాపం... నువ్వెళ్లి తీసుకురాకూడదూ’’ అంటూ అక్కడే ఉన్న ఓ కుర్రాణ్ని పురమాయించాడు. అనూరాధ ఆ కుర్రాడికి డబ్బిచ్చి పంపించింది. పది నిమిషాల్లోనే నేతితో వచ్చాడు ఆ కుర్రాడు. జ్యోతితో మట్టిపాత్రలో నెయ్యి పోయించాడు బాబా. అంతకు ఓ అరగంట ముందే పెళ్లి కావాల్సిన అమ్మాయి కోసం మంత్రించినట్లే మంత్రించాడు. ఎంత సేపటికీ నిప్పు కాదు కదా పొగ కూడా రావడం లేదు. జ్యోతి కుప్పకూలిపోలేదు అనే కానీ దాదాపు ఆమె పరిస్థితి అలాగే ఉంది. ‘‘వశీకరణకు విరుగుడుగా ఐదువారాల పాటు రోజూ ముగ్గు పెట్టి ఆవాహన చేస్తాను. నువ్వు రోజూ రానక్కరలేదు. ప్రతి శుక్రవారం వచ్చి పూజలో కూర్చుంటే చాలు. మూడో వారానికే కీడు మండిపోవాలి... ’’ తగుమాత్రం భయపెడుతూనే, ఆ భయాన్ని కొనసాగించడానికి కావలసినంత ధైర్యం చెప్పాడు. జ్యోతి కేసులో ఐదవ వారం వరకు ఆగాల్సిన పని రాలేదు. నాలుగవ వారానికే బాబా ప్రయోగించిన చిట్కాల రహస్యం బట్టబయలైంది. బాబా చేస్తున్నవి మోసాలని తెలిసిన తరవాత ఊళ్లో వాళ్లు ఆవేశంతో ఊగిపోయారు. అడ్డుకోకపోతే ప్రాణాలు పోయేటట్లున్నాయి. ట్విస్ట్ ఏమిటంటే... పోలీసులకు సమాచారం వెళ్లేలోపు బాబా ఊరి వారి కాళ్లు పట్టుకున్నాడు. ఇక ఇలా మాయలు చేయనని ఒట్టు పెట్టుకుని గండం నుంచి బయటపడ్డాడు. మంటలెలా వస్తాయి? వాటి లోపల... అంటే కాగితాల కింద దీపం పెట్టే దొన్నె ఉంటుంది. అందులో పొటాషియం పర్మాంగనేట్ పొడి ఉంటుంది. అది బూడిదరంగులో ఉండటం వల్ల ఆ సంగతి ఎవరికీ తెలియదు. దాని మీద గ్లిజరిన్ కలిసిన నెయ్యి పడిన ఇరవై సెకన్లకు పొగ, మంట మొదలవుతాయి. పొటాషియం పర్మాంగనేట్‌తో గ్లిజరిన్ కలిస్తే ఉష్ణమోచక చర్య జరిగి 200 డిగ్రీల వేడి పుడుతుంది. అందులో నుంచి మంటలు వస్తాయి. కొందరికి మొదటిసారే మంటలు తెప్పిస్తారు. బాగా డబ్బు గుంజవచ్చనే భరోసా ఉన్న చోట మూడు- ఐదు వారాలు తిప్పిన తర్వాత మంట తెప్పిస్తారు. అంత వరకు గ్లిజరిన్ లేని నెయ్యి మాత్రమే వేస్తారు. జనవిజ్ఞాన వేదిక దర్యాప్తులో బాబా దగ్గర ఉండే కుర్రాడు ఏ దుకాణంలో నెయ్యి కొంటున్నాడో గమనించి, ఆ దుకాణదారుడిని నిలదీస్తే విషయం బయటపడింది. జ్యోతి తన కాపురం నిలబెట్టమని బాబా దగ్గరకు వెళ్తున్నట్లు ఇరుగుపొరుగుకి తెలిసింది. భర్త వెంకటేశ్‌కూ తెలిసింది. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా అతడిని దోషిని చూసినట్లు చూస్తున్నారు. దాంతో జ్యోతి దూరమైపోయిందనే భయం మొదలైందడిలో. మిత్రుడి దగ్గర భోరుమన్నాడు. మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉండడానికి ఆకస్మాత్తుగా తనలో తలెత్తిన‘స్తంభన సమస్యే’ కారణమని చెప్పుకోక తప్పలేదు. ఆ మిత్రుడు హేతువాద దృక్పథం కలిగిన వాడు కావడంతో జ్యోతి భర్త అనారోగ్యంతోపాటు బాబా కుట్ర కూడా బయటపడింది. బాబా దగ్గరకొచ్చేవాళ్లందరూ చుట్టుపక్కల ఊళ్లలోనేవాళ్లే. వారి సమస్యలన్నీ తన మనుషుల ద్వారా బాబాకు తెలిసిపోతుంటాయి. అగ్గి లేని బుగ్గి! పుండరీకాక్షయ్య మలయాళ మాంత్రికుడు. కేరళలోనే కాకుండా యావద్దేశంలో ఒక సంచలనం సృష్టించాడు. యజ్ఞాలు చేస్తానని, యజ్ఞగుండంలో అగ్గిలేకుండా మంత్రంతోనే మంట తెప్పిస్తానని సవాల్ చేసేవాడు. అన్నట్లే మంటలు తెప్పించేవాడు. అదంతా మంత్రం మహిమ అని జనం నీరాజనాలు పట్టారు. అందులో ఉన్న సైంటిఫిక్ ఫార్ములాను బట్టబయలు చేసిన తర్వాత ఆయన ఆ తరహా ప్రాక్టీస్ మానేశారు. - మహమ్మద్ మియా, కర్నూలు, జనవిజ్ఞానవేదిక కార్యకర్త -
ధైర్యముంటే చాలు!
సినిమాలో సాధించడానికి నటీమణుల కు ధైర్యం చాలా అవసరం అంటున్నారు నటి తమన్నా. ఏమిటీ చాలా మంది శ్రమ, కృషి, ప్రతిభ అన్నింటికీ మించి అదృష్టం ఉండాలంటుంటారు. అలాంటిది ఈ మిల్కీబ్యూటీ ైధైర్యం కావాలంటున్నారేమిటనుకుంటున్నారా? అదేమిటో తమన్నా మాటల్లోనే చూద్దాం. నేను చిత్ర రంగప్రవేశం చేసి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ తమిళం, తెలుగు,హిందీ భాషల్లో ప్రము ఖ నాయకిగానే వెలుగొందుతున్నాను. ఇన్నేళ్లలో సినిమా నాకు చాలానే నేర్పించింది. కొత్తలో నటినవ్వాలన్న ఆసక్తి మినహా వేరేమీ తెలియదు. నేను ఉత్తరాది సంస్కృతిలో పెరిగిన యువతిని. అలాంటిది దక్షిణాది చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక్కడ భాష తెలియదు. సంస్కృతి, సంప్రదాయాలు అస్సలు తెలియవు. అయినా ఇక్కడి చిత్రాల్లో నటించడం మొదలెట్టాను. ఎలాంటి భయానికి గురి కాలేదు. ధైర్యం మాత్రమే నాలో ఉంది. అదే నన్ను ఉన్నత స్థాయికి చేర్చింది. తెలి యని భాష అని అప్పుడు భయపడి ఉంటే నటిగా ఇంత గుర్తింపు తెచ్చుకునే దానిని కాదు. అందుకే అంటున్నా నటీమణులు సాధించాలంటే చాలా ధైర్యం అవసరం. సినిమా జయాపజయాల గురించి నేను చింతించను. కఠనంగా శ్రమిస్తాను. చిత్ర జయాపజయాలన్నవి ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. నా వరకు నేను నటిగా చాలా సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నాను. అనుభవా లు చాలా పాఠాలు నేర్పాయి. అవే ఇప్పుడు జీవితాన్ని ఎలా మలచుకోవాల న్న పరిణితిని కలిగించాయి. అంటున్న తమన్నా ప్రస్తుతం తమిళం,తెలుగు,హింది భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్‌సేతుపతికి జం టగా ధర్మదురై చిత్రంలోనూ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న బ్ర హ్మాండ చిత్రం బాహుబలి-2 చిత్రంతో పాటు హిందీలో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్‌కు జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు. -
బక్క పోశాలు.. మళ్లీ బతికిండు!
రోజూ కనబడే కథలు ఎండ ఇరగదీసే సమయం. కానీ ఈపూట ఎందుకో కాస్త దాని మనసు మారినట్లుంది. వాతావరణం కాస్త చల్లగా ఉంది. కాలానికి తనను తాను మార్చుకునే వెసులుబాటు ఉన్నట్లే, ప్రకృతికి తనను తాను మార్చుకునే పరిస్థితి ఉన్నట్లే... వ్యక్తులకు కూడా ఉంటుందా? అందులోనూ సామాన్యులకు కూడా ఉంటుందా?! ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవడానికి ఈ ‘పోశాలు’ ఉదాహరణ. అతను మనసు మార్చుకున్నాడు కాబట్టే, ఈరోజు ఇఎస్ఐ(హైదరాబాద్) హాస్పిటల్ దగ్గర చెత్త ఏరుతూ, ఆ చెత్తను తన చేతిలో ఉన్న పెద్ద సంచిలో నింపుకుంటున్నాడు. మనకది ‘చెత్త పని’ కావచ్చు. అతనికది బంగారంలాంటి పని. విసిరేయబడ్డ ఖాళీ బాటిల్, తెగి చెప్పు... కాదేదీ అతనికి అనర్హం. అవునవును ‘లాభం’ ఆమోఘం. లాభం అంటే వేలు కాకపోవచ్చు. లక్షలు కాకపోవచ్చు. తనకు ఆ పూట తృప్తిగా తినడానికి అవసరమైన ఆదాయం మాత్రమే. అదే తన ఆదాయం. జీవితానందం. నలభై ఏళ్లు కూడా నిండని పోశాలును పలకరిస్తే, ఆ బక్కపలచటి వ్యక్తి మాటల్లో ఎన్నో ‘యుద్ధాలు’ కనిపిస్తాయి. అవి తనతో తాను చేసుకున్న యుద్ధాలు. పరిస్థితులతో చేసిన యుద్ధాలు. అక్కడెక్కడో కరీంనగర్ దగ్గర వీణవంక నుంచి ఈ మహానగరానికి ఎందుకొచ్చాడు? చెత్త ఏరే పనిని ఎందుకు ఎంచుకున్నాడు? అతని మాటల్లోనే విందాం... ‘‘మేము పురాగ ఉన్నోళ్లం కాదు. లేనోళ్లం కాదు. ఎంతో కొంత ఎవుసాయం ఉండే. దీంతోని పాటు ఆ పని ఈ పని చేసి నాయిన కుటుంబాన్ని ఎళ్లదీసేటోడు. నాకు ఇద్దరు అక్కలు. నేనే చిన్నోడిని. నన్ను బాగా గావురం చేసేటోళ్లు. నాయిన అప్పుసప్పు జేసి పెద్ద అక్క పెళ్లి చేసిండు. పెళ్లి జరిగి సంవత్సరం గూడ కాలేదు...నాయిన గుండెపోటుతో చనిపోయిండు. అటు చూస్తేనేమో...పెద్దక్క పెళ్లికి చేసిన అప్పు. ఉన్న పొలం అప్పులల్ల పోయింది. రోడ్డు మీద పడ్డం. నేను చదువు బందు జేసి కూలినాలి పనులు చేసేది. అమ్మ కూడా కూలి పనులు చేసేది.చెడు సావాసాల వల్ల... నాకు తాగుడు అలవాటైంది. బువ్వ లేకుండనైన ఉండెటోన్నిగని... తాగుడు లేకుండా ఉండేటోన్ని కాదు. దీంతో అమ్మ చిన్నక్కను దీసుకొని పెద్దక్క దగ్గరకు పోయింది. కొన్ని రోజుల తరువాత నాకు ఊళ్ల ఉండబుద్ది గాలే. హైద్రబాద్‌కు వచ్చిన. ఒకటే ఆకలి! చేతిలనేమో ఒక్క పైస లేదు. ఒకరోజు తిక్కలేసి బండి(రైలుబండి) కింద తలకాయబెట్టి సచ్చిపోదామనుకున్న. ధైర్యం చాల్లే. తాగితే ధైర్యం వస్తది. కాని డబ్బులెక్కడియి? ఆరోజు పొద్దున్నే ఒకటి చూసిన. ఒకాయన మూడు గిర్రల సైకిల్ బండి మీద పోతున్నడు. రెండు కాళ్లు చచ్చుబడ్డయి. చేత్తొని సైకిల్ నడుపుకుంట పోతున్నడు. ఎనక కూరగాయల గంప ఉన్నది. ఆయినను చూసినంక నా మనసు మారింది. రెండు కాళ్లు లేనోడు బతుకుతున్నడు. కుటుంబాన్ని కూరగాయలమ్మి సాదుతున్నడు. మరి నేనెందుకు ఇట్ల ఆలోచిస్తున్న? సచ్చి సాదించేదేమున్నది? చిన్న పనో పెద్ద పనో చేసి బతకాలనుకున్న. నా ముందు చెత్త కుప్ప కనిపించింది. ఒక సంచి చూసుకొని అందులో పనికొచ్చేవాటిని ఏసుకున్న. సంచి భుజాన ఏసుకొని ఎక్కడెక్కడ్నో తిరిగిన. జమ చేసిన చెత్తను అమ్మితే వంద రూపాయల దాక వచ్చింది. ఆరోజు కడుపునిండ తిన్న. తాగుడు బందు జేసిన. కష్టపడి సంపాదించి కొత్తగా బదుకుదామనుకుంటాన. -
పట్టు వదలకు... గెలుపు మరువకు!
స్ఫూర్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఏముండాలి? ‘చాలా ధైర్యం ఉండాలి’... ఆ ధైర్యంలో కొంచెం అయినా మనలో ఉంటే, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బెదిరిపోతుంది. విజయం మనతో చెలిమి చేస్తుంది. చీకటి భయపెట్టిన చోటే... వెలుగురేఖలు స్వాగతం పలుకుతాయి. సమర్థతకు పట్టం కడతాయి. అరుణ్ పండిట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు... ఒకప్పుడు! ఆత్మహత్య చేసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. పోరాడాలి. గెలవాలి అంటున్నాడు... ఇప్పుడు!! ఆ మార్పు వెనుక కథను తెలుసుకుందాం... స్నేహితులందరినీ పేరు పేరునా గుర్తు తెచ్చుకున్నాడు. అలా గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వారితో తనను తాను పోల్చి చూసుకున్నాడు. ‘వారితో పోల్చితే నేను ఎందుకూ పనికిరాను. అసమర్థుడిని’ అని వందోసారి అనుకున్నాడు. ‘అసమర్థుడిగా బతకడం కంటే చనిపోవడమే మంచిది!’ ఈసారి చాలా గట్టిగా అనుకున్నాడు. మళ్లీ ఏ మూలో చిన్న అలజడి. ‘చనిపోవాలా?’ ‘చనిపోయేంత తప్పు తాను ఏం చేశానని!’ సుజన్పూర్ (హిమాచల్‌ప్రదేశ్)లో చదువుకునే రోజుల్లో అపజయాలు అరుణ్ పండిట్‌ను వరుసగా పలకరించేవి. ఒకరోజు ఒక అపజయం ఎదురైతే, మరొకరోజు అంతకంటే బలమైన అపజయం ఎదురయ్యేది. ఇక చదువు విషయానికి వస్తే ప్రతి పరీక్షలోనూ ఫెయిల్ కావడమే! ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో చేరాలని తనకు ఒక కల ఉండేది. ఒకవేళ తాను కన్న కల నిజమైతే ఇప్పటి వరకు తనను చిన్న చూపు చూసిన వాళ్లే తరువాత నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. విమర్శకుల నోరు మూయించడానికైనా తాను ఎన్డీఎలో చేరాలనుకున్నాడు. మొదటి ప్రయత్నం చేశాడు... ఫెయిల్. రెండో ప్రయత్నం చేశాడు... ఫెయిల్. ముచ్చటగా మూడో ప్రయత్నం చేశాడు... ఫెయిల్! ‘‘కల మాత్రమే కనగల శక్తి ఉంది. దాన్ని నిజం చేసుకునే శక్తి నాలో లేదు’’ నిరాశలో పడిపోయాడు. అపజయాలకు తోడు అనారోగ్యం కూడా అరుణ్‌ను పట్టి పీడించింది. కొంతకాలం ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తరువాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాస్తే షరా మూమూలుగా ఫెయిలయ్యాడు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం, ఒక కల కనడం... ఒక అడుగుపడే లోపే పరాజయం ఎదురుకావడం... జీవితం అంటేనే అసహ్యం అనిపించేది. బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనుకున్నాడు. అందుకే ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ‘వైఫల్యం కూడా తప్పుతో సమానం. అందుకు శిక్ష చనిపోవడమే’ అనుకుంటూ సెల్‌ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇక సెలవు’ అని దగ్గరి స్నేహితులందరికీ యస్ఎంయస్ పెట్టాడు అరుణ్ పండిట్. అరుణ్‌కు నచ్చజెప్పడానికి, ఆత్మహత్య ప్రయత్నం నుంచి అతణ్ణి విరమింపచేయడానికి స్నేహితుల నుంచి ఫోన్లు వరదలా వచ్చాయి. కానీ ఏ ఫోన్‌కు అరుణ్ స్పందించలేదు. కానీ, ఒక యస్‌యమ్‌ఎస్ మాత్రం అతనిలో ఆలోచన రేకెత్తించింది. అందులో ఇలా ఉంది: ‘నా కాళ్లకు చెప్పులు లేవని ఏడుస్తుంటే, కాళ్ల్లు లేని వ్యక్తి కనిపించాడు. నా ఏడుపు ఆగిపోయింది. ఈ ప్రపంచాన్ని సవాలుగా తీసుకో... నిన్ను నువ్వు నిరూపించుకో’. ఎందుకో ఆ మెసేజ్‌ను మళ్లీ మళ్లీ చదవాలనిపించింది. అలా చదువుతున్న క్రమంలో జీవితం విలువ మెల్లగా అర్థం కావడం మొదలైంది. ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయం ఎంత తప్పో తెలిసింది. ఇలాంటివే కొన్ని మెసేజ్‌లు చదివేసరికి మూసుకుపోయిన కళ్లు తెరుచుకున్నాయి. జాడ లేని ఆత్మవిశ్వాసం పదునైన ఆయుధంతో తన ముందు నిల్చొని - ‘‘యుద్ధం చెయ్’’ అని పిలుపునిచ్చింది. అప్పటికప్పుడు తనలో ఒక చిన్న ఆలోచన మెరుపులా మెరిసింది. ‘‘ఒక చిన్న మెసేజ్ నన్ను ఆత్మహత్య ప్రయత్నం నుంచి రక్షించింది. దేశంలో ఎంతోమంది ఎన్నో బాధలతో ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పేలా, ఆత్మవిశ్వాసం నూరిపోసేలా ఒక వెబ్సైట్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?’’ అనే అరుణ్ ఆలోచన నుంచి ‘డోన్ట్ గివ్ అప్ వరల్డ్’ వెబ్సైట్ ప్రారంభమైంది. అనూహ్యమైన స్పందన సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఈ సైట్‌ను ఇరవై అయిదు లక్షల మంది వరకు చూశారు. అరుణ్ పండిట్ ఇప్పుడు ‘డిజిడబ్ల్యు’ నిర్వాహకుడు మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పెద్ద పెద్ద పుస్తకాల నుంచి కాకుండా, నిత్యజీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని అతను చేసే ఉపన్యాసాలు ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. రకరకాల ఆప్స్‌ను లాంచ్ చేయాలని, ఆన్లైన్ సైకలజికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని... ఇలా ఎన్నో ఆలోచనల్లో తలమునకలై క్షణం తీరిక లేకుండా ఉన్నాడు అరుణ్ పండిట్. ఇక నిరాశ అనే శత్రువు అతడి దగ్గరకు ఎలా వస్తుంది! సానుకూల దృక్పథంతో... స్ఫూర్తిదాయకమైన ఛాయాచిత్రాలు ‘డోన్ట్ గివ్‌అప్’లో ఉంటాయి. వీటిని ఎవరైనా పంపవచ్చు. అక్షరాల ద్వారా కాకుండా చిత్రాల ద్వారా ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం ఇది. గొప్ప వాళ్ల ఉపన్యాసాల నుంచి సేకరించిన మంచిమాటలు ఉంటాయి. తమ శక్తిసామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, గెలుపు పతాకం ఎగరేసిన వారి విజయగాథలు ఉంటాయి. కథలు, కవితలు, ఇంటర్వ్యూలు, వీడియోలు ఉంటాయి. అరుణ్ పండిట్ ఇప్పుడు ‘డిజిడబ్ల్యు’ నిర్వాహకుడు మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. పెద్ద పెద్ద పుస్తకాల నుంచి కాకుండా, నిత్యజీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆధారంగా చేసుకొని అతను చేసే ఉపన్యాసాలు ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. -
తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!
మై ఫిలాసఫీ జీవితం చాలామందికి పూలబాట కాకపోవచ్చు. పూలబాట అయినవాళ్లకు...అది శాశ్వతం కాకపోవచ్చు. ఈ ఎరుక మనలో ఉంటే కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా స్థిరచిత్తంతో ఉండే గుణం అలవడుతుంది. ‘నా శక్తి ఇది’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు ‘నా బలహీనత ఇది’ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే లెక్క కుదురుతుంది! మిగతా విషయాలను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... నా తప్పులను మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. కొన్ని సమయాల్లో ‘అహం’ వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తుంది. అహాన్ని పక్కన పెడితే వాస్తవం చేరువవుతుంది. అహాన్ని వదులుకోవడం అంటే ఒక మెట్టు కిందకి దిగడం కాదు... రెండు మెట్లు పైకి ఎక్కడం. ఉత్తినే సలహాల కోసం సలహాలు ఇచ్చే వారి దగ్గర సలహాలు తీసుకోవడం కంటే, తీసుకోకపోవడం వల్లే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాత్రలు నచ్చకపోయినా ‘నటించాలి’ అనే నియమమేదీ పెట్టుకోలేదు. ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో డిగ్రీ ఉంది. సిటీబ్యాంకులో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. చెప్పొచ్చేదేమిటంటే సినిమాలు నచ్చనప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకోగలను. ఈ చిన్న జీవితంలో మనం చేయడానికి ఎంతో ఉందని నమ్ముతాను. కష్టాలు, నష్టాల గురించి ఆలోచించడం వృథా. ఇంత పెద్ద జీవితంలో ఆలోచించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆలోచనా శక్తిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగా సంపాదించాలి, బాగా కీర్తి గడించాలి... ఇలాంటి కోరికలు ఏమీ లేవు. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాను. ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాను. - సోహా అలీ ఖాన్, హీరోయిన్ -
మెరికలు చూపిన మార్గంలో..
ప్రేరణ విజయం వైపు సాగిపోయేలా నిత్యం స్ఫూర్తిని రగిలించే ఒక కథానాయకుడి(హీరో)ని ఆదర్శంగా తీసుకోవడం ప్రతి వ్యక్తికీ ఎంతో అవసరం. ఎందుకంటే.. గొప్ప కలలు కనేలా హీరోలు మనల్ని ప్రేరేపిస్తారు. ప్రేరణ అందిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా మనోస్థైర్యం కలిగిస్తారు. ఒకవేళ మనం నిరాశ అనే సంద్రంలో మునిగిపోయినప్పుడు వారు తమ హిత వచనాలతో ధైర్యం నింపుతారు. నిక్షేపంగా బయటకు రావడానికి అవసరమైన గుండెనిబ్బరాన్ని మనలో కల్గిస్తారు. ఎల్లప్పుడూ ఒక్కరేనా! మన ఆదర్శ కథానాయకుడు ఎల్లప్పుడూ ఒక్కరే ఉండాలనే నియమం లేదు. జీవితంలో నానాటికీ మారిపోయే పరిణామాలు, పరిస్థితులను బట్టి హీరోలు సైతం మారుతుంటారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. హీరోలు పరిపూర్ణులుగా ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. అలా కోరుకుంటే నిరాశ చెందక తప్పదు. మనకు అసలు హీరోలే వద్దనుకొనే దశ రావడం బాధాకరం! మొదటి హీరో.. నాన్న నా హీరో ఎవరనే ప్రశ్న తరచుగా మనసులో మొలకెత్తుతూ ఉంటుంది. నా జీవితంలో పలువురు కథానాయకులున్నారు. వారిలో కొందరు ముఖ్యుల గురించి ప్రస్తావించడం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా..! జీవితంలోని మొదటి హీరోల్లో ఒకరు నా తండ్రి. మనలో చాలామందికి మొదటి హీరో తండ్రే కావడంలో ఆశ్చర్యం లేదు. నా తండ్రి చేసే పనుల నుంచి ఒక బాలుడిగా నేను ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను పొందేవాడిని. మా నాన్న కేరళలోని ఓ కుగ్రామం నుంచి ముంబై మహానగరానికి వచ్చారు. ఇక్కడే ఇంజనీరింగ్ చదివారు. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకున్నారు. హిందీ భాషలో నిష్ణాతుడిగా మారారు. ఆ భాషను మరొకరికి బోధించే స్థాయికి ఎదిగారు. నేను హిందీలో మాట్లాడడం, రాయడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మనచుట్టూ ఉండేవారితో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆరేళ్ల వయస్సులో నాన్న వద్ద నేర్చుకున్నాను. నేను ఎప్పటికీ మర్చిపోలేని రెండు ముఖ్యమైన పాఠాలు.. కారు డ్రైవర్‌ను ‘డ్రైవర్’ అని కాకుండా పేరు పెట్టి పిలవడం. మా డ్రైవర్ నాకు ‘డ్రైవర్’ కాదు.. నాథూ భయ్యా. మరొకటి.. నా పుస్తకాల సంచిని నేనే మోసుకుపోవడం! ఉన్నదానితోనే సాధించేలా.. స్కూల్లో ఉన్నప్పుడు నాకు క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. అప్పుడు సునీల్ గవాస్కర్ రూపంలో ఓ హీరో దొరికాడు. ఆయన గొప్ప పొడగరి కాదు. పొట్టిగా ఉంటాడు. మైదానంలోకి దిగాడంటే.. హెల్మెట్ ధరించకుండానే ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేవాడు. శారీరకంగా పొట్టిగా ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని గవాస్కర్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బౌన్సర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు తన శారీరక ప్రతికూలతే అనుకూలంగా మారిందని వెల్లడించాడు. తన ఇంట్లోని చిన్న బాల్కనీలోనే క్రికెట్ సాధన చేసేవాడినని, బంతులను సూటిగా బాదాలనే పాఠం అక్కడే అలవడిందని పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పిన ఈ రెండు విషయాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనలో ఉన్నదానితోనే అనుకున్నది సాధించేందుకు కృషి చేయాలి. మనలో లేని దాని గురించి ఫిర్యాదులు చేస్తూ కాలం గడిపితే ప్రయోజనం శూన్యం. ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
ఒక లడ్డూ బాబు విజయగాథ!
విజేత ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను. ‘‘నా బరువు ఎనభై కిలోలా?’’ అనుకున్నాను...ఆందోళన పడ్డాను. మరిచిపోయాను. కొంతకాలానికి... ‘‘నా బరువు తొంబై కిలోలా?’’ అనుకున్నాను...మరికొంత ఆందోళన పడ్డాను. మళ్లీ మరిచిపోయాను. మరి కొంత కాలానికి... ‘‘నా బరువు 108 కిలోలా?’’ ఆవేదన పడ్డాను...అమ్మోఅనుకున్నాను. మరచిపోలేక పోయాను. ‘‘నన్ను నా పేరుతో కాకుండా నిక్ నేమ్‌లతో వెక్కిరించే కాలం వచ్చింది’’ అని వణికి పోయాను. ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను. ఆటలు ఆడమని ఒకరు సలహా ఇచ్చారు. హమ్మయ్యా...నాకు క్రికెట్ ఆడడం వచ్చు. చాలా రోజుల తరువాత ప్లే గ్రౌండ్లోకి దిగాను. ‘‘ఈత కొట్టి చూడు..’’ అని మరొకరు సలహా ఇచ్చారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగాను. ఏదో కొత్త శక్తి వచ్చి చేరినట్లు అనిపించేది. ఒత్తిడిని చేత్తో తీసేసినట్లు హాయిగా ఉండేది. మా అమ్మ ప్రాణాయమం గురించి చెప్పారు. ఆ దారిలో కూడా వెళ్లాను. ఆరోగ్యవంతమైన శరీరానికి అది ఎంత అవసరమో తెలిసింది. బరువుతో ఉన్నప్పుడు తీయించుకున్న నా ఫొటో ఎప్పుడూ నా పర్స్‌లో ఉండేది. రోజూ పడుకునే ముందు ఆ ఫోటోని చూస్తూ పడుకునేవాడిని. అలా బరువు తగ్గాలనే పట్టుదల పెరిగింది. ఇప్పుడు నా బరువు 70 కిలోలు! - సాహిల్ ర్యాలీ, మోడల్